నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ద ప్యారడైజ్'. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. లెక్క ప్రకారం మార్చిలోనే థియేటర్లలోకి రావాలి. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఆగస్టుకి వాయిదా వేశారు. నాని పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి తొలి పాట రిలీజ్ చేశారు. 'ఆయా షేర్' అంటూ సాగే ఈ గీతం.. ప్రోమోతోనే ఆకట్టుకుంది. ఇప్పుడు పూర్తి పాట కూడా అలానే అదరగొడుతోంది.
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'ప్యారడైజ్' సినిమా తీస్తున్నారు. ఇందులో నాని సరసన కాయదు లోహర్ హీరోయిన్‌గా చేస్తోంది. మోహన్ బాబు విలన్ కాగా.. బాలీవుడ్ నటుడు రాఘవ్ జ్యూయెల్ కీలక పాత్ర చేస్తున్నాడు. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. విడుదలకు ఇంకా చాలారోజులు ఉంది కానీ హైప్ అయితే ఈ మూవీపై మామూలుగా లేదు.


