'ఛాంపియన్' బ్యూటీ ఓటీటీ ఎంట్రీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Champion Movie Actress Anaswara Rajan Upcoming Series Lucky OTT Release Date And Streaming Platform Details | Sakshi
Sakshi News home page

OTT: జీవీకి జోడీగా అనస్వర.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

Feb 1 2026 3:46 PM | Updated on Feb 1 2026 4:17 PM

Anaswara Rajan Lucky Series Streaming Details

మలయాళంలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనస్వర రాజన్.. ఈ మధ్యే 'ఛాంపియన్' అనే మూవీతో టాలీవుడ్‌కి పరిచయమైంది. ప్రస్తుతం మరో తెలుగు చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. ఇవి అలా ఉండగానే ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఈమె నటించిన ఓ ఫీల్ గుడ్ సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్‌కి రెడీ అయిపోయింది. ఇంతకీ దాని సంగతేంటి? ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మాస్టర్ మహేంద్రన్ కొత్త తెలుగు సినిమా)

తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్.. ఓవైపు కంపోజర్‌గా చేస్తూనే మరోవైపు హీరోగానూ అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నాడు. ఇతడు అనస్వర హీరోహీరోయిన్లుగా చేసిన ఓ సిరీస్ 'లక్కీ'. ఇందులో ఓ కుక్క పిల్ల కూడా లీడ్ రోల్ చేసింది. దీని చుట్టూనే సిరీస్ అంతా ఉంటుంది. హాట్‌స్టార్‌లో ఈనెల 20వ తేదీ నుంచి ఇది.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

'లక్కీ' విషయానికొస్తే.. తప్పిపోయిన ఓ చిన్న కుక్కపిల్ల హీరోకి దొరుకుతుంది. దీంతో దాన్ని తీసుకొచ్చి తన ఇంట్లోనే ఉంటున్న పాపకు ఇస్తాడు. ఓ రోజు.. రాజకీయ నాయకుడు సదరు పెట్ డాగ్‪‌ని ఎత్తుకుపోతాడు. అసలు ఆ కుక్కపిల్ల సంగతేంటి? చివరకు హీరోకు దగ్గరకు చేరిందా లేదా అనేది స్టోరీలా అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: 'మన శంకరవరప్రసాద్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడేనా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement