breaking news
Sreeleela
-
పెళ్లి కూతురిలా శ్రీలీల.. కాజల్ వన్నె తగ్గని అందం
పెళ్లి కూతురిలా ముస్తాబైన శ్రీలీలవన్నె తగ్గని అందంతో మెరిసిపోతున్న కాజల్బ్లాక్ చుడీదార్లో క్యూట్ అండ్ స్వీటుగా శ్రుతి హాసన్వైట్ ఫ్రాక్‌లో వయ్యారంగా బిగ్‌బాస్ దివిఅందమైన కుందనపు బొమ్మలా జ్యోతిరాయ్హెబ్బా పటేల్ బ్లాక్ అండ్ వైట్ లుక్ View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by S H E ♾️ (@anaswara.rajan) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Malavika_Manoj (@malavika_manojj) -
ఆ టాపిక్ తీయకండి.. నేను మీ టాపిక్ తీస్తా: శ్రీలీల
ఈ మధ్య కాలంలో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ అనగానే గుర్తొచ్చే పేరు శ్రీలీల. యాక్టింగ్ పరంగా ఈమెకు ఓ మాదిరి మార్కులు పడతాయి గానీ డ్యాన్సుల్లో మాత్రం ఇరగదీసేస్తోంది. కొన్నిరోజుల క్రితం తెగ హల్చల్ చేసిన 'వైరల్ వయ్యారి' పాటలోనూ శ్రీలీల మాస్ స్టెప్పులతో ఊపుఊపేసిందని చెప్పొచ్చు. అలాంటి ఈమె.. సీనియర్ నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న టాక్ షోలో పాల్గొంది. ఆసక్తికర సంగతుల్ని కొన్ని బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగానే రిలీజైంది.'జయమ్ము నిశ్చయమ్మురా' పేరుతో జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ఈ షో.. గత వారమే లాంచ్ అయింది. తొలి ఎపిసోడ్ గెస్ట్‌గా హీరో నాగార్జున వచ్చారు. తన వ్యక్తిగత విషయాలు బోలెడన్ని పంచుకున్నారు. ఇప్పుడు రెండో ఎపిసోడ్ కోసం యంగ్ సెన్సేషన్ శ్రీలీలని తీసుకొచ్చారు. ఆ ప్రోమోనే ఇప్పుడు విడుదల చేశారు.(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న తెలుగు హీరో.. భార్యకు సీమంతం)శ్రీలీలని షోకి ఆహ్వానించిన జగపతిబాబు.. 'మేమందరం ఇండస్ట్రీకి వచ్చి యాక్టింగ్ నేర్చుకున్నాం. నువ్వు యాక్టింగ్ నేర్చుకుని ఇండస్ట్రీకి వచ్చావ్' అని అన్నారు. దీంతో గతుక్కుమన్న శ్రీలీల.. సార్ తిట్టారా పొడిగారా అంటూ అమాయకంగా ఫేస్ పెట్టింది. 'గుంటూరు కారం' చేసేటప్పుడు లెఫ్ట్‌లోనో రైట్‌లోనో నీ ఫేస్ కొంచెం తేడా ఉండేది అని జగపతిబాబు అనగా.. 'ఆ టాపిక్ తీస్తే నేను మీ టాపిక్ తీసుకొస్తా సర్' అని శ్రీలీల చెప్పింది. 'మీ హీరోయిన్ గారు.. మీరు..' అంటూ వేలు చూపిస్తూ నవ్వేసింది.'ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టేశావ్' అని శ్రీలీలని ఉద్దేశించి జగపతిబాబు అనగానే.. 'దూల తీరిపోతుంది సార్' అంటూ శ్రీలీల తన బాధని నవ్వుతూనే బయటపెట్టింది. 'నీ మీద ఓ కంప్లైంట్ ఉందమ్మా' అంటూ జగ్గూ భాయ్ అనగానే.. శ్రీలీల తల్లి వెనక నుంచి ఈమెని సర్ప్రైజ్ చేసింది. 'మా అమ్మ మీకు పెద్ద ఫ్యాన్ సార్' అని శ్రీలీల చెప్పగానే.. జగపతిబాబు అలా చూశాడు. శ్రీలీల ముసిముసిగా నవ్వింది. దీంతో 'నువ్వెందుకు అంతగా సిగ్గు పడుతున్నావ్' అని జగపతిబాబు అనేసరికి అందరూ నవ్వేశారు. ఈ శుక్రవారం ఓటీటీలో ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) -
రవితేజ 'మాస్ జాతర' మూవీ HD స్టిల్స్
-
రవితేజ 'మాస్ జాతర' టీజర్ రిలీజ్
గత కొన్నాళ్లుగా రవితేజ చేస్తున్న సినిమాలు అయితే చేస్తున్నాడు గానీ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని 'మాస్ జాతర' అనే మూవీ చేశాడు. ఈనెల 27న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ కాగా ఓ మాదిరి వైరల్ అయ్యాయి. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: చెప్పడం మర్చిపోయాను.. క్షమించండి: ఎన్టీఆర్)రవితేజ సినిమా అంటే ఏయే అంశాలు ఉంటాయో.. 'మాస్ జాతర' టీజర్ అలానే ఉంది. కామెడీ, ఫైట్స్, రొమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ మూవీలో రవితేజ.. రైల్వే పోలీస్‌గా కనిపించబోతున్నాడు. శ్రీలీల హీరోయిన్. భాను భోగవరపు అనే కొత్త దర్శకుడు.. ఈ మూవీతో పరిచయమవుతున్నాడు. నాగవంశీ.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా రవితేజ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
రవితేజ 'మాస్ జాతర'.. టీజర్ రిలీజ్ టైమ్ ఫిక్స్!
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా కనిపించనుది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.(ఇది చదవండి: Mass Jathara: ‘ఓలే ఓలే' పాట రిలీజ్.. రవితేజ, శ్రీలీల డ్యాన్స్ అదుర్స్)కొద్ది రోజుల క్రితమే ఓలే ఓలే అనే మాస్ సాంగ్‌ను విడుదల చేసిన మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. మాస్ జాతర టీజర్‌ను ఈనెల 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సోమవారం ఉదయం 11 గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేస్తామని సితార ఎంటర్టైన్మెంట్ ట్వీట్ చేసింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాతో అభిమానులకు మరోసారి మాస్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. A full meal of MASS 🔥A full heart of ENTERTAINMENT 🤩All served together with #MassJatharaTeaser tomorrow at 11:08 AM ❤️🔥#MassJathara #MassJatharaOnAug27th Mass Maharaaj @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo @vidhu_ayyanna… pic.twitter.com/9QIbjkvgF0— Sithara Entertainments (@SitharaEnts) August 10, 2025 -
ఓలే ఓలే.. అన్ని బూతులే.. రవితేజ పాటపై విమర్శలు!
ఓలే ఓలే గుంటనీ అయ్యకాడ ఉంటానీ అమ్మకాడ తింటానీ వొళ్ళోకొచ్చి పంటాబుద్ధి లేదు జ్ఞానం లేదు సిగ్గు లేదుమంచి లేదు మర్యాద లేదుఅంగీ లేదు లుంగీ లేదు పంచె లేదుతాడు లేదు బొంగరం లేదునీ అమ్మని నీ అక్కని నీ తల్లిని నీ చెల్లిని... పట్టుకుని కాళ్లు మొక్కి పోతాచదువుతుంటే ఇవేవో బూతు పదాల్లా అనిపిస్తున్నాయి కదా?.. కానీ ఇవి ఓ సినిమాలో ఉన్న జానపద గీతం లిరిక్స్. ఓ స్టార్ హీరో ఈ పాటకు స్టెప్పులేశాడు. నెట్టింట ఈ పాట తెగ వైరల్ అవుతుంది. కొంతమంది హీరోహీరోయిన్ల స్టెప్పులను ఎంజాయ్ చేస్తుంటే..మరికొంతమంది మాత్రం లిరిక్స్‌పై తీవ్రమైన అభ్యంతరం తెలియజేస్తున్నారు. జానపద పాట పేరుతో బూతు పాటలు వినిపిస్తున్నారంటూ మండిపడుతున్నారు. #MassJathara songగుంట.. ఉంట.. పంట.. తింటా..నీ అమ్మని.. అక్కని.. చెల్లిని.. పట్టుకుని.....బుద్ది లేదు.. జానం లేదు.. సిగ్గు లేదు.. శరం లేదు..అంగీ లేదు.. లాగు లేదు.. లుంగీ లేదు.....Ole Ole లిరిక్స్..😡స్పెషల్ సాంగే కానీ వినడానికి దరిద్రంగా ఉంది.🤦#RaviTeja #Sreeleela pic.twitter.com/2i9RIBxOSp— Usha Rani Seetha (@RaniUshaa) August 6, 2025రవితేజ-శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’ లో ఈ ఫోక్ సాంగ్ ఉంది. నిన్న పాటను విడుదల చేయగా.. కొన్ని గంటల్లోనే అది వైరల్ అయింది. యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. అయితే కొంతమంది నెటిజన్స్ మాత్రం లిరిక్స్‌పై మండిపడుతున్నారు. 'నీ యమ్మ...అక్క, తల్లి, చెల్లి...' 'బుద్ది, జ్ఞానం సిగ్గు, శరం లేదు...' లాంటి బూతులతోనే పాటని కంపోజ్ చేయడం, దానికి రవితేజ లాంటి స్టార్ హీరో డ్యాన్స్ చేయడం దారుమని కామెంట్ చేస్తున్నారు. ‘జానపదం లో ఇలాంటి పదాలు అసలు బూతులు కావంటూ మరికొంతమంది రవితేజకు సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు. Me listening to Ole Ole Song be like ....#MassJathara #OleOle #RaviTeja #Sreeleela pic.twitter.com/pgu1UQmtcD— Tharun Tej Musical Audios🎧💥 (@TejaTeja47057) August 5, 2025 ఈ మధ్య సినిమాలో జానపద పాటలు ఎక్కువగా వాడేస్తున్నారు. స్టార్ హీరోలు సైతం ఫోక్ సాంగ్‌కి స్టెప్పులేస్తున్నారు. అయితే ఇన్నాళ్లు తెలంగాణ ఫోక్ సాంగ్స్ మాత్రమే సినిమాల్లో కనిపించేవి. ఇప్పుడు ఉత్తరాంధ్ర జానపద పాటలకు కూడా స్టార్స్ స్టెప్పులేస్తున్నారు. అవి బాగా వర్కౌట్ అవుతున్నాయి కూడా. అందుకే తాజాగా రవితేజ కూడా ఓ ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్‌కి స్టెప్పులేశాడు. రోహిణితో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఈ పాటను పాడాడు. Song ki baaga negative response vachindhi bro try changing the lyrics @vamsi84 or shorten the duration of the song. #OleOle #MassJathara https://t.co/54GSRaEnwK— EAGLE 🦅 (@RT_Zealot) August 6, 2025 -
రవితేజ మాస్ జాతర కౌంట్ డౌన్ స్టార్ట్...!
-
Mass Jathara: ‘ఓలే ఓలే' పాట రిలీజ్.. రవితేజ, శ్రీలీల డ్యాన్స్ అదుర్స్
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. కర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించి.. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. మొదటి గీతంగా విడుదలైన 'తు మేరా లవర్' అందరినీ ఉర్రూతలూగించింది. ఇప్పుడు రెండవ గీతంగా 'ఓలే ఓలే'ను విడుదల చేసింది చిత్ర బృందం. అందరూ కాలు కదిపేలా ఎంతో ఉత్సాహభరితంగా ఈ గీతముంది.ధమాకా జోడి రవితేజ-శ్రీలీల తెరపై కనిపిస్తే ఆ సందడే వేరు. 'ఓలే ఓలే' పాటతో ఈ జోడి మరోసారి ఆకట్టుకుంది. ఇద్దరూ పోటాపోటీగా నర్తించి పాటను మరో స్థాయికి తీసుకెళ్ళారు. రవితేజ తన వింటేజ్ స్టెప్పులతో అలరించారు. శ్రీలీల తన అసాధారణ నృత్య ప్రతిభతో మరోసారి కట్టిపడేశారు. ఇద్దరూ కలిసి ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా తెరపై మెరుపులు మెరిపిస్తున్నారు. -
కిరీటి స్టెప్పులు, శ్రీలీల గ్రేస్.. వైరల్ వయ్యారి ఫుల్ సాంగ్ చూసేయండి
ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా నటించిన తొలి చిత్రం జూనియర్ (Junior Movie). ఇది మొదటి సినిమా అయినప్పటికీ కిరీటి నటనకు, ముఖ్యంగా అతడి డ్యాన్స్‌కు ఫుల్ మార్కులు పడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమానిని అని చెప్పుకునే ఇతడు ఆ హీరోకు తగ్గట్లుగానే డ్యాన్స్ చేశాడు. వైరల్ వయ్యారి సాంగ్‌లో ఎన్టీఆర్‌ను గుర్తుచేసేలా స్టెప్పులతో అదరగొట్టాడు.వైరల్ వయ్యారి ఫుల్ వీడియో సాంగ్శ్రీలీల (Sreeleela) గ్రేస్, ఎక్స్ప్రెషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎప్పటిలాగే చించిపడేసింది. ఒకరకంగా చెప్పాలంటే జూనియర్ సినిమాకు వైరల్ వయ్యారి పాట భారీ హైప్ తీసుకొచ్చింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు. 4కె వర్షన్లో వైరల్ వయ్యారి సాంగ్ (Viral Vayyari Full Video Song)ను యూట్యూబ్‌లో అందుబాటులోకి తెచ్చారు. పోటాపోటీగా డ్యాన్స్ చేసిన కిరీటి, శ్రీలీలఇది చూసిన అభిమానులు.. శ్రీలీలకే పోటీ ఇచ్చేలా డ్యాన్స్ చేశాడని కిరీటిని ప్రశంసిస్తున్నారు. ఇక ఈ పాటకు రేవంత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. జూనియర్ సినిమా విషయానికి వస్తే.. కిరీటి, శ్రీలీల జంటగా నటించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీ జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదవండి: తిరుమలలో 'కిరణ్ అబ్బవరం' కుమారుడి నామకరణం -
ప్రేమకథ ఆలస్యం
హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్లో నటిస్తున్న తొలి హిందీ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. కార్తీక్ ఆర్యన్ , శ్రీలీల హీరో హీరోయిన్లుగా అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ ప్రేమకథ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా ఈ దీపావళికి విడుదల కావడం లేదని, వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని దర్శకుడు అనురాగ్ బసు వెల్లడించారు.‘‘ఇప్పటి వరకు మా సినిమా చిత్రీకరణ 40 శాతం పూర్తయింది. కార్తీక్ ఆర్యన్ మా సినిమాతోపాటుగా మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో కార్తీక్ డిఫరెంట్ లుక్స్‌తో కనిపిస్తాడు. ఈ లుక్స్ పరంగా ఇబ్బందులున్నాయి. ఆగస్టు లేదా సెప్టెంబరులో మా సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభిస్తాం.అయితే ‘సయారా’ సినిమా స్టోరీకి మా కథ దగ్గరగా ఉందని, దీంతో స్క్రిప్ట్‌లో మార్పులు చేయాల్సి రావడం వల్లే ఈ ఏడాది మా చిత్రం రిలీజ్ కావడం లేదన్న వార్తల్లో నిజం లేదు. ‘సయారా’ కథకు, మా సిని మాకు సంబంధం లేదు’’ అన్నారు అనురాగ్ బసు. ఇలా శ్రీలీల తొలి హిందీ సినిమా రిలీజ్ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా కానుంది. ఇక ప్రస్తుతం తెలుగులో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, తమిళంలో ‘పరాశక్తి’ వంటి చిత్రాలతో శ్రీలీల బిజీగా ఉన్నారు. -
శ్రీలీల వైరల్ వయ్యారి సాంగ్.. స్టూడెంట్ డ్యాన్స్‌కు హీరో ఫిదా!
ఇటీవల సినీ ప్రియులను ఓ రేంజ్లో ఊపేస్తోన్న హీరోయిన్ శ్రీలీల. గతేడాది పుష్ప-2 చిత్రంలో కిస్సిక్ సాంగ్‌తో అలరించిన ముద్దుగుమ్మ.. మరోసారి అలాంటి ఊపున్న సాంగ్‌తో మెప్పించింది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ హీరోగా వచ్చిన జూనియర్ మూవీలో వైరల్ వయ్యారి అంటూ అభిమానుల ముందుకొచ్చింది. ఈ మాస్ సాంగ్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. నెట్టింట ఎక్కడ చూసినా వైరల్ వయ్యారి అంటూ రీల్స్‌తో అదరగొట్టేసింది.అంతలా క్రేజ్ దక్కించుకున్న ఈ పాటకు కర్నాటకకు చెందిన ఓ విద్యార్థిని చేసిన డ్యాన్స్ నెట్టింట వైరలవుతోంది. హీరో కిరిటీ సమక్షంలోనే ఆ బాలిక అద్భుతంగా డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను హీరో కిరిటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థినికి హీరో కిరిటీ చిరుకానుక అందించారు. ఇది చూసిన నెటిజన్స్ విద్యార్థిని టాలెంట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతంగా చేశావంటూ కితాబిస్తున్నారు.కాగా.. కిరిటీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం జూనియర్. ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ జూలై 18 తెలుగు, కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఇంకా సందడి చేస్తోంది. The super talented V. Pooja from Kurugodu, a beautiful village in my hometown Ballari, dancing her heart out to #ViralVayyari. Blessings to you, little star! #Junior pic.twitter.com/FITaWGU6ra— Kireeti (@KireetiOfficial) July 23, 2025 -
'జూనియర్' రెండు రోజుల కలెక్షన్ ఎంతంటే?
రీసెంట్గా థియేటర్లలో పలు చిత్రాలు రిలీజ్ కాగా.. 'జూనియర్' చిత్రానికి చెప్పుకోదగ్గ వసూళ్లు కనిపిస్తున్నాయి. కిరీటికి హీరోగా ఇదే తొలి సినిమా అయినప్పటికీ డ్యాన్సులు, ఫైట్స్, డైలాగ్స్ లాంటివి బాగా చెప్పడం.. దానికి తోడు 'వైరల్ వయ్యారి' పాట తెగ వైరల్ అయిపోయేసరికి జనాలు ఈ మూవీని చూసేందుకు ఓ మాదిరిగా థియేటర్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తొలిరోజు కంటే రెండో రోజు వసూళ్లు కాస్త ఎక్కువగానే వచ్చాయి. ఇంతకీ రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్ ఎంత?కిరీటి, శ్రీలీల, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని రెగ్యులర్ కమర్షియల్ తరహా కథతోనే తెరకెక్కించారు. అంతెందుకు గతంలో వచ్చిన తెలుగు చిత్రాల ఛాయలు కూడా చాలా కనిపిస్తాయి. అయితేనేం వేరే చిత్రాలేం లేకపోవడం దీనికి ఓ రకంగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.1.45 కోట్లు వసూళ్లు రాగా.. రెండో రోజు రూ.1.65 కోట్ల మేర కలెక్షన్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అంటే రెండు రోజులకు కలిపి రూ.3.10 కోట్ల మేర నెట్ కలెక్షన్ అందుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: హీరోయిన్‌తో ప్రేమ... పెళ్లి వాయిదా వేసిన విశాల్)హీరోగా కొత్త కుర్రాడు చేస్తున్నప్పటికీ ఈ మాదిరి వసూళ్లు అంటే కాస్త విశేషమనే చెప్పాలి. అయితే వచ్చేవారం థియేటర్లలోకి 'హరిహర వీరమల్లు' రానుంది. ఇంతలోనే 'జూనియర్' కలెక్షన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మరి ఈ మూవీకి లాంగ్ రన్ అయ్యేసరికి ఎంత వసూళ్లు వస్తాయో చూడాలి?జూనియర్ విషయానికొస్తే.. జ్ఞాపకాలే ముఖ్యమనుకునే కుర్రాడు అభి(కిరీటి). కాలేజీలో సరదాగా గడుపుతూనే చదువులో మంచి ప్రతిభ చూపిస్తాడు. తను ప్రేమించిన శ్రీలీల పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. కానీ ఆ కంపెనీ బాస్ విజయ(జెనీలియా)కు అభి అస్సలు నచ్చడు. ఆమెకు తన పేరుతో ఉన్న విజయనగరం అనే ఊరు కూడా నచ్చదు. అలాంటిది అభితో కలిసి విజయ.. విజయనగరం వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లాక ఏం జరిగింది? ఆ ఊరికి విజయకు సంబంధమేంటి అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సేనాని రూల్స్ మాట్లాడతారు.. పాటించరు) -
పెళ్లి చేసుకునే ఆలోచన లేదు!
‘‘ఇప్పుడు నా వయసు 24 ఏళ్లే. నా కెరీర్ ఇప్పుడేప్రారంభం అయింది. 30 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు’’ అని హీరోయిన్ శ్రీలీల చెప్పారు. ‘పెళ్లి సందడి’(2021) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన ఆమె బిజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. అలాగే తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్నారామె. ‘ఆషికి 3’ సినిమాలో కార్తీక్ ఆర్యన్‌కి జోడీగా నటిస్తున్నారు శ్రీలీల. అయితే వీరిద్దరి రిలేషన్ గురించి గత కొన్నాళ్లుగా బాలీవుడ్లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల ప్రేమ, పెళ్లి, వ్యక్తిగత జీవితం వంటి విషయాలపై మాట్లాడారు. ‘‘ప్రస్తుతం నాకు 24 సంవత్సరాలు. కెరీర్ పరంగా ఇంకా ఎన్నో కలలున్నాయి.ప్రస్తుతం పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టాను. వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించేందుకు సమయం లేదు. నా జీవితంలో పెళ్లి అనేది 30 ఏళ్ల తర్వాతే జరుగుతుంది. అప్పటి వరకు ‘మీ వివాహం ఎప్పుడు?’ అని నన్ను ఎవరూ అడగొద్దు. ప్రస్తుతం నేను ప్రేమలో ఉన్నానని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, నిజంగా అలాంటిదేం లేదు. నాపై వచ్చిన పుకార్లన్నీ అసత్యం. నేను ఎక్కడికెళ్లినా మా అమ్మ నా వెంట ఉంటుంది. అమెరికా వెళ్లినప్పుడు కూడా నాతోనే ఉంది. అలాంటి పరిస్థితుల్లో నేను ఎవరితో ప్రేమలో పడగలను? నిజంగా ఎవరితోనైనా రిలేషన్ లో ఉంటే మా అమ్మ మాతో కలిసి ఉండగలదా? ప్రస్తుతానికి నా తొలిప్రాధాన్యం కెరీర్‌కే. పెద్ద సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఆ సినిమాల్లో బాగా నటించి, ప్రేక్షకుల మెప్పు పొందేందుకు కష్టపడుతున్నాను. నా కంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి.. వాటిని సాధించిన తర్వాతే వ్యక్తిగత విషయాల గురించి ఆలోచిస్తాను’’ అని తెలిపారు శ్రీలీల. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘మాస్ జాతర, ఉస్తాద్ భగత్‌సింగ్’, తమిళంలో ‘పరాశక్తి’, హిందీలో ‘ఆషికి 3’ వంటి సినిమాలు చేస్తున్నారు. -
'జూనియర్' కలెక్షన్.. మొదటిరోజు అన్ని కోట్లా?
నిన్న అనగా శుక్రవారం రిలీజైన సినిమాల్లో కాస్తోకూస్తో 'జూనియర్' మంచి బజ్ సొంతం చేసుకుంది. అందుకు తగ్గట్లే పాజిటివ్ టాక్ రావడంతో టికెట్స్ బాగానే సేల్ అయ్యాయి. కలెక్షన్ కూడా బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. గాలి జనార్ధనరెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయమైన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. ఇంతకీ ఈ మూవీ తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయి? తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం.కిరీటిని హీరోగా పరిచయం చేస్తూ 'జూనియర్' అనే సినిమాని దాదాపు రెండు మూడేళ్ల క్రితం ప్రకటించారు. షూటింగ్ పూర్తయినా సరే చాలా ఆలస్యమైన ఈ చిత్రం.. ఎట్టకేలకు తాజాగా థియేటర్లలోకి వచ్చింది. ఈ వీకెండ్ చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేకపోవడంతో 'జూనియర్'కి ప్లస్ అయింది. అందుకు తగ్గట్లే తొలిరోజు రూ.1.4 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కన్నడ కంటే తెలుగులోనే ఎక్కువ మొత్తం వసూలు కావడం విశేషం.(ఇదీ చదవండి: 'మెగా' లీకులు.. నిర్మాతలు గట్టి వార్నింగ్)కిరీటి స్వతహాగా కన్నడ అయినప్పటికీ.. తెలుగులో 'జూనియర్' చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. దానికి శ్రీలీల ఓ కారణం కాగా, 'వైరల్ వయ్యారి' పాట తెగ వైరల్ కావడం మరో కారణం అని చెప్పొచ్చు. తొలిరోజు తెలుగులో రూ.1.25 కోట్లు రాగా.. కన్నడలో కేవలం రూ.15 లక్షలే వచ్చినట్లు తెలుస్తోంది తొలి సినిమానే అయినప్పటికీ కిరీటి డ్యాన్సులు, ఫైట్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మూవీ కోసం బడ్జెట్ కూడా గట్టిగానే పెట్టారు. అయితేనే తొలిరోజు మంచి వసూళ్లే వచ్చాయి. లాంగ్ రన్లో కాస్త చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రావడం గ్యారంటీ అనిపిస్తోంది.'జూనియర్' విషయానికొస్తే.. జ్ఞాపకాలే ముఖ్యమనుకునే కుర్రాడు అభి(కిరీటి). కాలేజీలో సరదాగా గడుపుతూనే చదువులో మంచి ప్రతిభ చూపిస్తాడు. తను ప్రేమించిన శ్రీలీల పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. కానీ ఆ కంపెనీ బాస్ విజయ(జెనీలియా)కు అభి అస్సలు నచ్చడు. ఆమెకు తన పేరుతో ఉన్న విజయనగరం అనే ఊరు కూడా నచ్చదు. అలాంటిది అభితో కలిసి విజయ.. విజయనగరం వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లాక ఏం జరిగింది? ఆ ఊరికి విజయకు సంబంధమేంటి అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: Junior Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ) -
అప్పటివరకు అసలు పెళ్లి చేసుకోను: శ్రీలీల
యంగ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా 'జూనియర్'లో వైరల్ వయ్యారిగా తెగ సందడి చేస్తోంది. సరే ఈ సంగతులు పక్కనబెడితే బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఈమె ప్రేమలో ఉందనే రూమర్స్ గత కొన్నాళ్లుగా గట్టిగా వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరూ కలిసి పనిచేస్తుండటమే ఇందుకు కారణం. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీలీల ఈ పుకార్లతో పాటు తన పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: 'కొత్తపల్లిలో ఒకప్పుడు' సినిమా రివ్యూ)'నేను లవ్ చేస్తున్నానని అంతా అనుకుంటున్నారు. కానీ నేనెలా ప్రేమలో పడగలను. ప్రతిసారి అమ్మ నాతో ఉంటోంది. అయినాసరే నాపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. లేకలేక మియామీ వెళ్లినప్పుడు కూడా నా వెంట అమ్మ వచ్చింది. అలాంటప్పుడు నేనెలా ప్రేమలో పడతాను చెప్పండి' అని శ్రీలీల క్యూట్‌గా క్లారిటీ ఇచ్చింది.కొన్నిరోజుల క్రితం పెళ్లి కూతురిలా రెడీ వాటిని శ్రీలీల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అంతా ఈమెకు పెళ్లి అని ఫిక్సయ్యారు. కానీ అది తన పుట్టినరోజు, అలా బుట్టలో తీసుకెళ్లడం తన కుటుంబ సంప్రదాయం అని చెప్పింది. దీంతో కాస్త రిలాక్స్ అయ్యారు. ఇక పెళ్లి విషయమై స్పందించిన శ్రీలీల.. తనకు ఇప్పుడు 23 ఏళ్లు అని, ఎలా లేదన్నా 30 ఏళ్లు వచ్చేవరకు తను అసలు పెళ్లి చేసుకోనని కూడా చెప్పుకొచ్చింది. మరి అప్పుడైనా ప్రేమ వివాహమా? లేదంటే పెద్దల కుదిర్చిన పెళ్లా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 5 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
Junior Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ
టైటిల్ : జూనియర్నటీనటులు: కిరీటి రెడ్డి, శ్రీలీల, జెనీలియా, డా. రవిచంద్రన్, రావు రమేశ్, సత్య, వైవా హర్ష తదితరులునిర్మాణ సంస్థ: వారాహి చలన చిత్రంనిర్మాత: రజని కొర్రపాటిరచన-దర్శకత్వం: రాధా కృష్ణసంగీతం: దేవిశ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్ కుమార్ఎడిటర్: నిరంజన్ దేవరమేనేవిడుదల తేది: జులై 18, 2025‘వైరల్ వయ్యారి..’ ఈ ఒక్క పాటతో ‘జూనియర్’ సినిమాకు భారీ హైప్ వచ్చింది. కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన తొలి చిత్రమిది. సోషల్ మీడియాలో వైరల్ పాట బాగా వైరల్ అవ్వడం.. శ్రీలీల, జెనీలియా లాంటి స్టార్స్ నటిస్తుండడంతో టాలీవుడ్‌లోనూ ఈ చిత్రంపై బజ్ క్రియేట్ అయింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘జూనియర్’(Junior Movie Review )పై భారీ అంచనాలు పెరిగాయి. మరి అంచనాలను ఈ చిత్రం అందుకుందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..విజయనగరానికి చెందిన కోదండపాణి(రవి చంద్రన్)-శ్యామల దంపతులకు ఆలస్యంగా పుట్టిన బిడ్డ అభి(కిరీటీ రెడ్డి). కొడుకు పుట్టగానే భార్య చనిపోతుంది. దీంతో కోదండ పాణి తన కొడుకుకు అన్నీ తానై పెంచుతాడు. తండ్రి-కొడుకు మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం.. ఆయన చూపించే అతిప్రేమ అభికి చిరాకు తెప్పిస్తుంది. తండ్రికి దూరంగా ఉండాలనే పైచదువుల కోసం సిటీకి వెళ్తాడు. ‘అరవయ్యేళ్లు వచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని మెమోరీస్ ఉండాలి కదా’ అంటూ స్నేహితులతో కాలేజీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. తోటి విద్యార్థిని స్పూర్తి(శ్రీలీల)తో ప్రేమలో పడి.. ఆమె పని చేసే కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. తొలిరోజే తన ప్రవర్తనతో బాస్ విజయ సౌజన్య (జెనీలియా)కు చిరాకు తెప్పిస్తాడు. ఆ తర్వాత విజయ సౌజన్య గురించి ఓ నిజం తెలుస్తుంది. ఓ కారణంగా ఆమెతో కలిసి తన సొంతూరు విజయనగరానికి వెళ్తాడు. అభికి తెలిసిన నిజం ఏంటి? విజయనగరం గ్రామంతో విజయ సౌజన్యకు ఉన్న సంబంధం ఏంటి? అభి తండ్రి సొంత ఊరిని వదిలి ఎందుకు నగరానికి వచ్చాడు? కోదండ పాణికి, విజయ సౌజన్యకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..సినీ తారలు లేదా ప్రముఖ కుటుంబాల నుంచి ఎవరైనా హీరోగా సీనీ రంగంలోకి అడుగుపెడితే.. తొలి సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. హీరోగా రాణించగలడా? లేదా? అనేది తొలి సినిమాతోనే డిసైడ్ చెస్తారు. డెబ్యూ ఫిల్మ్‌తో కాస్త మెప్పించినా సరే.. భవిష్యత్‌కు ఢోకా ఉండదు. అందుకే వారసుల ఎంట్రీకి ప్రముఖ కుటుంబాలు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కమర్షియల్ కథతో రావడానికి ట్రై చేస్తారు. తమ వారసుడిలో ఉన్న టాలెంట్ మొత్తాన్ని తొలి సినిమాలోనే చూపించేందుకు ప్రయత్నిస్తారు. కిరీటి రెడ్డి విషయంలోనూ అదే జరిగింది.(Junior Movie Review ) ప్రముఖులు వారసుల డెబ్యూ ఫిల్మ్‌కి కావాల్సిన అంశాలన్నింటిని కొలతలేసి మరీ ‘జూనియర్’ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రాధా కృష్ణ. హీరోని ఎలివేట్ చేసేలా యాక్షన్ సీన్స్, డ్యాన్స్, డైలాగ్స్ అన్నీ చక్కగా సెట్ చేసుకున్నాడు. కానీ కథ విషయంలో మాత్రం కొత్తగా ఆలోచించలేకపోయాడు. సినిమా ప్రారంభం మొదలు ఎండ్ వరకు ప్రతీ సన్నివేశం పాత సినిమాలను గుర్తు తెస్తుంది. కామెడీ బాగా పండడం.. పాటలు, యాక్షన్ సీన్లు ఆకట్టుకునేలా ఉండడంతో రొటీన్ కథే అయినా ప్రేక్షకులకు బోర్ కొట్టదు(Junior Movie Review). ఒక ఎమోషన్ సీన్‌తో కథను ప్రారంభించి.. కాసేపటికే కథను కాలేజీకి షిఫ్ట్ చేశాడు. హీరో ఎంట్రీ సీన్‌ని బాగా ప్లాన్ చేశారు. కాలేజీలో హీరోయిన్‌తో చేసే అల్లరి, స్నేహితులతో కలిసి చేసే కామెడీ బాగా వర్కౌట్ అయింది. జెనీలియా పాత్ర ఎంట్రీ తర్వాత కథనం కాస్త సీరియస్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితీయార్థంపై ఆసక్తి పెంచేలా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం మొత్తం గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. కొన్ని సన్నివేశాలు శ్రీమంతుడు, మహర్షి సినిమాలను గుర్తు తెస్తుంది. కొన్ని చోట్ల ఎమోషన్ బాగా పండింది కానీ కథనంలో మాత్రం కొత్తదనం అనిపించదు. ప్రతి సీన్ ఎక్కడో చూసినట్లుగానే అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఓ చిన్న ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. కథను ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. హీరో కిరీటిరెడ్డికి మాత్రం ఫర్ఫెక్ట్ డెబ్యూ ఫిల్మ్. మరి కమర్షియల్‌గా ఏ మేరకు ఆట్టుకుంటుందో చూడాలి. ఎవరెలా చేశారంటే..కిరీటీకి ఇది తొలి చిత్రమే అయినా తెరపై చూస్తే మాత్రం ఎంతో అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అదరగొట్టేశాడు. ఇక డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వైరల్ వయ్యారి పాటలో శ్రీలీలతో పోటీ పడి మరీ డ్యాన్స్ చేశాడు. కొన్ని స్టెప్పులు జూనియర్ ఎన్టీఆర్ స్థాయిలో వేశాడు. శ్రీలీల పాత్రకు ఈ సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేదు. కేవలం పాటల కోసమే అన్నట్లుగా ఆమె పాత్రని తీర్చిదిద్దారు. సెకండాఫ్ మొత్తంలో ఒక వయ్యారి పాటలో మాత్రమే కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత జెనీలియా ఓ మంచి పాత్రతో రీఎంట్రీ ఇచ్చింది. విజయ సౌజన్య పాత్రకు ఆమెకు న్యాయం చేసింది. అయితే నటించేందుకు ఆ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. హీరో తండ్రిగా రవిచంద్రన్ ఉన్నంతలో చక్కగా నటించాడు . వైవా హర్ష, సత్యల కామెడీ బాగా పండింది. రావు రమేశ్, అచ్యుత్ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి బిగ్ ఎసెట్. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. పాటలన్నీ ఆకట్టుకుంటాయి. వైరల్ వయ్యారి పాట బిగ్ స్క్రీన్‌పై ఇంకా బాగుంది. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌ని చాలా రిచ్‌గా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
రెడ్ శారీలో ‘జూనియర్’మూవీ ఈవెంట్లో మెరిసిన శ్రీలీల (ఫొటోలు)
-
ఆ ఇద్దరు ప్రశంసించారంటే.. ఇక ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు: రాజమౌళి
‘‘సాయిగారు ‘జూనియర్’( Junior Movie) మొదలుపెట్టినప్పుడు... మంచి కథతో చిన్న చిత్రం ప్రారంభిస్తున్నారనుకున్నాను. అయితే శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్‌గారు... ఇలా నటీనటుల లిస్ట్ పెరుగుతూనే ఉంది. దేవిశ్రీ సంగీతం, సెంథిల్ సినిమాటోగ్రఫీ, ఫైట్‌మాస్టర్ పీటర్ హెయిన్స్... ఇలా ఒక్కొక్కరు యాడ్ అవుతూ ఉంటే ఓ పెద్ద సినిమాకి ఎలాంటి నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంచుకుంటామో అలా ‘జూనియర్’కి కూడా పెట్టుకుంటూ వెళ్లారు. అలా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా చేశారు’’ అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి(SS Rajamouli) అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జూనియర్’. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయిక. డా. రవిచంద్రన్, జెనీలియా ఇతర పాత్రలు పోషించారు. వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎస్ రాజమౌళి బిగ్ టికెట్ లాంచ్ చేసిన అనంతరం మాట్లాడుతూ– ‘‘పెద్ద సినిమా అంటే బడ్జెట్ గురించి కాదు... ‘జూనియర్’ సినిమా వెయ్యికి పైగా స్క్రీన్స్‌లలో రిలీజ్ అవుతోందంటే అందుకు ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తే కారణం. ఈ చిత్రాన్ని తొలి రోజే, లేకుంటే తొలి వారమే మేము చూడాలని ఆడియన్స్‌కి ఆసక్తి ఉన్నప్పుడే అది ఎగ్జిబిటర్స్ వద్ద నుంచి డిస్ట్రిబ్యూటర్స్ వద్దకు వచ్చి ఆ తర్వాత నిర్మాత వద్దకు వచ్చి వెయ్యి స్క్రీన్లలో విడుదలవుతోంది. చిన్ని సినిమాగా స్టార్ట్ అయిన ఈ సినిమాని ఈ స్థాయికి తీసుకొచ్చిన సాయిగారికి అభినందనలు. నేను కూడా ఈ చిత్రం చూసేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. తన పాటలతో సినిమాని ఎలివేట్ చేయడం దేవిశ్రీకి బాగా తెలుసు. ‘వైరల్ వయ్యారి...’ పాట ఎంత వైరల్ అయ్యింది, ఎంత క్రేజ్ తీసుకొచ్చిందనే విషయం గురించి నేను చెప్పక్కర్లేదు. సెంథిల్ తను అనుకున్న ఔట్పుట్ వచ్చేవరకు ఎక్కడ కూడా రాజీపడడు. పీటర్ హెయిన్స్ క్రేజీ మ్యాన్... విపరీతంగా కష్టపడతాడు. కిరీటి చాలా బాగా చేశాడని సెంథిల్, పీటర్ వంటి వారు ప్రశంసించారంటే ఇక ఇండస్ట్రీలో నీకు(కిరీటి) ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. ఎంతో అంకితభావంతో రాధాకృష్ణ ఈ సినిమాని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈ చిత్రాన్ని అందరూ తప్పకుండా థియేటర్లలో చూడండి. మీ టికెట్ డబ్బులకు కచ్చితంగా పైసా వసూల్ సినిమాలా ఉంటుంది’’ అని చెప్పారు. -
‘జూనియర్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వైరల్ వయ్యారి సాంగ్.. హీరోయిన్ శ్రీలీలను మించిపోయిన బామ్మ..!
శ్రీలీల సాంగ్ చిన్నా పెద్దా లేకుండా అందరిని ఊపేస్తోంది. గతేడాది పుష్ప-2 మూవీలో కిస్సిక్ సాంగ్‌తో అభిమానులను అలరించిన ముద్దుగుమ్మ.. మరోసారి అలాంటి గూస్బంప్స్ తెప్పించే పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. శ్రీలీల హీరోయిన్గా నటించిన లేటేస్ట్ మూవీ 'జూనియర్' నుంచి వైరల్ వయ్యారి అంటూ ఇటీవలే లిరికిల్ సాంగ్ రిలీజ్ చేయగా యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఈ పాటతో మరోసారి మాస్ ఆడియన్స్‌ను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటీ హీరోగా పరిచయమవుతోన్న ఈ సినిమా జూలై 18న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్లో వైరల్ వయ్యారి సాంగ్‌ను ప్రదర్శించారు. ఈ పాటకు సీనియర్ నటి, బామ్మ పాత్రలకు ఫేమస్ అయిన మణి తనదైన డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. వైరల్ వయ్యారి వేదికపై స్టెప్పులతో ఓ ఊపు ఊపేసింది. పక్కనే యాంకర్ సుమ బామ్మతో కలిసి కాలు కదిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ బామ్మ ఎనర్జీ వేరే లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.Good music and good vibe has no age barrier ❤️The most viral dance for #ViralVayyari at the #Junior Grand Pre Release Event ❤🔥Watch live now!▶️ https://t.co/XiLs4gDSed#Junior Grand release on July 18th ✨#JuniorOnJuly18th #JuniorPreReleaseEvent pic.twitter.com/JSCTs2onDa— Vaaraahi Chalana Chitram (@VaaraahiCC) July 16, 2025 -
ట్రిప్‌లో అరియానా ఎంజాయ్.. తలకిందులుగా రకుల్
తలకిందులుగా ఆసనాలు వేస్తున్న రకుల్ ప్రీత్చీరలో అదిరిపోయేలా వైరల్ వయ్యారి శ్రీలీలజిమ్లో తెగ కష్టపడుతున్న సీరత్ కపూర్చీరలో మరింత అందంగా యువనటి సుప్రీతచికాగో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న అరియానాచల్లటి గాలిని ఆస్వాదిస్తున్న కాయదు లోహర్గ్లామర్ ఒలకబోస్తున్న బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) -
'అమ్మమ్మ.. అందరు నిన్ను వైరల్ వయ్యారి అంటున్నారు'.. శ్రీలీల ఫన్నీ వీడియో!
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ఇటు తెలుగులో.. అటు కన్నడలో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. తెలుగులో వరుస సినిమాలు చేసిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం కన్నడ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ హీరోగా వస్తోన్న చిత్రం జూనియర్. ఈ మూవీలో జెనీలియా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అయితే ఈ సినిమాలో ఓ క్రేజీ సాంగ్ పుష్ప-2 రేంజ్లో వైరలైంది. పుష్పలో శ్రీలీల చేసిన ఐటమ్ సాంగ్‌ను తలపించింది. వైరల్ వయ్యారి అంటూ సాగే ఈ పాట మాస్ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. దీంతో ఎక్కడ చూసిన వైరల్ వయ్యారి అనే సాంగ్ తెగ వైరలవుతోంది.అయితే తాజాగా శ్రీలీల షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తన అమ్మమ్మతో చేసిన ఫన్నీ వీడియో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. అమ్మమ్మ నిన్ను అందరు వైరల్ వయ్యారి అంటున్నారు అని శ్రీలీల చెప్పగా.. నన్నెందుకు అంటారు..నన్ను ఎవరు అనరు.. నిన్నే కదా అనేది అంటూ నవ్వుతూ మాట్లాడింది. ఇది చూసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.#ViralVayyari aka @sreeleela14's fun banter with her grandmother is the cutest thing we can see today!!😂❤️#Sreeleela #Junior #TFNReels #TeluguFilmNagar pic.twitter.com/ru3ppiIRR7— Telugu FilmNagar (@telugufilmnagar) July 16, 2025 -
‘సత్యం’ సినిమా చేయవద్దని చెప్పారు : జెనీలియా
‘‘నా కెరీర్ ప్రారంభం నుంచి ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రలు చేయాలనే ఉద్దేశంతోనే సినిమాలు చేస్తూ వచ్చాను. ‘బొమ్మరిల్లు’లో నేను చేసిన హాసిని పాత్ర మరచిపోలేనిది. అలాగే ‘హ్యాపీ’లో మధుమతి, ‘కథ’ సినిమాలో చిత్ర.. ఇలా విభిన్నమైన పాత్రలు చేశాను. ‘తుజే మేరీ కసమ్’ (నువ్వేకావాలి హిందీ రీమేక్)తో హిందీలో ఎంట్రీ ఇచ్చాను. ఆ తర్వాత ‘బాయ్స్’ సినిమా చేశాను. ఆ వెంటనే ‘సత్యం’ సినిమా అంగీకరించాను. అయితే ఆ సమయంలో ‘సత్యం’ చేయవద్దని నాకు కొంత మంది చెప్పారు. కానీ కథ నచ్చడంతో నా మనసు మాటవిని ఆ సినిమా చేస్తే హిట్‌గా నిలిచింది. కథ మనకు నచ్చితే చేయాలి.. ఆ తర్వాత ప్రేక్షకులే మనల్ని గుర్తిస్తారు’’ అని నటి జెనీలియా తెలిపారు. కిరీటి రెడ్డి, శ్రీలీల జోడీగా, జెనీలియా కీలక పాత్రలో నటించిన చిత్రం ‘జూనియర్’. రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జెనీలియా విలేకరులతో మాట్లాడుతూ– ‘‘తండ్రీకొడుకుల కథే ‘జూనియర్’. ఈ చిత్రంలో నేను ఓ లేడీబాస్ తరహా పాత్ర చేశాను. కిరీటి పాత్రతో నా రోల్‌కు ఉండే రిలేషన్ ఏంటి? అనేది సినిమాలో చూడాలి. శ్రీలీల అమేజింగ్ నటి. దేవిశ్రీ ప్రసాద్‌గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సాయి కొర్రపాటిగారు గ్రాండ్‌గా నిర్మించారు. కథానాయికలకు పెద్దగా అభిమానులు ఉండరు. కానీ ‘బొమ్మరిల్లు’లో హాసిని పాత్రతో చాలా మంది నాకు అభిమానులయ్యారు. నా కెరీర్లో బిజీగా ఉన్నప్పుడే నా తొలి సినిమా ‘తుజే మేరీ కసమ్’ హీరో రితేష్‌ను వివాహం చేసుకున్నాను. పెళ్లి తర్వాత తెలుగు సినిమాల్లో గ్యాప్ వచ్చింది. మళ్లీ నేను తిరిగి తెలుగు సినిమాలు ఎప్పుడు చేస్తున్నానని నా అభిమానులు సోషల్ మీడియా వేదికగా అడుగుతూనే ఉన్నారు. వారిలో మహిళలు ఎక్కువమంది ఉండటం నాకు సంతోషంగా అనిపించింది. తెలుగు అభిమానులు నన్ను హాసినిగానే గుర్తుపెట్టుకున్నారు. ‘బొమ్మరిల్లు 2’ ఉంటుందేమో చూడాలి. నాకంటూ డ్రీమ్ రోల్స్ లేవు. అసలు నేను నటిని కావాలనుకోలేదు. అలాంటిది ఇండస్ట్రీలోకి రావడం, ఇన్ని పాత్రలు చేయడం, ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించడం... ఇవన్నీ నాకు కలగానే అనిపిస్తాయి. నా యాక్టింగ్ కెరీర్‌ను కొనసాగిస్తాను. చిన్న పాత్రా? పెద్ద పాత్రా? అనేది ముఖ్యం కాదు. నా పాత్ర కథపై ప్రభావవంతంగా ఉంటే చాలు. రామ్‌చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో నేను సినిమాలు చేశాను. వాళ్లందరూ ఇప్పుడు స్టార్స్ అయిపోయారు.. వాళ్ల ప్రయాణంలో భాగం కావడం నాకు సంతోషంగా ఉంది. ‘బొమ్మరిల్లు’ సినిమాలో కోట శ్రీనివాసరావుగారితో కలిసి నటించడాన్ని మర్చిపోలేను. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. పెళ్లి తర్వాత రితేష్– నేను మా ప్రొడక్షన్లో ‘వేద్’ (తెలుగు సినిమా మజిలీ మరాఠి రీమేక్) సినిమా చేశాం. మంచి ప్రేమకథ కుదిరితే మళ్లీ కలిసి నటిస్తాం’’ అని చెప్పారు. -
షాకిస్తున్న శ్రీలీల రెమ్యునరేషన్
-
బర్త్ డే గర్ల్ శ్రీలీల.. వైరల్ పాటకు రీతూ డ్యాన్స్
పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న శ్రీలీలవైరల్ వయ్యారి పాటకు రీతూ చౌదరి-సిరి హన్మంతు డ్యాన్స్వింబుల్డన్ కోసం లండన్ వెళ్లిపోయిన జాక్వెలిన్చీరలో చక్కని చందమామలా యాంకర్ స్రవంతిముంగురులతో చీరలో ముద్దుగుమ్మలా అనంతికనాభి అందాలతో రచ్చ లేపుతున్న హీరోయిన్ వేదిక View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) -
'జూనియర్' కోసం శ్రీలీల.. అంత రెమ్యునరేషన్ ఇచ్చారా?
ఈ మధ్య కాలంలో సరైన హిట్స్ పడలేదు గానీ శ్రీలీల ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయినే. ఈ ఏడాది మార్చిలో 'రాబిన్ హుడ్'తో వచ్చింది గానీ కలిసి రాలేదు. ఇప్పుడు కొత్త హీరో కిరీటితో కలిసి 'జూనియర్' అనే మూవీ చేసింది. రీసెంట్గా 'వైరల్ వయ్యారి' అనే పాట తెగ వైరల్ అవుతోంది కదా! అది ఈ సినిమాలోనిదే. ఓవైపు స్టార్ హీరోలతో కలిసి పనిచేస్తున్న ఈ బ్యూటీ.. కొత్త కుర్రాడితో చేసేందుకు రెమ్యునరేషన్ గట్టిగానే తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.తెలుగు మూలాలు ఉన్నప్పటికీ శ్రీలీల.. బెంగళూరులోనే పెరిగింది. హీరోయిన్గా తొలి మూవీ కూడా కన్నడలోనే చేసింది. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత 'జూనియర్' మూవీతో రాబోతుంది. గాలి జనార్ధన కొడుకు కిరీటి హీరోగా పరిచయమవుతున్న చిత్రమిది. కన్నడతో పాటు తెలుగులోనూ జూలై 18న రిలీజ్ చేస్తున్నారు. కాస్తోకూస్తో హైప్ నడుస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)అయితే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న శ్రీలీల.. సాధారణంగా రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోంది. అయితే జూనియర్ కోసం మాత్రం ఈమెకు రూ.4 కోట్ల పారితోషికం ఇచ్చారనే టాక్ నడుస్తోంది. అంటే డబుల్ బొనాంజా. ఈ మూవీలో శ్రీలీల మాత్రం కాస్త చెప్పుకోదగ్గ ఫేస్. కిరీటి కొత్తవాడు. జెనీలియా చాన్నాళ్ల తర్వాత ఈ సినిమాతోనే దక్షిణాదిలోకి రీఎంట్రీ ఇస్తోంది. మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి?'జూనియర్' సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు కాగా.. రాజమౌళి చిత్రాలకు పనిచేసే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్. రాధాకృష్ణ రెడ్డి దర్శకుడు. తెలుగులో 'ఈగ' తదితర సినిమాలు తీసిన వారాహి నిర్మాణ సంస్థ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా నిర్మించినట్లు విజువల్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ క్రమంలోనే శ్రీలీల జాక్ పాట్ కొట్టినట్లు అనిపిస్తోంది.(ఇదీ చదవండి: పాకిస్థాన్‌లో 'రామాయణం' నాటకం.. ఫొటోలు వైరల్) -
వైరల్ వయ్యారి పాటకు స్టేజీపై స్టెప్పులేసిన శివన్న
ఎక్కడ చూసినా వైరల్ వయ్యారి నేనే.. పాటే వినిపిస్తోంది. ఇందులో శ్రీలీల, కిరీటి జంటగా డ్యాన్స్ చేశారు. శ్రీలీల గ్రేస్, డ్యాన్స్ గురించి తెలియంది కాదు! ఎప్పటిలాగే అల్లాడించేసింది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కిరీటి గురించే! జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయిన ఈ యంగ్ హారో.. ఆయనలాగే పపర్ఫుల్గా స్టెప్పులేశాడు. నిన్ను చూస్తుంటే తారక్‌ను చూస్తున్నట్లే ఉందని చాలామంది కిరీటపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇతడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు. జూనియర్ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు.వయ్యారి సాంగ్‌కు స్టేజీపై స్టెప్పులుఈ మూవీ జూలై 18న విడుదల కానుంది. ఈ క్రమంలో బెంగళూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో కిరీటి శివన్నతో స్టేజీపై స్టెప్పులేయించాడు. వైరల్ వయ్యారి పాటకు స్టెప్పు ఇది.. అని ఒకసారి చూపించగనే శివన్న ఇట్టే నేర్చేసుకున్నారు. పాట ప్లే అవుతుంటే ఫుల్ జోష్‌లో డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.జూనియర్ సినిమా విశేషాలుప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా, శ్రీలీల హీరోయిన్గా నటించిన చిత్రం జూనియర్. జెనీలియా దేశ్‌ముఖ్ కీలక పాత్ర పోషిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలకు పని చేసిన కేకే సెంథిల్ కుమార్ జూనియర్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. A true viral moment 💥💥Karunada Chakravarthy @NimmaShivanna Garu dances to the #ViralVayyari song with the lead pair at the Junior Grand Pre Release Event ❤🔥#Junior grand release on July 18th ✨A Rockstar @ThisIsDSP Musical 🎸🔥 pic.twitter.com/lpAxfYmnSa— Vaaraahi Chalana Chitram (@VaaraahiCC) July 13, 2025 చదవండి: ఫ్రెండ్స్‌తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, అంతలోనే సిట్టింగా? -
అమ్మ మీద ప్రేమ.. ఆ హీరోపై అభిమానం ఎప్పటికీ తగ్గదు: కిరీటి
గాలి జనార్దనరెడ్డి (Janardhana Reddy) కుమారుడు కిరీటి (Kireeti) హీరోగా ఎంట్రీ ఇచ్చేశారు. ఆయన నటించిన మొదటి సినిమా ‘జూనియర్’ (Junior) జులై 18న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో కిరీటి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. అదే సమయంలో కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ స్ఫూర్తితో కిరీటి ఇండస్ట్రీలోకి వస్తున్నట్లు కూడా చెప్పారు. ఇందులో శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా నటిస్తుంది. జెనీలియా, రావు రమేశ్ తదితరులు భాగం అయ్యారు. కన్నడ దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం బ్యానర్లో రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. బాహుబలి,ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన కె.కె.సెంథిల్‌కుమార్ ఈ చిత్రానికి పనిచేయడం విశేషం.గాలి జనార్దనరెడ్డి వేల కోట్ల ఆస్తులకు కిరీటి వారసుడు.. అతను అనుకుంటే ఎన్నో వ్యాపారాలు చేయవచ్చు. కానీ, సినిమా మీద మక్కువతో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా జరిగిన కిరీటి ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లు అతన్ని ప్రశంసిస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కానీ, చాలా వినయంగా ఉన్నాడు అంటూ కామెంట్ల రూపంలో చెబుతున్నారు. అదే టైమ్‌లో తనలో టాలెంట్ ఏంటో ట్రైలర్, మొదట సాంగ్‌తో చూపించాడు. శ్రీలీలకు పోటీగా తన డ్యాన్స్‌తో కిరీటి మెప్పించాడు. తను వేసిన స్టెప్స్ చాలామందిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మిలియన్ల కొద్ది రీల్స్ కూడా వైరల్ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని చెప్పిన కిరీటి.. తారక్‌ను కూడా మెప్పించేలా స్టెప్పులు వేశాడు.జీవితంలో ఒక్కసారైనా ఆయన్ను కలుస్తా: కిరీటిజూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని కిరీటి ఇలా చెప్పాడు.' నా ఫస్ట్ పాటకు మంచి గుర్తింపు వచ్చింది. శ్రీలీలతో సమానంగా స్టెప్పులు వేశానంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. అయితే, ఒక ఎన్టీఆర్ అభిమానిగా ఆ సాంగ్ విజయాన్ని ఆయనకు ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఎన్టీఆర్ డ్యాన్స్, నటన, వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ను జీవితంలో ఒక్కసారైనా కలిసే ఛాన్స్ వస్తే చాలా సంతోషిస్తాను. నా సినిమా వేడుకకు అతిథిగా తారక్ సార్ వస్తే.. జీవితంలో ఎప్పిటికీ గుర్తుండిపోతుంది. నాకు ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా చాలా ఇష్టం. ఆయన్ను కలిస్తే అదృష్టంగా భావిస్తాను. అమ్మ మీద ప్రేమను, ఎన్టీఆర్ మీద ప్రేమను మాటల్లో చెప్పలేము. అలా అని నేను ఇతర హీరోలను, అభిమానులను తక్కువ చేయను. ఒక్కోక్కరికి ఒక హీరో అంటే ఎలా ఇష్టం ఉంటుందో నాకు కూడా ఎన్టీఆర్ అంటే అభిమానం' అని కిరీటి అన్నారు. -
వైరల్.. వయ్యారి నేనే.! (ఫొటోలు)
-
శ్రీలీల లేటేస్ట్ మూవీ.. ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శకధీరుడు రాజమౌళి
కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘జూనియర్’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ జెనీలియా కీలక పాత్ర పోషించారు. వారాహి చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. తెలుగు వర్షన్ రాజమౌళితో.. కన్నడ వర్షన్ ట్రైలర్‌ను కిచ్చా సుదీప్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇటీవల విడుదలైన వైరల్ వయ్యారి అనే ఐటమ్ సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.Happy to release the trailer of @KireetiOfficial’s #Junior… Wishing him all the best on his debut and best wishes to the entire team for the release on July 18th!#JuniorTrailer https://t.co/qDwK35QvR2— rajamouli ss (@ssrajamouli) July 11, 2025 -
పుష్ప-2 రేంజ్లో మాస్ సాంగ్.. మరోసారి వైరల్ అవుతోన్న శ్రీలీల!
గాలి జనార్దన రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా నటిస్తోన్న చిత్రం జూనియర్. ఈ మూవీలో హీరోయిన్గా శ్రీలీల కనిపించనుంది. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో జెనీలియా దేశ్‌ముఖ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్, టీజర్‌కు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడడంతో వరుస అప్డేట్స్తో మేకర్స్ అలరిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే జూనియర్ మూవీ నుంచి మరో లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. వైరల్ వయ్యారి అంటూ సాగే మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో శ్రీలీల మరోసారి తనదైన డ్యాన్స్‌తో అదరగొట్టినట్లు తెలుస్తోంది. పుష్ప-2లో ఐటమ్ సాంగ్ రేంజ్లో శ్రీలీల అలరించినట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. తాజాగా విడుదలైన పాట మాస్ ఆడియన్స్‌ను ఊపేస్తోంది. కాగా.. ఈ పాటను కల్యాణ్ చక్రవర్తి రాయగా.. హరిప్రియ, దేవిశ్రీ ప్రసాద్ ఆలపించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. -
వైరల్ ఎలా అవ్వాలంటోన్న శ్రీలీల.. అసలు విషయం ఏంటంటే?
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ ఏడాది నితిన్ సరసన రాబిన్‌హుడ్‌లో మెప్పించిన భామ.. ప్రస్తుతం మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం జూనియర్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్ర పోషించారు.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఇప్పటికే విడుదలైన సాంగ్, టీజర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈనెల 4న వైరల్ వయ్యారి అంటూ సాగే పాటను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలీల, దేవీశ్రీ ప్రసాద్ చేసిన ప్రమోషన్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఈ వీడియో మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీకి కాల్ చేసిన శ్రీలీల.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన మీ రీల్సే కనిపిస్తున్నాయి.. మీలా వైరల్ ఎలా అవ్వాలో నేర్పిస్తారా అని అడిగింది. ఏంటీ వైరల్ ఎలా అవ్వాలో మీకు నేర్పాలా?కామెడీ వద్దమ్మా? మీరే నాకు నేర్పాలని దేవీశ్రీ అన్నారు. నిజమే కదా.. మీరు వయ్యారంగా ఓ మాస్ స్టెప్ వేస్తే అదే వైరలైపోద్ది అని చెప్పాడు. అదేదో మీరే ఇవ్వండి సార్ అని శ్రీలీల ముద్దుగా అడగడంతో.. వైరల్ వయ్యారి అంటే ఎలా ఉంది సాంగ్ అంటూ దేవీశ్రీ మ్యూజిక్ అదరగొట్టేశాడు. ఇదంతా వైరల్ వయ్యారి పాట కోసమే వీరిలా వైరైటీ ప్రమోషన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. వారాహి చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.#Junior second single #ViralVayyari out on July 4thIn cinemas July 18th. @sreeleela14 @ThisIsDSP pic.twitter.com/TDAbv8w5Rz— ScreenTimeGuru (@ScreenTimeGuru) July 1, 2025 -
హీరోగా గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు.. టీజర్ చూశారా?
గాలి జనార్దనరెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం జూనియర్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం బ్యానర్లో రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.మూవీ ప్రమోషన్లలో భాగంగా జూనియర్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే కాలేజీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా జులై 18న బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో రవి చంద్రన్, జెనీలియా, రావు రమేష్, సుధారాణి, అచ్యుత్ రావు, సత్య, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. -
శ్రీలీల తీరుపై టాలీవుడ్ సీరియస్
-
అఖిల్‌కి హ్యాండ్ ఇచ్చిన శ్రీలీల?
కొన్నాళ్ల ముందు వరకు తెలుగులో వరస సినిమాలు చేసిన శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ కొత్త మూవీస్ చేస్తోంది. సరైన హిట్స్ పడట్లేదు గానీ ఇప్పటికీ ట్రెండింగ్ హీరోయిన్గా కొనసాగుతోందని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ఈమె.. అఖిల్ సినిమాకు హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ అసలేంటి విషయం?(ఇదీ చదవండి: జపనీస్ వీడియో గేమ్‌లో రాజమౌళి.. ఇదో క్రేజీ రికార్డ్)శ్రీలీల చేతిలో ప్రస్తుతం రెండు హిందీ సినిమాలు, ఒక తమిళ సినిమా ఉంది. అలానే తెలుగులో అక్కినేని అఖిల్ సరసన 'లెనిన్' అనే మూవీ కూడా చేస్తోంది. ఈ ఏప్రిల్‌లో అఖిల్-శ్రీలీల జంటగా కనిపించనున్నారని ఓ వీడియో రిలీజ్ చేసి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. దీపావళికి మూవీ రిలీజ్ అనుకుంటున్నారు. అయితే ఎక్కువగా హిందీ, తమిళ సినిమాలకే డేట్స్ ఇస్తున్న కారణంగా శ్రీలీలకు బదులు మరో హీరోయిన్ని చూసుకోవాలని టీమ్ భావిస్తుందట.శ్రీలీల చివరగా తెలుగులో 'రాబిన్ హుడ్' మూవీలో కనిపించింది. త్వరలో 'మాస్ జాతర' చిత్రంతో రాబోతుంది. ఇది కాకుండా పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లోనూ ఈమెనే హీరోయిన్. కొన్నిరోజుల క్రితమే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలైంది. హిందీలో ఆషికి 3, తమిళంలో 'పరాశక్తి' చేస్తోంది. ఈమె నటించిన కన్నడ చిత్రం 'జూనియర్' రిలీజ్ కావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ సిరీస్.. 'ఫ్యామిలీ మ్యాన్ 3' కొత్త అప్డేట్) -
శ్రీలీల బర్త్ డే సెలబ్రేషన్స్.. బ్లాక్ శారీలో ఈషా వావ్!
బాలిలో బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేస్తున్న సుకుమార్ భార్యబర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటలతో హీరోయిన్ శ్రీలీలనల్ల చీరలో కేక పుట్టిస్తున్న తెలుగమ్మాయి ఈషా రెబ్బామెరుపుల చీరలో జిగేలుమనిపిస్తున్న ప్రగ్యా జైస్వాల్బెడ్పై జాన్వీ కపూర్ టెంపరేచర్ పెంచే పోజులుగద్దర్ అవార్డ్ అందుకున్న నివేదా థామస్.. పోస్ట్ వైరల్ఫ్రెండ్స్-ఫ్యామిలీతో రాయ్ లక్ష్మీ బర్త్ డే సెలబ్రేషన్స్ View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Sonam Bajwa (@sonambajwa) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Aakanksha Singh (@aakankshasingh30) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) -
హీరోయిన్ శ్రీలీల బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
బర్త్ డే స్పెషల్
దక్షిణాదిలోని యంగ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు శ్రీలీల. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్న ఈ బ్యూటీ పుట్టినరోజు జూన్ 14న. ఈ సందర్భంగా తెలుగులో ఆమె నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్, మాస్ జాతర, లెనిన్’ సినిమాల నుంచి ప్రత్యేక పోస్టర్స్ రిలీజ్ చేసి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలి΄ారు మేకర్స్. పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.అలాగే ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ–హీరోయిన్ శ్రీలీల రెండోసారి జోడీగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే... అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్’.‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పై మూడు సినిమాల నుంచి శ్రీలీల బర్త్ డే స్పెషల్ పోస్టర్స్ విడుదల అయ్యాయి. -
మంత్రి ప్రసంగిస్తుండగా శ్రీలీల ఎంట్రీ.. అసలేం జరిగిందంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Duddilla Sridhar Babu)కు వింత అనుభవం ఎదురైంది. సీత (షి ఈజ్ ది హీరో ఆల్వేస్ - SITHA) యాప్ ఆవిష్కరణ వేడుకలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో హీరోయిన్ శ్రీలీల అక్కడికి వచ్చేసింది. అది గమనించిన యాంకర్ ఝాన్సీ (Anchor Jhansi) మంత్రి ప్రసంగాన్ని కొద్ది క్షణాలపాటు ఆపింది.మంత్రి ప్రసంగానికి ఆటంకంమంత్రివర్యులు క్షమించాలి అంటూనే హీరోయిన్ శ్రీలీల (Actress Sreeleela)ను స్టేజీపైకి పిలిచింది. 'షి ఈజ్ ది హీరో ఆల్వేస్' అనే యాప్ లాంఛ్ చేస్తున్నాం. కాబట్టి.. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఎంటర్ప్రెన్యూర్ శ్రీలీలను స్టేజీపైకి ఆహ్వానిస్తున్నాం అంటూ తన ఇంట్రో ముగించింది. అలా శ్రీలీల.. స్టేజీ ఎక్కగా మంత్రి ఏమాత్రం చిరాకుపడకుండా ఆమెను నవ్వుతూ పలకరించాడు. తర్వాత తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించాడు.సభామర్యాద పాటించరా?ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీలీల హీరోయిన్ అయినంత మాత్రాన.. మంత్రి ఉపన్యాసాన్ని మధ్యలో ఆపటం అర్థరహితమని, పైగా ఎంతో అనుభవమున్న యాంకర్ ఝాన్సీ ఇలా చేయడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. స్పందించిన ఝాన్సీఒక వక్త ఉపన్యసించేటప్పుడు వారిని ఆటంకపరచడం అవమానించడమే అవుతుంది. సభా మర్యాద పాటించాల్సి ఉంటే బాగుండేది.. అక్కడ శ్రీధర్‌బాబు కాకుండా ఇంకా ఎవరున్నా పరిస్థితి మరోలా ఉండేది అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై యాంకర్ ఝాన్సీ స్పందించింది. మంత్రి మాట్లాడుతున్న సమయంలో శ్రీలీల కార్యక్రమానికి వచ్చిందని పేర్కొంది. మంత్రి అనుమతితోనే శ్రీలీలను స్టేజీపైకి తీసుకొచ్చామంది. అంతేతప్ప ఆయన ప్రసంగాన్ని మధ్యలో అడ్డుకోలేదని వివరణ ఇచ్చింది. హిరోయిన్ శ్రీ లీల కోసం తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగాన్ని ఆపిన యాంకర్ ఝాన్సీశ్రీధర్ బాబు మెత్తని వాడు కాబట్టి ఒప్పుకున్నాడు అదే ఇగో వున్న ఏ ఇతర మంత్రి అయిన వుంటే పరిస్థితి వేరుగా వుండేది pic.twitter.com/cjpGi2Rd46— Kumar Reddy.Avula (@Kumar991957) June 10, 2025 చదవండి: సుహాసిని ఫోన్ చేసి మరీ ఆ మాట చెప్పేసరికి షాకయ్యా: నటుడు -
'గీతగోవిందం' నటి గ్రాడ్యుయేషన్.. ధనశ్రీ వర్మ ట్రెక్కింగ్
మత్తెక్కించేలా చూస్తున్న యంగ్ సెన్సేషన్ శ్రీలీలఫుడ్ గురించి నివేదా థామస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్పెళ్లి చేసుకున్న 'ఆరెంజ్' హీరోయిన్ షాజన్ పదమ్సీట్రెక్కింగ్ చేస్తూ అందాలన్నీ చూపిస్తున్న ధనశ్రీ వర్మరిలాక్స్ మోడ్‌లో అక్కినేని వారి కోడలు శోభితఇంటీరియర్ డిజైన్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన నటి అనీషాజిమ్లో తెగ కష్టపడుతున్న పూరీ ఫ్రెండ్ ఛార్మీ View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Aneesha Dama (@aneeshadama) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Shazahn Padamsee (@shazahnpadamsee) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Siddhi Idnani (@siddhi_idnani) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) -
తల్లితో కలిసి పూజ చేసిన శ్రీలీల! (ఫొటోలు)
-
శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది
యంగ్ హీరోయిన్ శ్రీలీల.. తాజాగా ఇంట్లో సెలబ్రేషన్స్ అని కొన్ని ఫొటోలు చేసింది. దీంతో ఈమెకు నిశ్చితార్థం జరిగిందా? పెళ్లెప్పుడు? అబ్బాయి ఎవరు? అని ఇలా రకరకాల ప్రశ్నలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ విషయమై తెగ మాట్లాడుకున్నారు. ఇంకా ఊరుకుంటే ఇది చాలా దూరం వెళ్తుందేమోనని ఊహించిన శ్రీలీల.. మొత్తానికి ఈ ఫొటోలపై క్లారిటీ ఇచ్చేసింది.'నా ముందస్తు పుట్టినరోజు వేడుకల్ని ఇట్లో మేం ఈ విధంగానే సెలబ్రేట్ చేసుకున్నాం. దీనికి సంబంధించిన ప్లానింగ్ అంతా అమ్మ చూసుకున్నారు' అని శ్రీలీల చెప్పింది. దీంతో పాటు ఓ నాలుగైదు ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వేడుకల్లో నటుడు రానా భార్య మిహిక పాల్గొనడం విశేషం.(ఇదీ చదవండి: పరమశివుడిగా సూపర్‌స్టార్ కృష్ణ.. పోస్టర్ చూశారా?)ఈ ఫొటోలు చూసి శ్రీలీల ఎంగేజ్మెంట్ అని అందరూ అనుకోవడానికి ఓ కారణముంది. ప్రస్తుతం బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్న ఈమె.. సదరు హీరోతో డేటింగ్లో ఉందని, త్వరలో పెళ్లి చేసుకుంటారనే రూమర్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే శ్రీలీల తాజా ఫొటోలు చూసి అందరూ షాకయ్యారు. క్లారిటీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు.'పెళ్లి సందD' మూవీతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. వరస సినిమాలు చేసింది. చివరగా 'రాబిన్ హుడ్' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం అఖిల్ 'లెనిన్'లో నటిస్తోంది. అలానే పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లోనూ ఈమెనే హీరోయిన్.(ఇదీ చదవండి: నిఖిల్ పాన్ ఇండియా మూవీ.. ఇన్నాళ్లకు అప్డేట్) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
పెళ్లి వేడుకలా హీరోయిన్ శ్రీలీల బర్త్ డే (ఫొటోలు)
-
శ్రీలీల నిశ్చితార్థం..? 'బిగ్ డే' అంటూ ఫోటోలు విడుదల.. అసలు విషయం ఇదేనా?
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లో ఒకరిగా ఫుల్ జోష్‌లో ఉన్న శ్రీలీల(Sreeleela) త్వరలో పెళ్లి చేసుకోబోతుందని నెట్టింట వైరల్ అవుతుంది. అందుకు కారణం తాజాగా సోషల్‌మీడియాలో ఆమె షేర్ చేసిన వీడియో, ఫోటోలే అని తెలుస్తోంది. కొంత సమయం క్రితం శ్రీలీల తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫోటోలు పంచుకుంది. తన చెంపల మీద పసుపు పూసి కొందరు ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈరోజు నాకు 'బిగ్ డే' అంటూనే పూర్తి వివరాలు 'కమింగ్ సూన్' అంటూ హింట్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు కూడా ఒక క్లారిటీకి వచ్చేసి.. సైలెంట్‌గా శ్రీలీల నిశ్చితార్థం చేసుకుందని త్వరలో పెళ్లి అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే, అసలు విషయం నిశ్చితార్థం కాదని తెలుస్తోంది. జూన్ 14న శ్రీలీల పుట్టినరోజు ఉంది. కానీ తిథుల ప్రకారం ఆ వేడుకను ఇలా ముందే సెలబ్రేట్ చేసుకున్నట్లు సమాచారం ఉంది. ప్రతి ఏటా ఆమెకు ఇది అలవాటుగా చేస్తారని టాక్. పుట్టినరోజు సెలబ్రేషన్స్‌ను ఈరోజుల్లో కూడా తిధుల ప్రకారం ఇలా జరుపుకునే వాళ్లు ఉన్నారా..! అదీ హీరోయిన్ జరుపుకోవటం వింతగా ఉందని కొందరు చెబుతున్నారు.ఫోటోలు షేర్ చేసిన శ్రీలీల ఎలాంటి వివరాలు పూర్తిగా ప్రకటించలేదు. త్వరలో చెబుతానని, తనకు ఈరోజు 'బిగ్ డే' అంటూ.. హింట్ ఇచ్చింది. అయితే, నెటిజన్ల నుంచి శ్రీలీల షేర్ చేసిన ఫోటోలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. శ్రీలీల నిశ్చతార్థం చేసుకుందని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఏదైనా వాణిజ్య ప్రకటన కోసం ఆమె చేస్తున్న ప్రమోషన్స్ కావచ్చని అంటున్నారు. మరోవైపు ఆమె పుట్టినరోజును ఇలా సెలబ్రేట్ చేసుకుందని కూడా సమాచారం ఉంది. ఫోటోలు షేర్ చేసే సమయంలో కాస్త క్లారిటీగా విషయం చెబితే బాగుంటుంది కదా అంటూ మరికొందరు మండిపడుతున్నారు. ఈ విషయంపై శ్రీలీల ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan), శ్రీలీల (Sreeleela) డేటింగ్లో ఉన్నారంటూ కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అనురాగ్ బసు దర్శకత్వంలో వారిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ప్రేమలో పడ్డారని టాక్ వచ్చింది. కార్తిక్ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి వేడుకలో శ్రీలీల కనిపిస్తూ ఉంటుంది. ఆపై కొద్దిరోజుల క్రితం జరిగిన ‘ఐఫా’ (IFFA) వేడుకల్లో తమ ఇంటికి ఎలాంటి అమ్మాయి కోడలిగా రావాలో చెబుతూ కార్తిక్ ఆర్యన్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 'ఒక మంచి వైద్యురాలు మా ఇంటికి కోడలిగా రావాలని మేము కోరుకుంటున్నాం' అని ఆమె చెప్పారు. శ్రీలీల నటి మాత్రమే కాదు ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్ చదువుతుంది. హీరో తల్లి చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయి. View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా ‘జూనియర్’.. సాంగ్ రిలీజ్
కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జూనియర్’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించగా, జెనీలియా కీలక పాత్ర పోషించారు. వారాహి చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘లెట్స్ లివ్ దిస్ మూమెంట్... లెట్స్ లవ్ దిస్ మూమెంట్..’ అనే సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను బెంగళూరులో నిర్వహించారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ స్వరకల్పనలో శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను జస్ప్రీత్ జాజ్ పాడారు. విజయ్ పొలాకి నృత్య రీతులు సమకూర్చారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరో కిరిటీ రెడ్డి మాట్లాడుతూ– ‘‘చాలా మంచి సినిమా తీశాం. ‘జూనియర్’లోని ప్రతి మూమెంట్‌ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో నాకు గాయమైంది. దాంతో కోలుకోడానికి ఏడాది పట్టింది. ఈ కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైంది. లెజెండరీ యాక్టర్ వి. రవిచంద్రన్‌గారు మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు ఈ సినిమాలో నటించారు’’ అని తెలిపారు. ‘‘మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా కోసం కిరీటి చాలా హార్డ్ వర్క్ చేశాడు’’ అని తెలిపారు వి. రవిచంద్రన్. ‘‘రవిచంద్రన్, సెంథిల్, దేవిశ్రీప్రసాద్గార్లు వంటి సీనియర్స్ ఉండటం వల్ల మా ‘జూనియర్’ సినిమా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవుతుందని నమ్ముతున్నాను’’ అని చెప్పారు రాధాకృష్ణ. ‘‘కిరీటి యాక్షన్, డ్యాన్సింగ్ స్కిల్స్ చాలా సర్ప్రైజ్ చేశాయి. నటుడిగా అతనికి గొప్ప భవిష్యత్ ఉంది’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ఈ వేడుకలో కొరియోగ్రఫర్ విజయ్ ΄ోలాకి, ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ మాట్లాడారు. -
‘పైసావాలా’ విజయం సాధించాలి: శ్రీలీల
రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత, పి. అన్షు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పైసావాలా’(Paisawala Movie). కె. నవీన్ తేజస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్, వీకేఎం మూవీస్ బ్యానర్లపై కె. నవీన్ తేజస్, నూనెల పైడిరాజు, పిజె దేవి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను స్టార్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) తాజాగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ, “‘పైసావాలా’ టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు. ఈ చిత్రానికి నగేష్ గౌరీష్ సంగీతం అందించగా, గౌతం వాయిలాడ సినిమాటోగ్రాఫర్‌గా, ఎంజే సూర్య ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘పైసావాలా’ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. -
ఓటీటీలోకి వచ్చేసిన 'రాబిన్ హుడ్' సినిమా
హీరో నితిన్ లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్' ఓటీటీలోకి వచ్చేసింది. మార్చిలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. కామెడీ మూవీ అన్నారు గానీ ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో నవ్వించలేకపోయింది. ఇప్పుడీ చిత్రం అటు టీవీ, ఇటు ఓటీటీలోకి ఒకేసారి వచ్చింది.(ఇదీ చదవండి: భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన డాక్టర్ బాబు) నితిన్-శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్.. ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఇక డిజిటల్ హక్కులు దక్కించుకున్న జీ5 సంస్థ.. తాజాగా శనివారం నాడు సాయంత్రం 6 గంటలకు టీవీలో టెలికాస్ట్ చేసింది. అదే టైంలో ఓటీటీలోకి కూడా తీసుకొచ్చేసింది. గతంలో సంక్రాంతి వస్తున్నాం చిత్రానికి ఇలానే చేసి మంచి వ్యూయర్ షిప్ సొంతం చేసుకున్నారు. రాబిన్ హుడ్ విషయానికొస్తే.. రామ్ అలియాస్ రాబిన్ హుడ్ (నితిన్) చిన్నప్పుడే దొంగగా మారతాడు. ధనవంతుల నుంచి డబ్బులు దొంగిలించి అనాథ శరణాలయాలకు దానం చేస్తుంటాడు. మరోవైపు రుద్రకొండలో కరుడుగట్టిన విలన్ ఉంటాడు. తన వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటాడు. ఇంకోవైపు ఆస్ట్రేలియాలో ఉన్న వాసుదేవ్ కుమార్తె రీనా (శ్రీలీల) తాతని చూసేందుకు ఇండియా వస్తుంది. ఈ మూడు పాత్రలు ఎలా కలిశాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: హీరో జయం రవి భార్య- ప్రియురాలి మధ్య మాటల యుద్ధం!) -
ఒకేసారి ఓటీటీ, టీవీలో ‘రాబిన్ హుడ్’.. ఎప్పుడంటే?
నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్(Robinhood).. ఈ ఏడాది మార్చిలో విడుదలై డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. శ్రీలీల గ్లామర్, క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో, కేతికా శర్మ ఐటమ్ సాంగ్..ఏవి సినిమాను రక్షించలేకపోయాయి. ఛలో, భీష్మ లాంటి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్న వెంకీ కుడుముల ఈ చిత్రంలో అపజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఓటీటీలో అయినా ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం చిత్రబృందంలో బలంగా ఉంది. అయితే ఓటీటీ కంటే ముందే ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ని కొనుగోలు చేసిన జీ5(ZEE5) సంస్థ.. మే 10న ఈ చిత్రాన్ని టీవీలో టెలికాస్ట్ చేయనుంది. ఆ తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫార్ములా అప్లై‘సంక్రాంతి వస్తున్నాం’సినిమాను అటు ఛానల్లో, ఇటు ఓటీటీలోకి ఓకేసారి తీసుకోచ్చింది జీ5 సంస్థ. ఇప్పుడు ‘రాబిన్‌హుడ్’ విషయంలోనూ అదే ఫాలో అవుతోంది. ఓటీటీ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు కానీ.. మే 10వ తేదినే ఓటీటీలో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని ఒకేసారి టీవీలోనూ, ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల.. జీ చానల్‌కి మంచి టీఆర్పీ వచ్చింది. అందుకే రాబిన్ హుడ్ చిత్రానికి కూడా అదే ఫార్ములా అప్లై చేస్తున్నారు. మరి ఈ రాబిన్‌హుడ్ కనీసం బుల్లితెర మనసులను అయినా దోచుకుంటాడో లేదో చూడాలి.రాబిన్ హుడ్ కథేంటంటే..?రామ్ (నితిన్) అనాథ. చిన్నప్పుడు అతన్ని ఓ పెద్దాయన హైదరాబాద్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పిస్తాడు. అక్కడ తినడానికి తిండిలేక ఇబ్బందిపడుతున్న తోటి పిల్లల కోసం దొంగగా మారతాడు. పెద్దయ్యాక ‘రాబిన్‌హుడ్’ పేరుతో ధనవంతుల ఇళ్లలో చోరీలు చేస్తుంటాడు. అతన్ని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన పోలీసు అధికారి విక్టర్(షైన్ చాం టాకో) ఈగోని దెబ్బతీస్తూ ప్రతిసారి దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు. దీంతో విక్టర్ రాబిన్‌ని పట్టుకోవడమే టార్గెట్‌గా పెట్టుకుంటాడు. రాబిన్‌కి ఈ విషయం తెలిసి..దొంగతనం మానేసి జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేంద్రప్రసాద్) నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు. అదే సమయంలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకు వస్తుంది. ఆమెకు సెక్యూరిటీగా రాబిన్ వెళ్తాడు. ఇండియాకు వచ్చిన నీరాను గంజాయి దందా చేసే రౌడీ సామి(దేవదత్తా నాగే) మనుషులు బంధించి రుద్రకొండ అనే ప్రాంతానికి తీసుకెళ్తారు? సామి వలలో చిక్కుకున్న నీరాను రాబిన్‌హుడ్ ఎలా రక్షించాడు? నిరాను రుద్రకొండకు ఎందుకు రప్పించారు? రాబిన్‌హుడ్ సడెన్‌గా సెక్యూరిటీ ఏజెన్సీలో ఎందుకు చేరాల్సివచ్చింది? ఈ కథలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.Full of laughs, packed with thrills, and loaded with chills – Robinhood ! Don't miss 🌟🎬Robinhood World Television Premiere On May 10th, Saturday at 6 PM On #ZeeTelugu#ZeeTeluguPromo #WorldTelevisionPremiereRobinhood #RobinhoodOnZeeTelugu pic.twitter.com/SjA5ShGdPX— ZEE TELUGU (@ZeeTVTelugu) May 6, 2025 -
సితార ఎక్కడా తగ్గట్లే.. చీరలో స్టైలిష్ గా శ్రీలీల
చిన్న వయసులోనే గ్లామరస్ గా సితారచీరలో శ్రీలీల బ్యాక్ లెస్ పోజులుబేబీ బంప్ తో ఈవెంట్ లో పాల్గొన్న కియారామేకప్ లేకుండా కనిపించిన నభా నటేశ్హాలీవుడ్ స్టైల్లో కనిపిస్తున్న ప్రియాంక చోప్రాహిట్ 3 శ్రీనిధి చీర స్టిల్స్.. చూస్తే మెల్ట్ అవ్వాల్సిందేడ్యాన్స్ తో ఎంటర్ టైన్ చేసిన మంచు లక్ష్మీ View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
రామ్ చరణ్‌తో శ్రీలీల మాస్ స్టెప్పులు.. మరో ‘కిస్సిక్’ అవుతుందా?
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న‘పెద్ది’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొన్నటి వరకు రామ్ చరణ్ నాన్‌స్టాప్‌గా ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు. ఇప్పుడు కాస్త బ్రేక్ తీసుకొని టుస్సాడ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ కోసం విదేశాలకు వెళ్తున్నారు. రామ్ చరణ్ రావడానికి కనీసం రెండు, మూడు వారాలైనా పట్టే అవకాశం ఉంది. ఈ లోపు ఆయనతో సంబంధం లేని సన్నివేశాలను షూట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇందులో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంటుందట. ఈ పాటను కాజల్‌తో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవన్ని పుకార్లు మాత్రమే. బుచ్చిబాబు ప్లాన్ వేరే ఉందంట. ఓ స్టార్ హీరోయిన్‌తో ఈ ఐటమ్ సాంగ్‌కి స్టెప్పులేయించబోతున్నాడట. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు మన ‘కిస్సిక్’ పాప శ్రీలీలనే.పుష్ప 2 చిత్రంలో శ్రీలీల చేసిన ఐటం సాంగ్ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అల్లు అర్జున్‌తో కలిసి ఆమె వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. ఇప్పుడు రామ్ చరణ్‌తో కలిసి చిందులేసేందుకు శ్రీలీల రెడీ అవుతోందని టాలీవుడ్లో వినిపిస్తున్న లేటెస్ట్ గాసిప్. రంగస్థలంలోని ‘జిగేల్ రాణి’ మాదిరి పెద్దిలో కూడా ఓ ఊరమాస్ సాంగ్‌ని ప్లాన్ చేశాడట బుచ్చిబాబు. ఈ పాటకు శ్రీలీల అయితేనే న్యాయం చేస్తుందని మైత్రీ మూవీమేకర్స్ నిర్మాతలకు చెప్పాడట. అయితే వాళ్లు ఇంకా శ్రీలీలను సంప్రదించలేదట. కానీ దాదాపు ఆమెతోనే ఆ పాట చేయించాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇప్పట్లో శ్రీలీల డేట్స్ దొరకడం చాలా కష్టం. బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ సినిమా షూటింగ్, ప్రమోషన్స్‌కే ఎక్కువ డేట్స్ కేటాయించింది. ఆ సినిమా తర్వాత రవితేజ మాస్ జాతర షూటింగ్లో పాల్గొంటుంది.అలాగే శివకార్తికేయన్ ‘పరాశక్తి’, అఖిల్ ‘లెనిన్’ కూడా లైన్లో ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్న శ్రీలీలకి ‘పెద్ది’ కోసం ఇప్పట్లో డేట్స్ కేటాయించే చాన్స్ అయితే లేదు. బుచ్చిబాబుకు కూడా ఇప్పుడే ఆ పాట కావాలన్న డిమాండేమి లేదు. సినిమా రిలీజ్‌కి ఇంకా చాలా సమయం ఉంది. ఆలోపు శ్రీలీల మూడు నాలుగు రోజులు డేట్స్ కేటాయిస్తే చాలు.. పాట అయిపోతుంది. మరి శ్రీలీల చేసే ఈ రెండో ఐటమ్ సాంగ్ కూడా ‘కిస్సిక్’ మాదిరి సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రామ్ చరణ్ తో శ్రీలీల.. థియేటర్లు దద్దరిల్లడం పక్కా
-
ఫోటోలో కనిపించిన పాప వివరాలు తెలిపిన 'శ్రీలీల'
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల కొద్దిరోజుల క్రితం ఒక చిన్నపాపతో ఉన్న ఫోటోను తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. తమ కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చేసిందని క్యాప్షన్ పెట్టడంతో ఆమె మరో బిడ్డను దత్తత తీసుకున్నారేమో అని అందరూ అనుకున్నారు. సుమారు మూడేళ్ల క్రితం ఆమె ఓ అనాథశ్రమాన్ని సందర్శించినప్పుడు దివ్యాంగులైన గురు, శోభిత అనే ఇద్దరు పిల్లల పరిస్థితి చూసి చలించిపోయింది. ఆ సమయంలో వారిని దత్తత తీసుకుంది. దీంతో తాజాగా మరో పాపను కూడా శ్రీలీల దత్తత తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఆ ఫోటోలోని పాప గురించి చెబుతూ తాజాగా శ్రీలీల మరో పోస్ట్ షేర్ చేసింది.ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే శ్రీలీల కాస్త విరామం దొరకగానే చిన్నపాపతో సరదాగా ఆడుకుంటూ కనిపించింది. ఆ పాప వివరాలు చెప్పాలని చాలామంది నెటిజన్లు కామెంట్ల రూపంలో శ్రీలీలను కోరడంతో తాజాగా సమాధానం చెప్పింది. ఆ పాప తన సోదరి కూతురు అని శ్రీలీల క్లారిటీ ఇచ్చింది. నా సోదరి కూతురు వల్ల మా ఇల్లు అంతా కొత్తగా ఉంది. ముఖ్యంగా ఈ పిన్నిలో మరింత జోష్ నింపింది' అని ఇన్‌స్టా స్టోరీస్‌లో తెలిపింది. పుష్ప2 సినిమాలో ప్రత్యేకమైన సాంగ్‌లో మెప్పించిన శ్రీలీల పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో ఒక సినిమాలో నటిస్తుంది. కార్తిక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ సమయంలోనే కార్తిక్ - శ్రీలీల మధ్య ప్రేమ మొదలైందని వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయంపై వారు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?
శ్రీలీల(Sreeleela) పేరు చెప్పగానే డ్యాన్సులే గుర్తొస్తాయి. అప్పట్లో పల్సర్ బండి పాటకు.. రీసెంట్ గా పుష్ప 2లో(Pushpa 2 Movie) కిస్సిక్ అంటూ స్టెప్పులేసి అదరగొట్టేసింది. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈమె గురించి ఇప్పుడో విషయం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏంటి సంగతి?తెలుగు మూలాలున్న అమ్మాయి శ్రీలీల. పుట్టి పెరిగింది అమెరికాలో గానీ ప్రస్తుతానికైతే బెంగళూరులో తల్లితో కలిసి ఉంటుంది. షూటింగ్ లేనప్పుడు తన ఇంట్లో చేసే అల్లరిని అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. యాక్టింగ్ పరంగా శ్రీలీలపై చిన్న చిన్న విమర్శలు వస్తుంటాయి. ఓ విషయంలో మాత్రం ఈమె అందరి మనసులు దోచేసింది.(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) ఎంబీబీఎస్ పూర్తి చేసిన శ్రీలీల.. ఓవైపు హీరోయిన్ గా చేస్తోంది. ఇది అందరికీ తెలుసు. కానీ 2022లో ఓ అనాథశ్రమాన్ని సందర్శించినప్పుడు.. దివ్యాంగులైన గురు, శోభిత అనే ఇద్దరు పిల్లల పరిస్థితి చూసి చలించిపోయింది. వాళ్లని దత్తత తీసుకుంది(Adopted). వాళ్ల ఆలనపాలన చూసుకుంటోంది.తన కుటుంబంలోకి మరో పాప వచ్చిందని శ్రీలీల తాజాగా పోస్ట్ పెట్టింది. ఇందులో ఓ చిన్న పాపకు ముద్దులు పెడుతూ కనిపించింది. నెటిజన్ల అయితే ఈ పాప ఎవరా అని మాట్లాడుకుంటున్నారు. కొందరు మాత్రం మరో బిడ్డని దత్తత తీసుకుంది అని అంటున్నారు. లేదంటే బంధువులమ్మాయి అనేది శ్రీలీల చెబితే గానీ క్లారిటీ రాదు.(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
శేఖర్ మాస్టర్ తో అనసూయ ఫన్నీ పోజులుసితారకు అక్కలా అనిపిస్తున్న తల్లి నమ్రతపట్టుచీరలో ముచ్చటైన నవ్వుతో మీనాక్షి చౌదరిబంధువుల పాపతో శ్రీలీల ముద్దు మురిపెంచీరలో తెగ సిగ్గుపడిపోతున్న పూజా హెగ్డేజలకన్య తరహా డ్రస్సులో రకుల్ ప్రీత్ అందాల జాతరటామ్ బాయ్ లా మారిపోయిన రష్మిక మందన్నా View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by HT City Showstoppers (@htcityshowstoppers) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Hariprriya Simha (@iamhariprriya) -
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
బాలీవుడ్ సినిమా ప్రేక్షకలోకానికి ఆషికి అనే సినిమా ఓ గొప్ప ప్రేమ కావ్యం. ఆ సినిమా విజయం ఎంత గొప్పది అంటే.. ఆ సినిమా పేరు గుర్తుకురాగానే ఆ సినిమాలో జీవించిన నటీనటులు కళ్ల ముందు సిసలైన ప్రేమ చిహ్నాల్లా మెరుస్తారు. ఆ సినిమా, ఆడియో ఆల్బమ్ వయసు పాతికేళ్లు కానీ... ఇప్పటికీ ఆ పాటల్ని వినకుండా ఉండలేని ప్రేక్షక–ప్రేమాభిమానులు ఎందరో..నటీ నటులు అనుఅగర్వాల్, రాహుల్ రాయ్‌లతో సహా ఆ చిత్రంలో పాలు పంచుకున్న ఎందరికో ఆషికి తిరుగులేని గుర్తింపును తీసుకొచ్చింది.అంత చరిత్ర ఉన్న ఆషికికి ఇప్పటికే ఒక సీక్వెల్ వచ్చి విజయవంతం అయింది. ఇప్పుడు మరోసారి ఆ సినిమాకి సీక్వెల్ తయారవుతోంది. ఈ ఆషికి 3(Aashiqui 3 Movie )లో బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి ఎదిగిన శ్రీలీల(sreeleela) నటిస్తోంది. ఈ నేపధ్యంలోనే తొలి ఆషికి సినిమా కధానాయిక నటి అను అగర్వాల్(Anu Agarwal), తన ఆలోచనలను పంచుకున్నారు. తనకు ఆషికి లో పాత్ర ఎంతగా మనసుకు హత్తుకు పోయిందో వెల్లడించారు. ఆషికి అనేది కేవలం తెరపై నటించిన మరో పాత్ర మాత్రమే కాదని– అది తన హృదయ స్పందన అని ఆమె పేర్కొన్నారు.తాను ఆషికీలో తొలిసారి భాగంగా మారినప్పుడు ఆ సమయంలో అది అంత గొప్ప చిత్రం కాదనీ. అప్పటికి దర్శకుడు మహేష్ భట్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్‌గా పేరు తెచ్చుకోలేదనీ, తన మొదటి మెయిన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టిన ఒక ఆర్ట్ హౌస్ డైరెక్టర్. మాత్రమే నని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆషికి నేను పనిచేసిన ఓ చిత్రం మాత్రమే కాదు, ఇది నన్ను నేను రూపొందించడంలో నన్ను నేను నిర్మించుకోవడంలో సహాయపడింది. అది నా వ్యక్తిగత జీవితంపై ఎంతో ప్రభావం చూపింది.‘ అంటూ ఉద్విగ్నంగా చెప్పారు.అటువంటి ఐకానిక్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎంపికైనందుకు కృతజ్ఞత కలిగి ఉండాలని ఆషికి 3 నటీనటులకు ఆమె సూచించారు. ‘ఇది అహంకారంతో చెబుతున్నది కాదు, ఆషికీ సిరీస్‌లో చేరిన ఎవరైనా ఓ ఘనమైన వారసత్వంలో భాగమవుతున్నారు. ఆ వారసత్వంలోకి అడుగుపెట్టిన మరు క్షణమే, సగం విజయం సాధిస్తారు. ప్రేక్షకులు మిమ్మల్ని ఆషికి వారసులుగా చూసేందుకు వస్తారు. అందుకే నటీనటులు తమకు లభించిన అవకాశం పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఆ వారసత్వాన్ని గొప్ప గౌరవంగా భావించాలి.‘ అంటూ ఆమె ఉద్భోధించారు. ప్రేమ అనేది విశ్వవ్యాప్తం కాలాతీతం అని అను అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ప్రేమ చిత్రణ సమకాలీన సున్నితత్వాలకు అనుగుణంగా ఉండవచ్చు, అయితే ప్రేమను నిర్వచించే ప్రాథమిక భావోద్వేగాలు అనుభవాలు ఎల్లప్పుడూ అలాగే ఉంటాయని తాను నమ్ముతానంది.ఆషికి తర్వాత పొడగరి సుందరి, డస్కీ బ్యూటీగా 1990 ప్రాంతంలో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న అనుఅగర్వాల్ 1999 ప్రాంతంలో అనూహ్యంగా ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై వెండితెరకు దూరమయ్యారు. కొన్నేళ్లపాటు చికిత్స తర్వాత ప్రస్తుతం కోలుకున్నప్పటికీ..సినిమాల్లో ఇంకా అవకాశాలు రావడం లేదు. ఆమె తమిళ దర్శకుడు మణిరత్నం దొంగ దొంగ చిత్రంలో కొంచెం నీరు కొంచెం నిప్పు పాట ద్వారా దక్షిణాది ప్రేక్షకులకూ చిరపరిచితమయ్యారు. -
ఓటీటీలోకి 'రాబిన్ హుడ్'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
రీసెంట్ టైంలో ఓటీటీల్లోకి(Ott Movies) కొత్త సినిమాలు చాలావరకు నెలలోపే వచ్చేస్తున్నాయి. ఈ విషయంలో చిన్నా పెద్దా అనే తేడాలు ఉండట్లేదు. మరీ బ్లాక్ బస్టర్ అనుకుంటే నెలన్నర నుంచి రెండు నెలలకు స్ట్రీమింగ్ చేస్తున్నారు.మరోవైపు 'సంక్రాంతికి వస్తున్నాం'తో జీ5 ఓటీటీ సంస్థ.. సరికొత్త పంథాలో వెళ్తోందని చెప్పాలి. ఒకేసారి అటు టీవీ, ఇటు ఓటీటీల్లో సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నారు. వెంకీ మూవీతో పాటు రీసెంట్ గా 'కింగ్ స్టన్' చిత్రాన్ని ఇలానే రిలీజ్ చేశారు. ఇప్పుడీ లిస్టులోకి 'రాబిన్ హుడ్'(Robinhood Movie) కూడా చేరబోతున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) నితిన్, శ్రీలీల(Sreeleela) జంటగా నటించిన ఈ సినిమా.. ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే ఘోరంగా ఫ్లాప్ అయింది. కనీస వసూళ్లు రాక చతికిలపడిందని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడీ మూవీని మే 4న టీవీ, ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.'రాబిన్ హుడ్' విషయానికొస్తే.. రామ్ (నితిన్) ఓ అనాథ. అనాథశ్రమాల కోసం రాబిన్ హుడ్ పేరుతో దొంగతనాలు చేస్తుంటాడు. కొన్ని కారణాల వల్ల ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరుతాడు. ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చిన నీరా (శ్రీలీల)కు సెక్యూరిటీగా ఉంటాడు. ఓరోజు నీరాని ఎవరో కిడ్నాప్ చేస్తారు. మరి రామ్, నీరాని ఎలా రక్షించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తమన్నా హారర్ సినిమా.. కలెక్షన్ మరీ ఇంత తక్కువా?) -
శ్రీలీలతో స్టెప్పులు.. అతని జన్మ ధన్యమైందంటున్న నెటిజన్స్!
టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తోన్న హీరోయిన్ శ్రీలీల. ఇటీవల నితిన్ సరసన రాబిన్‌హుడ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. వెంకీ కుడుముల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయితే శ్రీలీల ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో రెండోసారి జతకట్టింది. మాస్ జాతర పేరుతో వస్తోన్న మూవీలో హీరోయిన్గా కనిపించనుంది. గతంలో ధమాకా చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల నటించిన సంగతి తెలిసిందే.అయితే శ్రీలీల డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప-2 కిస్సిక్ సాంగ్‌తో అభిమానులను ఓ ఊపు ఊపేసింది. హీరోలతో పోటీ పడి మరి తన స్టెప్పులతో అదరగొడుతుంది. శ్రీలీలతో డ్యాన్స్ చేయడమంటే మామూలు ఎనర్జీ సరిపోదు అనేలా స్టెప్పులతో ఆలరిస్తుంది. అలా సరదాగా స్టెప్పులతో అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటో చూసేయండి.అయితే తాను సరదాగా డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఓ ఈవెంట్‌కు వెళ్లిన ముద్దుగుమ్మ బయటికి వస్తున్న సమయంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్‌తో ఓ బాలీవుడ్ పాటకు కాలు కదిపింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్స్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. శ్రీలీలతో డ్యాన్స్ చేయడం అతని జీవితంలో మరిచిపోలేడని రాసుకొచ్చింది. ఈ క్షణాలు అతని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాడని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.ఇక శ్రీలీల సినీ కెరీర్ విషయానికొస్తే.. కన్నడ చిత్రం కిస్ (2019)తో శ్రీలీల మరపురాని అరంగేట్రం చేసింది. పెళ్లి సందడి (2021)లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. భగవంత్ కేసరి (2023), స్కంద (2023), ఆదికేశవ (2023), గుంటూరు కారం (2024) చిత్రాల జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తోంది.Security guard can forget his wife his life, but! he can never forget this moment in his entire life 😹 I felt that way when I saw his happiness pic.twitter.com/pXHrqXFONG— Shubhangi Pandit (@Babymishra_) April 15, 2025 -
మాస్ మహారాజా రవితేజ 'మాస్ జాతర' చిత్రం నుంచి మొదటి గీతం 'తు మేరా లవర్' విడుదల
-
చక్రి 'ఏఐ' వాయిస్ తో కొత్త పాట.. వింటేజ్ స్టెప్పులు
రవితేజ(Raviteja) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మాస్ జాతర'(Mass Jathara Movie). శ్రీలీల హీరోయిన్. కొత్త దర్శకుడు భాను భోగవరపు తీస్తున్నాడు. లెక్క ప్రకారం మేలో రిలీజ్ అనుకున్నారు కానీ ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే తొలి పాట రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత)'తూ మేరా లవర్' అంటూ సాగే ఈ పాటని దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాయిస్ తో కంపోజ్ చేయడం విశేషం. 'ఇడియట్'లోని ఫేమస్ స్టెప్పులు మళ్లీ రవితేజనే వేసి ఆకట్టుకున్నాడు. శ్రీలీల(Sreeleela) కూడా గత చిత్రాలతో పోలిస్తే హాట్ గా ఉంది. భీమ్స్ అందించిన మ్యూజిక్ కూడా బాగుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?) -
నోరు జారిన కుర్రాడు.. నిధి అగర్వాల్ మాత్రం
సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్. అందుకే పలువురు నెటిజన్లు.. హీరోహీరోయిన్లపై అప్పుడప్పుడు నోటికొచ్చిన కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఇలాంటి వాటిని సదరు నటీనటులు పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకుంటే మాత్రం కాస్త గట్టిగానే ఇచ్చేస్తుంటారు. హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhhi Agerwal).. ఇప్పుడు ఓ కుర్రాడికి అలానే కౌంటర్ ఇచ్చింది.ఏం జరిగిందంటే?నిధి అగర్వాల్ గురించి ఓ ట్విటర్ పేజీలో పోస్ట్ పెట్టగా.. దీనికి స్పందించిన ఓ నెటిజన్ ఈమెని శ్రీలల(Sreeleela) పోలుస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశాడు. 2021లో వచ్చిన శ్రీలీల 20కి పైగా సినిమాలు చేసింది. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత నిధి ఏం చేసింది? ఎన్ని మూవీస్ చేసింది? అని అన్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)ఈ ట్వీట్ పై స్వయంగా స్పందించిన నిధి అగర్వాల్.. సదరు నెటిజన్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. 'ఇస్మార్ట్ శంకర్ తర్వాత హీరో మూవీ చేసింది. తమిళంలో మూడు మూవీస్ చేసింది. హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu Movie)కి సంతకం చేసింది. మంచి స్క్రిప్ట్ లు అనుకున్న వాటికే సంతకం చేస్తున్నా. అందుకు టైమ్ తీసుకుంటున్నాను. కొన్నిసార్లు నా నిర్ణయం తప్పయి ఉండొచ్చు. కానీ మంచి సినిమాలు చేయాలనేది నా అభిప్రాయం. వరసగా సినిమాలు చేయాలనే తొందరేం లేదు. ఈ ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటున్నా. కాబట్టి బ్రదర్.. నా గురించి నువ్వేం బాధపడకు' అని చెప్పుకొచ్చింది.నిధి అగర్వాల్ బాగానే కౌంటర్ చేసింది. కానీ సదరు నెటిజన్ అన్నదాంట్లోనూ కాస్త నిజముంది. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ తప్పితే నిధి అగర్వాల్ కెరీర్ లో చెప్పుకోదగ్గ మూవీ లేదు. పవన్ తో హరిహర వీరమల్లు, ప్రభాస్ తో రాజాసాబ్(The Raja Saab Movie) చేసింది గానీ వీటిపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అటు శ్రీలీల కూడా సినిమాలైతే చేస్తోంది గానీ దాదాపు ఫ్లాప్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత) -
మాస్ జాతర.. మరోసారి 'ఇడియట్' స్టెప్పులేసిన రవితేజ
మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర. మనదే ఇదంతా అనేది ట్యాగ్‌లైన్. ఈ మూవీలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ధమాకా బ్లాక్‌బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. తాజాగా ఈ సినిమా నుంచి తు మేరా లవర్ అనే పాట రిలీజ్ చేశారు. 2002లో వచ్చిన ఇడియట్ సినిమాలోని చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే పాటకు రీమిక్స్ చేసి దీన్ని రూపొందించారు. పాటే కాదు రవితేజ స్టెప్పులు కూడా రిపీట్ చేశాడు.ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఫుల్ సాంగ్ ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారు. సామజవరగమన మూవీకి రైటర్‌గా పనిచేసిన భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. విధు అయ్యన్న సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. చదవండి: అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే -
ప్లాప్స్ వచ్చినా తగ్గేదేలే !
-
నేను సింగిల్.. రూ.50 కోట్లు తీసుకుంటే తప్పేంటి?: బాలీవుడ్ హీరో
టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) 'ఆషిఖి 3' (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజైన ఫస్ట్‌లుక్ టీజర్లో వీరి కెమిస్ట్రీ చూసి అభిమానులు ఫిదా అయ్యారు. మీ జోడీ బాగుందని మెచ్చుకున్నారు. పైగా బయట కూడా తరచూ జంటగానే కనిపించడంతో ఆఫ్‌స్క్రీన్‌లోనూ ప్రేమాయణం నడిపిస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది.నేను సింగిల్తాజాగా ఈ రూమర్‌పై కార్తీక్ క్లారిటీ ఇచ్చాడు. ఫిలింఫేర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ మాట్లాడుతూ.. నేను సింగిల్‌గా ఉన్నాను. ప్రస్తుతం ఎవరితోనూ డేటింగ్లో లేను. గతంలోనూ నేను పలువురితో ప్రేమాయణం సాగించినట్లు వార్తలు వచ్చాయి. అందులో కొన్ని నిజాలు కాగా మరికొన్ని ఉట్టి అబద్ధాలు మాత్రమే!నేర్చుకున్నా..అప్పుడీ గాసిప్స్ గురించి నేనంతగా పట్టించుకునేవాడిని కాదు. నేను ఎవరినైనా కలిసినా కూడా ఏవేవో కథనాలు అల్లుకునేవారు. ఒకరకంగా చెప్పాలంటే నా గురించి నాకే తెలియని వార్తలు వచ్చేవి. అవి చూసి నేను కాస్త జాగ్రత్తగా ఉండాలని తెలుసుకున్నాను. పరిస్థితుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా కార్తీక్.. జాన్వీ కపూర్, సారా అలీఖాన్, అనన్య పాండే వంటి పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినట్లు ఆమధ్య వార్తలు వచ్చాయి.రూ.50 కోట్లు.. నేనొక్కడినే తీసుకుంటున్నానా?కార్తీక్ ఒక్కో సినిమాకుగానూ రూ.50 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు వస్తున్న వార్తలపైనా స్పందించాడు. ఇండస్ట్రీలో నేనొక్కడినే అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నానా? మిగతావాళ్ల గురించి రాయరు కానీ నాగురించి మాత్రం నొక్కి చెప్తుంటారు అని అసహనం వ్యక్తి చేశాడు. కార్తీక్- శ్రీలీలల సినిమా విషయానికి వస్తే.. అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది.చదవండి: అల్లు అర్జున్ బర్త్‌డే: 'ఎదురు నీకు లేదులే.. అడ్డు నీకు రాదులే' -
విజయాల శ్రీ‘లీల’వెనుక రహస్యాలివే...
యువ నటి శ్రీలీల(sreeleela) నిస్సందేహంగా భారతీయ సినీరంగంలో తదుపరి పెద్ద స్టార్ కానుంది అంటున్నాయి సినీజోస్యాలు. తన అందం, ఆకర్షణ, ఎలక్ట్రిఫైయింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ అసాధారణమైన ఇతర నైపుణ్యాలతో, ఆమె దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా మారింది. ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ సరసన బాలీవుడ్లో అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతోంది. పుష్ప2లోని కిస్సిక్ పాటతో ఆమె ఉత్తరాది ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపారు. నిజానికి పుష్ప తొలి భాగంలో సమంత ఐటమ్ సాంగ్ హిట్ అయినా కూడా సమంతకు రానంత పాప్యురారిటీ శ్రీలీలకు వచ్చింది. ఆ పాట ఆమె హిందీ చిత్రసీమలోకి రెడ్‌కార్పెట్ వేసింది. దాంతో సౌత్‌లోనూ ఆమె క్రేజ్ తారాస్థాయికి చేరుకుంది, ఇక ఆమె బాలీవుడ్లో మెరిసిపోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే...శ్రీలీల తాజా హిందీ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.ఇటీవల, ఈ చిత్రం సెట్ నుంచి అనేక వీడియోలు ఫొటోలు ఆనలైన్ లో ప్రత్యక్షమయ్యాయి. మరుసటి తక్షణమే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎరుపు రంగులో వదులుగా ఉండే దుస్తులు ధరించిన శ్రీలీల లుక్ ని, ఆమె రూపాన్ని మెచ్చుకుంటూ ఆమె పాత్ర గురించి ఊహాగానాలు చేస్తూ, అభిమానులు వీటిని షేర్ చేస్తున్నారు. ఓ రకంగా ఈ చిత్రానికి దక్షిణాదిలో విపరీతమైన టాక్ రావడానికి కారణం శ్రీలీలే అని చెప్పాలి. అందం, ప్రతిభ ఆత్మవిశ్వాసాల కలయికగా శ్రీలీల బాలీవుడ్లో రంగప్రవేశం చేస్తోంది. ఖచ్చితంగా కొన్నేళ్ల పాటు భారతీయ సినీరంగాన్ని ఊపే సత్తా ఆమెకు ఉందని బాలీవుడ్ మీడియా ఊహాగానాలు చేస్తోంది. ఈ సందర్భంగా శ్రీలీలను ఈ స్థాయిలో నిలబెట్టిన కొన్ని ముఖ్యమైను అంశాలను పరిశీలించాలి..కన్నడ చిత్రం కిస్ (2019)తో శ్రీలీల మరపురాని అరంగేట్రం చేసింది, ఆమె సహజమైన సౌందర్యం, ప్రకాశవంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్ర విజయం ఆమెకు కొత్త అవార్డులను సంపాదించిపెట్టింది, ఇది భారతీయ చలనచిత్రంలో ఆమె మంచి జర్నీకి నాంది పలికింది.రెండో విషయంగా చెప్పాల్సి వస్తే ఆమె నృత్య,నటనా ప్రతిభ గురించే చెప్పాలి. ధమాకా (2022)లో, జింతాక్ పాటలో చురుకైన రిథమ్, గ్రేస్ ఎక్స్ప్రెషన్స్ లతో శ్రీలీల తెలుగు సినిమాకి డాన్స్ డార్లింగ్‌గా మారింది.పెళ్లి సందడి (2021)లో సాంప్రదాయంగా కనపడి, భగవంత్ కేసరి (2023)లో యాక్షన్ సీన్స్ వరకు శ్రీలీల తనలోని షేడ్స్ స్కిల్స్ బాగా పండించింది. స్కంద (2023), ఆదికేశవ (2023), గుంటూరు కారం (2024) చిత్రాల జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న పాత్రలతో తన స్కిల్స్‌కు సానబట్టింది.భాషపై పట్టు కూడా శ్రీలలకు అచ్చొచ్చిన మరో అంశం. కన్నడ, తెలుగు, తమిళం ఇంగ్లీషు భాషలపై ఆమెకున్న పట్టు ఆమెని విభిన్న భాషా చిత్రాల్లో, భిన్న పరిశ్రమల్లో బలంగా నిలబెట్టింది. వివిధ భాషా నేపథ్యాలకు చెందిన అభిమానులతో ఆమె సులభంగా మమేకం కాగలుగుతోంది. అంతర్జాతీయ ట్రెండ్స్‌ను ఒడిసిపట్టగల శ్రీలీల ఫ్యాషన్ ఐకాన్‌గా కూడా ఆకట్టుకోగలుగుతోంది. ఆమె వార్డ్రోబ్ ఫ్యాషన్ ప్రియుల ఫేవరెట్ గా పేరొందింది.అధిక ఫ్యాషన్‌తో యువత కు మరింత దగ్గర కాగలుగుతోంది. ఆమె ఫ్యాషన్ లుక్స్ ఆమెను మ్యాగజైన్లపై, వెబ్‌సైట్స్‌లో తళుక్కుమనేలా చేస్తున్నాయి. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (2023) వంటి చిత్రాలలో పనిచేస్తున్నప్పుడు, శ్రీలీల తన వైద్య విద్య పరిజ్ఞానం గురించి ఆమె స్వచ్ఛంద సేవల గురించి బాగా వెలుగులోకి వచ్చింది. ఆమె సహకారం అందిస్తున్న గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాలు మహిళల విద్యకు మద్దతు అందించడం వంటివి ఆమెను నటిగా మాత్రమే కాక అంతకు మించి భారతీయ సినిమా రంగంలో ఒక ప్రత్యేకమైన రోల్ మోడల్‌గా అవతరించేందుకు అవకాశం అందిస్తున్నాయి. -
చేదు అనుభవం.. శ్రీలీలని పట్టి లాగేశారు
సినిమా సెలబ్రిటీలు బయటకు నవ్వుతూ కనిపిస్తుంటారు. కానీ అప్పుడప్పుడు అభిమానుల వల్ల ఇబ్బంది పడుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి పరిస్థితి శ్రీలీలకు (Sreeleela) ఎదురైంది. కొందరు అభిమానులు ఈమెని గట్టిగా పట్టి లాగేశారు. (ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా)కొన్నాళ్ల ముందు వరకు వరస తెలుగు సినిమాలు చేసిన శ్రీలీల.. ప్రస్తుతం బాలీవుడ్ లో మూవీస్ చేస్తోంది. కార్తీక్ ఆర్యన్(Karthik Aryan)తో ఓ ప్రేమకథలో నటిస్తోంది. నిన్నటివరకు డార్జిలింగ్ లో షూటింగ్ చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కార్తిక్, శ్రీలీల నడిచి వస్తుండగా.. పక్కనే ఉన్న కొందరు శ్రీలీలని పట్టి లాగేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన శ్రీలీల ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరీ ఇలా ప్రవర్తిస్తున్నారేంట్రా అని అనుకుంటున్నారు. ఇకపోతే కార్తిక్ ఆర్యన్ తో శ్రీలీల డేటింగ్ అని కూడా కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. అయితే ఇవన్నీ మూవీపై బజ్ పెంచేందుకేనని కొందరు నెటిజన్లు అంటున్నారు.(ఇదీ చదవండి: దెయ్యం నవ్వు హీరోయిన్.. డైరెక్టర్ విచిత్రమైన కామెంట్స్)Manhandling actresses in public places has to stop tf #Sreeleela pic.twitter.com/TdMjPLQHlT— Aryan (@Pokeamole_) April 6, 2025 -
బెంగాలీ బ్యూటీలా అనసూయ.. ట్రిప్ లో రష్మిక నవ్వులు
బెంగాలీ బ్యూటీలో ముస్తాబైన యాంకర్ అనసూయఒమన్ ట్రిప్ లో జాలీగా ఎంజాయ్ చేస్తున్న రష్మికహాట్ పోజులతో రెచ్చిగొట్టేస్తున్న జాన్వీ కపూర్చీరలో కిర్రెక్కిపోయే అందంతో కావ్య కల్యాణ్ రామ్పచ్చనిచెట్ల మధ్య తృప్తి దిమ్రి సోయగాల విందుఅమ్మకు పుట్టినరోజు విషెస్ చెప్పిన అనుపమహాలీవుడ్ అందగత్తెలా కనిపిస్తున్న శ్రీలీల View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Chitrangda Singh (@chitrangda) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by 🧿Ayesha Takia Azmi (@ayeshatakia) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Samyuktha Viola Viswanathan (@samyukthaviswanathan) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by ForeverNew India (@forevernew_india) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya) -
హీరోయిన్ శ్రీలీలకు ముఖ్యమంత్రి గిఫ్ట్.. ఎందుకో తెలుసా?
పెళ్లి సందడి తర్వాత టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది శ్రీలీల. ఇటీవలే నితిన్ సరసన రాబిన్‌హుడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉగాది కానుకగా రిలీజై థియేటర్లలో సందడి చేస్తోంది. తెలుగులో స్టార్డమ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్‌లోనూ అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ సిక్కింలో జరుగుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ అంతా కలిసి ఆ రాష్ట్ర సీఎంను కలిశారు. సినిమా షూటింగ్ కోసం సిక్కింను ఎంచుకున్నందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఈ నేపథ్యంలో కార్తీక్ ఆర్యన్, శ్రీలీల, అనురాగ్ బసుకు తమ రాష్ట్ర సంప్రదాయం ప్రతిబింబించేలా బహుమతులు అందజేశారు. అంతేకాకుండా మూవీ షూటింగ్ సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తిస్తాయిలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సీఎంఓ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.ఈ సందర్భంగా డైరెక్టర్ అనురాగ్ బసు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తమ మూవీని అద్భుతంగా తెరకెక్కిస్తామని వెల్లడించారు. ఇక్కడ షూటింగ్ సమయంలో ప్రజల నుంచి వస్తున్న మద్దతు, ప్రేమ పట్ల చాలా సంతోషంగా ఉందని కార్తీక్ ఆర్యన్ అన్నారు. మాకు భద్రత కల్పించినందుకు సిక్కిం పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది మా షూటింగ్ సజావుగా పూర్తి చేసేందుకు సహకరిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. సిక్కింలోని ప్రకృతి దృశ్యాలు, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు తనను ఆకర్షించాయని హీరోయిన్ శ్రీలీల అన్నారు. ఈశాన్య రాష్ట్రానికి తన మొదటి పర్యటనను నా జీవితంలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు.It was a pleasure to meet Bollywood filmmaker Shri Anurag Basu and renowned actors Mr Kartik Aaryan and Ms. Sreeleela at my official residence, Mintokgang. They have been in the state for a week, shooting their upcoming film at iconic locations such as MG Marg and Tsomgo Lake.… pic.twitter.com/ycwHB8R7IG— Prem Singh Tamang (Golay) (@PSTamangGolay) April 2, 2025 -
ప్రతి షోకి వసూళ్లు పెరుగుతున్నాయి: ‘రాబిన్‌హుడ్’ నిర్మాత
‘‘రాబిన్‌హుడ్’ (Robinhood Movie ) క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. మేం థియేటర్స్‌కి వెళ్లి చూశాం. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం చాలా హ్యాపీగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఫోన్ చేసి, సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. ప్రతి షోకి వసూళ్లు పెరుగుతున్నాయి’’ అన్నారు నిర్మాత యలమంచిలి రవిశంకర్. (చదవండి: రాబిన్‌హుడ్ మూవీ రివ్యూ)నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్, ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇతర ΄ాత్రలు పోషించారు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. (చదవండి: 'హత్య' మూవీ రివ్యూ.. ఇది కదా అసలు నిజం!)ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘రాబిన్ హుడ్’లో మంచి కథతో పాటు వినోదం, ఫైట్స్ అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీతో పాటు యువత వెళ్లి ఎంజాయ్ చేసే సినిమా ఇది’’ అన్నారు. ‘‘మేము రెండు థియేటర్స్‌ని విజిట్ చేశాం. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తుండటం సంతోషంగా అనిపించింది. ఈ ఉగాదికి మా సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది’’ అన్నారు వెంకీ కుడుముల. -
రాబిన్‌హుడ్‌లో డేవిడ్ వార్నర్.. రెండు నిమిషాలకే ఇంత హంగామా చేశారా?
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ రోజే థియేటర్లలోకి వచ్చేసింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా ద్వారా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీ రిలీజ్ ముందు ప్రమోషన్లలోనూ బిజీగా పాల్గొన్నారు. రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెరిశారు. దీంతో రాబిన్‌హుడ్‌లో డేవిడ్ రోల్‌పై అభిమానుల్లో మరింత అంచనాలు పెరిగాయి.అయితే ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ పాత్రపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కెమియో రోల్ అయినప్పటికీ ట్రైలర్ ఎంట్రీ ఇవ్వడం చూసిన ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఉంటుందని ఊహించారు. కానీ అభిమానులు ఊహించినంత స్థాయిలో మాత్రం డేవిడ్ పాత్ర కనిపించలేదు. కేవలం 2 నిమిషాల 50 సెకన్ల పాటు కనిపించి ఉస్సురుమనిపించారు. రాబిన్‌హుడ్‌లో కొద్దిసేపే కనిపించడంపై డేవిడ్ వార్నర్ అభిమానులు నిరాశకు గురయ్యారు. అది కూడా కేవలం డ్రగ్ డీలర్ పాత్రలో కనిపించడం.. కథలో పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడంతో మైనస్‌గా మారింది.మూవీ ప్రమోషన్స్‌లో డైరెక్టర్ వెంకీ కుడుముల వార్నర్ పాత్రపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. వార్నర్ రోల్ ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తుందని అన్నారు. అంతేకాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కావడం, స్వయంగా అతను కూడా మూవీ ప్రమోషన్లలో పాల్గొనడంతో అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కనీసం పది నిమిషాల పాటైనా వార్నర్ స్క్రీన్‌పై సందడి చేస్తే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వార్నర్.. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుందాం. -
‘రాబిన్‌హుడ్’ మూవీ రివ్యూ
నితిన్ ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. భీష్మ(2020) తర్వాత ఆయనకు ఆ స్థాయి విజయం లభించలేదు.దీంతో మళ్లీ భీష్మ దర్శకుడు వెంకీ కుడుములనే నమ్ముకున్నాడు. ఆయన దర్శకత్వంలో ‘రాబిన్‌హుడ్’(Robinhood Review) అనే సినిమాతో నితిన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి చిత్రంతో నితిన్ హిట్ ట్రాక్ ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. రామ్ (నితిన్) అనాథ. చిన్నప్పుడు అతన్ని ఓ పెద్దాయన హైదరాబాద్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పిస్తాడు. అక్కడ తినడానికి తిండిలేక ఇబ్బందిపడుతున్న తోటి పిల్లల కోసం దొంగగా మారతాడు. పెద్దయ్యాక ‘రాబిన్‌హుడ్’ పేరుతో ధనవంతుల ఇళ్లలో చోరీలు చేస్తుంటాడు. అతన్ని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన పోలీసు అధికారి విక్టర్(షైన్ చాం టాకో) ఈగోని దెబ్బతీస్తూ ప్రతిసారి దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు. దీంతో విక్టర్ రాబిన్‌ని పట్టుకోవడమే టార్గెట్‌గా పెట్టుకుంటాడు. రాబిన్‌కి ఈ విషయం తెలిసి..దొంగతనం మానేసి జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేంద్రప్రసాద్) నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు.(Robinhood Review). అదే సమయంలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకు వస్తుంది. ఆమెకు సెక్యూరిటీగా రాబిన్ వెళ్తాడు. ఇండియాకు వచ్చిన నీరాను గంజాయి దందా చేసే రౌడీ సామి(దేవదత్తా నాగే) మనుషులు బంధించి రుద్రకొండ అనే ప్రాంతానికి తీసుకెళ్తారు? సామి వలలో చిక్కుకున్న నీరాను రాబిన్‌హుడ్ ఎలా రక్షించాడు? నిరాను రుద్రకొండకు ఎందుకు రప్పించారు? రాబిన్‌హుడ్ సడెన్‌గా సెక్యూరిటీ ఏజెన్సీలో ఎందుకు చేరాల్సివచ్చింది? ఈ కథలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..రాబిన్‌హుడ్ కథ అంటే ధనవంతుల నుంచి దొంగిలించి పేదవాళ్లకు పంచే ఒక నీతిగల దొంగ స్టోరీ అందరికి తెలిసిందే. తెలుగు సినిమాల్లో ఈ తరహా కథలు చాలానే వచ్చాయి. కానీ ప్రతి సినిమా దానికి తగ్గట్టుగా కొత్త రంగు, రుచి జోడించి ప్రేక్షకులను అలరించింది. రాబిన్‌హుడ్ కూడా టైటిల్‌కి తగ్గట్టే రాబిన్‌హుడ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం. కథ పరంగా చూస్తే ఇందులో కొత్తదనం ఏది కనిపించదు. శారీరక బలం కంటే, మానసిక బలాన్ని ఎక్కువగా నమ్ముకునే హీరో.. దొంగతనం చేసి అవసరం ఉన్నవాళ్లకు పంచడం..కథ ఇదే లైన్లో సాగుతుంది. ఇక్కడ హీరో అనాథ పిల్లల కోసం దొంగతనం చేస్తుంటాడు. ఆ పాయింట్ వినగానే అందరికి రవితేజ ‘కిక్’ గుర్తొస్తుంది. కానీ పూర్తిగా ‘కిక్’ థీమ్‌ని అనుసరించలేదు. ( ఇదీ చదవండి: Mad Square Movie Review: 'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ)కథలో డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. చివరకు వాటి మధ్య ఉన్న సంబంధం రివీల్ అవుతుంది. ఈ ట్విస్టులు సాధారణ ప్రేక్షకులకు కిక్ ఇస్తాయి. ఫస్టాప్ మొత్తం ఫన్‌జోన్‌లో సాగుతుంది. హీరో చిన్నప్పుడే ఎందుకు దొంగగా మారాల్సి వచ్చిందో తెలియజేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. హీరోను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులను బురిడి కొట్టించే సీన్లన్ని పాత సినిమాను గుర్తు చేస్తాయి. హీరోయిన్ ఎంట్రీ తర్వాత కథనం కామెడీతో పరుగులు పెడుతుంది. వెన్నెల కిశోర్, రాజేంద్రప్రసాద్ మధ్య వచ్చే సన్నివేశాలల్లో కామెడీ బాగా పండింది(Robinhood Review)ముఖ్యంగా నీరా దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు జాన్ స్నో చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. కామెడీ సీన్లతో ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. విలన్ చుట్టూ సాగే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేవు. కథనం కూడా కొంతవరకు ఊహకందేలా సాగుతుంది. కొన్ని ట్విస్టులు ఆకట్టుకున్నప్పటికీ.. రాబిన్ అసలు రుద్రకోండకు ఎందుకు వచ్చాడనేది తెలిసిన తర్వాత మళ్లీ రొటీన్ మూడ్‌లోకి వెళ్లిపోతాం. అదే సమయంలో వచ్చిన అదిదా సర్ప్రైజ్ సాంగ్ కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ‘ట్రూత్ ఆర్ డేర్’ సీన్ ఒకటి నవ్వులు పంచుతుంది. డేవిడ్ వార్నర్ పాత్ర మినహా క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుంది. అయితే వార్నర్ పాత్రను సరైన ముగింపు ఇవ్వకుండా.. పార్ట్ 2 కూడా ఉంటుందని హింట్ ఇచ్చేశారు. ఎవరెలా చేశారంటే..రాబిన్‌హుడ్ పాత్రలో నితిన్ చక్కగా నటించాడు. అతని కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ అయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో పలు సన్నివేశాల్లో అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీలీల పాత్ర పరిమితంగా ఉన్నప్పటికీ, తెరపై చాలా అందంగా కనిపించింది. నటనపరంగా ఆమెకు పెద్దగా స్కోప్ ఉన్న పాత్రమేది కాదు. దేవదత్త పాత్ర మొదట్లో భయపెట్టేలా అనిపించినా, చివర్లో కాస్త నీరసంగా మారి ప్రేక్షకులను నిరాశపరిచింది.రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్‌ల కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇద్దరు తమదైనశైలీలో నటించి నవ్వులు పూయించారు.డేవిడ్ వార్నర్ స్క్రీన్‌పై చాలా తక్కువ సమయం కనిపించినప్పటికీ, అతని ఎంట్రీతో థియేటర్లలో విజిల్స్ మారుమోగేలా అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించాడు. శుభలేక సుధాకర్, షైన్ చాం టాకోతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జీవి ప్రకాశ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. పాటలు వినడానికి బాగున్నా..తెరపై చూస్తే అంతగా ఆకట్టుకోలేవు. కథలో వాటిని ఇరికించినట్లుగా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకు భారీగానే ఖర్చు చేసినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమాను చాలా రిచ్‌గా తీర్చిదిద్దారు. -
Robinhood: ‘రాబిన్‌హుడ్’ మూవీ ట్విటర్ రివ్యూ
హీరో నితిన్ గత కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్నాడు. ఆయన ఖాతాలో ఇటీవలి కాలంలో ఒక్క హిట్ సినిమా కూడా లేదు. ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘మాస్ట్రో’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవడంతో నితిన్ మార్కెట్ బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’తో గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హీస్ట్ కామెడీ చిత్రంలో నితిన్‌కి జోడీగా శ్రీలీల నటించింది. ఆస్ట్రేలియా క్రికెటర్ డెవిడ్ వార్నర్ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రచారచిత్రాలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘రాబిన్‌హుడ్’కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.రాబిన్‌హుడ్ చిత్రానికి ఎక్స్‌లో మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొందరు అంటుంటే...యావరేజ్ అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. Done with my show,good 2nd half, where each & every episode worked out except cringe Leela portions. David Bhai cameo at the end is hilarious!!adidha suprisu song is good..!! Overall a decent commercial entertainer 2.5/5 #Robinhood— Peter Reviews (@urstrulyPeter) March 27, 2025 ఇప్పుడే సినిమా చూశాను. సెకండాఫ్ బాగుంది. శ్రీలీల పోర్షన్ మినహా ప్రతి ఎపిసోడ్ బాగా వర్కౌట్ అయింది. డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ చివరిలో వచ్చి నవ్వులు పూయిస్తోంది. అదిదా సర్ప్రైజ్ సాంగ్ బాగుంది. ఓవరాల్‌గా ఇది డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని ఓ నెటిజన్ 2.5 రేటింగ్ ఇచ్చాడు.#RobinhoodGood 1st half and a bad second half.Not better than bheeshma(as compared by hero). @actor_nithiin @sreeleela14 @VenkyKudumula pic.twitter.com/hZHFLIoHA5— Nenu (@nenuneneh) March 28, 2025 ‘ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ బాగోలేదు. భీష్మతో పోలిస్తే మాత్రం ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.#Robinhood Review : SUMMER FULL FAMILY ENTERTAINER - 3.5/5 🔥🔥🔥ACTOR @actor_nithiin and #RajendraPrasad GAARU DUO WAS THE BIGGEST ASSET TO THE FILM 🎥 DIRECTOR @VenkyKudumula DEALED THE SIMPLE STORY WITH HIS TRADEMARK COMEDY AND SCREENPLAY 💥💥🔥🔥👍👍NEW STAR ⭐️… pic.twitter.com/b8EFYU2PD4— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) March 28, 2025‘సమ్మర్ ఫుల్‌ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. రాజేంద్రప్రసాద్, నితిన్ పాత్రలు పండించిన కామెడీ సినిమాకు ప్రధాన బలం. ఓ సింపుల్‌స్టోరీని వెంకీ కుడుముల తనదైన కామెడీ సీన్లతో, స్క్రీన్ ప్లేతో చక్కగా తీర్చిదిద్దాడు’ అంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్‌చ్చాడు.#Robinhood Bagundhi 2nd half >>>> 1st half David Bhai entry ki theaters resound aeeeComedy bagundhi Songs placement worst except adhi dha suprise song.Overall ga good film😂— NAvANeETh (@Navaneethkittu) March 28, 2025రాబిన్‌హుడ్ బాగుంది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ బెటర్. డేవిడ్ భాయ్ ఎంట్రీకి థియేటర్స్‌లో రీసౌండే. కామెడీ బాగుంది. అదిదా సర్ప్రైజ్ మినహా మిగతా పాటల ప్లేస్‌మెంట్స్ బాగోలేవు. ఓవరాల్‌గా గుడ్ మూవీ అని ఓ వ్యక్తి ట్విటర్లో రాసుకొచ్చాడు. Done with 1st Half of #Robinhood !Here is the #Review so far:Strictly Average!! As a commercial cinema, plot and treatment is quite routine, but the comedy by #VennelaKishore & #RajendraPrasad garu worked out to an extent! Generated good laughs in the theatre! Needs a very… https://t.co/3yhnScEFtP— FILMOVIEW (@FILMOVIEW_) March 27, 2025POSITIVE REPORTS 💥 from the Premiere Shows #Robinhood. Congratulations💐 #teamRobinhood @actor_nithiin @VenkyKudumula @sreeleela14 @gvprakash @MythriOfficial pic.twitter.com/Du6ClOcmao— Mallesh Chetpally (@Mallesh_Nithiin) March 28, 2025#Robinhood Review : SUMMER FULL FAMILY ENTERTAINER - 3.5/5 🔥🔥🔥ACTOR @actor_nithiin and #RajendraPrasad GAARU DUO WAS THE BIGGEST ASSET TO THE FILM 🎥 DIRECTOR @VenkyKudumula DEALED THE SIMPLE STORY WITH HIS TRADEMARK COMEDY AND SCREENPLAY 💥💥🔥🔥👍👍NEW STAR ⭐️… pic.twitter.com/b8EFYU2PD4— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) March 28, 2025Show completed:- #Robinhood Fun entertainer 👍Above average movie 2.75/5 First half is good Okayish Second half Not a story based film ... go with the flow Go with your family , have fun#Robinhood series will continue... 2nd part villain @davidwarner31 pic.twitter.com/yrd3PGpsl6— venkatesh kilaru (@kilaru_venki) March 27, 2025#Robinhood2.75/5A good entertainer with loads of fun😀Nithiin & Venky Kudumula's combo generates a laugh riot in 1st half and the second half is a mix of emotion & entertainment.Vennela Kishore and RP comedy worked well. The pre-climax and climax are the heart of the film.— BioScope Telugu (@BioScope_Telugu) March 28, 2025 -
పోటీ తప్పదనే మైండ్‌సెట్‌తో ఉండాలి: ‘మైత్రీ’ నిర్మాత
‘‘రాబిన్ హుడ్’లో మంచి వినోదం ఉంది. ఓ హార్ట్ టచింగ్ పాయింట్‌ను ఈ సినిమాలో టచ్ చేశాం. ఆడియన్స్ కొత్త అనుభూతి పొందుతారు’’ అని నితిన్ అన్నారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘రాబిన్ హుడ్’. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశంలో హీరో నితిన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నాది చాలా ఇంటలెక్చువల్ రోల్. క్లైమాక్స్‌లో నా క్యారెక్టర్ రౌండప్, వచ్చే ట్విస్ట్‌లు, షాక్‌లు ఆడియన్స్‌కు ఫ్రెష్‌గా అనిపిస్తాయి’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాలో ఫన్ ఉన్నప్పటికీ కథలో ఆత్మ మాత్రం ఎమోషనే. ఆ ఎమోషన్ సీక్వెన్స్ బాగా వర్కౌట్ అయింది’’ అని తెలిపారు వెంకీ కుడుముల. ‘‘ఈ రోజుల్లో ఉన్న పోటీ ప్రపంచంలో సోలో రిలీజ్ డేట్ ఆశించకూడదు. మేం వస్తున్నామన్నప్పుడు మా ఒక్క సినిమానే ఉంది. కానీ ఇప్పుడు రెండు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. మనం మూవీ చేస్తున్నప్పుడే పోటీ తప్పదనే మైండ్ సెట్‌తో దిగాలని భావిస్తా. ఇక వచ్చే ఏడాది మా బ్యానర్‌కు చాలా ముఖ్యం. ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్, రామ్‌చరణ్– బుచ్చిబాబు, ప్రభాస్–హను రాఘవపూడి, రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’, రాహుల్ సంకృత్యాన్–విజయ్ దేవరకొండ మూవీ, పవన్ కల్యాణ్ సినిమా... ఈ అరడజను సినిమాలపై మా ప్రస్తుత ఫోకస్ ఉంది. ఇక తమిళ హీరో అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీకి మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నాం. మా బేనర్లో ఇంకొన్ని సినిమాలు కూడా ఉన్నాయి’’ అని నిర్మాత రవిశంకర్ అన్నారు. -
పుష్ప2 'కిస్సిక్' సాంగ్ మేకింగ్ వీడియో చూశారా..?
పుష్ప సినిమా 'ఊ అంటావా మామ' సాంగ్ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.. పుష్ప2లో కిస్.. కిస్.. కిస్సిక్ సాంగ్ వైరల్ అయింది. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం నటి శ్రీలీల (Sreeleela) తనదైన గ్లామర్, స్టెప్పులతో దుమ్మురేపింది. అయితే, ఇప్పుడు ఆ సాంగ్ మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అత్యంత వేగంగా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న దక్షిణాది పాటగా కిస్సిక్ రికార్డు సృష్టించింది. ఈ సాంగ్‌కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిగా.. చంద్రబోస్ సాహిత్యం అందించారు. సింగర్ సుభ్లాషిణి ఆలపించారు. ఇప్పటికే ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో ఉంది. తాజాగా మేకింగ్ వీడియో రిలీజ్ చేయడంతో నెట్టింట ట్రెండ్ అవుతుంది. కిస్సిక్ అంటూ మీరూ చూసేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. -
నితిన్ ‘రాబిన్ హుడ్’ HD మూవీ స్టిల్స్
-
ఎక్కడికెళ్లినా గర్వంగా ఇక్కడికే వస్తా!: శ్రీలీల
‘‘ఒక సినిమాతో ప్రేక్షకులకు వినోదం పంచితే, మరో సినిమాతో సందేశం ఇవ్వాలి. ఇలా నా సినిమాలను బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నాను. తెలుగు అమ్మాయిగా, హీరోయిన్గా నాపై ఆ బాధ్యత ఉంటుంది’’ అని హీరోయిన్ శ్రీలీల అన్నారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ అతిథి పాత్రలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక శ్రీలీల పంచుకున్న విశేషాలు. ⇒ ‘రాబిన్‌హుడ్’ సినిమాలో ఫారిన్ నుంచి ఇండియాకు వచ్చిన నీరా వాసుదేవ్ అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. తన ప్రపంచంలో తను ఉంటుంది. ఈ ప్రపంచం అంతా తన చుట్టూనే ఉంటుందని అనుకుంటుంది. నా కెరీర్లో నీరా వాసుదేవ్ లాంటి ఫన్ రోల్‌ను ఇప్పటివరకూ చేయలేదు. నితిన్‌గారితో వర్క్ చేయడం ఇది రెండోసారి (గతంలో ‘ఎక్స్ట్రా’ మూవీలో కలిసి నటించారు). చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఓ ఫ్యామిలీ మెంబర్లా ఉంటారు. ఈ సినిమాతో మాకు హిట్ పెయిర్‌గా పేరు వస్తుంది. ‘రాబిన్‌హుడ్’ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. ⇒ నీరా వాసుదేవ్ పాత్రకు రష్మికా మందన్నాను అనుకున్నారు. రష్మికకు కూడా నచ్చిన పాత్ర ఇది. కానీ కాల్షీట్స్ విషయంలో సమస్యలు రావడం వల్ల రష్మిక తప్పుకున్నారు. ఆ సమయంలో వెంకీగారు నాకు ఫోన్ చేసి, ఈ రోల్ గురించి చెప్పారు. నాకు నచ్చి ఓకే అన్నాను. ఇటీవల ‘పుష్ప: ది రూల్’ షూటింగ్లో మేం కలుసుకున్నప్పుడు రష్మిక నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. నేను మైత్రీ ఫ్యామిలీలో ఉన్నానని గర్వంగా చెప్పగలను. మన ఫ్యామిలీతో సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో, వారితో మూవీ చేస్తే అలా ఉంటుంది. ⇒ ‘పుష్ప ది రూల్’ సినిమాలో ‘కిస్సిక్’ స్పెషల్ సాంగ్ చేశాను. ఈ సాంగ్ సక్సెస్ తర్వాత ఆ తరహా స్పెషల్ సాంగ్స్ చేసేందుకు నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ ‘పుష్ప: ది రూల్’ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుపొందిన భారతీయ సినిమా. సో... ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశాను. అయితే ఇకపై ఇలాంటి పెద్ద సినిమాల్లో సాంగ్స్‌కి బదులుగా మంచి రోల్స్ చేయాలనుకుంటున్నాను. ⇒ 2023లో నావి ఐదారు సినిమాలు రిలీజ్ అయ్యాయి. దాంతో త్రీ షిఫ్ట్స్ కూడా వర్క్ చేశాను. అయితే గత ఏడాది హీరోయిన్గా ఒకే ఒక్క సినిమా (‘గుంటూరు కారం) లో కనిపించాను. నా ఫైనల్ ఇయర్ మెడికల్ ఎగ్జామ్స్ వల్ల ఎక్కువ సినిమాలు చేయలేదు. ఈ గ్యాప్‌లో ఎన్నో మంచి రోల్స్, మంచి చిత్రాలు వదులుకున్నాను.⇒ ప్రస్తుతం రవితేజగారితో ‘మాస్ జాతర’, శివ కార్తికేయన్గారితో ‘పరాశక్తి’, కన్నడ–తెలుగు భాషల్లో ‘జూనియర్’ సినిమా చేస్తున్నాను. ‘రాబిన్ హుడ్’లో కేతికా శర్మ చేసిన స్పెషల్ సాంగ్ ‘అదిదా సర్ప్రైజ్’లోని కొన్ని డ్యాన్స్ మూమెంట్స్‌కి భిన్నాబిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మీరు అద్భుతమైన డ్యాన్సర్. ఆ తరహా డ్యాన్స్ మూవ్స్, కొరియోగ్రఫీ గురించి ఓ హీరోయిన్గా ఏం చెప్తారు? ‘‘ఒక అమ్మాయి దృష్టి కోణంలో చెప్పాలంటే... మనం కంఫర్టబుల్‌గా ఉన్నామా? లేదా? అనేది ముఖ్యం. స్టెప్స్ అనేవి చేసేవారి కంఫర్ట్ లెవల్స్‌పై ఆధారపడి ఉంటాయి. కంఫర్ట్ జోన్ అనేది పర్సన్ టు పర్సన్ మారుతుంది. అయితే... అమ్మాయి ఇబ్బంది పడలేదు అన్నప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. హీరోయిన్గా నేను ఎన్నో సాంగ్స్ చేశాను. శేఖర్ మాస్టర్‌తో కూడా చేశాను. అందరం హ్యాపీ’’ అంటున్న శ్రీలీలతో బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాలోని డ్యాన్స్ మూవ్స్, అలాగే వేరే సినిమాల్లోని ఈ తరహా డ్యాన్స్ మూవ్స్‌పై మహిళా కమిషన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. మీరేం అంటారు? అన్న ప్రశ్నకు శ్రీలీల బదులిస్తూ... ‘‘మహిళా కమిషన్‌కి మంచి స్థాయి ఉంది. ఏది సరైనదో వారికి తెలుసు. పాత సినిమాల పట్ల కూడా వారికి నాలెడ్జ్ ఉంది. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనుకుంటున్నాను’’ అన్నారు.హిందీ చిత్ర పరిశ్రమలో బిజీ అవుతున్నారు... అక్కడికే వెళ్లిపోతారని కొందరు అంటున్నారు.. అన్ని భాషల్లో సినిమాలు చేయాలనుకుంటున్నాను. కానీ శ్రీలీల అంటే ఎవరు? తెలుగింటి అమ్మాయి. తెలుగు∙చిత్ర పరిశ్రమ నాకు ఇల్లులాంటిది. ఒకవేళ బయటకు వెళ్లినా గర్వంగా ఇక్కడికే (తెలుగు) తిరిగి వస్తాను. మన పిల్లలు చదువుకోవడానికి మరొక చోటుకు వెళతారు. కానీ మళ్లీ మన ఇంటికే వస్తారు కదా! సరిహద్దులు మారినంత మాత్రాన గాలి మారదు. నేను అన్ని భాషలనూ బ్యాలెన్స్ చేస్తూ, సినిమాలు చేయాలనుకుంటున్నాను. -
'నాకు శ్రీలీల తప్పితే ఎవరూ నచ్చరు'.. వార్నర్ మామ తెలుగు ప్రాక్టీస్ చూశారా?
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యారు. రాబిన్‌హుడ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ అభిమానులను మెప్పించనున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా డేవిడ్ వార్నర్ సందడి చేశారు. అంతేకాదు తెలుగులోనూ ఏకంగా డైలాగ్స్ కూడా చెప్పి అలరించారు.అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డేవిడ్ వార్నర్‌కు తెలుగు నేర్పించే పనిలో ఫుల్ బిజీ అయిపోయారు నితిన్, శ్రీలీల. వార్నర్ మామకు తెలుగు నేర్పిద్దామని నితిన్ చెప్పారు. నాకు తెలుగు సినిమాలో నితిన్ అంటే పిచ్చి అని వార్నర్‌తో చెప్పించగా.. ఆ తర్వాత నాకు శ్రీలీల తప్పితే ఎవరూ నచ్చరు.. అంటూ వార్నర్‌తో శ్రీలీల తెలుగు ప్రాక్టీస్ చేయించారు. అయితే ఇదంతా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముందు సరదాగా చేసినట్లు తెలుస్తోంది. ప్రీరిలీజ్ వేడుకకు ముందు డేవిడ్ వార్నర్‌కు తెలుగు నేర్పిస్తున్న ఈ వీడియోను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. Secret behind @davidwarner31's Telugu or actually not 😅Book your tickets for #Robinhood now!🎟️ https://t.co/ogblfmwZTd#RobinhoodTrailer TRENDING on YouTube.▶️ https://t.co/h2nhPhMrqEGRAND RELEASE WORLDWIDE ON MARCH 28th.@actor_nithiin @sreeleela14 @VenkyKudumula… pic.twitter.com/7rdEnEeoPT— Mythri Movie Makers (@MythriOfficial) March 25, 2025 -
'రాబిన్‌హుడ్' టికెట్ ధరలు పెంపునకు ప్రభుత్వం అనుమతి
టాలీవుడ్ హీరో నితిన్(Nithiin), శ్రీలీల( Sreeleela) జోడీగా నటించిన చిత్రం 'రాబిన్‌హుడ్'(Robinhood).. ఉగాది కానుకగా మార్చి 28న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ టికెట్ల ధరలను పంచుతూ ఏపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించారు. డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. గతంలో భీష్మ సినిమాతో నితిన్ - వెంకీ కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రాబిన్‌హుడ్ కూడా భారీగా క్లిక్ అవుతుందని ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి.రాబిన్‌హుడ్ చిత్ర మేకర్స్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చి 28 నుంచి ఏడు రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. సింగిల్ స్క్రీన్‌లో ఒక్కో టికెట్‌పై రూ.50 , మల్టీప్లెక్స్ లలో టికెట్‌కు రూ.75 ధరను అదనంగా పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. జీఎస్టీతో కలిపే ఈ ధరలు ఉంటాయని అందులో పేర్కొంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదు.రేట్లు పెంపు సరే.. తేడా వస్తే..భారీ బడ్జెట్ చిత్రాలకు మాత్రమే గతంలో టికెట్ల రేట్లు పెంపునకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చేవి. అయితే, ఇప్పుడు మీడియమ్ బడ్జెట్ చిత్రాలకు కూడా ఇలా రేట్లు పెంచడం ఏంటి అంటూ విమర్శలు వస్తున్నాయి. సంక్రాంతి సమయంలో గేమ్ ఛేంజర్, డాకూమహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలకు టికెట్ ధరలు పెంచారు. అయితే, ప్రేక్షకులు థియేటర్స్‌కు వెళ్లడం బాగా తగ్గిపోయింది. దీంతో వెంటనే ఆ ధరలను మళ్లీ తగ్గించేశారు. ఇప్పుడు రాబిన్‌హుడ్ చిత్రానికి టికెట్ ధరలను పెంచాలనే నిర్ణయం సరైంది కాదని విమర్శలు ఉన్నాయి. సినిమా బాగుందని టాక్ వస్తే సరే.., ఒకవేళ మిక్స్డ్ టాక్ వస్తే మాత్రం రిస్క్ తప్పదని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ధరల పెంపు వల్ల థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గే ఛాన్స్ ఉంది. రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఉండకపోవచ్చని చెప్పవచ్చు. -
బౌలర్‌గా శ్రీలీల .. బ్యాట్స్‌మెన్‌గా ఎవరంటే?.. రాబిన్‌హుడ్ టీమ్ ప్రకటించిన నితిన్!
టాలీవుడ్ హీరో నితిన్ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వెంకీ కుడుముల డైరెక్షన్లో వస్తోన్న రాబిన్‌హుడ్ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. గతంలో వీరిద్దరి కాంబోలో భీష్మ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా డేవిడ్ వార్నర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నితిన్‌కు యాంకర్ ఓ ఆసక్తికర ప్రశ్న వేసింది. రాబిన్‌హుడ్ టీమ్ నుంచి క్రికెట్ జట్టును తయారు చేయాలంటే ఎవరూ దేనికి సూట్ అవుతారో చెప్పాలంటూ హీరోను అడిగింది. దీనికి నితిన్ స్పందిస్తూ.. మా క్రికెట్ టీమ్‌లో శ్రీలీల బౌలర్.. ఎందుకంటే ఆమె వయ్యారంగా బౌలింగ్ చేస్తే ఎవరైనా అవుట్ కావాల్సిందే.. వికెట్ కీపర్‌గా మా మైత్రి నిర్మాత రవిశంకర్.. అంపైర్‌గా వెంకీ కుడుముల.. బ్యాట్స్‌మెన్‌గా నేనే.. మా టీమ్‌లో క్యాచ్‌లో పట్టేది నవీన్.. మా టీమ్ ఓనర్‌గా డేవిడ్ వార్నర్ అంటూ ఫన్నీగా తమ రాబిన్‌హుడ్ టీమ్‌ను ప్రకటించారు. -
‘రాబిన్ హుడ్’ ప్రీ రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)
-
‘రాబిన్ హుడ్’ ట్రైలర్ రిలీజ్..డేవిడ్ వార్నర్ ఎంట్రీ అదుర్స్ (ఫొటోలు)
-
రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. అది దా డేవిడ్ వార్నర్ సర్ప్రైజ్!
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ 'రాబిన్‌హుడ్'.'భీష్మ' హిట్ ఫిల్మ్ తర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.తాజాగా రాబిన్‌హుడ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథి డేవిడ్ వార్నర్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వార్నర్ తన డ్యాన్స్‌తో ఆడియన్స్‌ను అలరించారు. పుష్ప చిత్రంలో చూపే బంగారమాయమే శ్రీవల్లి.. అనే పాటకు అల్లు అర్జున్ స్టైల్లో హుక్ స్టెప్‌కు కాలు కదిపారు. అంతేకాకుండా రాబిన్ హుడ్ మూవీలో అది దా సర్ప్రైజ్ అంటూ సాగే కేతిక శర్మ పాటకు సైతం డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. The fan-favorite @davidwarner31 does the blockbuster #Pushpa hookstep at the #Robinhood trailer launch & Grand Pre-Release Event ❤️🔥Watch Live now!▶️ https://t.co/lbpuVoSvra#Robinhood Trailer Out Now ▶️ https://t.co/h2nhPhMrqE@actor_nithiin @sreeleela14 @VenkyKudumula… pic.twitter.com/fUUihxlejF— Mythri Movie Makers (@MythriOfficial) March 23, 2025 The stars of #Robinhood - @actor_nithiin, @sreeleela14, @davidwarner31 & @TheKetikaSharma - dance to the trending chartbuster #AdhiDhaSurprisu at the #Robinhood trailer launch & Grand Pre-Release Event 💥💥❤️🔥Watch Live now!▶️ https://t.co/lbpuVoSvra#Robinhood Trailer Out Now… pic.twitter.com/mmISnN1ula— Mythri Movie Makers (@MythriOfficial) March 23, 2025 -
రాబిన్‌హుడ్ వచ్చేశాడు.. ట్రైలర్ రిలీజ్ చేసిన డేవిడ్ వార్నర్
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ రాబిన్‌హుడ్.'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్- దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా రాబిన్‌హుడ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డేవిడ్ వార్నర్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే నితిన్ పంచ్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాయి. వెన్నెల కిశోర్, నితిన్ మధ్య వచ్చే సన్నివేశాలతో థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్ చివర్లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎంట్రీ ఓ రేంజ్లో అదిరిపోయింది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమాను మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం జీవీ ప్రకాశ్‌కుమార్ అందించారు. -
రష్మికను చూసి ఇబ్బంది పడ్డ శ్రీలీల.. ఎందుకో తెలుసా?
శ్రీలీల(Sreeleela).. గత కొంతకాలంగా టాలీవుడ్లో ఎక్కువ వినిపిస్తున్న పేరు ఇది. ఒకవైపు స్టార్ హీరోలతో మరోవైపు యంగ్ స్టార్స్‌లో సినిమాలు చేస్తూ తెలుగు తెరపై దూసుకెళ్తోంది. అయితే ఈ టాలెంటెడ్ బ్యూటీ ఇటీవల తన దూకుడుని తగ్గించింది. ఈ మధ్యకాలంలో ఆమె నటించిన చిత్రాలేవి రిలీజ్ కాలేదు. కానీ పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకవైపు హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తూనే.. సడెన్‌గా పుష్ప 2లో స్పెషల్ సాంగ్‌కి అల్లు అర్జున్‌తో కలిసి స్టెప్పులేసింది. ‘కిస్సిక్’ అంటూ సాగే ఈ పాట ఎంతపెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. అయితే ఈ పాట ఒప్పుకునేందుకు శ్రీలీల కాస్త వెనకడుకు వేసిందట. కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని ఆలోచించిందట. కానీ డైరెక్టర్ సుకుమార్ నచ్చజెప్పి పాటకు ఒప్పించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ పాట శ్రీలీల కెరీర్‌కి ప్లస్సే అయింది. అయితే ఈ పాట షూటింగ్ కోసం వెళ్లినప్పుడు సెట్లో రష్మిక(rashmika mandanna)ను చూసి శ్రీలీల భయపడిందట. ఆమెతో మాట్లాడేందుకు కాస్త సిగ్గు పడిందట. దానికి గల కారణం ఏంటో కూడా శ్రీలీల వివరించింది.శ్రీలీల హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రంలో మొదట రష్మికను హీరోయిన్గా తీసుకున్నారు. కొంతవరకు షూటింగ్ ప్రారంభించిన తర్వాత ఆమె ప్లేస్‌లో శ్రీలీలను తీసుకున్నారు. పుష్ప–2 ఐటమ్ సాంగ్ షూటింగ్లో మొదటిసారి రష్మికని కలిసినప్పుడు– రాబిన్‌హుడ్ రీ ప్లేస్మెంట్ గుర్తు వచ్చి, శ్రీ లీల ఇబ్బంది పడింది. అయితే డేట్స్ ప్రాబ్లమ్ వల్ల తనే రాబిన్‌హుడ్ సినిమా వదిలేశానని, రష్మిక చెప్పడంతో ఊపిరి పీల్చుకుందట శ్రీ లీల. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమే చెప్పింది. ఇక ఈ స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలకు మైత్రీ మూవీ మేకర్స్ భారీగానే పారితోషికం అందించిందట. ఈ ఒక్క పాటకే దాదాపు రూ. 2 కోట్లు అందించినట్లు సమాచారం. -
శ్రీలీల గురించి ఈ విషయాలు తెలుసా?
👉: చాలా ఏళ్ళ క్రితం ఏ హీరోయిన్ని అడిగినా, ‘డాక్టర్ కాబోయి యాక్టర్‌ని అయ్యాను’ అని చెప్పేవారు. ఇప్పటి పాపులర్ హీరోయిన్లలో చాలామంది డాక్టర్లే! సాయి పల్లవి , మీనాక్షి చౌదరి , శ్రీ లీల.. తన తల్లి స్వర్ణలత గైనకాలజిస్ట్ కావడంతో డాక్టర్ కావాలనుకున్నానని శ్రీ లీల చెప్పింది. విజయవాడ మూలాలు ఉన్నా, పుట్టింది అమెరికాలో, పెరిగింది బెంగళూరులో.👉: కేజీఎఫ్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యశ్– శ్రీలీలకి ఫ్యామిలీ ఫ్రెండ్. యశ్ భార్య రాధికా పండిట్‌కి డెలివరీ చేసిన డాక్టర్ శ్రీ లీల వాళ్ళ తల్లే! అలా రెండు కుటుంబాలకి పరిచయం!👉: యశ్ని సూపర్ స్టార్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బావ మురళితో కన్నడంలో ఓ సినిమాలో నటించింది. యశ్‌తో నటించే చాన్స్ కోసం శ్రీ లీల ఎదురు చూస్తోంది.👉: దగ్గుబాటి ఫ్యామిలీకి శ్రీ లీల దూరపు బంధువు. రానా దగ్గుబాటి ఆ మధ్య తన రియాలిటీ షోలో– తను ఏ బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కి వెళ్ళినా, శ్రీ లీల కనబడుతుందని కామెంట్ చేశారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా శ్రీ లీలకి బంధుత్వం ఉంది.👉: పుష్ప –2లో కిస్సిక్ సాంగ్‌తో ఆడియన్స్‌ని వెర్రెక్కించిన శ్రీ లీలకి ఐటమ్ సాంగ్స్ కొత్త కాదు. పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ సినిమాలో మొదటిసారి ఐటమ్ సాంగ్ చేసింది.👉: డాన్స్ అంటే విపరీతమైన పిచ్చి. మంచి బీట్ ఉన్న సాంగ్ వినబడితే చాలు– బాడీ ఆటోమేటిక్‌గా డాన్స్ చేస్తుంది. ఆ క్వాలిటీయే– ఆది కేశవ సినిమాలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌కి పెట్టారు.👉: పుష్ప –2లో ఐటమ్ సాంగ్ చేసి, సమంతని రీ ప్లేస్ చేసింది. కిస్సిక్ సాంగ్‌కు రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని టాక్.👉: తను ఇంత వరకూ చేసిన క్యారెక్టర్స్‌లో భగవంత్ కేసరిలోని పాత్ర, సాంగ్స్‌లో కిస్సిక్ సాంగ్ బాగా ఇష్టమని శ్రీ లీల చెప్పింది.👉: నితిన్‌తో రాబిన్‌హుడ్ సినిమాలో నటిస్తోంది. నితిన్‌తో రెండో సినిమా. నిజానికి రాబిన్‌హుడ్‌లో రష్మిక మందన్నా హీరోయిన్గా చేయాలి. మొదట షూటింగ్ మొదలైనప్పుడు– రష్మిక హీరోయిన్. తర్వాత శ్రీ లీల రష్మికని రీ ప్లేస్ చేసింది.👉: పుష్ప–2 ఐటమ్ సాంగ్ షూటింగ్లో మొదటిసారి రష్మికని కలిసినప్పుడు– రాబిన్‌హుడ్ రీ ప్లేస్మెంట్ గుర్తు వచ్చి, శ్రీ లీల ఇబ్బంది పడింది. అయితే డేట్స్ ప్రాబ్లమ్ వల్ల తనే రాబిన్‌హుడ్ సినిమా వదిలేశానని, రష్మిక చెప్పడంతో ఊపిరి పీల్చుకుందట శ్రీ లీల.👉: బై టూ లవ్ అనే కన్నడ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు– ఓ అనాథ శరణాలయానికి వెళ్లింది. అక్కడి అనాథలను చూసి చలించి, బుద్ధిమాంద్యం ఉన్న ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. తన జీవితంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అదే అని చెప్పింది శ్రీ లీల.👉: తను చేసిన గుంటూరుకారం, పుష్ప–2, ధమాకా సాంగ్లా కోట్లాది వ్యూస్‌తో టాప్ ప్లేస్‌లో ఉండటం బాగా కిక్కు ఇచ్చిన మేటర్ అంటుంది శ్రీ లీల. -
బాలీవుడ్ హీరోతో శ్రీలీల డేటింగ్
-
లెనిన్ లవ్‌స్టోరీ
‘ఏజెంట్’ మూవీ తర్వాత అఖిల్ కొత్త చిత్రానికి సంబంధించిన సమాచారం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ కిరణ్ మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ హీరోగా ‘లెనిన్’ అనే చిత్రం రూపొందుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారట. ఇది చిత్తూరు నేపథ్యంలో సాగే గ్రామీణ యాక్షన్ లవ్‌స్టోరీ ఫిల్మ్ అని, ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని సమాచారం. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 14న హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుందని, దాదాపు ఇరవై రోజులు పాటు షూటింగ్ కొనసాగుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. అన్నపూర్ణ స్డూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
కోడలిగా శ్రీలీల..? డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన హీరో తల్లి (ఫోటోలు)
-
యంగ్ హీరోతో శ్రీలీల.. నిజమేనా?
ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. 2023-24లో వరస తెలుగు సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. కాస్త గ్యాప్ తీసుకుంది. త్వరలో 'రాబిన్ హుడ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఇది కాకుండా మరో హిందీ మూవీలోనూ నటిస్తోంది. ఇదంతా పక్కనబెడితే శ్రీలీలపై ఇప్పుడు డేటింగ్ రూమర్స్ వస్తున్నాయి.తెలుగమ్మాయి అయిన శ్రీలీల.. ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూవీస్ చేస్తోంది. అయితే బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో ఈమె డేటింగ్ లో ఉందని తెగ మాట్లాడేసుకుంటున్నారు. దీనికి కారణాలు కూడా చెబుతున్నారు.(ఇదీ చదవండి: సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: టాలీవుడ్ నిర్మాత)ప్రస్తుతం శ్రీలీల-కార్తిక్ ఆర్యన్.. అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సరే ఈ విషయం పక్కనబెడితే కొన్నిరోజుల క్రితం కార్తిక్ ఇంట్లో ఫ్యామిలీ అంతా కలిసి పార్టీ చేసుకుంటే శ్రీలీల అక్కడ కనిపించింది. తాజాగా ఐఫా అవార్డుల వేడుకల్లో కార్తిక్ తల్లి కూడా వచ్చింది. ఎలాంటి కోడలు మీకు కావాలి అనే ప్రశ్నకు.. డాక్టర్ కోడలు అని చెప్పారు. ఈ క్రమంలోనే కార్తిక్ ఆర్యన్ తల్లి చెప్పిన కామెంట్, శ్రీలీల డాక్టర్ కోర్స్ పూర్తి చేసి ఉండటాన్ని లింక్ చేసి శ్రీలీల-కార్తిక్ ఆర్యన్ డేటింగ్ లో ఉన్నారని అనేస్తున్నారు. ఇది నిజమా అంటే చెప్పలేం. ఎందుకంటే బాలీవుడ్ ఇలాంటి గాసిప్స్ కావాలనే పుట్టిస్తారేమో గానీ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంటుంది. శ్రీలీలది కూడా బహుశా ఇలాంటి రూమరే అయ్యిండొచ్చేమో?(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
‘రాబిన్‌హుడ్’ మూవీ ప్రెస్మీట్లో మెరిసిన శ్రీలీల (ఫొటోలు)
-
నితిన్ ‘రాబిన్‌హుడ్’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
నితిన్ రాబిన్‌హుడ్.. అది దా సర్ప్రైజ్ అంటోన్న కేతిక శర్మ
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ రాబిన్‌హుడ్.'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్- దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన మంచి రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి మూడో లిరికల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. 'అది దా సర్ప్రైజ్' అంటూ సాగే ఐటమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ స్పెషల్ సాంగ్‌లో హీరోయిన్ కేతిక శర్మ తన డ్యాన్స్‌తో అలరించింది. ముఖ్యంగా కేతిక శర్మ అందాలతో అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఈ పాట రాబిన్ హుడ్‌లో మూవీలో ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. అంతుకుముందే కేతిక శర్మ తెలుగులో రంగరంగ వైభవంగా, లక్ష్య లాంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం జీవీ ప్రకాశ్‌కుమార్ అందించారు. This summer heat is here with the sizzling moves and the blazing beats 🔥🔥#Robinhood third single #AdhiDhaSurprisu ft. @TheKetikaSharma out now ❤️🔥▶️ https://t.co/GvczL8HezzA @gvprakash musical.Lyrics by Academy Award Winner @boselyricistSung by @neetimohan18 &… pic.twitter.com/fRkw35ndnO— Mythri Movie Makers (@MythriOfficial) March 10, 2025 -
'విశ్వంభర'లో శ్రీలీల.. గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. లెక్క ప్రకారం సంక్రాంతికే రిలీజ్ అవ్వాలి కానీ ఇప్పటికీ ఇంకా షూటింగ్ నడుస్తోంది. తాజాగా శ్రీలీల కూడా చిత్రీకరణలో పాల్గొంది. ఈ క్రమంలోనే చిరు.. యువ హీరోయిన్ కి క్యూట్ బహుమతి ఇచ్చారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)రీసెంట్ టైంలో సరైన హిట్స్ పడకపోవడంతో శ్రీలీల.. తెలుగు సినిమాలు తగ్గించేసింది. హిందీలో ఓ మూవీ చేస్తోంది. ఇప్పుడు ఈమెని చిరు 'విశ్వంభర' కోసం తీసుకున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఫొటోలతో ఈ క్లారిటీ వచ్చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీలీలకు దుర్గ దేవి ప్రతిమ గల శంఖాన్ని చిరంజీవి బహుమతిగా ఇచ్చారు. ఈ ఫొటోలు చూస్తే చిరు-శ్రీలీల ఏదో పాట షూటింగ్ కోసం సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. మరి శ్రీలీల.. సినిమాలో ప్రత్యేక గీతం ఏమైనా చేస్తోందా? పాత్రలో నటిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: గోదావరిలో అస్థికలు కలిపిన యాంకర్ రష్మీ) -
'శ్రీలీల రాకతో ఈ ఐటం బ్యూటీ కెరీర్ ఖతం'.. ఇవే నచ్చదంటున్న నోరా
నోరా ఫతేహి (Nora Fatehi).. ఐటం సాంగ్ డ్యాన్సరే కాదు, నటి కూడా! కానీ ఆమెకు ఎక్కువగా డ్యాన్సర్‌గానే గుర్తింపు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అభిషేక్ బచ్చన్ సరసన బి హ్యాపీ అనే సినిమాలో నటిస్తోంది. అయితే తనను ప్రతిసారి ఎవరో ఒకరితో పోల్చడం నచ్చదంటోందీ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నోరా ఫతేహి మాట్లాడుతూ.. నేను ముక్కుసూటిగా మాట్లాడతాను. దాన్ని అందరూ తలపొగరు అనుకుంటారు. ఐటం సాంగ్స్, యాక్టింగ్..స్పెషల్ సాంగ్స్‌లో కనిపించనంతమాత్రాన హీరోయిన్గా చేయొద్దని ఎక్కడా లేదే! ప్రతి ఒక్కరూ ఐటం సాంగ్స్ (Item Songs) చేయొచ్చు, కావాలనుకుంటే నటించనూవచ్చు. ఈ విషయంలో అందరికీ ఒకేవిధమైన న్యాయం ఉండాలి. స్పెషల్ సాంగ్స్ చూసినప్పుడు నేను ఏమని ఫీలవుతానో తెలుసా? అమ్మాయిలు ధైర్యంగా ముందడుగు వేశారు.. అందంగా కనబడుతూనే ఇలాంటి పాటల్లో కనిపించేందుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదని సంతోషపడతాను. నాతో పోల్చుకుంటున్నారుకానీ నచ్చని విషయం ఏంటంటే.. వారి సాంగ్ ప్రమోషన్‌కు నా పేరును వాడుకోవడం! ఏదైనా పాటను జనాల్లోకి తీసుకెళ్లాలనుకున్నప్పుడు నా పేరును లాగుతున్నారు. నోరాతో పోల్చితే చాలనుకుంటున్నారు. అన్ని పీఆర్ ఏజెన్సీ (PR campaigns)లు ఇదే పని చేస్తున్నాయి. కొత్త పాట రిలీజైనప్పుడల్లా నోరా కెరీర్ ముగిసినట్లే.. ఈ కొత్త బ్యూటీ నోరా కంటే 100 రెట్లు నయం.. ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. దీని వెనక ఎవరున్నారో నాకు తెలుసు. ఎవరినీ కిందకు లాగనుఇందుకోసం ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారో కూడా బాగా తెలుసు. సేమ్, ఇలాగే అవతలివారిని కిందకు లాగుతూ ప్రచారం చేద్దామని కొన్ని పీఆర్ ఏజెన్సీలు నన్ను సంప్రదించాయి. కానీ నేనందుకు ఒప్పుకోలేదు. నన్ను నేను ఎవరితోనూ పోల్చుకోలేను. ఎవరినీ కిందకు లాగడం నాకిష్టం లేదు. నా పాట రిలీజైనప్పుడు నా పనితనం, డ్యాన్స్, ఎఫర్ట్స్.. ఇవి చూసి మాత్రమే జనాలు నన్ను మెచ్చుకోవాలి అని చెప్పుకొచ్చింది.శ్రీలీల వంటి హీరోయిన్ల రాకతో..ఈ మధ్య శార్వరి, శ్రీలీల (Sreeleela), రాషా వంటి పలువురు యంగ్ హీరోయిన్లను నోరాతో పోల్చారు. అంతేకాదు వారి రాకతో నోరా కెరీర్ ఖతమైపోయిందన్న కామెంట్లు కూడా చూశాం అంటున్నారు నెటిజన్లు. నోరా ప్రధాన పాత్రలో నటించిన బి హ్యాపీ సినిమా విషయానికి వస్తే. ఈ మూవీ మార్చి 14న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.చదవండి: రన్యారావు కేసు కీలక మలుపు.. ఆమె శరీరంపై గాయాలు -
చూపులతో గుచ్చి గుచ్చి రీమిక్స్ ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..
-
‘రాబిన్‌హుడ్’లో డేవిడ్ వార్నర్.. రెమ్యునరేషన్ ఎంతంటే?
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner)లో ఓ మంచి నటుడు ఉన్నాడు. యాక్టింగ్ అంటే అతనికి పిచ్చి. లాక్డౌన్ సమయంలో ఎన్నో టిక్‌టాక్ వీడియోలు చేసి అలరించాడు. అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్‌బాబుతో పాటు పలువురు టాలీవుడ్ హీరోల పాటలకు స్టైప్పులేస్తూ దక్షిణాది సీనీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా ఓ తెలుగు సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’( Robinhood Movie). మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించాడట. ఈ విషయాన్ని ఇన్నాళ్లు గోప్యంగా ఉంచిన మేకర్స్.. తాజాగా ఓ ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించారు.డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారనే విషయం తెలియగానే..అటు క్రికెట్ అభిమానులతో పాటు ఇటు సీనీ లవర్స్ కూడా ‘రాబిన్‌హుడ్’లో ఆయన పాత్ర ఎలా ఉంటుంది? అసలు ఆ పాత్రలో నటించడానికి వార్నర్ ఎంత తీసుకున్నాడు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం.. వార్నర్‌కి రూ.50 లక్షలను రెమ్యునరేషన్‌గా అందించారట నిర్మాతలు. అయితే వార్నర్ మాత్రం రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి డిమాండ్ చేయలేదట . సరదా కోసమే ఆ పాత్రను చేస్తానని అంగీకరించాట. కానీ నిర్మాతలే ఆయనకు ఉన్న క్రేజీని దృష్టిలో పెట్టుకొని చిన్న పాత్రలో నటించినా.. భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందించారట. ఇక రాబిన్‌హుడ్ విషయానికొస్తే.. ‘భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ ఇది. హానీ సింగ్ అనే పాత్రలో నితిన్ నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
బాలీవుడ్ హీరో ఫ్యామిలీ ఈవెంట్లో శ్రీలీల.. అప్పుడే డేటింగ్ రూమర్స్!
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం రాబిన్హుడ్తో ప్రేక్షకులను పలకరించనుంది. నితిన్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఉగాది కానుకగా మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీతో పాటు బాలీవుడ్‌లోనూ ఎంట్రీకి సిద్ధమైంది శ్రీలీల. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తోన్న చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఇటీవలే విడుదల చేశారు.తాజాగా ఈ ముద్దుగుమ్మ కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీ ఈవెంట్లో మెరిసింది. హిందీ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆమెతో పాటు కార్తీక్ ఆర్యన్ సైతం స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన సోదరి కృతిక తివారీ కోసం ఈ వేడుక ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె సాధించిన విజయాలను సెలబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు వీరిద్దరి కెమిస్ట్రీ చూసిన నెటిజన్స్ డేటింగ్లో ఉన్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే కార్తీక్ ఆర్యన్ గతేడాది సూపర్‌హిట్ చిత్రం భూల్ భూలైయా- 3లో కనిపించాడు. మరోవైపు శ్రీలీల పుష్ప-2 చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెప్పించింది. Sreeleela at kartik aaryan's sister celebrationbyu/Medium_Bicycle_1004 inBollyBlindsNGossip -
ట్రెండింగ్ బ్యూటీ కాయదు.. పాపతో శ్రీలీల ఫన్
ధగధగ మెరిసిపోతున్న మిస్ ఇండియా మానుషీ చిల్లర్ఒళ్లుని విల్లులా వంచేసి యాంకర్ అనసూయ వయ్యారాలుమంచులో చిల్ అవుతున్న హీరోయిన్ త్రిద చౌదరిఒంటిపై జిగేలు మనే డ్రస్సుతో కేక పుట్టిస్తున్న నోరా ఫతేహిరంజాన్ సీజన్ షురూ.. క్యూట్ పోజులతో మృణాల్ ఠాకుర్చీరలో భలే ముద్దుగా రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ కాయదు లోహర్కొత్త పెళ్లి కూతురి కళ ఉట్టిపడుతున్న పార్వతి నాయర్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Suhana Khan (@suhanakhan2) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Tridha Choudhury ✨ (@tridhac) View this post on Instagram A post shared by Shriya Pilgaonkar (@shriya.pilgaonkar) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Nitya Shetty (@nityashettyoffl) View this post on Instagram A post shared by Amy Jackson Westwick (@iamamyjackson) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Chitrangda Singh (@chitrangda) View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) View this post on Instagram A post shared by Aakanksha Singh (@aakankshasingh30) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
Big Update: శ్రీలీల సినిమాలో వార్నర్
-
టాలీవుడ్ సూపర్ హిట్ జోడీలు.. మళ్లీ రిపీట్..
చిత్ర పరిశ్రమలో హిట్ జోడీకి ఉన్న క్రేజే వేరు. ఓ హీరో, హీరోయిన్ కాంబినేషన్లో సినిమా విజయం సాధిస్తే మళ్లీ ఆ కాంబో ఎప్పుడు రిపీట్ అవుతుందా? అనే ఆసక్తి ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఉంటుంది. హిట్ జోడీ రిపీట్ అవుతోందంటే ట్రేడ్ వర్గాల్లో, బిజినెస్ సర్కిల్స్‌లో ఫుల్ క్రేజ్‌తో ΄ాటు అంచనాలు ఉంటాయి. అందుకే అలాంటి హిట్ జోడీని రిపీట్ చేసేందుకు దర్శక–నిర్మాతలు కూడా తమ వంతు ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఇందుకు ఒక్కోసారి కొన్నేళ్లు కూడా పట్టొచ్చు. ప్రస్తుతం తెలుగులో రిపీట్ అవుతున్న జోడీలపై ఓ లుక్కేద్దాం...పద్దెనిమిదేళ్ల తర్వాత..హీరో చిరంజీవి, హీరోయిన్ త్రిషల జోడీ పద్దెనిమిదేళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. ‘విశ్వంభర’ సినిమాలో వీరు జంటగా నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరూ తొలిసారి జోడీగా నటించారు. 2006 సెప్టెంబరు 20న విడుదలైన ఈ మూవీ విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైన పద్దెనిమిదేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి ‘విశ్వంభర’ కోసం స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ‘బింబిసార’ వంటి హిట్ మూవీ తీసిన మల్లిడి వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్‌గా ‘విశ్వంభర’ రూపొందుతోంది. ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు తొలుత ప్రకటించింది చిత్రయూనిట్. కానీ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ హీరోగా రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ కోసం ‘విశ్వంభర’ సినిమా విడుదలని వాయిదా వేశారు. అయితే మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ వేసవిలో సినిమా విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. షష్ఠిపూర్తి కోసం 38 ఏళ్ల తర్వాత... నటుడు రాజేంద్ర ప్రసాద్, నటి అర్చనల జోడీ 38 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. వీరిద్దరూ ‘షష్ఠిపూర్తి’ సినిమా కోసం రెండో సారి కలిసి నటించారు. రాజేంద్ర ప్రసాద్, అర్చన జోడీగా డైరెక్టర్ వంశీ తీసిన చిత్రం ‘లేడీస్ టైలర్’. 1986 నవంబరు 26న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన కలిసి నటించలేదు. తాజాగా పవన్ ప్రభ దర్శకత్వం వహించిన ‘షష్ఠిపూర్తి’ కోసం వీరు 38 ఏళ్ల తర్వాత మరోసారి జంటగా నటించారు. ఈ చిత్రంలో రూపేష్, ఆకాంక్షా సింగ్ మరో జంట. అయితే ఈ కథ మొత్తం రాజేంద్ర ప్రసాద్, అర్చన చుట్టూనే తిరుగుతుందట. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో షష్ఠిపూర్తి కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి ‘షష్ఠిపూర్తి’ అనే టైటిల్ పెట్టారట. రూపేష్ నిర్మించిన ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అనే విషయంపై స్పష్టత లేదు. మధ్యతరగతి యువకుడి ప్రేమకథ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన తొలి చిత్రం ‘బేబి’. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2023 జూలై 14న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీలో ఆనంద్, వైష్ణవి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ప్రత్యేకించి యువతరం ఈ సినిమాకి ఫుల్ ఫిదా అయ్యారు. ‘బేబి’ తర్వాత వీరు మరోసారి జోడీగా నటిస్తున్నారు. ‘90స్’ (ఎ మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్‌తో మంచి విజయం అందుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో 32వ చిత్రంగా రూపొందుతోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోలో ‘మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూశారు కదా. ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి. ఇది నా స్టోరీ, నీ స్టోరీ, కాదు కాదు.. మన స్టోరీ. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ’ అంటూ ఆనంద్ దేవరకొండ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.మాస్ జాతర రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ధమాకా’. 2022 డిసెంబరు 23న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అందులోనూ ప్రత్యేకించి రవితేజ–శ్రీలీల డ్యాన్సులు, భీమ్స్ సంగీతం ఈ సినిమాకి ప్లస్‌గా నిలిచాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి హిట్ జోడీ రెండేళ్ల తర్వాత ‘మాస్ జాతర’ సినిమాతో రిపీట్ అవుతోంది. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్లో 75వ చిత్రంగా రూపొందుతోన్న ‘మాస్ జాతర’పై ఇండస్ట్రీలో అంచనాలున్నాయి. అందులోనూ రవితేజ–శ్రీలీల హిట్ జోడీ రిపీట్ అవుతుండటం కూడా ఈ సినిమాకి మరింత క్రేజ్ తీసుకొచ్చింది. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రత్యేక గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ‘మాస్ జాతర’ సినిమాకి కూడా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండటం మరో విశేషం. వేసవి కానుకగా మే 9న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. నాలుగోసారి...నటుడు శివాజీ, నటి లయది హిట్ జోడీ. ‘మిస్సమ్మ’ (2003), ‘అదిరిందయ్యా చంద్రం’ (2004), ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ (2006) వంటి సినిమాల్లో జంటగా నటించి, హిట్స్ అందుకున్నారు. తాజాగా వీరి జోడీ నాలుగోసారి రిపీట్ అవుతోంది. వివాహం తర్వాత సినిమాలకు కొన్నేళ్లు విరామం ఇచ్చిన లయ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. ప్రస్తుతం లయ, శివాజీ జోడీగా కొత్త సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంతో సుధీర్ శ్రీరామ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై శివాజీ నిర్మిస్తున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ జంట నటిస్తున్న నాలుగో చిత్రంపై ప్రేక్షకుల్లో క్రేజ్ నెలకొంది. బ్యాక్ టు బ్యాక్హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్ బ్యాక్ టు బ్యాక్ రిపీట్ అవుతోంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్’ సినిమాలో నితిన్, శ్రీలీల తొలిసారి జంటగా నటించారు. 2023 డిసెంబరు 8న విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. కానీ, నితిన్–శ్రీలీల జోడీ బాగుందనే టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరూ ‘రాబిన్‌హుడ్’ సినిమాలో జంటగా నటించారు. ‘భీష్మ’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. మంచి వినోదాత్మక కుటుంబ కథా చిత్రం ఇదని, నితిన్ కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందినట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘రాబిన్‌హుడ్’లో తన పాత్ర, నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారంటూ శ్రీలీల కూడా స్పష్టం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా 2024 డిసెంబరు 25న విడుదల కావాల్సి ఉంది. అయితే ముందుగా ప్రకటించిన తేదీకి విడుదలకాలేదు. మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. అప్పుడు వినోదం.. ఇప్పుడు థ్రిల్లర్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో శ్రీవిష్ణు. ఆయన కెరీర్లో విజయవంతమైన చిత్రాల్లో ‘సామజవరగమన’ ఒకటి. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెబా మోనికా జాన్ నటించారు. 2023 జూన్ 29న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించడంతో పాటు హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత ‘మృత్యుంజయ్’ మూవీ కోసం మరోసారి జోడీ కట్టారు శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్.ఈ చిత్రానికి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. ‘సామజవరగమన’తో వినోదం పంచిన శ్రీవిష్ణు, రెబా జాన్ ‘మృత్యుంజయ్’తో ప్రేక్షకులను ఏ మేర భయపెడతారో చూడాలి. మరికొన్ని జోడీలు‘సీతా రామం’ సినిమాతో సూపర్ హిట్ జోడీ అనిపించుకున్న దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ రెండోసారి నటించనున్నారట. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఈ సినిమాలో సాయిపల్లవి లేదా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బాలకృష్ణ– ప్రగ్యాజైస్వాల్ జోడీ కూడా రిపీట్ కానుందని సమాచారం. ‘అఖండ, డాకు మహారాజ్’ వంటి సినిమాల తర్వాత ‘అఖండ 2’లో వీరిద్దరూ కలిసి నటించనున్నారట. అయితే ‘అఖండ 2’లో హీరోయిన్గా సంయుక్తని ప్రకటించారు మేకర్స్. మరి ప్రగ్యా జైస్వాల్ సెకండ్ హీరోయిన్గా కనిపిస్తారా? లేదంటే ముఖ్యమైన పాత్ర చేయనున్నారా? అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. మరికొన్ని జోడీలు కూడా రిపీట్ కానున్నాయని సమాచారం. – డేరంగుల జగన్ మోహన్ చదవండి: సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్ రెడ్డి వంగా -
కారాన్ని ఇంగ్లీషులో ఏమంటారు?.. శ్రీలీల క్యూట్ వీడియో చూశారా?
పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీలీల. ప్రస్తుతం నితిన్ సరసన రాబిన్ హుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల పుష్ప-2లో కిస్సిక్ సాంగ్‌తో అభిమానులను కట్టిపడేసిన భామ బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ కార్తీక్ ఆర్యన్ సరసన క్రేజీ ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల.అయితే తాజాగా శ్రీలీలకు సంబంధించిన ఓ క్యూట్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. పల్లీల పొడిని కారంలో కలుపుకుని తింటున్న వీడీయోను శ్రీలీల టీమ్ ట్విటర్లో షేర్ చేసింది. ఇందులో పీనట్ పొడిలో కారం కలుపుకుని ప్రతి రోజు తింటానంటోంది ముద్దుగుమ్మ. అంతేకాకుండా కారం పొడిని ఇంగ్లీషులో ఏమంటారని క్యూట్‌గా అడిగింది. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. శ్రీలీలీ బాలీవుడ్‌లోనూ ఎంట్రీకి సిద్ధమైంది. కార్తీక్ ఆర్యన్ సరసన కనిపించనుంది ముద్దుగుమ్మ. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ వీడియోను ఇటీవలే మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్, అనురాగ్ బసు ప్రొడక్షన్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ నిర్మిస్తున్నారు. Cutest video on internet ❤️❤️🥹@sreeleela14 #Sreeleela pic.twitter.com/o8xckGmsor— Team Sreeleela™️ (@Teamsreeleela) February 19, 2025 -
బాలీవుడ్ బులాయా
నార్త్ నుంచి సౌత్‌కి వచ్చే కథానాయికల సంఖ్య ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. అయితే సీన్ మారింది. ఇప్పుడు దక్షిణాదిన పాపులర్ అయిన కథానాయికలను బాలీవుడ్ బులాయా (బాలీవుడ్ పిలిచింది). అలా ఇక్కడ సక్సెస్ అయి, బాలీవుడ్‌కి పరిచయం కానున్న కథానాయికలు కొందరు ఉన్నారు. ఆ తారలు హిందీలో చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. డబుల్ ధమాకా దక్షిణాదిలోని అగ్ర కథానాయికల్లో సాయిపల్లవి ఒకరు. అందం, అభినయం పరంగా ఇక్కడ బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె హిందీలో రెండు సినిమాలు అంగీకరించారు. ఆ చిత్రాలు ‘రామాయణ’, ‘ఏక్ దిన్’. రామాయణం ఆధారంగా నితీష్ తివారి దర్శకత్వంలో హిందీలో ‘రామాయణ’ మూవీ రూ΄÷ందుతోంది. ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, లక్ష్మణుడి పాత్రలో రవి దుబే నటిస్తున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ కనిపిస్తారని బాలీవుడ్ సమాచారం. యశ్‌తో కలిసి నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. 2026 దీపావళికి తొలి భాగాన్ని, 2027 దీపావళికి రెండో భాగాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అలాగే ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హిందీలో ‘ఏక్ దిన్’ (వర్కింగ్ టైటిల్) అనే మూవీ చేశారు. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటించారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అయితే ‘రామాయణ, ఏక్ దిన్’ చిత్రాల్లో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన రాలేదు. ఆ సంగతలా ఉంచితే... ‘ఏక్ దిన్’ ముందుగా రిలీజవుతుందని, ఈ మూవీతోనే సాయిపల్లవి బాలీవుడ్ ఫస్ట్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని టాక్. లవ్ ఫిల్మ్‌తో... తెలుగులో సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించారు హీరోయిన్ శ్రీలీల. ఈ బ్యూటీ ఇప్పుడు హిందీలో నిరూపించుకోవడానికి రెడీ అయ్యారు. బాలీవుడ్ నుంచి తనకు మంచి స్వాగతమే దక్కినట్లుగా తెలుస్తోంది. ఒకేసారి రెండు ఆఫర్లు అందుకున్నారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు డైరెక్షన్‌లోని ఓ లవ్ ఫిల్మ్‌లో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైందట. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, అనురాగ్ బసు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాయే కాకుండా సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా నిర్మాత దినేష్ విజన్ ఓ మూవీని ΄్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీలీల నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా చర్చల్లో కూడా ఆమె పాల్గొన్నారు. క్వీన్ ఆఫ్ క్వీన్స్ ‘బింబిసార, విరూపాక్ష, డెవిల్: ది సీక్రెట్ ఏజెంట్’ వంటి తెలుగు హిట్ మూవీస్‌తో ప్రేక్షకులను అలరించారు హీరోయిన్ సంయుక్త. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుకోనున్నారీ బ్యూటీ. కాజోల్, ప్రభుదేవా, నసీరుద్దీన్ షా లీడ్ రోల్స్ చేస్తున్న హిందీ చిత్రం ‘మహారాజ్ఞి: క్వీన్ ఆఫ్ క్వీన్స్’లో సంయుక్త ఓ లీడ్ రోల్ చేస్తు న్నారు. చరణ్ ఉప్పలపాటి దర్శకత్వంలో వెంకట అనీష్, హర్మాన్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది. తెలుగు హీరోయిన్ అనన్యా నాగళ్ల, కన్నడ హీరోయిన్ తన్వీ వంటి మరికొందరు తారల బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖరారైందని సమాచారం. -
మాల్దీవుస్‌లో సాక్షి అగర్వాల్ చిల్.. సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ లేటేస్ట్ లుక్!
మజాకా ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా మన్మధుడు హీరోయిన్ అన్షు..సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ లేటేస్ట్ లుక్స్..లైప్ ఈజ్ బూమరాంగ్ అంటోన్న మేఘా ఆకాశ్..బ్లాక్ బ్యూటీలా మెరిసిపోతున్న శ్రీలీల..మాల్దీవుస్‌లో చిల్ అవుతోన్న సాక్షి అగర్వాల్.. View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) -
శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. హీరోగా ఎవరంటే?
-
కిస్సిక్ భామ బాలీవుడ్ ఎంట్రీ.. హీరోగా ఎవరంటే?
పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీలీల. ఆ తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించింది. ఇటీవల పుష్ప-2 సినిమాలో కిస్సిక్ సాంగ్‌తో అభిమానులను ఓ ఊపు ఊపేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. దక్షిణాదిలో ఓ ఊపు ఊపేస్తోన్న శ్రీలీలకు బాలీవుడ్‌లోనూ క్రేజీ ఛాన్ కొట్టేసింది. శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.బాలీవుడ్ కార్తీక్ ఆర్యన్ సరసన కనిపించనుంది ముద్దుగుమ్మ. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్, అనురాగ్ బసు ప్రొడక్షన్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ నిర్మిస్తున్నారు. -
మత్తు కళ్లతో మాయజేస్తున్న శ్రీలీల ఫోటోలు
-
‘మంగళవారం’లో..?
తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్గా దూసుకెళుతున్నారు శ్రీలీల(SreeLeela). ఇప్పటికే అరడజను సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ బ్యూటీ తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ మూవీలో నటించనున్నారని టాక్. అది కూడా హిట్ మూవీ ‘మంగళవారం’(mangalavaram movie sequel) సీక్వెల్లో అట. అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మంగళవారం’. 2023 నవంబరు 17న విడుదలైన ఈ చిత్రం హిట్‌గా నిలిచింది.ప్రత్యేకించి పాయల్ రాజ్‌పుత్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘మంగళవారం 2’ రూపొందనుంది. అయితే ద్వితీయ భాగంలో తాను లీడ్ రోల్లో నటించడం లేదంటూ పాయల్ రాజ్‌పుత్ ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారట. సీక్వెల్లో పూర్తిగా కొత్త కథ ఉంటుందని, అందుకే పాయల్ రాజ్‌పుత్ కాకుండా మరో హీరోయిన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో అజయ్ భూపతి ఉన్నారని సమాచారం.సీక్వెల్ కథకి శ్రీలీల అయితే సరిగ్గా సరిపోతుందన్నది ఆయన ఆలోచన అని ఫిల్మ్‌నగర్ టాక్. అయితే ‘మంగళవారం 2’ గురించి శ్రీలీలతో ఆయన చర్చిం చారా? లేదా? ఈ మూవీకి ఆమె పచ్చజెండా ఊపుతారా? లేదా వంటి విషయాలపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడక తప్పుదు. శ్రీలీల ప్రస్తుతం తెలుగులో నితిన్ ‘రాబిన్ హుడ్’, రవితేజ ‘మాస్ జాతర’, పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, తమిళంలో శివ కార్తికేయన్‌తో ‘పరాశక్తి’ మూవీ చేస్తున్నారు. -
జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా...
‘జోరుగా హుషారుగా షికారు పోదమా...’ అంటూ అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణకుమారి అప్పట్లో సిల్వర్ స్క్రీన్‌పై చేసిన సందడిని నాటి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ పాట ప్రస్తావన ఎందుకూ అంటే... జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా... అంటూ కొందరు కథానాయికలు డైరీలో నాలుగుకి మించిన సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఆ హీరోయిన్లు చేస్తున్నసినిమాల గురించి తెలుసుకుందాం...రెండు దశాబ్దాలు దాటినా బిజీగా...చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకుపైగా ప్రయాణం పూర్తి చేసుకున్నారు త్రిష. అందం, అభినయంతో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె ఇప్పటికీ ఫుల్ బిజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. అంతేకాదు.. అందం విషయంలోనూ యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం త్రిష చేతిలో తెలుగు, తమిళ్, మలయాళంలో కలిపి అరడజను సినిమాలున్నాయి. ఆమె నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారామె.‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి–త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే మోహన్‌లాల్ లీడ్ రోల్లో డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు త్రిష. అదే విధంగా అజిత్ కుమార్ హీరోగా మగిళ్ తిరుమేని తెరకెక్కిస్తున్న ‘విడాముయర్చి’, అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ‘గుడ్ బ్యాడీ అగ్లీ’, కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం రూపొందిస్తున్న ‘థగ్ లైఫ్’, సూర్య కథానాయకుడిగా ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ‘సూర్య 45’ (వర్కింగ్ టైటిల్) వంటి తమిళ చిత్రాల్లో నటిస్తూ జోరు మీద ఉన్నారు త్రిష. తెలుగులో లేవు కానీ...తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బుట్ట బొమ్మగా స్థానం సొంతం చేసుకున్నారు హీరోయిన్ పూజా హెగ్డే. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) అనే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ. టాలీవుడ్లో పదేళ్ల ప్రయాణం పూజా హెగ్డేది. కాగా చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా తర్వాత ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కానీ, బాలీవుడ్, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు పూజా హెగ్డే.తమిళంలో స్టార్ హీరోలైన విజయ్, సూర్యలకు జోడీగా నటిస్తున్నారు. విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ‘జన నాయగన్’ అనే సినిమాతో పాటు, సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో రూపొందుతోన్న ‘రెట్రో’ మూవీస్‌లో నటిస్తున్నారు పూజా హెగ్డే. అలాగే డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ అనే సినిమాలో నటిస్తున్నారామె. షాహిద్ కపూర్ హీరోగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో రూపొందిన హిందీ మూవీ ‘దేవా’. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. హిందీ, తమిళ భాషల్లో బిజీగా ఉన్న పూజా హెగ్డే తెలుగులో మాత్రం ఒక్క సినిమాకి కూడా కమిట్ కాలేదు. జోరుగా లేడీ సూపర్ స్టార్ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు నయనతార. నటిగా రెండు దశాబ్దాలకు పైగా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆమె ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. కథానాయికగా ఫుల్ క్రేజ్‌లో ఉన్నప్పుడే దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో 2022 జూన్ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు నయనతార. వీరిద్దరికీ ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్నారు. ఇక కెరీర్ పరంగా ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. తమిళంలో ‘టెస్ట్, మన్నాంగట్టి సిన్స్ 1960, రాక్కాయీ’ వంటి సినిమాలతో పాటు పేరు పెట్టని మరో తమిళ చిత్రం, ‘డియర్ స్టూడెంట్’తో పాటు మరో మలయాళ మూవీ, ‘టాక్సిక్’ అనే కన్నడ సినిమాతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు నయనతార. అయితే 2022లో విడుదలైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ తర్వాత మరో తెలుగు చిత్రానికి పచ్చజెండా ఊపలేదామె.అరడజను సినిమాలతో‘చూసీ చూడంగానే నచ్చేశావే.. అడిగీ అడగకుండా వచ్చేశావే... నా మనసులోకి’ అంటూ రష్మికా మందన్నాని ఉద్దేశించి పాడుకుంటారు యువతరం ప్రేక్షకులు. అందం, అభినయంతో అంతలా వారిని ఆకట్టుకున్నారామె. కన్నడలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ఛలో ’(2018) సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు ఈ కన్నడ బ్యూటీ. ఓ వైపు కథానాయకులకి జోడీగా నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి.వాటిలో ‘రెయిన్ బో, ది గాళ్ ఫ్రెండ్’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ‘రెయిన్ బో’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. అదే విధంగా ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది గాళ్ ఫ్రెండ్’. అలాగే విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ ‘ఛావా’లో హీరోయిన్గా చేశారు రష్మిక. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.ఇక సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న హిందీ మూవీ ‘సికందర్’లోనూ రష్మిక కథానాయిక. అదే విధంగా నాగార్జున, ధనుశ్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న తెలుగు, తమిళ చిత్రం ‘కుబేర’లోనూ హీరోయిన్గా నటించారు ఈ బ్యూటీ. మరోవైపు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ‘థామా’ అనే బాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నారు రష్మికా మందన్నా.ఏడు చిత్రాలతో బిజీ బిజీగా...మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి, ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సంయుక్తా మీనన్. ‘భీమ్లా నాయక్’ (2022) చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమయ్యారు ఈ మలయాళ బ్యూటీ. ‘భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు సంయుక్త. ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. వాటిలో తెలుగులోనే ఐదు చిత్రాలుండగా, ఓ హిందీ ఫిల్మ్, ఓ మలయాళ సినిమా కూడా ఉంది.నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ‘స్వయంభూ’, శర్వానంద్ కథానాయకుడిగా రామ్ అబ్బరాజు డైరెక్షన్లో రూపొందుతున్న ‘నారి నారి నడుమ మురారి’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న ‘హైందవ’, బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ‘అఖండ 2: తాండవం’ సినిమాల్లో నటిస్తున్నారు సంయుక్తా మీనన్. అదే విధంగా తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలోనూ నటిస్తున్నారామె.యోగేష్ కేఎంసీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అలాగే ఆమె నటిస్తున్న తొలి హిందీ చిత్రం ‘మహారాజ్ఞి–క్వీన్ ఆఫ్ క్వీన్స్’. ఈ మూవీకి చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అదే విధంగా మోహన్‌లాల్ లీడ్ రోల్లో జీతూ జోసెఫ్ దర్వకత్వంలో రూపొందుతోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు సంయుక్తా మీనన్. ఇలా ఏడు సినిమాలతో ఫుల్ బీజీ బీజీగా ఉన్నారామె. హుషారుగా యంగ్ హీరోయిన్టాలీవుడ్లో మోస్ట్ సెన్సేషన్ హీరోయిన్గా దూసుకెళుతున్నారు శ్రీలీల. ‘పెళ్లిసందడి’ (2021) సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌ని సొంతం చేసుకున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ (2022) సినిమాతో తెలుగులో తొలి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న శ్రీలీల వరుస చిత్రాలతో యమా జోరు మీదున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తెలుగు సినిమాలతో పాటు ఓ తమిళ చిత్రం ఉన్నాయి.నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాబిన్ హుడ్’, రవితేజ హీరోగా భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ‘మాస్ జాతర’, పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ వంటి తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు శ్రీలీల. అదే విధంగా శివ కార్తికేయన్ హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘పరాశక్తి’ అనే తమిళ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారామె.హిందీలోనూ...దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతా రామం’ (2022) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు మృణాళ్ ఠాకూర్. ఆ సినిమా మంచి హిట్‌గా నిలిచింది. మృణాళ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో ‘హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్’ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ ప్రభాస్ ‘కల్కి: 2898 ఏడీ’ చిత్రంలో అతిథి పాత్ర చేశారు. ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్ బాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారారు. ఆమె హిందీలో ‘పూజా మేరీ జాన్, హై జవానీతో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2’, తుమ్ హో తో’ వంటి చిత్రాలు చేస్తున్నారు. అదే విధంగా అడివి శేష్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు మృణాళ్ ఠాకూర్.రెండు తెలుగు... రెండు హిందీ ప్రేక్షకుల హృదయాల్లో అతిలోక సుందరిగా అభిమానం సొంతం చేసుకున్న దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్ వారసురాలిగా పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ హిందీలో ఎంట్రీ ఇచ్చారు. యూత్ కలల రాణిగా మారారు ఈ బ్యూటీ. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర: పార్ట్ 1’ (2024) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు జాన్వీ. ప్రస్తుతం ఆమె చేతిలో కూడా నాలుగు సినిమాలుఉన్నాయి. వాటిలో రెండు తెలుగు కాగా రెండు హిందీ మూవీస్.రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ‘దేవర: పార్ట్ 2’ సినిమా కూడా ఉండనే ఉంది. అదే విధంగా హిందీలో ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి, పరమ్ సుందరి’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఇలా నాలుగైదు సినిమాలతో బిజీ బిజీగా షూటింగ్స్ చేస్తున్న కథానాయికలు ఇంకొందరు ఉన్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
మాస్ మహారాజా 'మాస్ జాతర'.. గ్లింప్స్ వచ్చేసింది
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం 'మాస్ జాతర'. ఈ మూవీ రవితేజ కెరీర్లో 75వ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాకు ‘సామజవరగమన చిత్రానికి రైటర్‌గా పనిచేసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో శ్రీలీల మరోసారి రవితేజ సరసన హీరోయిన్గా కనిపించనుంది. గతంలో వీరిద్దరు జంటగా నటించిన ధమాకా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.ఇవాళ మాస్ మహారాజా బర్త్ డే కావడంతో ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా మాస్ జాతర మూవీ గ్లింప్స్‌ను ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. దాదాపు 61 సెకన్ల పాటు వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే మాస్ జాతరను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ చిత్రం మే 09న థియేటర్లలో సందడి చేయనుంది. The Swag.The Energy.The Vibe. 🔥🔥🔥𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl is here to deliver an ALL ROUND SHOW! 😎❤️🔥#MassJathara ~ Mass Rampage Glimpse out now 💥— https://t.co/1s6R68jgYG #HappyBirthdayRaviTeja garu ❤️@sreeleela14 @BhanuBogavarapu @vamsi84… pic.twitter.com/Tp9Zn1vouZ— Sithara Entertainments (@SitharaEnts) January 26, 2025 -
'పుష్ప 3' ఐటెమ్ సాంగ్.. ఆ హీరోయిన్ అయితే సూపర్ హిట్టే: దేవిశ్రీ ప్రసాద్
పుష్ప సిరీస్ గురించి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప2 భారీ కలెక్షన్స్ సాధించి ఎన్నో రికార్డ్స్‌ను దాటేసింది. పుష్ప రెండు భాగాలకు దేవిశ్రీ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ క్రమంలో ఆయన తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో 'పుష్ప 3' (Pushpa 3) ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. పుష్ప చిత్రాలకు ఐటెమ్ సాంగ్స్ మంచి గుర్తింపును ఇచ్చాయి. ఇప్పుడు పుష్ప3లో ఐటెమ్ సాంగ్‌లో ఎవరు కనిపిస్తే బాగుంటుందో దేవిశ్రీ ప్రసాద్ తాజాగా చెప్పారు. (ఇదీ చదవండి: విజయ్‌తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష)పుష్పలో సమంత 'ఊ అంటావా మామ.. ఉఊ అంటావా మామా' అంటూ తన గ్లామర్‌తో దుమ్మురేపింది. పుష్ప2లో శ్రీలీల కిస్సిక్ సాంగ్‌లో నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఈ ప్రత్యేకమైన సాంగ్స్ గురించి దేవిశ్రీ ప్రసాద్ ఇలా పంచుకున్నారు. పుష్ప 2 కిస్సిక్ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటారని తాము ముందే ఊహించామని అయన అన్నారు. అయితే, ఈ సాంగ్‌కు శ్రీలీల మంచి ఆప్షన్ అని తాను మేకర్స్‌కు ముందే చెప్పానని ఆయన అన్నారు. దానికి ప్రధాన కారణం ఆమె చాలా బెటర్‌గా డ్యాన్స్ చేయడమేనని దేవిశ్రీ అన్నారు. ఇప్పటికే చాలామంది టాప్ హీరోయిన్లు తన మ్యూజిక్‌లో వచ్చిన ఐటెమ్ సాంగ్స్‌లో మెప్పించిన విషయాన్ని గుర్తుచేశారు. అందులో కాజల్ అగర్వాల్ (జనతా గ్యారేజ్), పూజా హెగ్డే( రంగస్థలం), సమంత (పుష్ప), శ్రీలీల (పుష్ప2)ఉన్నారన్నారు. వారందరూ కూడా కెరీర్లో మంచి పీక్‌లో ఉన్నప్పుడే ఐటెమ్ సాంగ్స్‌లలో కనిపించారన్నారు.'పుష్ప 3' ఐటెమ్ సాంగ్‌లో జాన్వీ ఎంపిక ఎందుకంటే..?పుష్ప 3 సినిమాలో ఐటెమ్ సాంగ్‌లో కనిపించేది ఎవరని ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయని ఆయన అన్నారు. ఈ అంశంపై దీనిపై దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. పాట ఆధారంగా హీరోయిన్ను ఎంపిక చేస్తారని దేవి తెలిపారు. ఇండస్ట్రీలో సాయి పల్లవి డ్యాన్స్‌కు తాను అభిమానినని చెప్పిన ఆయన.. జాన్వీ కపూర్(Janhvi Kapoor) కూడా మంచి డ్యాన్సర్ అని ఆయన తెలిపారు. ఇప్పటికే బాలీవుడ్లో నటించిన ఆమె పాటలు చూశానని అన్నారు. ఆమె అమ్మగారు అయిన శ్రీదేవిలో ఉన్న గ్రేస్ జాన్వీలో కూడా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, పుష్ప-3 ఐటెమ్ సాంగ్‌కు జాన్వీ అయితే సరైన ఎంపిక అని తాను అనుకుంటున్నట్లు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు.‘పుష్ప 2’ ఘన విజయం అందుకున్న తర్వాత దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ పార్ట్ 3కి సంబంధించి నిరంతరం పని చేస్తున్నారని దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే చెప్పారు. ఆ స్టోరీపై రీవర్క్ కూడా చేస్తున్నారని ఆయన తెలిపారు. సుకుమార్ ఇచ్చిన మంచి స్క్రిప్టుకు అల్లు అర్జున్ అద్భుతంగా నటించడం వల్లే సినిమా భారీ హిట్ అయిందని ఆయన అన్నారు. పుష్ప 1, పుష్ప 2కి ఎలా పనిచేశామో ‘పుష్ప 3’కి అదే స్థాయిలో కష్టపడతామని తెలిపారు. -
హీరోయిన్ శ్రీలీల క్యూట్ ఫోటోలు
-
ఏకంగా కరణ్ జోహర్ బ్యానర్ లో సినిమా..
-
బాలీవుడ్లో బడా బేనర్లో...
సౌత్‌లో దూసుకెళుతున్న శ్రీలీల(Sreeleela) బాలీవుడ్ ఎంట్రీ(Bollywood entry) గురించి కొన్నాళ్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ప్రచారంలో ఉన్న వార్త విషయానికొస్తే... బాలీవుడ్లో ఓ బడా బేనర్ అయిన ధర్మ ప్రొడక్షన్స్( Dharma Productions) ద్వారా శ్రీలీల హిందీ చిత్రపరిశ్రమ అరంగేట్రం జరగనుందట. ఈ సంస్థ అధినేత కరణ్ జోహార్ ‘తూ మేరీ మై తేరా... మై తేరా తూ మేరీ’ అనే చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్(Kartik Aaryan) హీరోగా నటించనున్నారు. ఈ హీరో సరసన శ్రీలీలను హీరోయిన్గా ఫిక్స్ చేశారని సమాచారం. ఇక అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం అని బాలీవుడ్ టాక్. ఈ ఏడాది మధ్యలో ఈ చిత్రం షూట్ ఆరంభం అవుతుందట. ఈ చిత్రానికి సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించనున్నారు. మరి... బడా బేనర్ ద్వారా శ్రీలీల(Sreeleela) బాలీవుడ్ ఎంట్రీ (Bollywood entry) జరుగుతుందా? అంటే... వేచి చూడాల్సిందే. -
హైదరాబాద్ : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్..శ్రీలీల,దక్ష నాగర్కర్ డ్యాన్స్ అదుర్స్ (ఫోటోలు)
-
2025లో టాలీవుడ్ ని శాసించనున్న రష్మిక, శ్రీలీల, మీనాక్షి
-
ఈ ఏడాది టాప్ సాంగ్స్ లిస్ట్ ప్రకటించిన యూట్యూబ్.. తెలుగు పాటకు చోటు
తెలుగు సాంగ్ గ్లోబల్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. 2024లో విడుదలైన సాంగ్స్‌లలో టాప్-10 లిస్ట్‌ను యూట్యూబ్ అధికారికంగా ప్రకటించింది. అందులో ఇండియా నుంచి ఒక సాంగ్ మాత్రమే ఉంది. అయితే, అది తెలుగు సినిమాకు సంబంధించిన పాట కావడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాదిలో 'గుంటూరు కారం'తో సందడి చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లు రాబట్టింది. అయితే ఈ సినిమాలోని 'కుర్చీ మడతపెట్టి' పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సాంగ్‌తో లెక్కలేనన్నీ రీల్స్ కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో మరో అరుదైన ఘనత సాధించింది.'కుర్చీ మడతపెట్టి' సాంగ్ విడుదలైనప్పటి నుంచే యూట్యూబ్‌లో భారీ క్రేజ్ ఏర్పడింది. 527+ మిలియన్ వ్యూస్‌తో ఇప్పటికి కూడా నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. దీంతో 2024 యూట్యూబ్ టాప్ సాంగ్స్‌లో స్థానం దక్కించుకున్న ఏకైక ఇండియన్ పాటగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే విషయాన్ని యూట్యూబ్ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 7 టాప్ హిట్ సాంగ్స్‌ను యూట్యూబ్ ప్రకటించింది. అందులో భారత్ నుంచి ఎంపికైన ఏకైక పాట 'కుర్చీ మడతపెట్టి' అనే సాంగ్ ఉండటం విశేషం. కేవలం తెలుగులోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ తెలుగు పాట సత్తా చాటడంతో మహేష్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.గుంటూరు కారం సినిమా 2024 జనవరి 12న విడుదలైంది. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హారికా అండ్ హసిని బ్యానర్స్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. 'కుర్చీ మడతపెట్టి' సాంగ్‌లో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల, మహేష్ వేసిన స్టెప్పులకు థియేటర్స్ దద్దరిల్లాయి. -
లీలా వినోదం..
ఎప్పటిలానే మన గ్లామర్ సిటీ నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో నిర్వహించనున్న ఇయర్ ఎండ్ వేడుకలకు వేదికలు రెడీ అయ్యాయి. ఇందులో లైవ్ మ్యూజిక్ సెటప్‌లు, సెలిబ్రిటీ గెస్టులు వంటి ఇతర వినోద కార్యక్రమాలకు సన్నాహాలు మొదలయ్యాయి. నగర యువత ఈ వేడుకలను ఎక్కడెక్కడ చేసుకోవాలో ఇప్పటి నుంచే ప్లాన్లు చేసుకోవడం మొదలుపెట్టేశారు. ఇప్పటికే పలువురు బుక్ మై షోలో పాస్‌లు రిజిష్టర్ చేసేసుకున్నారు. వీరి ఆసక్తి, ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే నిర్వాహకులు సైతం తమ ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో దీని గురించిన మరిన్ని విశేషాలు.. ఇప్పటికే నగరంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు, ప్రస్తుత సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు యువత సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కొన్ని థీమ్స్‌ను సైతం సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు పలువురు ఈవెంట్ ఆర్గనైజర్లు. ముఖ్యంగా సినీ తారలు, ప్రముఖ సింగర్స్, డ్యాన్సర్స్.. ఎవరు ఎక్కడ హాజరవుతున్నారనే సమాచారాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకించి ఢిల్లీ, ముంబయి తదితర ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్న డీజే స్పెషలిస్టులు, లైవ్ మ్యూజిక్ స్పెషలిస్టులు వారి ప్రోమోలను వదులుతున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలో లైవ్ బ్యాండ్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. ఈ ఈవెంట్లకు బుకింగ్స్ ప్రారంభం కావడమే కాదు కొన్నింటికి ఇప్పటికే సోల్డ్ ఔట్ బోర్డులు పెట్టడం విశేషం. స్టార్ గ్లామర్ ఈవెంట్స్.. వేడుకలు ఏవైనా సరే... అందులో గ్లామర్ ఉంటేనే వినోదమైనా, ఉల్లాసమైనా. ఈ నేపథ్యంలో ఇయర్ ఎండ్ వేడుకల నిర్వహణలో సెలిబ్రిటీలను భాగం చేస్తున్నారు నిర్వాహకులు. సాధారణంగా ఇటువంటి ఈవెంట్స్‌లో సినీతారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో భాగంగానే నగరంలో పలు వేదికల్లో గ్రాండ్‌గా నిర్వహించే లైవ్‌మ్యూజిక్ కాన్సర్ట్‌లు, పబ్, రిసార్ట్, ఓపెన్ ఏరియా ఈవెంట్లలో పలువురు సినీతారలు, సింగర్లు తళుక్కున మెరవనున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ప్రముఖ నటి శ్రీలీల, గాయకులు సునీత, రాకింగ్ సింగర్ రామ్ మిరియాల, తదితర టాలీవుడ్, బాలీవుడ్ సింగర్స్ నగరంలో ప్రేక్షకులకు తమ గాత్రంతో అలరించనున్నారు. డీజేల సందడి.. నూతన సంవత్సర వేడుకలకు సినిమా గ్లామర్ తోడైతే ఆ కిక్కేవేరబ్బా అంటోంది నగర యువత. తమకు నచి్చన భాష, హీరోల సినిమా పాటలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి అంటూ సామాజిక మాధ్యమాల్లో శోధిస్తున్నారు. తెలుగు లైవ్ కాన్సర్ట్స్‌కు ఎక్కువ మంది మొగ్గుచూపుతుండగా, ఉత్తర భారతం నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నవారు మాత్రం హిందీ, ఇంగ్లి‹Ùకార్యక్రమాలను కోరుకుంటున్నారు. దీంతో ఈవెంట్ నిర్వాహకులు సైతం అందుకు అనుగుణంగానే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో నిపుణులైన డీజే ఆర్టిస్టులకు డిమాండ్ నెలకొంది. సాయంత్రం 8 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు.‘నై’ వేడుకల్లో శ్రీలీల... సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నిర్వహించనున్న ఇయర్ ఎండ్ వేడుకలకు అప్పుడే గ్లామర్ వచ్చేసింది. ఆల్వేస్ ఈవెంట్స్, ఎస్వీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 31న నగరంలోని నోవోటెల్ వేదికగా నిర్వహించనున్న నై (ఎన్‌వైఈ) 2025 వేడుకల్లో టాలీవుడ్ గ్లామర్ క్వీన్ శ్రీలీల తన స్టెప్పులతో అలరించనున్నారు. ఈ ఈవెంట్ పోస్టర్‌ను శుక్రవారం నోవాటెల్ వేదికగా ఆవిష్కరించారు. ఇందులో ప్రముఖ యాంకర్ రవి, నటి సౌమ్య జాను పాల్గొని సందడి చేశారు. నిర్వాహకులు సుమంత్ మాట్లాడుతూ.. బాలీవుడ్ లైవ్ మ్యూజిక్, కలర్‌ఫుల్ వేదికతో పాటు టాప్ మోడల్స్‌తో నిర్వహిస్తున్న ఫ్యాషన్ షోతో నై (ఎన్‌వైఈ) 2025 వేదిక కానుందన్నారు. నిరావల్ లైవ్ బ్యాండ్ నగరానికి ప్రత్యేకంగా రానుందని, వేడుకల్లో ప్రముఖ సినీతార శ్రీలీల పాల్గొని అలరించనున్నారని తెలిపారు. ప్రత్యేకమైన ఎస్ఎఫ్ఎక్స్ ప్రదర్శనలతో, న్యూ ఇయర్ కౌంట్ డౌన్‌తో పాటు విభిన్న రుచుల ఆహారం, ప్రీమియం డ్రింక్స్, టాటూ, ఫొటో బూత్‌లు అందుబాటులో ఉంటాయని సహ నిర్వాహకులు వినోద్ పేర్కొన్నారు. అంతేకాకుండా పలువురు సెలిబ్రిటీలు ఇందులో భాగం కానున్నారని అన్నారు. నగరంలో పలు కార్యక్రమాలు..⇒ హెచ్ఐసీసీ నోవోటెల్లో నూతన సంవత్సర వేడుకలకు ప్రముఖ సినీ నటి శ్రీలీల హాజరుకానున్నారు. లైవ్ బ్యాండ్, డ్యాన్స్, బాలీవుడ్ డీజే, మ్యాజిక్‌షో, కిడ్స్ జోన్, ఫ్యాషన్ షో, తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ‘న్యూ ఇయర్ ఈవ్’ పేరిట రాత్రి 8 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇంగ్లిష్, తెలుగు, హిందీ పాటలు ఉంటాయి. ⇒ ప్రిజమ్ క్లబ్ అండ్ కిచెన్‌లో రామ్ మిరియాల బ్యాండ్ అమృతం ‘ది ప్రిజమ్ సర్కస్ 4.0’ కార్యక్రమన్ని ఏర్పాటు చేస్తున్నారు. ⇒ ఎల్బి నగర్ ఇండోర్ స్టేడియంలో యూబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యాండ్ కాప్రిసియోని ప్రత్యక్షంగా ప్రదర్శిస్తుంది. సంగీతం, ఎనర్జీ, ఉత్సాహంతో కూడిన విద్యుత్ వెలుగుల్లో నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. చార్ట్–టాపింగ్ హిట్లు, హై–ఎనర్జీ పెర్ఫార్మెన్స్ల మిక్సింగ్ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ⇒ బోల్డర్ హిల్స్‌లోని ప్రిజమ్ ఔట్ డోర్స్‌లో ప్రముఖ సింగర్స్ కార్తీక్, సునీత హాజరవుతున్నారు. ⇒ హైటెక్స్ ఎరీనాలో హైదరాబాద్ బిగ్గెస్ట్ న్యూ ఇయర్ బాష్ 2025 (ఓపెన్ ఎయిర్) కార్యక్రమానికి నేహ ఆర్ గుప్తా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. -
కొత్తపేటలో హీరోయిన్ శ్రీలీల సందడి
-
ఫ్రెండ్లీ స్టయిలిస్ట్ శరణ్యారావు
ఫ్యాషన్ వరల్డ్‌లో తెలుగువాళ్లు తక్కువగా కనిపిస్తారు.కానీ క్రియేటివ్ స్కిల్స్‌తో గట్టిగా నిలబడతారు!వాళ్లలో శరణ్యారావు పేరును చెప్పుకోవచ్చు గొప్పగా!శరణ్య స్వస్థలం విశాఖపట్నం. ముస్తాబు చేయడంలో ముందుండేది చిన్నప్పటి నుంచీ! శరణ్య అలంకరణ, స్టయిలింగ్కి తొలి మోడల్ ఆమె చెల్లెలే! ఇంటి పనుల్లో అమ్మ బిజీగా ఉండి, చెల్లిని రెడీ చేయలేకపోతే ఆ బాధ్యత తను తీసుకునేది! అది క్రమంగా అభిరుచిగా మారింది. తన పాకెట్ మనీతో మేకప్ వస్తువులు కొనేది. ఏ చిన్న ఫంక్షన్ అయినా చెల్లిని చక్కగా ముస్తాబు చేసి మురిసిపోయేది. ఆ అలంకరణను కొన్నిసార్లు అందరూ మెచ్చుకున్నా, చెల్లికి నచ్చేది కాదు. మరికొన్నిసార్లు ఎవ్వరికీ నచ్చకపోయినా, చెల్లికి మాత్రం తెగ నచ్చేది. ఇష్టాయిష్టాల్లో ఒకొక్కరిదీ ఒక్కో టేస్ట్ అని అర్థంచేసుకుంది శరణ్య. వాటిని బ్యాలెన్స్ చేస్తూ అందరూ మెచ్చే స్టయిలింగ్‌ని చూపించొచ్చు అని తెలుసుకుంది. రానురాను అదే ఆమె సిగ్నేచర్ స్టయిలింగ్ అయింది. ఫ్యాషన్ మీదున్న మక్కువతో బెంగళూరులో ఫ్యాషన్ కోర్సుచేసి, పేరున్న డిజైనర్ దగ్గర కొంతకాలం పనిచేసింది. తర్వాత హైదరాబాద్ వచ్చి స్టయిలింగ్ స్టార్ట్ చేసింది. పర్ఫెక్ట్ బాడీ, బ్రాండెడ్ దుస్తులతోనే స్టయిలింగ్ అనే ప్రాక్టీస్‌ని మార్చేసింది. పర్సనాలిటీ, బాడీ టైప్, బాడీ టోన్, కంఫర్ట్ వంటివాటిని దృష్టిలో పెట్టుకుని స్ట్రీట్ షాపింగ్ దుస్తులతో స్టయిలింVŠ చేస్తూ పర్ఫెక్ట్ అనిపించుకోవడం మొదలుపెట్టింది. అలా శరణ్య స్టయిలింగ్కి ఫిదా అయ్యి, ఆమె స్టయిలింగ్‌తో గార్జస్ అనిపించుకున్న వారిలో శ్రీలీల, ఐశ్వర్యా మీనన్, కావ్యా థాపర్, దక్షా నాగర్కర్, అదితీ గౌతమి, మాళవికా నాయర్, మిర్నా మీనన్ ఉన్నారు. రామ్ పోతినేని, సుశాంత్, సత్యదేవ్ లాంటి మేల్ యాక్టర్స్‌కూ శరణ్య స్టయిలింగ్ చేసింది. ‘తిమ్మరుసు’, ‘స్కంద’, ‘భోళా శంకర్’ వంటి సినిమాలకు స్టయిలిస్ట్‌గా పనిచేసింది. సినిమా కలర్ పాలెట్‌ను ఫాలో అవుతూ.. లెవెన్త్ అవర్‌లో కూడా కూల్‌గా స్టయిలింగ్ అందించే డైరెక్టర్స్ ఫ్రెండ్లీ స్టయిలిస్ట్‌గా శరణ్యకు మంచి పేరుంది. అలా బోయపాటి, మెహర్ రమేశ్ వంటి డైరెక్టర్లకు ఆమె ఫేవరిట్ స్టయిలిస్ట్ అయింది. -
శ్రీకాకుళం : జోరువానలో శ్రీలీల చూసేందుకు అభిమానుల ఉత్సాహం (ఫొటోలు)
-
బలగం బ్యూటీ బోల్డ్ లుక్.. మరింత హాట్‌గా పూనమ్ బజ్వా!
బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ బోల్డ్ లుక్..!హాట్‌నెస్‌తో పూనమ్ బజ్వా స్టన్నింగ్ పిక్స్..!ఇయర్ ఎండ్ మూడ్‌లో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి..!సితార వింటర్ వేకేషన్ పిక్స్..కిస్సిక్ సాంగ్ ఫోటోలు షేర్ చేసిన శ్రీలీల..స్మైలీ లుక్స్‌తో అనికా సురేంద్రన్..బాత్ టబ్‌లో కాజల్ సిస్టర్ నిషా అగర్వాల్.. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) -
'కిస్ కిస్ కిస్ కిస్సిక్'.. ఫుల్ సాంగ్ వచ్చేసింది!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులను ఊర్రూతలూగించిన సాంగ్ 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా'. పుష్ప చిత్రంలోని ఈ సాంగ్‌లో హీరోయిన్ సమంత తన డ్యాన్స్, గ్లామర్‌తో అదరగొట్టేసింది. అయితే ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన పుష్ప-2లోనూ ఇలాంటి క్రేజీ సాంగ్‌ను మేకర్స్ తీసుకొచ్చారు. కిస్సిక్ పేరుతో వచ్చిన ఐటమ్ సాంగ్ థియేటర్లలో ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. బన్నీ ఫ్యాన్స్ అయితే ఈ సాంగ్‌కు ఫిదా అయిపోయారు.తాజాగా ఈ కిస్సిక్ ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియోను పుష్ప టీమ్ రిలీజ్ చేసింది. ఈ పాటకు హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంది. 'దెబ్బలు పడతాయిరో రాజా' అంటూ ఐటమ్ సాంగ్‌తో శ్రీలీల అలరించింది. కాగా.. ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించగా.. సుభాషిణి ఆలపించారు. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న పుష్పరాజ్..ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. రిలీజ్ రోజున మొదలైన వసూళ్లు ఊచకోత ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1400 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. కలెక్షన్స్ పరంగా ఇదే ఊపు కొనసాగితే త్వరలోనే రెండు వేల కోట్ల మార్కును చేరుకునే ఛాన్స్ ఉంది. -
విజయనగరంలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల సందడి (ఫొటోలు)
-
పండుగ రేసు నుంచి తప్పకున్న నితిన్ 'రాబిన్‌హుడ్'
క్రిస్టమస్ రేసు నుంచి 'రాబిన్ హుడ్' సినిమా తప్పుకుంది. ఈమేరకు చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. 'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. టైటిల్ ప్రకటించిన సమయం నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.‘రాబిన్‌హుడ్’ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే, తాజాగా ఆ సంస్థ మరో ప్రకటన చేసింది. రాబిన్ హుడ్ చిత్రాన్ని అనుకున్న తేదీలో విడుదల చేయడం లేదంటూ తెలిపింది. కానీ, కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. మైత్రీ మూవీస్ నుంచి తెరకెక్కిన పుష్ప2 ఇంకా థియేటర్లో రన్ అవుతూనే ఉంది. మరోవైపు మోహన్‌లాల్ బరోజ్ తెలుగు వర్షన్‌ను ఇదే సంస్థ డిసెంబర్ 25న విడుదల చేస్తుంది. ఆపై ఈ క్రిస్టమస్ రేసులో సుమారు 10కి పైగా చిత్రాలు రేసులో ఉన్నాయి. దీంతో థియేటర్స్ కొరత ఏర్పడే ఛాన్స్ ఉందని రాబిన్ హుడ్ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.రాబిన్ హుడ్‌లో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాశ్‌కుమార్ అందిస్తున్నారు. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుంది. -
చుడీదార్లో అనసూయ ఇలా.. చీరలో శ్రీలీల అలా
చీరలో అందాల బొమ్మలా ముద్దుగుమ్మ శ్రీలీలచుడీదార్లో కొంటెచూపులతో కిక్కిస్తున్న అనసూయగౌనులో యాంకర్ శ్రీముఖి క్యూట్ పోజులుహాట్నెస్ పెంచేస్తున్న బబ్లీ బ్యూటీ రాశీఖన్నాబీచ్ ఒడ్డున చిల్ అవుతున్న మెరుపుతీగ మౌనీరాయ్పొట్టి నిక్కర్లో కేక పుట్టించేలా పూనమ్ బజ్వా View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Niti Taylor (@nititaylor) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
రూ.150 కోట్ల బడ్జెట్ సినిమా.. ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల
వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివ కార్తికేయన్. ఈయన ఇటీవల రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో హీరోగా నటించిన అమరన్ చిత్రం ఘనవిజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. సాయి పల్లవి నాయికగా నటించిన ఈ చిత్రాన్ని నటుడు కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై భారీ ఎత్తున నిర్మించారు. ప్రస్తుతం శివకార్తికేయన్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తాజాగా మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఇందులో నటి శ్రీలీల నాయకిగా నటించనున్నారు. ఇదే ఈమె నటిస్తున్న తొలి తమిళ చిత్రం. పుష్ప సినిమా తర్వాత ఆమెకు భారీగా ఛాన్స్‌లు పెరుగుతున్నాయి. అయితే, ఆమె సెలక్టెడ్ పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందకు వెళ్తుంది. ఇందులో ప్రముఖ నటుడు జయం రవి కూడా ప్రధాన పాత్రను పోషించనున్నారు. మరో ముఖ్య పాత్రలో నటుడు అధర్వ పోషించనున్నారు. డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. దీనికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఆయనకు 100వ చిత్రం కావడం విశేషం. అదేవిధంగా ఈ చిత్రానికి రవి కె.చంద్రన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. దీని గురించి నిర్మాత అధికారిక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. అందులో ఈ ఎస్.కె 25 చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని నిర్మాత ఆకాష్ భాస్కరన్ వ్యక్తం చేశారు. ఇది పీరియడ్ కాల కథాంశంతో రూపొందుతున్న చిత్రం. దీనికి పురనానూరు అనే టైటిల్ ఇంతకుముందే ఖరారు చేశారు అన్నది గమనార్హం. ఈ చిత్రం రూ.150 కోట్ల బడ్జెట్లో రూపొందుతున్నట్లు సమాచారం. మల్టీ స్టార్స్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. -
విశాఖలో సందడి చేసిన సినీ నటి శ్రీలీల (ఫొటోలు)
-
అల్లు అర్జున్ విషయంలో ప్రభాస్, శ్రీలీల రియాక్షన్
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు మద్ధతుగా చిత్ర పరిశ్రమ నుంచి పలువురు నటీనటులు ఇప్పటికే స్పందించారు. ఈ క్రమంలో కొందరు బన్నీ ఇంటికే కూడా వెళ్లి ఆయన్ను కలిసి వచ్చారు. తాజాగా ప్రభాస్ తన స్నేహితుడు అల్లు అర్జున్‌తో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. దీంతో ఇరువురి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. కన్నడ హీరో ఉపేంద్ర కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. వీరిద్దరూ 'S/O సత్యమూర్తి' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా ఈరోజు అల్లు అర్జున్ ఇంటికి వెళ్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఆయన సినిమా షూటింగ్ పనుల వల్ల హైదరాబాద్‌లో లేరని తెలుస్తోంది. దీంతో బన్నీకి ఫోన్ చేసి తన యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ ఉదయం నుంచి బన్నీ ఇంటికి చాలామంది సెలబ్రిటీలు క్యూ కట్టారు. ముఖ్యంగా చిరంజీవి సతీమణి సురేఖ, డైరెక్టర్ సుకుమార్ కంటతడి పెట్టడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.అల్లు అర్జున్ తప్పు చేయరు: శ్రీలీలఅల్లు అర్జున్ అరెస్టుపై నటి 'శ్రీలీల' కూడా రియాక్ట్ అయింది. ఆయన్ను అరెస్టు చేయడం బాధాకరమని ఆమె చెప్పారు. ఈ ఘటనతో నేను చాలా టెన్షన్ పడ్డాను. ఆయన ఎప్పుడు తప్పు చేయరు. న్యాయవ్యస్థను ఆయన గౌరవిస్తారు. కాబట్టి అల్లు అర్జున్‌కు మంచి జరిగింది. ఆయన పెద్ద స్టార్ అయినప్పటికీ భారత పౌరుడిగా మన వ్యవస్థలోని రూల్స్‌ను అందరిలాగే పాటించారు.' అని శ్రీలీల పేర్కొంది. -
పుష్ప-2 బ్లాక్ బస్టర్ తో మళ్లీ శ్రీలీల డేట్స్ కు క్రేజ్
-
రాజమండ్రిలో సందడి చేసిన సినీనటి శ్రీలీల (ఫొటోలు)
-
రాజమండ్రిలో సందడి చేసిన సినీ హీరోయిన్ శ్రీలీల
-
'కిస్సిక్' పాటకు బామ్మలు అదిరిపోయే డ్యాన్స్
'పుష్ప 2'లో ఐటమ్ సాంగ్ 'కిస్సిక్'.. బాగానే ఫేమస్ అయింది. రిలీజైనప్పుడు బాగాలేదన్నారు గానీ ఇప్పుడు అందరూ తెగ డ్యాన్సులు చేస్తున్నారు. పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు ఎవరూ తగ్గట్లేదు. మిగతా వాళ్ల సంగతేమో గానీ ఓ అనాథశ్రమంలో బామ్మలు ఈ పాటకు డ్యాన్స్ చేయడం మాత్రం తెగ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)కర్ణాటక బెల్గం ఊరిలో శాంతాయ్ వృద్ధాశ్రమం ఉంది. ఇందులో ఉంటే బామ్మలు ట్రెండీ గీతాలకు ఎప్పటికప్పుడు డ్యాన్స్ చేస్తూ బాగానే ఫేమ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్లలో ఓ నలుగురు.. 'దెబ్బలు పడతయ్రోయ్' అంటూ 'పుష్ప 2' పాటకు భలే స్టెప్పులేశారు. ఈ వీడియో ఇప్పుడు తెలుగు నెటిజన్లకు తెగ నచ్చేస్తోంది. 'కిస్సిక్' పాటలో కనిపించిన శ్రీలీల కూడా వీళ్ల డ్యాన్స్‌కి ఫిదా అయిపోయింది. వీడియోకి లైక్ కొట్టింది.'పుష్ప 2' కలెక్షన్స్ విషయానికొస్తే మూడు రోజుల్లో రూ.621 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి.. భారత బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేవలం హిందీలోనూ రూ.200 కోట్లకు పైగా నెట్ వసూళ్లు వచ్చినట్లు స్వయంగా నిర్మాతలే ప్రకటించారు. ఆదివారం కూడా భారీగానే టికెట్ సేల్స్ అయ్యింటాయి. టోటల్ వీకెండ్ వసూళ్ల రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ యాక్టర్స్) View this post on Instagram A post shared by Shantai Vruddashram (Old Age Home) (@shantai_second_childhood) -
కాకినాడలో నటి శ్రీలీల సందడి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడలో సినీ నటి శ్రీలీల సందడి చేశారు. ఆదివారం స్థానిక మెయిన్ రోడ్డులో కొత్తగా ఏర్పాటు చేసిన జేసీ మాల్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ మూడంతస్తులు తిరిగి వివిధ రకాల చీరలు, ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాకినాడకు రావడం చాలా సంతోషంగా ఉందని, గతంలో కూడా ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. షాపింగ్ మాల్లో రకరకాల ఉత్పత్తులు ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. సరసమైన ధరలు అందిస్తున్న షాపింగ్ మాల్లో దుస్తులు కొనుగోలు చేయాలని అన్నారు. మాల్ అధినేతలు ఎం.వెంకటరెడ్డి, జమున మాట్లాడుతూ జేసీ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా కాంబో ఆఫర్లు ఇస్తున్నామన్నారు. తక్కువ ధరలో నాణ్యమైన వస్త్రాలు అమ్మడమే తమ సక్సెస్‌కు కారణమన్నారు. మహిళలు మెచ్చే ఎన్నో రకాల చీరలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు. శ్రీలీలను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. -
పుష్ప-2 ఐటమ్ సాంగ్ ఎఫెక్ట్.. శ్రీలీల షాకింగ్ డిసిషన్!
ప్రస్తుతం సినీప్రియులను పుష్ప-2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా అలరిస్తోంది. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్‌తో సినీ ప్రియులను అలరించింది టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల. కిస్సిక్ అంటూ ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. ప్రస్తుతం రాబిన్‌హుడ్‌లో నటిస్తోన్న శ్రీలీల ఐటమ్ సాంగ్‌తో మరింత క్రేజ్ దక్కించుకుంది.అయితే కిస్సిక్ సాంగ్ తర్వాత శ్రీలీలకు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. అయితే అవీ హీరోయిన్గా కాదట. ఐటమ్ సాంగ్స్ చేసేందుకు ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయట. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం సంప్రదించారని టాక్ వినిపిస్తోంది. కానీ ఆ భయంతోనే వరుస ఆఫర్లు శ్రీలీల తిరస్కరించినట్లు తెలుస్తోంది. అదేంటో తెలుసుకుందాం.(ఇది చదవండి: పుష్పరాజ్ ఆల్ టైమ్ రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?)శ్రీలీల షాకింగ్ నిర్ణయం..అయితే టాలీవుడ్ క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీలకు ఆ తర్వాత కొద్దిగా అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ ముద్దుగమ్మ నితిన్ సరసన రాబిన్హుడ్తో ప్రేక్షకులను పలకరించనుంది. అంతకుముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ కావడన్నే పుష్ప-2లో ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పింది శ్రీలీల. ఈ సాంగ్ చేయడానికి ప్రత్యేక కారణముందని కూడా వెల్లడించింది.అయితే తనపై ఐటమ్ సాంగ్ హీరోయిన్గా ముద్రపడుతుందేమో అన్న భయం పట్టుకుందన్న వార్త వైరలవుతోంది. అందువల్లే ఇకపై ఐటమ్ సాంగ్స్ చేయకూడదని శ్రీలీల నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఐటమ్ సాంగ్ కోసం చాలామంది నిర్మాతలు శ్రీలీలను సంప్రదించేందుకు యత్నిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుందని టాక్. ఏదేమైనా కిస్సిక్ సాంగ్‌తో శ్రీలీల క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. -
అరకులో ‘మాస్ జాతర’... రవితేజతో భారీ యాక్షన్ సీక్వెన్స్!
అరుకులో మాస్ జాతర చేయనున్నారు హీరో రవితేజ. ఆయన కెరీర్లో రూపొందుతున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్‌లైన్. హిట్ ఫిల్మ్ ‘సామజవరగమన’కు ఓ రైటర్‌గా పనిచేసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత రవితేజ, హీరోయిన్ శ్రీలీల కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ ఆఫీసర్ లక్ష్మణ్ భేరీ పాత్రలో రవితేజ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా తాజా షెడ్యూల్ డిసెంబరు మూడో వారంలో అరకులో ప్రారంభం కానుందని సమాచారం. ముఖ్యంగా అరకు, ఆ తర్వాత పాడేరు, ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు లొకేషన్స్‌లో ‘మాస్ జాతర’ చిత్రీకరణ జరగనుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొంటారు. కొంత టాకీ పార్టుతో పాటు, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ప్లాన్ చేశారు మేకర్స్. రాజేంద్రప్రసాద్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మే 09న విడుదల కానుంది. -
శివ కార్తికేయన్ తో జోడి కట్టనున్న శ్రీలీల..
-
రంభ పిల్లల్ని చూశారా?.. ప్రాంక్ వీడియోతో శ్రీలీల
కొడుకు ఇద్దరు కూతుళ్లతో ఒకప్పటి హీరోయిన్ రంభహీరో నితిన్‌ని ప్రాంక్ చేసిన యంగ్ సెన్సేషన్ శ్రీలీలకేరళ బీచ్‌లో సర్ఫింగ్ చేసిన హీరోయిన్ ఆషికా రంగనాథ్మాల్దీవుల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న హన్సికకొత్త సినిమా షూటింగ్లో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేనాభి అందాలతో కట్టిపడేస్తున్న రీతూ చౌదరిపొట్టి నిక్కర్లో కేక పుట్టిస్తున్న తెలుగమ్మాయి రమ్య View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Nainika Anasuru🦋 (@_.nainikadances) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Rahasya Kiran (@rahasya_kiran) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Anju Kurian (Ju) (@anjutk10) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Rambha💕 (@rambhaindran_) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) -
ఒక్కసారిగా పెరిగిన శ్రీ లీల క్రేజ్...
-
వైల్డ్ ఫైర్.. ఆంధ్రా అంతా 'పుష్ప 2' నామస్మరణే (ఫొటోలు)
-
పుష్ప 2 కిస్సిక్, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల అదిరిపోయే లేటెస్ట్ లుక్స్ (ఫొటోలు)
-
'పుష్ప 2' మూవీ ఆల్ పోస్టర్స్.. ఫుల్ HD (ఫొటోలు)
-
పుష్ప2 ఈవెంట్లో సందడి చేసిన శ్రీలీల, అనసూయ (ఫొటోలు)
-
ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పుష్ప-2
-
వైట్ శారీలో ఆర్జీవీ హీరోయిన్.. మరింత క్యూట్‌గా ఆషిక రంగనాథ్!
వైట్ శారీలో ఆర్జీవీ శారీ హీరోయిన్ ఆరాధ్య దేవి స్టన్నింగ్ లుక్స్...ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్ వేడుకలో మెరిసిన ప్రియమణి..నా సామిరంగ హీరోయిన్ ఆషిక రంగనాథ్ క్యూట్ లుక్స్...ఈ కోట తనకెంతో ప్రత్యేకమన్నా ఆదితి రావు హైదరీ..ఫిల్మ్ ఫేర్ అవార్డ్‌తో లైగర్ భామ అనన్యపాండే..తెల్లటి చీరలో శ్రీలీల స్మైలీ లుక్స్.. బంగారం లాంటి చీరలో మెరిసిన శ్రియా శరణ్.. View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Manoj Kumar Katokar (@media9manoj) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by AaradhyaDevi (@iamaaradhyadevi) -
సిక్స్‌ప్యాక్ లేదని నన్ను రిజెక్ట్ చేశారు: నవీన్ పొలిశెట్టి
హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4లో హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ శ్రీలీల పాల్గొన్నారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ఎప్పటిలాగే నవీన్ పొలిశెట్టి నవ్వులు పంచాడు.. బాలకృష్ణను ఉద్దేశిస్తూ.. సర్, మీరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే.. మీరు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.. నేను మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్ అంటూ నవ్వులు పూయించాడు.క్లాసికల్ స్టైల్లో కుర్చీ మడతపెట్టిశ్రీలీల వీణ పట్టుకుని కూర్చోగా.. కుర్చీ మడతపెట్టి పాటను క్లాసికల్ స్టైల్లో ట్రై చేయమంటూ రాగమందుకున్నాడు నవీన్. అతడి గానం విన్న శ్రీలీల.. తన వీణ భరించలేకపోతోందంటూ నవ్వేసింది. ఆడిషన్స్ గురించి చెప్పమని బాలయ్య అడగ్గా.. నవీన్ ఓ సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. సిక్స్ ప్యాక్ లేదని..ఓ చిప్స్ కంపెనీ ఆడిషన్లో.. నాకు సిక్స్ ప్యాక్ లేదని రిజెక్ట్ చేశారు. అసలు చిప్స్ తిన్నవాడికి సిక్స్‌ప్యాక్ ఎలా వస్తుదని లాజిక్ పాయింట్ అడిగాడు. చివర్లో ముగ్గురూ కిస్సిక్ పాటకు స్టెప్పులేశారు. ఈ ఫన్‌ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 6న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో రిలీజ్ కానుంది. -
కుర్చీ మడతపెట్టి పాటకు మైండ్ బ్లాక్ అయ్యే రికార్డ్
కొన్ని పాటలు భాషతో సంబంధం లేకుండా క్లిక్ అవుతాయి. అలా ఈ ఏడాది కుర్చీ మడతపెట్టి పాట సూపర్‌డూపర్ హిట్టయింది. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ లెవల్లోనూ ఈ పాట మార్మోగిపోయింది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన గుంటూరు కారం సినిమాలోనిదే ఈ పాట!పాట బ్లాక్బాస్టర్ హిట్మహేశ్బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైంది. మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీలో తమన్ అందించిన సంగీతం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి పాటకైతే విజిల్స్ పడ్డాయి.వన్స్మోర్ఈ సాంగ్ యూట్యూబ్‌లో రిలీజవగానే సెన్సేషనల్ హిట్ అయింది. మహేశ్, శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. రిపీట్ మోడ్‌లో పాట వింటూనే ఉన్నారు. తాజాగా ఈ పాట అరుదైన రికార్డు అందుకుంది. ఏకంగా 50 కోట్ల (500 మిలియన్) వ్యూస్ సాధించింది. ఈ సంతోషకర సమయంలో ఫ్యాన్స్ వన్స్‌మోర్ అంటూ మరోసారి కుర్చీ మడతపెట్టి సాంగ్ వింటున్నారు. చదవండి: నాన్న ఇంటికి రావొద్దన్నారు.. చచ్చిపోదామనుకున్నా: రాజేంద్రప్రసాద్ -
రెడ్ అండ్ బ్లాక్ సారీలో.. శ్రీలీల అన్‌స్టాపబుల్ లుక్స్ (ఫోటోలు)
-
పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. బలమైన కారణం ఉందన్న శ్రీలీల!
ప్రస్తుతం అందరిచూపు పుష్ప-2 ది రూల్‌పైనే ఉంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. అయితే సినిమా రిలీజ్‌కు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఈవెంట్లో కిస్సిక్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు శ్రీలీల తన స్టెప్పులతో అదరగొట్టారు. ఈ సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే అత్యధిక వ్యూస్‌తో రికార్డులు క్రియేట్ చేస్తోంది.అయితే ఈ సాంగ్ చేయడం వెనక బలమైన కారణం ఉందని హీరోయిన్ శ్రీలీల అన్నారు. రాబిన్‌హుడ్ మూవీ ప్రెస్మీట్లో కిస్సిక్ సాంగ్ చేయడం గురించి మాట్లాడారు. ఇది యావరేజ్ ఐటమ్ సాంగ్ కాదన్నారు. గతంలో ఎన్నో సినిమాలకు ఐటమ్ సాంగ్ చేయమని అడిగారు. కానీ ఇప్పటివరకు నేను చేయలేదు..ఈ సాంగ్ చేయడానికి స్ట్రాంగ్ రీజన్ ఉందని శ్రీలీల అన్నారు. పుష్ప-2 రిలీజైనప్పుడు అదేంటో మీకే తెలుస్తుందని శ్రీలీల పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీలీల.. నితిన్ సరసన రాబిన్ హుడ్ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.కాగా.. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న పుష్ప-2 డిసెంబర్ 4న విడుదల కానుంది. ఈ మూవీ రష్మిక మందన్నా శ్రీవల్లిగా అలరించనుంది. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరోసారి టాలీవుడ్ ప్రియులను మెప్పించనున్నారు. -
'కిస్సిక్' కోసం భారీ రెమ్యునరేషన్.. స్పందించిన శ్రీలీల
ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసిన ‘పుష్ప 2’ మూవీ గురించే మాట్లాతున్నారు. ఇక ఇటీవల విడుదలైన స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’ అయితే యూట్యూబ్‌లో దుమ్ము దులిపేస్తుంది. ఈ పాటకు అల్లు అర్జున్, శ్రీలీల వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పాటు ఈ పాటపై మరో ఆసక్తికర గాసిప్ కూడా నెట్టింట హల్చల్ చేస్తుంది. అదే శ్రీలీల రెమ్యునరేషన్. ఈ ఐటమ్ సాంగ్ కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషన్ తీసుకుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఓ భారీ సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటుందో ఈ పాటకు అంతే మొత్తంలో డిమాండ్ చేసిందట. నిర్మాతలు కూడా శ్రీలీల అడిగినంత డబ్బు ఇచ్చారని నిన్నటి నుంచి తెగ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ పుకారుపై శ్రీలీలతో పాటు నిర్మాతలు స్పందించారు.వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్- శ్రీలీల జంటగా రాబిన్‌హుడ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాబిన్‌హుడ్ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నితిన్, శ్రీలీలతో పాటు దర్శకుడు వెంకీ, నిర్మాత రవి, నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్ప ఐటమ్ సాంగ్ రెమ్యునరేషన్‌పై శ్రీలీలకు ప్రశ్న ఎదురైంది. ‘కిస్సిక్’ సాంగ్ కోసం సినిమా స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారట కదా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘అసలు ఇప్పటి వరకు రెమ్యునరేషన్ మ్యాటరే మా మధ్య జరగలేదని అటు శ్రీలీల, ఇటు నిర్మాతలు చెప్పుకొచ్చారు. ‘అంత ఇంత అని ఏమి అనుకోలేదు. అవకాశం వచ్చింది చేసేశా. ఇంకా డబ్బుల గురించి మాట్లాడలేదు’అని శ్రీలీల అన్నారు. నిర్మాతలు, నవీన్ మాట్లాడుతూ..‘రెమ్యునరేషన్ టాపికే శ్రీలీల తీయలేదు. మీరు అనుకున్నంత రెమ్యునరేషన్ అయితే ఇవ్వలేదు’అని క్లారిటీ ఇచ్చారు.ఇక పుష్ప 2 విషయానికొస్తే.. అల్లు అర్జున్- రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
నితిన్ 'రాబిన్‌హుడ్' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
వన్ మోర్ టైమ్ అంటోన్న నితిన్.. రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది!
భీష్మ హిట్ తర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబోలో వస్తోన్న చిత్రం రాబిన్‌హుడ్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.తాజాగా రాబిన్‌హుడ్ మూవీ నుంచి వన్ మోర్ టైమ్ అనే రొమాంటిక్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. జీవి ప్రకాశ్, విద్య ఆలపించారు. యూనిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతమందిస్తున్నారు. The LOVE FUSION SONG OF THE YEAR is here!#Robinhood First Single #OneMoreTime out now!▶️ https://t.co/QR2AWYjcFlSung by @gvprakash & @VidyaVox 🎙️GRAND RELEASE WORLDWIDE ON DECEMBER 25th 💥@sreeleela14 @VenkyKudumula @kk_lyricist @OfficialSekhar @MythriOfficial pic.twitter.com/0MiffNi3x6— nithiin (@actor_nithiin) November 26, 2024