ప్రేయసితో బిగ్‌బాస్‌ షణ్ముఖ్‌ ఎంగేజ్‌మెంట్‌ | Bigg Boss Shanmukh Jaswanth Engagement With Vaishnavi Chodisetti, Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Shanmukh Engagement Photos: 'దేవుడి ప్లాన్‌..' నిశ్చితార్థ ఫోటోలు షేర్‌ చేసిన షణ్ముఖ్‌

Feb 25 2026 6:47 PM | Updated on Feb 25 2026 6:52 PM

Bigg Boss Shanmukh Jaswanth Engaged with Vaishnavi Chodisetti

ఒకప్పుడు కవర్‌ సాంగ్స్‌, షార్ట్‌ ఫిలింస్‌ ద్వారా యూట్యూబ్‌లో సెన్సేషన్‌ అయ్యాడు షణ్ముఖ్‌ జశ్వంత్‌. ఆ తర్వాత బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి మరింత పాపులర్‌ అయ్యాడు. తర్వాత పలు వివాదాలతో వార్తల్లో నిలిచిన షణ్ను ఈ ఏడాది ప్రారంభంలో ఓ గుడ్‌న్యూస్‌ చెప్పాడు. తను ప్రేమలో ఉన్నట్లు వెల్లడించాడు. అమ్మాయి ముఖం చూపించకుండా, పేరు చెప్పకుండా కేవలం V అనే అక్షరాన్ని మాత్రమే వెల్లడించాడు.

ఎంగేజ్‌మెంట్‌
తాజాగా ఆ అమ్మాయితో ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు తెలిపాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు వైష్ణవి చోడిశెట్టి. తనొక ఇన్‌ఫ్లుయెన్సర్‌ అని తెలుస్తోంది. ఫిబ్రవరి 25న అంటే ఈరోజు తన నిశ్చితార్థం జరిగిందని ఫోటోలు షేర్‌ చేశాడు. దేవుడు ఈ రకంగా ప్లాన్‌ చేశాడు.. అయిపాయె అని క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ ఫోటోల్లో షణ్ముఖ్‌ - వైష్ణవి ఇద్దరూ బంగారు రంగు దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కెరీర్‌
షణ్ముఖ్‌ సోషల్‌ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉండేది. కానీ ఎప్పుడైతే బిగ్‌బాస్‌ షోలో అడుగుపెట్టాడో అంతా తలకిందులైంది. ఈ రియాలిటీ షోలో నటి సిరి హన్మంత్‌తో లవ్‌ ట్రాక్‌ నడిపాడు. ఇది జనాలకు మింగుడుపడలేదు. ఎందుకంటే అప్పటికే షణ్ను.. దీప్తి సునయనతో ప్రేమలో ఉన్నాడు. ఆల్‌రెడీ ప్రేమలో ఉండగా మళ్లీ ఈ పిచ్చిపనులేంటి? అని అందరూ విమర్శించారు.

తీరా షో నుంచి బయటకు వచ్చాక దీప్తితో బ్రేకప్‌ కూడా అయింది. ఇంతలో డ్రగ్స్‌ కేసులో చిక్కుకున్నాడు. మరోపక్క అమ్మకు క్యాన్సర్‌.. చాలాకాలం పాటు డిప్రెషన్‌తో కుంగిపోయాడు. కానీ నెమ్మదిగా దాన్నుంచి బయటపడి తిరిగి కెరీర్‌పై ఫోకస్‌ పెట్టాడు. అలా ప్రేమకు నమస్కారం అని ఓ సినిమా చేస్తున్నాడు.

 

 

చదవండి: రష్మికకు మూడోసారి.. విజయ్‌కు మాత్రం తొలిసారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement