సెలబ్రేషన్స్‌కు రెడీ.. విజయ్- రష్మిక పెళ్లి సందడి షురూ..! | Rashmika and Vijay Deverakonda are set to begin their wedding celebrations | Sakshi
Sakshi News home page

Rashmika and Vijay: సెలబ్రేషన్స్‌కు రెడీ.. విజయ్- రష్మిక పెళ్లి సందడి షురూ..!

Feb 23 2026 9:27 PM | Updated on Feb 24 2026 9:21 AM

Rashmika and Vijay Deverakonda are set to begin their wedding celebrations

టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ అఫీషియల్‌గా తన పెళ్లిని అనౌన్స్ చేశారు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే విరోష్‌ జంట ఒక్కటి కానుందని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ గ్రాండ్‌ వేడుకలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న ఉదయపూర్‌లో మెహందీ వేడుకతో రష్మిక-విజయ్ పెళ్లి సందడి మొదలు కానుంది.

ఆ తర్వాత ఫిబ్రవరి 25న హల్దీ, సంగీత్  సందడి కొనసాగనుంది. ఈ వేడుకలు ఉదయపూర్‌లోని విలాసవంతమైన ఐటీసీ మెమెంటోస్ జరుగుతాయి. ఈ వేడుకల్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొననున్నారు. ఈ జంట ఫిబ్రవరి 26న మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. 

కాగా.. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తెలుస్తోంది. విజయ్ - రష్మిక వారి కుటుంబ సభ్యులు, సహచరులతో కలిసి సోమవారం ఉదయమే ఉదయ్‌పూర్ చేరుకున్నారు. కొన్నేళ్లుగా తమ రిలేషన్‌ను సీక్రెట్‌గా కొనసాగించిన ఈ జంట చివరికీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. విజయ్ దేవరకొండనే స్వయంగా తన పెళ్లిని ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వివాహం తర్వాత  టాలీవుడ్‌ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్‌ రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement