ఇంత సెన్సేషన్‌ ఊహించలేదు, ఇకనైనా అవకాశాలొస్తే బాగుండు! | Kalpana Iyer hopes viral Rambha Ho Video Get Acting Offers | Sakshi
Sakshi News home page

'రంభ హో హో' పాటతో సెన్సేషన్‌.. అవకాశాలు వస్తే చాలు!

Feb 1 2026 6:19 PM | Updated on Feb 1 2026 6:23 PM

Kalpana Iyer hopes viral Rambha Ho Video Get Acting Offers

'రంభ హో హోహో..' ఈ పాట ఒకప్పుడు చాలా ఫేమస్‌. ధురంధర్‌ సినిమాలో ఈ సాంగ్‌ను వాడుకోవడంతో మరోసారి వైరల్‌ అయింది. అయితే ఈ పాటకు 70 ఏళ్ల నటి కల్పనా అయ్యర్‌ హుషారుగా స్టెప్పులెయ్యడం అంతకంటే ఎక్కువ వైరలవుతోంది. 1981లో వచ్చిన అర్మాన్‌ సినిమాలోని పాటే రంభ హో హో. ఈ డిస్కో సాంగ్‌లో కల్పనా అయ్యర్‌ స్టెప్పులేసింది. 

పెళ్లిలో డ్యాన్స్‌
దాదాపు 45 ఏళ్ల తర్వాత మరోసారి ఈ పాటపై కాలు కదిపింది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో కల్పనా అయ్యర్‌ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్‌ కుమారుడి పెళ్లికి వెళ్లాను. అతడిని నా కొడుకులాగే భావిస్తాను. అందుకే ఫ్యామిలీతో కలిసి ఆ పెళ్లికి హాజరయ్యాను. అందరూ డ్యాన్స్‌ చేయమని కోరితే అప్పటికప్పుడు స్టెప్పులేశా.. అదేమీ ముందుగా ప్లాన్‌ చేసుకోలేదు.

చాలా స్పెషల్‌
ఆ వీడియోను సాధారణంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాను. ఇంకేముంది, కొద్ది గంటల్లోనే చాలా వైరల్‌ అయిపోయింది. ఎక్కడ చూసినా అదే వీడియో కనిపిస్తోంది. అందరూ నాపై ఎంతో ప్రేమ చూపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందులోనూ నాలుగు దశాబ్దాల కిందట డ్యాన్స్‌ చేసిన పాట మరోసారి గుర్తింపు తెచ్చుకుంటుంటే మరింత స్పెషల్‌గా అనిపిస్తోంది. 

అవకాశాలు వస్తే అంతే చాలు
ఈ సాంగ్‌ను ధురంధర్‌ మూవీలో వాడారని విన్నాను. అందుకు దర్శకుడు ఆదిత్య ధర్‌కు కృతజ్ఞతలు చెప్పి తీరాల్సిందే! ఆయన వల్లే ఇప్పటి జెనరేషన్‌ ఆ పాటను మళ్లీ పాడుకోగలుగుతున్నారు. సినిమా ఇండస్ట్రీని చాలా మిస్‌ అయ్యాను. ఈ వైరల్‌ పాపులారిటీ మూలాన అవకాశాలు వస్తే కెమెరా ముందు నటిస్తాను అంటోంది. మరి కల్పనా కోరిక నెరవేరుతుందా? మరోసారి వెండితెరపై కనిపిస్తుందా? అన్నది చూడాలి! వందకు పైగా సినిమాల్లో యాక్ట్‌ చేసిన కల్పనా.. చివరగా హమ్‌ సాత్‌ సాత్‌ హై (1999) మూవీలో కనిపించింది.

 

 

 

చదవండి: కవలలు పుట్టాక రామ్‌చరణ్‌ ఫస్ట్‌ పోస్ట్‌.

Advertisement
 
Advertisement
Advertisement