ఓటీటీకి మరో సంక్రాంతి సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Sivakarthikeyan and Sreeleela's Parasakthi OTT Release Date | Sakshi
Sakshi News home page

Parasakthi OTT Release Date: ఓటీటీకి వివాదాస్పద మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Feb 1 2026 1:40 PM | Updated on Feb 1 2026 1:55 PM

Sivakarthikeyan and Sreeleela's Parasakthi OTT Release Date

తమిళ నటుడు శివకార్తికేయన్‌కు తెలుగు ఆడియన్స్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. తాను నటించిన లేటెస్ట్ మూవీ 'పరాశక్తి'  చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. పీరియాడికల్ స్టోరీతో తీసిన ఈ చిత్రం జనవరి 10న థియేటర్లలో రిలీజైంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం అభిమానలను అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహించారు.

తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 7వ తేదీ నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్సయిన వారు ఓటీటీలో చూసేయండి.

ఈ మూవీని 1964లో తమిళనాడులో ఓ ఊరిలో జరిగిన ఉద్యమం ఆధారంగా తెరకెక్కించారు. హిందీని జాతీయ భాషగా ప్రకటించిన తర్వాత మధురైలోని ఓ ఊరిలో విద్యార్థులకు, ఓ ఊరివాళ్లకు.. ఓ పోలీస్‌తో ఎలాంటి గొడవ జరిగింది? చివరకు ఏమైంది అనే పాయింట్‌తో మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో​ పలు అభ్యంతరకరమైన డైలాగ్స్‌ ఉండటంతో సెన్సార్‌ బోర్డ్ భారీ కట్స్ చెప్పింది. ఏకంగా 20కి పైగా కట్స్‌ సూచించింది.  సెన్సార్ వివాదం ముగిసిన తర్వాత థియేటర్లలో రిలీజ్ చేశారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement