
రీసెంట్‌గా థియేటర్లలో పలు చిత్రాలు రిలీజ్ కాగా.. 'జూనియర్' చిత్రానికి చెప్పుకోదగ్గ వసూళ్లు కనిపిస్తున్నాయి. కిరీటికి హీరోగా ఇదే తొలి సినిమా అయినప్పటికీ డ్యాన్సులు, ఫైట్స్, డైలాగ్స్ లాంటివి బాగా చెప్పడం.. దానికి తోడు 'వైరల్ వయ్యారి' పాట తెగ వైరల్ అయిపోయేసరికి జనాలు ఈ మూవీని చూసేందుకు ఓ మాదిరిగా థియేటర్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తొలిరోజు కంటే రెండో రోజు వసూళ్లు కాస్త ఎక్కువగానే వచ్చాయి. ఇంతకీ రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్ ఎంత?
కిరీటి, శ్రీలీల, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని రెగ్యులర్ కమర్షియల్ తరహా కథతోనే తెరకెక్కించారు. అంతెందుకు గతంలో వచ్చిన తెలుగు చిత్రాల ఛాయలు కూడా చాలా కనిపిస్తాయి. అయితేనేం వేరే చిత్రాలేం లేకపోవడం దీనికి ఓ రకంగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.1.45 కోట్లు వసూళ్లు రాగా.. రెండో రోజు రూ.1.65 కోట్ల మేర కలెక్షన్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అంటే రెండు రోజులకు కలిపి రూ.3.10 కోట్ల మేర నెట్ కలెక్షన్ అందుకున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: హీరోయిన్‌తో ప్రేమ... పెళ్లి వాయిదా వేసిన విశాల్)
హీరోగా కొత్త కుర్రాడు చేస్తున్నప్పటికీ ఈ మాదిరి వసూళ్లు అంటే కాస్త విశేషమనే చెప్పాలి. అయితే వచ్చేవారం థియేటర్లలోకి 'హరిహర వీరమల్లు' రానుంది. ఇంతలోనే 'జూనియర్' కలెక్షన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మరి ఈ మూవీకి లాంగ్ రన్ అయ్యేసరికి ఎంత వసూళ్లు వస్తాయో చూడాలి?
జూనియర్ విషయానికొస్తే.. జ్ఞాపకాలే ముఖ్యమనుకునే కుర్రాడు అభి(కిరీటి). కాలేజీలో సరదాగా గడుపుతూనే చదువులో మంచి ప్రతిభ చూపిస్తాడు. తను ప్రేమించిన శ్రీలీల పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. కానీ ఆ కంపెనీ బాస్ విజయ(జెనీలియా)కు అభి అస్సలు నచ్చడు. ఆమెకు తన పేరుతో ఉన్న విజయనగరం అనే ఊరు కూడా నచ్చదు. అలాంటిది అభితో కలిసి విజయ.. విజయనగరం వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లాక ఏం జరిగింది? ఆ ఊరికి విజయకు సంబంధమేంటి అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: సేనాని రూల్స్ మాట్లాడతారు.. పాటించరు)