పదేళ్ల తర్వాత దొరికిన అరుదైన గిఫ్ట్‌ ఆ సినిమానే: తాప్సీ | Taapsee Pannu says Dunki was a gift after 10 years of struggle | Sakshi
Sakshi News home page

Taapsee Pannu: పదేళ్ల తర్వాత దొరికిన అరుదైన అవకాశం: తాప్సీ

Feb 25 2026 4:06 PM | Updated on Feb 25 2026 5:09 PM

Taapsee Pannu says Dunki was a gift after 10 years of struggle

హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవలే అస్సీ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. కోర్టు రూమ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాకు  అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించగా.. మలయాళ నటి కని కుస్రుతి కీలక పాత్రలో మెప్పించింది. ఈ మూవీ రిలీజ్ ‍తర్వాత తాప్సీ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ఇటీవల ఓ ఛానెల్‌తో మాట్లాడిన ఆమె.. సౌత్ ఇండస్ట్రీపై వివాదాస్పద కామెంట్స్ చేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తాప్సీ తన కెరీర్ గురించి మాట్లాడింది. షారూఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాలో ఆఫర్ రావడంపై స్పందించింది. డంకీ లాంటి భారీ కమర్షియల్ చిత్రంలో అవకాశం రావడం మంది నటులకు కష్టమని తెలిపింది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో నటించడం తన కెరీర్‌లో అరుదైన క్షణమని వెల్లడించింది. సెన్సిబిలిటీ ఉన్న వ్యక్తి ఆ పాత్ర అవసరమని.. అందుకే తనకు వచ్చిందని ఆమె అన్నారు.

తాప్సీ పన్ను మాట్లాడుతూ..'డంకీ లాంటి అవకాశాలు తనకు మాత్రమే కాదు. పరిశ్రమలోని చాలా మంది నటులకు కూడా కష్టమే. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో నటించడం నా కెరీర్‌లో అరుదైన క్షణం. చాలా సంవత్సరాల నాకు  లభించిన సినిమా డంకీ. దశాబ్దానికి పైగా సినిమాల్లో నటించిన తర్వాత అందుకున్న బహుమతి డంకీ. నాలాంటి వారికి డంకీ లాంటి సినిమా దొరకడం కష్టం. అస్సీ, గాంధారి లాంటి సినిమాలు చేయడం వల్లే  డంకీ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలు నాకు పరిశ్రమలో గుర్తింపు తీసుకొచ్చాయని' పంచుకుంది. తన కెరీర్‌ను మాస్ ఎంటర్‌టైనర్‌లతో ప్రారంభించానని తెలిపింది.  దక్షిణాదిలో నా కెరీర్‌ను మాస్ చిత్రాలతో ప్రారంభించా.. ఆ తర్వాత నా హిందీ సినిమా అరంగేట్రం డేవిడ్ ధావన్‌తో జరిగిందని పేర్కొంది.

కాగా.. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన డంకీ చిత్రంలో షారుఖ్ ఖాన్‌ హీరోగా నటించారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్ కీలక పాత్రల్లో నటించారు. విక్కీ కౌశల్ ప్రత్యేక పాత్రలో కనిపించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement