ఆ పిల్లి ఉంటే అందరూ దాసోహమే.. 'హనీ' ట్రైలర్ రిలీజ్ | Naveen Chandra Honey Movie Trailer | Sakshi
Sakshi News home page

Honey Trailer: భయపెట్టేలా నవీన్ చంద్ర 'హనీ' ట్రైలర్

Feb 1 2026 6:27 PM | Updated on Feb 1 2026 6:35 PM

Naveen Chandra Honey Movie Trailer

నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ హారర్ సినిమా 'హనీ'. కరుణ కుమార్ దర్శకుడు. ఓవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల,  ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఫిబ్రవరి 6న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఆదివారం ఈవెంట్ నిర్వహించి ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఇది భయపెట్టేలా ఉండటం విశేషం.

(ఇదీ చదవండి: దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. ఫొటోలు వైరల్)

నిజ జీవిత సంఘటనల ప్రేరణతో మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ అంశాలతో 'హనీ' మూవీ తీశారు. ఈ మూవీలో దివి, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి తదితర ఇతర కీలక పాత్రలు పోషించారు. సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాలతో దీన్ని తెరకెక్కించారు. ట్రైలర్ బట్టి చూస్తే.. ఓ దేవత వాహనంగా పిల్లిని చూపించారు. ఇది ఎవరి దగ్గర ఉంటే అందరూ వాళ్లకు దాసోహం అవుతారనే పాయింట్ చెప్పుకొచ్చారు. ఇది ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.

(ఇదీ చదవండి: విషాదం.. టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత)

Advertisement
 
Advertisement
Advertisement