ఓటీటీకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. ఎక్కడ చూడాలంటే? | One Battle After Another on OTT Streaming Date Locked | Sakshi
Sakshi News home page

One Battle After Another on OTT: ఓటీటీకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Feb 23 2026 7:28 PM | Updated on Feb 23 2026 9:28 PM

One Battle After Another on OTT Streaming Date Locked

హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్రలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్‌ 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్'. ఈ చిత్రం తాజాగా బాప్టా అవార్డుల్లో సత్తా చాటింది. ఏకంగా ఆరు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టింది. గతేడాది సెప్టెంబర్ 26న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి పాల్ థామస్ ఆండర్సన్ దర్శకత్వం వహించారు.

తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 26 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని  జియో హాట్‌స్టార్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మూవీ గతంలో గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌లోనూ సత్తా చాటింది. అంతేకాకుండా ఈ ఏడాది జరగనున్న ఆస్కార్‌ అవార్డులకు వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ 13 విభాగాల్లో నామినేషన్స్ సాధించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే వంటి కీలక విభాగాలలో నామినేట్ అయింది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement