చలో జార్జియా | Varanasi Update: Mahesh Babu heads to Georgia for filming | Sakshi
Sakshi News home page

చలో జార్జియా

Feb 25 2026 1:01 AM | Updated on Feb 25 2026 1:01 AM

Varanasi Update: Mahesh Babu heads to Georgia for filming

హీరో మహేశ్‌బాబు జార్జియాకి ప్రయాణం అయ్యారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న  ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్‌ బిజినెస్‌ బ్యానర్లపై కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ‘వారణాసి’ తాజా షెడ్యూల్‌ కోసమే మహేశ్‌బాబు విదేశీ బాటపట్టారు. మంగళవారం హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఆయన జార్జియాకి బయలుదేరారు.

అక్కడ జరగనున్న కీలక షెడ్యూల్‌ కోసం మహేశ్‌ వెళ్లారు. ఆయనకి సెండాఫ్‌ ఇచ్చేందుకు భార్య నమ్రత, కుమార్తె సితార ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. మహేశ్‌కి వారు సెండాఫ్‌ ఇస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, సన్‌గ్లాసెస్, టోపీ... ఇలా స్టైలిష్‌గా ఉన్న మహేశ్‌ని చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక మహేశ్‌బాబు–రాజమౌళి కాంబోలో రానున్న ‘వారణాసి’ మూవీపై అంతర్జాతీయ స్థాయిలో ఫుల్‌ బజ్‌ నెలకొంది. ఈ సినిమా 2027 ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement