కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది. పోస్టర్ చూస్తే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా కనిపించనుంది.
తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజైన టీజర్ చూస్తుంటే 20 ఏళ్ల అమ్మాయితో 40 ఏళ్ల వ్యక్తి ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తనకంటే వయసులో 20 ఏళ్లు పెద్దగా ఉన్న వ్యక్తితో హీరోయిన్ ప్రేమలో పడడం ఈ చిత్రం ఆసక్తిని మరింత పెంచుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.


