‘ది కేరళ స్టోరీ 2’పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు | Kerala HC Seeks Screening Of The Kerala Story 2 Before Release | Sakshi
Sakshi News home page

‘ది కేరళ స్టోరీ 2’పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Feb 24 2026 5:30 PM | Updated on Feb 24 2026 5:33 PM

Kerala HC Seeks Screening Of The Kerala Story 2 Before Release

‘ది కేరళ స్టోరీ2’ సినిమాపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విడుదలకు ముందే ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించాలని చిత్రబృందాన్ని ఆదేశించింది. ఈ సినిమా సెన్సార్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం కేరళ హైకోర్టులో విచారణ జరిగింది. సాధారణంగా కోర్టులు సినిమాలకు సంబంధించి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలో అంతగా కల్పించుకోదు. కానీ ఈ సినిమా టైటిల్‌లో రాష్ట్రం పేరు ఉపయోగించారని, అందుకే ఈ కేసును విచారణకు అంగీకరించినట్లు  కోర్టు తెలిపింది. ఈ నెల 25న ముందుగా ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించాలని, ఆ తర్వాతే సెన్సార్‌ విషయంలో జోక్యం చేసుకుంటామని ధర్మాసనం తేల్చి చెప్పింది. 

2023లో వివాదాల మధ్య విడుదలైన ‘ది కేరళ స్టోరి’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది. కామాఖ్య నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్టు యూ/ఏ సర్టిఫికేట్‌ జారీ చేసింది.  ఈ సినిమాలో కేరళను తప్పుగా చూపించారని ఆరోపణలు చేస్తూ పలువురు కోర్టు మెట్లు ఎక్కారు. ఫిబ్రవరి 25 తర్వాత హైకోర్టు తన తీర్పుని వెలువరించనుంది. ఫిబ్రవరి 27న ఈ చిత్రం విడుదల కాబోతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement