‘ఓకేరా నీ ఇష్టం’.. ఈ మాట భయపెడుతోంది : నానిపై శ్రీకాంత్‌ ఓదెల ఎమోషనల్‌ పోస్ట్‌ | The Paradise Movie Director Srikanth Odela Emotional Birthday Wishes To Actor Nani, Post Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

‘ఓకేరా నీ ఇష్టం’.. ఈ మాట భయపెడుతోంది : నానిపై శ్రీకాంత్‌ ఓదెల ఎమోషనల్‌ పోస్ట్‌

Feb 24 2026 11:37 AM | Updated on Feb 24 2026 1:17 PM

The Paradise Director Srikanth Odela Emotional Birthday Note To Nani

నేచురల్‌ స్టార్‌ నాని, యంగ్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికి తెలిసిందే. నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో వచ్చిన ఆ చిత్రం..బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. శ్రీకాంత్‌ తొలి సినిమానే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ మూవీ తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకొని తన రెండో సినిమా కూడా నానితోనే ప్లాన్‌ చేశాడు. అదే ‘ది ప్యారడైజ్‌’. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. మోహన్‌ బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్‌ చేశాయి. నాని బర్త్‌డే(ఫిబ్రవరి 24) సందర్భంగా ఈ రోజు ‘ఆయా షేర్’ అనే సాంగ్‌ కూడా రిలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల(Srikanth Odela ) నానికి బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ ఎక్స్‌లో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు.

‘నాని(Nani) అన్న..‘నీ ఇష్టం శ్రీకాంత్‌’ అని అన్న ప్రతిసారి నాకు ‘శ్రీకాంత్‌ నిన్ను నమ్ముతున్నాను’ అన్నట్లుగా వినిపించేది. ఆ నమ్మకం నన్ను ప్రతిసారి భయపెట్టేసింది. అందుకే ‘ది ప్యారడైజ్‌’ కోసం ప్రతి సెకను నా రక్తాన్నా, ఆత్మను ధారపోశాను. నేను నీ సినిమా రూల్స్‌ని బ్రేక్‌ చేశాను. మీ వర్కింగ్‌ డేస్‌  ప్యాటర్న్‌ మార్చేశాను. మీ సినిమా రిలీజ్‌ డేట్‌ ప్లానింగ్‌ని కూడా బ్రేక్‌ చేశాను. చివరకు మీ వర్కింగ్‌ స్టైల్‌ని కూడా మార్చేశాను. ఇలా మీరు పెట్టిన ప్రతి నియమాన్ని నేను ఉల్లంఘించాను. అయినా సరే నువ్వు నాపై చూపిస్తున్న ఆ నమ్మకం నన్ను మరింత బాధ్యతగా పని చేసేలా చేసింది. 

నువ్వు నమ్మినంతగా నన్ను ఇంకెవరు నమ్మలేదు అన్న. సినిమా కోసం నేను జడలు వేసుకోవాలి అంటే.. ఓకేరా నీ ఇష్టం అన్నావు. టాటూ వేసుకోవాలని చెబితే నీ ఇష్టం అన్నావు. ప్రతిరోజు లెక్కలేనన్ని రీటేకులతో నిన్ను టార్చర్‌ చేసినా.. సింపుల్‌గా ‘ఓకేరా నీ ఇష్టం’ అన్నావు. నీతో ఎప్పుడు ఈ విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పలేదు కానీ..‘నువ్వు ఎప్పుడూ ‘నీ ఇష్టం శ్రీకాంత్’ అని ఎందుకు అంటావు అనే దానికి సమాధానం కోసం నా జీవితంలో ప్రతి సెకను నిరంతరం వెతుకుతున్నాను.    బహుశా ‘ది ప్యారడైజ్‌’(The Paradise) సినిమాతో ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో. 

నన్ను నమ్మిన నా ధరణికి(దసరాలో నాని పాత్ర పేరు) నన్ను మళ్లీ నమ్ముతున్న నా జడల్‌కి( ది ప్యారడైస్‌లో నాని పాత్ర పేరు)కి హ్యాప్తీ బర్త్‌డే. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను నాని అన్న’ అని శ్రీకాంత్‌ ఓదెల రాసుకొచ్చాడు. ‘ది ప్యారడైజ్‌’ మూవీ ఆగస్ట్‌ 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement