రుబరూ రెడీ | Adivi Sesh Dacoit first single Rubaroo to be out on February 27 | Sakshi
Sakshi News home page

రుబరూ రెడీ

Feb 24 2026 1:16 AM | Updated on Feb 24 2026 1:16 AM

Adivi Sesh Dacoit first single Rubaroo to be out on February 27

అడివి శేష్, మృణాళ్‌ ఠాకూర్‌ జోడీగా నటించిన ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘డెకాయిట్‌’. ఈ యాక్షన్  లవ్‌స్టోరీతో కెమెరామెన్  షానియల్‌ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. కాగా ఈ చిత్రంలోని ‘రుబరూ...’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను ఈ నెల 27న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

‘‘డెకాయిట్‌’ మూవీ కథాంశం ప్రధానంగా యాక్షన్  చుట్టూ తిరిగినప్పటికీ ‘రుబారూ..’ సాంగ్‌ మాత్రం మంచి ఎమోషనల్‌ టచ్‌తో కొత్త ఫీల్‌ని ఇస్తుంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీని హైలెట్‌ చేస్తూ, వారి జర్నీని ప్రజెంట్‌ చేసే పాట ఇది’’ అని యూనిట్‌ పేర్కొంది. అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్రలో నటించి ఈ సినిమాకు సునీల్‌ నారంగ్‌ సహ నిర్మాతగా వ్యవహరించగా, భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement