టాలీవుడ్ హీరోలు యంగ్ దర్శకులపై చర్చ వస్తే తరచూ అట్లీ, ప్రశాంత్ నీల్, నీల్సన్, కార్తీక్ సుబ్బరాజు వంటి పేర్లే వినిపిస్తుంటాయి. కానీ మన దగ్గర కూడా యూత్‌ను ఆకట్టుకునే స్టైలిష్ యాక్షన్ సినిమాలు తెరకెక్కించగల టాలెంట్ ఉన్న దర్శకులు ఉన్నారు.అందులో ముఖ్యంగా నిలుస్తున్న పేరు సుజీత్.
‘ఓజి’ సినిమాతో సుజీత్ ఒక్కసారిగా భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమా చుట్టూ ఏర్పడిన అంచనాలు, టీజర్లు, పోస్టర్లు—అన్నీ కలిపి సుజీత్‌ను పాన్ ఇండియా రేంజ్‌లో చర్చకు తెచ్చాయి. ఇప్పుడు ‘ఓజి’ తర్వాత ఆయన చేయబోయే ప్రాజెక్ట్‌పై కూడా అదే స్థాయిలో ఆసక్తి నెలకొంది.
సుజీత్ తదుపరి చిత్రం నేచురల్ స్టార్ నానితో ఉండనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇండస్ట్రీలో ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా విడుదలైన ‘బ్లడీ రోమియో’ అనౌన్స్‌మెంట్ వీడియో ఈ ప్రాజెక్ట్‌పై మరింత స్పష్టత ఇచ్చింది. వీడియోలో కనిపించిన విజువల్స్ ఆధారంగా ఈ సినిమా యుకే ఫుడ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని అర్థమవుతోంది. రెసిపీలు, చెఫ్ ఎలిమెంట్స్, వంటకాలకు సంబంధించిన సింబాలిజం వంటివి కథలో కీలక భాగమని సూచిస్తున్నాయి. లోగోలో కనిపించిన లండన్ బ్యాక్‌డ్రాప్ సినిమా సెట్టింగ్‌ను క్లియర్ చేసింది.
ఇప్పటివరకు విభిన్న జానర్లలో తనదైన ముద్ర వేసుకున్న నాని, ఇటీవల రగ్డ్ పీరియాడిక్ టచ్ ఉన్న ‘పారడైజ్’ తరహా కథ తర్వాత సుజీత్‌తో పూర్తిగా స్టైలిష్ యాక్షన్ జోన్‌లోకి అడుగుపెడుతున్నారు. గన్స్, గర్ల్స్, స్టైలిష్ టేకింగ్, ఎలివేషన్ సీన్స్ అన్నీ కలిపి ఈ చిత్రం ఫుల్ క్లాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని టాక్.
యూత్‌కు నచ్చేలా స్టైలిష్‌గా సినిమా తీయగల దర్శకుడిగా సుజీత్ ఇప్పటికే తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఇప్పుడు నాని వంటి వెర్సటైల్ నటుడితో కలయిక మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఈ చిత్రం టాలీవుడ్‌కు కొత్త స్టైలిష్ యాక్షన్ ఫేజ్‌ను తెచ్చిపెడుతుందా? అన్నది చూడాలి.


