'ఈ సారి మామూలుగా ఉండదు'.. డకాయిట్ కొత్త రిలీజ్ డేట్
టాలీవుడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న ఇంటెన్స్ యాక్షన్ ప్రేమకథా చిత్రం డకాయిట్(Dacoit). ఇప్పటికే రిలీజ్ తేదీ ప్రకటించినా అనివార్య కారణాలతో వాయిదా పడుతూనే వస్తోంది. గతంలో ఈ ప్రాజెక్ట్ నుంచి కోలీవుడ్ భామ శృతిహాసన్ అనూహ్యంగా తప్పుకుంది. ఇది కూడా సినిమా ఆలస్యానికి కారణం కావొచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ మూవీలో హీరోయిన్గా చేస్తోంది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.కానీ వారు అనుకున్న తేదీ ప్రకారం కుదరకపోవడంతో తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు డకాయిట్ మేకర్స్. వచ్చే ఏడాది ఉగాది కానుకగా డకాయిట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. 'ఈ సారి మామూలుగా ఉండదు.. వెనక్కి తిరిగి చూసేదే లేదు' అంటూ అడివి శేష్ మూవీ పోస్టర్‌ను పంచుకున్నారు. వచ్చే ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో డకాయిట్ సందడి చేయనుందని ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో అడివి శేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. (ఇది చదవండి: 'డకాయిట్' ఫైర్ గ్లింప్స్ విడుదల)ఈ మూవీని షానీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. అడివి శేష్ నటించిన ‘క్షణం’, గూఢచారితో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్‌గా చేసిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. కాగా.. ఇప్పటికే ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. Ee Saari Mamulga undadhu ❤️🔥There’s NO LOOKING BACK#DACOIT This UGADI MARCH 19th 2026in Theaters WORLDWIDE pic.twitter.com/KaxruBidTN— Adivi Sesh (@AdiviSesh) October 28, 2025