కవలలు పుట్టాక రామ్‌చరణ్‌-ఉపాసన ఫస్ట్‌ పోస్ట్‌ | Ram Charan, Upasana First Post After Twins Birth | Sakshi
Sakshi News home page

'డబుల్‌' హ్యాపీలో రామ్‌చరణ్‌.. స్పెషల్‌ ఫోటోతో తొలి పోస్ట్‌

Feb 1 2026 3:30 PM | Updated on Feb 1 2026 3:39 PM

Ram Charan, Upasana First Post After Twins Birth

కవలల రాకతో మెగా ఫ్యామిలీలో సంతోషాలు వెల్లివిరిశాయి. రామ్‌చరణ్‌- ఉపాసనలకు జనవరి 31న రాత్రి బాబు, పాప పుట్టాడని చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా గుడ్‌న్యూస్‌ చెప్పాడు. తాజాగా ఈ శుభవార్తను చరణ్‌- ఉపాసన దంపతులు ఓ స్పెషల్‌ ఫోటో ద్వారా తమ అభిమానులతో పంచుకున్నారు.

వాళ్లే గొప్ప బలం
బాబు, పాప పుట్టారన్న విషయాన్ని మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడిని కలిగి ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. మన జీవితంలో మహిళలే గొప్ప బలం. మాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌కు భార్య గర్భంతో ఉన్నప్పుడు దిగిన ఓ ఫోటోను జత చేశారు. 

పెళ్లి
అందులో చరణ్‌ దంపతులు బ్లాక్‌ డ్రెస్‌ ధరించగా.. రెండు శునకాలను పట్టుకుని ఠీవీగా నిల్చున్నారు. కాగా రామ్‌చరణ్‌, ఉపాసన 2011 డిసెంబర్‌ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. 2012 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2023లో కూతురు క్లీంకార జన్మించింది. ఇప్పుడు క్లీంకారతో ఆడుకునేందుకు మరో బుజ్జి పాపాయి, బుడ్డోడు కుటుంబంలో చేరారు.

చదవండి: తండ్రి బాటలో రామ్‌చరణ్‌.. ఎంత గొప్ప మనసు

Advertisement
 
Advertisement
Advertisement