అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం డెకాయిట్. ఒక ప్రేమ కథ అనేది క్యాప్షన్. అడివి శేష్ నటించిన క్షణం, గూఢచారి సినిమాలకు కెమెరామెన్‌గా పని చేసిన షానిల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు.

టీజర్ రిలీజ్
నాగార్జున నటించిన 'హలో బ్రదర్' మూవీలోని కన్నెపిట్టరో.. కన్ను కొట్టరో పాటతోనే టీజర్ మొత్తం సాగుతుంది. చివర్లో ఓ చిన్నారి డాక్టర్‌వా..? అని హీరోను అడిగితే అందుకతడు దొంగ అని బదులిస్తాడు. మొత్తానికి టీజర్ అయితే అదిరిపోయింది. టీజర్ డిఫరెంట్‌గా బాగుందంటున్నారు అభిమానులు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించింది. డెకాయిట్ ఉగాది కానుకగా మార్చి 19న విడుదల అవుతోంది.


