రోడ్డుపై అందరూ కలిసి చితకబాదారు: అక్షయ్‌ కుమార్‌ | Akshay Kumar Was Beaten For College Crush, Recalls that Incident | Sakshi
Sakshi News home page

Akshay Kumar: నా టాలెంట్‌కు ఫిదా అవుతారనుకుంటే కుమ్మేశారు

Feb 23 2026 4:55 PM | Updated on Feb 23 2026 5:00 PM

Akshay Kumar Was Beaten For College Crush, Recalls that Incident

కాలేజీ డేస్‌లో చాలామంది ప్రేమలో పడతారు. కొందరిది వన్‌సైడ్‌ లవ్‌ అయితే మరికొందరిది టూసైడ్‌ లవ్‌. అలా బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ కూడా కాలేజీలో చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నాడట! ఈ విషయాన్ని 'ద వీల్‌ ఆఫ్‌ ఫార్చ్యూన్‌' షోలో వెల్లడించాడు. తాజాగా ఈ షోలోని లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.

అమ్మాయి ఇంటి ముందు
తన కాలేజీ డేస్‌లోని లవ్‌ స్టోరీని గుర్తు చేసుకున్నాడు. 'ఇది 40 ఏళ్ల కిందట ముచ్చట. అప్పుడు నేను కాలేజీకి వెళ్తున్నాను. ఒక అమ్మాయిని చూసి ముచ్చటపడ్డాను. తనకోసం ప్రత్యేకంగా ఒక పాట నేర్చుకున్నాను. నా ఫ్రెండ్‌ ఒకరికి గిటార్‌ వాయించడం తెలుసు. కాబట్టి వాడిని వెంటేసుకుని నేరుగా అమ్మాయి ఇంటి ముందు నిలబడ్డాను. 

 తన్నులు తిన్నాం
అతడు గిటార్‌ వాయిస్తుంటే నేను పాట పాడటం మొదలుపెట్టాను. నా పాట విని అమ్మాయి వస్తుందనుకుంటే చుట్టుపక్కలవాళ్లు వచ్చి మమ్మల్ని చితక్కొట్టారు. వారి చేతిలో చచ్చామనుకున్నాం. ఎవరినో ఇంప్రెస్‌ చేద్దామని వెళ్లి మేమే తన్నులు తిని వచ్చాం' అని గుర్తు చేసుకున్నాడు.

పర్సనల్‌ లైఫ్‌
కాగా సినిమాల్లో స్టార్‌ హీరోగా క్రేజ్‌ తెచ్చుకున్న అక్షయ్‌ ఫిలింఫేర్‌ మ్యాగజైన్‌ ఫోటోషూట్‌లో హీరోయిన్‌ ట్వింకిల్‌ ఖన్నాను కలిశాడు. అలా వాళ్లిద్దరి మధ్య పరిచయం తర్వాత ప్రేమకు దారి తీసింది. 2001లో అక్షయ్‌, ట్వింకిల్‌ పెళ్లి చేసుకున్నారు. వీరికి 2002లో కుమారుడు ఆరవ్‌ జన్మించాడు. 2012లో కూతురు నితారా పుట్టింది.

చదవండి: విడాకుల తర్వాత బాధలో.. ఎవర్నీ నమ్మొద్దనుకున్నా..: సమంత

Advertisement
 
Advertisement
Advertisement