పెళ్లిలో అల్లు అర్జున్ సతీమణి సందడి.. వీడియో వైరల్! | Allu Arjun Wife Sneha Reddy Attends Marriage Video Goes Viral | Sakshi
Sakshi News home page

Allu Arjun: పెళ్లి వేడుకలో స్నేహా రెడ్డి సందడి.. వీడియో వైరల్!

Feb 25 2026 7:03 PM | Updated on Feb 25 2026 7:13 PM

Allu Arjun Wife Sneha Reddy Attends Marriage Video Goes Viral

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బంధువుల పెళ్లికి ఆమె హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా స్నేహారెడ్డితో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు. కాగా.. బన్నీని స్నేహారెడ్డి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇక అల్లు అర్జున్‌ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. పుష్ప-2 తర్వాత వస్తోన్న మూవీ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ చిత్రంలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్‌ ముంబయిలో శరవేగంగా జరుగుతోంది. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను ఏఏ22 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement