ప్రభాస్- దర్శకుడు నాగ్ అశ్విన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ మూవీకి సీక్వెల్‌గా ‘కల్కి 2898 ఏడీ 2’ షూటింగ్ మొదలైంది.
‘కల్కి 2898 ఏడీ 2’ షూటింగ్‌లో అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో సిద్ధం చేసిన ప్రత్యేక సెట్‌లో ఆయనపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మార్చి మొదటివారంలో ప్రభాస్ కూడా ఈ చిత్రీకరణలో పాలుపంచుకోనున్నట్లు సమాచారం. అయితే, కమల్‌హాసన్ మార్చి తర్వాత సెట్‌లోకి వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. ఇక్కడ దాదాపు నెల రోజుల పాటు రెగ్యులర్ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ కర్ణ, భైరవ అనే రెండు పాత్రల్లో కనిపించనున్నారు. అశ్వత్థామగా అమితాబ్, సుప్రీం యాస్కిన్‌గా కమల్ నటిస్తున్నారు. అయితే, పార్ట్-1లో దీపిక పదుకొణె చేసిన సుమతి పాత్రలో ఎవరు నటిస్తారనేది ప్రకటన రావాల్సి ఉంది.


