ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో చిరంజీవి 'మన శంకరవరప్రసాద్'కి ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన వచ్చింది. ఇప్పటివరకు రూ.350 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చాయి. దీనిబట్టి జనాలు ఎంతలా చూశారో అర్థం చేసుకోవచ్చు. కంటెంట్ పరంగా రొటీన్ అనే విమర్శలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఇది క్లిక్ అయింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైందని, స్ట్రీమింగ్ డేట్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు.
నటుడిగా రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చిరంజీవి సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఆ లోటుని 'మన శంకరవరప్రసాద్' తీర్చేసినట్లే కనిపిస్తుంది. ఈ మూవీలో చిరంజీవి సరసన నయనతార నటించగా.. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర చేశారు. అనిల్ రావిపూడి దర్శకుడు. జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతున్న ఈ మూవీని.. ఫిబ్రవరి 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజులు అటుఇటు అయినా సరే వచ్చే నెల రెండో వారం ఓటీటీ రిలీజ్ పక్కా అని మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ))
'మన శంకరవరప్రసాద్' విషయానికొస్తే.. నేషనల్ సెక్యూరిటీ అధికారి శంకరవరప్రసాద్ (చిరంజీవి).. కేంద్రమంత్రి శర్మ రక్షణ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంటాడు. మంత్రి కూడా శంకర్‌ని కుటుంబ సభ్యుడిలా చూసుకుంటూ ఉంటాడు. శంకర్ గతంలో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ జీవీఆర్ కుమార్తె శశిరేఖని పెళ్లి చేసుకుంటాడు. కానీ కొన్నాళ్లకు విడాకులు తీసుకుంటారు. దీంతో పిల్లల్ని చూసే ఛాన్స్ కూడా శంకర్‌కి ఉండదు. ఇది తెలుసుకున్న కేంద్రమంత్రి.. పిల్లలతో సమయం గడిపేలా వాళ్లు చదువుతున్న స్కూల్‌లో పీఈటీగా ఉద్యోగం ఇప్పిస్తాడు. కొన్నాళ్లకు శంకర్.. పిల్లలకు దగ్గరగానే ఉన్నాడని శశిరేఖకు తెలుస్తోంది. ఇదే టైంలో జీవీఆర్‌పై దాడి జరగుతుంది. దీంతో మాజీ భార్య ఇంటికే శంకర్.. సెక్యూరిటీ కోసం వస్తాడు. తర్వాత ఏమైంది? ఇంతకీ శంకర్-శశిరేఖ ఎందుకు విడిపోయారు? అనేదే మిగతా స్టోరీ.
సంక్రాంతి సినిమాల ఓటీటీ డీటైల్స్ విషయానికొస్తే.. ప్రభాస్ 'రాజాసాబ్' చిత్రాన్ని ఫిబ్రవరి 6 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అలానే శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' మూవీని ఫిబ్రవరి 4 నుంచే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేయనున్నారు. ఇది కూడా అనౌన్స్ చేశారు.
(ఇదీ చదవండి: కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా రివ్యూ)


