గోవాలో నాగచైతన్య సందడి.. వీడియో వైరల్ | Naga Chaitanya Appeareance at Goa Indian Racing Festival | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: గోవాలో నాగచైతన్య సందడి.. వీడియో వైరల్

Feb 23 2026 4:57 PM | Updated on Feb 23 2026 5:05 PM

Naga Chaitanya Appeareance at Goa Indian Racing Festival

టాలీవుడ్ హీరో నాగచైతన్య గోవాలో సందడి చేశారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌కు ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఈ పోటీల్లో తన మోటార్‌స్పోర్ట్స్ టీమ్‌ హైదరాబాద్ బ్లాక్‌ బర్డ్స్‌కు మద్దతుగా పాల్గొన్నారు. రౌండ్-4లో భాగంగా నిర్వహించిన రేసింగ్ ఈవెంట్‌లో తమ డ్రైవర్లను ఉత్సాహపరుస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. తండేల్ సూపర్ హిట్‌  తర్వాత సరికొత్త మైథలాజికల్‌ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ మూవీకి విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. చైతూ కెరీర్‌లో 24వ చిత్రంగా రానున్న ఈ సినిమాను ఎన్‌సీ24 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చైతూ సరసన సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement