తెలుగమ్మాయికి కోలీవుడ్‌ నుంచి పిలుపు! | Vaishnavi Chaitanya Ready For Kollywood Debut With Director Vignesh Karthik, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Vaishnavi Chaitanya: 'బేబీ' హీరోయిన్‌ కోలీవుడ్‌ ఎంట్రీ!

Feb 25 2026 4:35 PM | Updated on Feb 25 2026 4:52 PM

Vaishnavi Chaitanya Ready to Debut in Kollywood

వైష్ణవి చైతన్య.. యూట్యూబ్‌ దగ్గర మొదలైన ఆమె జర్నీ ఇప్పుడు సినిమా వరకు చేరింది. మొదట్లో అల వైకుంఠపురములో, రంగ్‌దే, టక్‌ జగదీశ్‌ వంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది. ఆనంద్‌ దేవరకొండ 'బేబీ' సినిమాతో హీరోయిన్‌గా మారి ఫస్ట్‌ మూవీకే మంచి మార్కులు కొట్టేసింది. ఈ ఒక్క సినిమాతోనే విశేషమైన గుర్తింపు, ప్రేమ, అవార్డులు అందుకుంది. 

కోలీవుడ్‌ ఎంట్రీ
ప్రస్తుతం ఎపిక్‌: ద సెమిస్టర్‌ మూవీ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ఓ వార్త వైరల్‌గా మారింది. జీవీ ప్రకాశ్‌ హీరోగా విఘ్నేశ్‌ కార్తీక్‌ ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. ఇప్పటికే 'హాట్‌స్పాట్‌ టూ మచ్‌'తో సక్సెస్‌ అందుకున్న ఈ దర్శకుడు ఈసారి ఏం ప్లాన్‌ చేయబోతున్నాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

సినిమా
ఈ క్రమంలో అతడి నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌లో జీవీ ప్రకాశ్‌ హీరోగా, తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి అజిత్‌ హీరోగా నటించిన వాలిమై అనే తమిళ మూవీలో వైష్ణవి చైతన్య చిన్న రోల్‌ చేసింది. కానీ, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం నిజమైతే మాత్రం కోలీవుడ్‌లో కథానాయికగా ఇదే తన తొలి సినిమా కానుంది.

చదవండి: పెళ్లి వేడుకలో వరుణ్‌- లావణ్య.. ఎక్కడంటే?

Advertisement
 
Advertisement
Advertisement