breaking news
Vishwanath and Sons Movie
-
ఆ సినిమా చూసి ఏడ్చేశా.. గంటసేపు నిద్రపట్టలేదు: శివరాజ్ కుమార్
కొన్ని సినిమాలు అందరికీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ కొందరికి మాత్రం అవి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఇప్పుడు అలాంటి అనుభవమే ఎదుర్కొన్నారు. ఈయన లీడ్ రోల్ చేసిన 'బెయిల్' మూవీ ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా కారణంగా తనకెలాంటి ఫీలింగ్ వచ్చిందో బయటపెట్టారు.(ఇదీ చదవండి: తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో భారీ రెమ్యునరేషన్! రోజుకు రూ.7.5 లక్షలు)'ఈ మధ్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా చూశాను. చూసిన తర్వాత గంటసేపు నిద్రపట్టలేదు. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సీన్స్ చూస్తున్నంతసేపు మా అమ్మనాన్న డాక్టర్ రాజ్ కుమార్, పార్వతమ్మలతో పాటు మా కుటుంబమే గుర్తొచ్చింది. భవిష్యత్‌లో నేను కూడా ఇలాంటి మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చేయాలనుకుంటున్నాను' అని శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చారు.సూర్య హీరోగా చేసిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైంది. తెలుగులో మంచి టాక్ వచ్చినప్పటికీ తమిళంలో పెద్దగా ఆడలేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ మూవీపై సర్వత్రా నెగిటివ్ టాక్ వినిపించింది. అలాంటిది శివరాజ్ కుమార్ కన్నీళ్లు పెట్టుకోవడం, నిద్రపోలేకపోవడం ఆసక్తికరంగా అనిపించింది.శివరాజ్ కుమార్ విషయానికొస్తే.. కన్నడలో హీరోగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ ఈ ఏడాది తెలుగులో వచ్చిన 'పెద్ది'లో కీలక పాత్ర చేశారు. రజనీకాంత్ 'జైలర్ 2'లోనూ అతిథి పాత్ర చేశారు. అలానే తమిళంలోనే 'పికాసో', తెలుగులో 'గుమ్మడి నర్సయ్య', కన్నడలో 'డాడ్', 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రాలతో పాటు క్యాన్సర్ జయించిన తన జీవితం ఆధారంగా తీసిన 'సర్వైవర్: ఏ సూపర్‌స్టార్' డాక్యుమెంటరీలోనూ కనిపించనున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మమిత సూపర్ హిట్ సినిమా.. అధికారిక ప్రకటన) -
ఈ తార పట్టిందే బంగారం.. ఏడాదిలో 1000 కోట్లు..
ఒకప్పుడు చిన్న పాత్రలతో మెప్పించిన ఈ మలయాళ భామ..ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. వరుస విజయాలు.. భారీ వసూళ్లతో మమిత బైజు క్రేజ్ ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. పట్టింది ప్రతీదీ బంగారం అన్నట్లుగా.. వరుసగా ఆమె నటించిన ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపాయి. ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో ఈ అమ్మడికి స్టార్ హీరోయిన్ల రేంజ్లో డిమాండ్ పెరిగిపోయింది. అసలు ఆ ఐదు సినిమాలు ఏంటి..? మమిత బైజు కేరీర్‌ను మలుపు తిప్పిన ఆ విజయాలు ఏంటో చూద్దాం..!‘కర’తో 50 కోట్లు..తమిళ హీరో ధనుష్ కథానాయకుడిగా విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన చిత్రం ‘కర’ ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్గా నటించింది. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశాయి. ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో సాగుతుంది. తండ్రి-కొడుకుల ఎమోషన్‌తో తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం అంతగా మెప్పించలేకపోయింది. దీంతో కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.‘డ్యూడ్’తో100 కోట్లుప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ నెల 17 విడుదలైంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లుకు పైగా వసూళ్లు సాధించింది. ఇదీ చదవండి: ’మండాడి‘పై రజినీకాంత్ రివ్యూ.. నటుడు ఎమోషనల్‘జననాయగన్’తో 300కోట్లకు పైగా.. తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్( తెలుగులో జన నాయకుడు). హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ నిర్మించారు. ఈ చిత్రం జులై 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తెలుగులో అంత విజయం సాధించనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు వసూళ్లు రాబెట్టింది.బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ 300 కోట్లుబాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన చిత్రాల్లో ‘'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ కూడా ఒకటి. మమితా బైజు, నివీన్ పౌలీ నటించిన ఈ చిత్రం మలయాళ సినీ పరిశ్రమలో అత్యధిక వసూళ్లను సాధించింది. ఓనమ్ పండగ సందర్భంగా ఆగస్టు 21న మలయాళంలో రిలీజ్ అయిన ఈ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.300ల కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సెప్టెంబర్ 4న ఈ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ అయింది. ‘ప్రేమలు’ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించారు. ఇదీ చదవండి: ఓటీటీ తర్వాత థియేటర్లో.. కానీ ఎక్కడ తేడా కొట్టింది?విశ్వనాథ్ అండ్ సన్స్ 260 కోట్లుసూర్య, మమితా బైజు జంటగా నటించిన తాజా చిత్రం‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్స్‌లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 260 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులనూ అలరిస్తోంది. సెప్టెంబర్11 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. -
ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరీ ఇంత ఘోరమా?
కొన్ని సినిమాలు థియేటర్లలో బాగా ఆడుతాయి. కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత అవే చిత్రాలకు రెస్పాన్స్ మరోలా ఉంటుంది. ఇది చాలా మూవీస్ విషయంలో జరిగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. కొన్నాళ్ల క్రితం 'చెన్నై లవ్ స్టోరీ'కి ఇలాంటి అనుభవమే ఎదురవగా.. ఇప్పుడీ లిస్టులో విశ్వనాథ్ అండ్ సన్స్, మకుటం వచ్చి చేరాయి.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన)సూర్య హీరోగా చేసిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా గత నెలలో థియేటర్లలో రిలీజైంది. తెలుగులో హిట్ కాగా తమిళంలో పెద్దగా కలెక్షన్స్ రాలేదు. ఓవరాల్‌గా బాగానే ఉందనిపించుకుంది. కానీ వారం క్రితం ఓటీటీలో రిలీజైన తర్వాత పూర్తిగా సీన్ మారిపోయింది. అసలు ఈ మూవీ హిట్ ఎలా అయిందా అని నెటిజన్లు ట్వీట్స్ పెడుతున్నారు. మమిత బైజు సీన్స్ తప్పితే మిగతావి ఏమంత ఇంట్రెస్టింగ్గా లేవు కదా అని మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో ప్రింట్ క్వాలిటీ కూడా భయంకరంగా ఉందని వీడియోలని ఫ్రూప్స్గా పెడుతున్నారు.సూర్య సినిమా విషయంలో ఇలా ఉంటే.. విశాల్ 'మకుటం' చిత్రానికి అయితే ఓటీటీలోకి వచ్చిన పోస్ట్‌మార్టం చేస్తున్నారు. పావుగంట కంటే ఎక్కువ చూడలేకపోయామని ఒకరు.. అసలు ఈ మూవీ ఎలా తీశార్రా బాబు అని మరొకరు పోస్టులు పెడుతున్నారు. ఈ చిత్ర మేకింగ్ వీడియోల్లో విశాల్ ప్రవర్తనకు సంబంధించిన బిట్స్ కట్ చేసి సోషల్ మీడియాలో దారుణంగా ఆడుకుంటున్నారు.గత కొన్నిరోజుల నుంచి ట్విటర్, ఇన్ స్టాలో ఈ రెండు సినిమాల గురించే చాలా చర్చ జరుగుతోంది. ఇదంతా చూసిన చాలామంది సినిమాలు నిజంగా బాగోలేవా? లేదంటే పనిగట్టుకుని నెటిజన్లు వీటిని ట్రోల్ చేస్తున్నారా? అని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఓటీటీ, సోషల్ మీడియా జమానా పెరిగిన తర్వాత మూవీస్ విషయంలో శూలశోధన ఎక్కువైంది. రాబోయే రోజుల్లో ఈ ట్రోలింగ్ బారిన ఇంకెన్ని పెద్ద సినిమాలు పడతాయో ఏంటో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
సూర్య సినిమాకు భారీ ఓపెనింగ్స్ పాన్ ఇండియా వసూళ్లే టార్గెట్!
-
వీకెండ్ ధమాకా.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు
ఈ వారం థియేటర్లలోకి ఎపిక్, మారెమ్మ, మహేంద్ర గిరి వారాహి, మండాడి, సర్దార్ 2 సినిమాలు వచ్చాయి. అయితే వీటిలో దేనికి కూడా సూపర్ హిట్ అనే టాక్ రాలేదు. వీటిని చూసిన చాలామంది ఓకే పర్లేదని అంటున్నారు. మరోవైపు ఓటీటీల్లో ఈ వీకెండ్ ఏకంగా 26 సినిమాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో పలు తెలుగు హిట్ సినిమాలతో పాటు డబ్బింగ్‌లు కూడా ఉన్నాయి.ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్', విశాల్ 'మకుటం', మహారాజా హాస్టల్, పంచనామా, కట్టాలన్, వరవు లాంటి చిత్రాలు, సిరీస్‌లు చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (సెప్టెంబరు 11)అమెజాన్ ప్రైమ్మకుటం -తెలుగు డబ్బింగ్ సినిమామహారాజ హాస్టల్ - తెలుగు డబ్బింగ్ మూవీమ్యాజిక్ మష్రూమ్స్ - మలయాళ చిత్రంఅచ్యుత అవతారం - మలయాళ సినిమాడియోల్ బాంద్ 2 - మరాఠీ చిత్రంసల్మోఖ్జీ - తెలుగు డబ్బింగ్ కొరియన్ సినిమారక్కసపురదోళ్ - కన్నడ మూవీద రివల్యూషనరీస్ - తెలుగు డబ్బింగ్ సిరీస్నెట్ఫ్లిక్స్విశ్వనాథ్ అండ్ సన్స్ - తెలుగు డబ్బింగ్ సినిమాగో టీమ్ - స్పానిష్ మూవీచుంబక్ - హిందీ సిరీస్కాల్ మై ఏజెంట్! ద మూవీ - ఇంగ్లీష్ సిరీస్హాట్స్టార్ద పేపర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్అలీబాబా ఔర్ 40 భూత్ - హిందీ సిరీస్ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్ - తెలుగు డబ్బింగ్ సిరీస్వన్ నైట్ వోయెజ్ - జపనీస్ సిరీస్లిబాంగ్ లిబు - మలేషియన్ మూవీజంగిల్ టేల్స్ విత్ మౌగ్లీ - హిందీ సిరీస్ (సెప్టెంబరు 12)జీ5పంచనామా - తెలుగు సిరీస్ఘమసాన్ - హిందీ సిరీస్అద్కిట్టా - మరాఠీ మూవీఆహాకట్టాలన్ - తెలుగు డబ్బింగ్ సినిమావరవు - తెలుగు డబ్బింగ్ మూవీవెంజన్స్ - తమిళ చిత్రంసన్ నెక్స్ట్వివాహ్ - మలయాళ సినిమాలయన్స్ గేట్ ప్లేహంగ్రీ - తెలుగు డబ్బింగ్ మూవీ -
ఓటీటీలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
సూర్య, మమితా బైజు జంటగా నటించిన తాజా చిత్రం‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్స్‌లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 260 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందకు రెడీ అయింది. సెప్టెంబర్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ కథేంటంటే.. సంజయ్ విశ్వనాథ్(సూర్య) ఓ వ్యాపారవేత్త, ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన షూటర్. 40 ఏళ్లు వయసొచ్చినా పెళ్లి చేసుకోడు. అమెరికాకి వెళ్లి సరోగసి ద్వారా మగబిడ్డని కని స్వదేశానికి తిరిగొస్తాడు. కొన్నాళ్ల తర్వాత పిల్లాడు ఓ అరుదైన వ్యాధి బారిన పడతాడు. బోన్ మారో(ఎముక గుజ్జు) ట్రాన్స్ ప్లాంట్ అవసరమవుతుంది. దీంతో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి అవసరం ఏర్పడుతుంది. అమెరికాకు తిరిగెళ్లి సరోగసి మదర్ మ్యాడీ (మమిత)ని వెతికి భారత్‌కి తీసుకొస్తాడు. సర్జరీ తర్వాత ఆమె తిరిగి వెళ్ళిపోవాలని ముందే ఒప్పందం చేసుకుంటాడు.20 ఏళ్ల మ్యాడీ.. సంజయ్ ఇంటికి వచ్చిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు సంజయ్ 40 ఏళ్లు వచ్చినా పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? తల్లి అవసరం లేకుండా తన కొడుకును పెంచుకోగలిగాడా? మ్యాడీ ప్రేమని సంజయ్ ఎందుకు తిరస్కరించాడు? చివరకు పెళ్లి విషయంలో సంజయ్ తన ఆలోచన మార్చుకున్నాడా లేదా? అనేది మిగతా స్టోరీ. -
మమిత సూపర్ డ్యాన్స్.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
రెండు వారాల క్రితం థియేటర్లలోకి వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాలో హీరో సూర్యతో పాటు చాలామందికి హీరోయిన్ మమిత బైజు కూడా తెగ నచ్చేసింది. యాక్టింగ్ అంటూ ఈమె చేసిన అల్లరికి చాలామంది ఫ్లాట్ అయిపోయారు. ఇదే మూవీలో హిట్ గీతం 'నేనో బటర్ ఫ్లై' గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడీ సాంగ్ పూర్తి వీడియోని రిలీజ్ చేసేశారు.(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి)సూర్యపై ప్రేమ పుట్టే సందర్భంలో మమిత ఈ పాట పాడుతూ క్యూట్, సూపర్ డ్యాన్స్ చేస్తుంది. ఈ మూవీకి ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. తమిళ చిత్రంగా దీన్ని తీశారు. అయితే సొంత భాషలో పెద్దగా ఆడలేదు గానీ తెలుగు, ఓవర్సీస్లో మంచి వసూళ్లు దక్కించుకుంది. వచ్చే నెల రెండో వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: మమిత మరో ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్) -
కథ వినగానే సూర్య అలా అన్నారు!: వెంకీ అట్లూరి
‘‘ఒకప్పుడు అన్ని రకాల జానర్ సినిమాలు వచ్చేవి. కానీ, కొంతకాలంగా ఫ్యామిలీ సినిమాలు తగ్గిపోయాయి. అందుకే మంచి ఫ్యామిలీ సినిమా వస్తే, ప్రేక్షకులు థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు. కోవిడ్ టైమ్‌లో ఆడియన్స్ కొత్తదనం కోరుకుంటున్నారని తెలుసుకున్నాను. ఇందుకు తగ్గట్లే జానర్స్ షిఫ్ట్ చేస్తూ, కథలు రాస్తూ సినిమాలు చేస్తున్నాను’’ అని వెంకీ అట్లూరి చెప్పారు. సూర్య, మమిత బైజు హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది.ఈ సినిమా రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, విజయవంతంగా ప్రదర్శితమవుతోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో వెంకీ అట్లూరి చెప్పిన విశేషాలు... ⇒ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాకు మేం ఊహించినదానికంటే ఎక్కువ స్పందన లభిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. సూర్యగారు ఈ సినిమా కథ వినగానే కథకు అనవసరమైన కామెడీ లేదా కమర్షియల్ అంశాలు జోడించకుండా నిజాయితీగా చెబుదామని అన్నారు. అందుకే కథలోని ఏ పాత్ర పడిపోకుండా జాగ్రత్తలు వహించాను. అలాగే క్లైమాక్స్‌లో కూడా చాలా కేర్ తీసుకున్నాం. ⇒ నా దృష్టిలో ఏ మనిషి చెడ్డవారు కాదు. పరిస్థితుల వల్ల ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవరిస్తుంటారు. ఇదే ఈ విషయాన్ని ఈ సినిమాలో చెప్పాను. వయసు వ్యత్యాసం ఉన్న బంధంపై కథ రాయాలనుకున్నప్పుడే హీరోకు 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి బలమైన కారణం ఉండాలనుకుని, ఈ అంశం చుట్టూ ఈ కథ అల్లాను. వయసు వ్యత్యాసం కూడిన అంశాన్ని తమిళనాడు సీఎం విజయ్‌గారి జీవితంతో పోల్చుతూ కొందరు సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తున్నారని అంటున్నారు. కానీ నిజానికి ఈ కథను 2022లోనే అనుకుని, క్యారెక్టర్ పేరు సంజయ్ అని రాసుకున్నాను. కాకపోతే హీరోగా సూర్యగారిని ఊహించుకోలేదు. సూర్యగారికి కథ చెప్పిన తర్వాత ఆయన బాడీ ల్యాంగ్వేజ్కి తగ్గట్లు కొన్ని మార్పులు చేయడం జరిగింది. ⇒ సూర్యగారికి తమిళంలో మంచి మార్కెట్ ఉంది. అందుకే ఈ సినిమాను తమిళంలో తీసి, తెలుగులో డబ్ చేశాం. అయితే తమిళంలో కన్నా, తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి కదా అంటున్నారు. కానీ రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తున్నారు. తమిళనాడు ఒక రాష్ట్రం మాత్రమే. పైగా మన దగ్గర థియేటర్స్ సంఖ్య ఎక్కువ. అలాగే టికెట్ ధరల్లో కూడా వ్యత్యాసం ఉంది. అయితే అక్కడి సిని మాలకు థియేటర్స్‌లో లాంగ్ రన్ ఉంటుంది.⇒ సితార బ్యానర్లో నిర్మితమయ్యే సినిమాలకు త్రివిక్రమ్‌గారి పర్యవేక్షణ ఉంటుంది. దీంతో ఆయన సినిమాలు చూసి కొన్ని చిన్న చిన్న మార్పులు చెబుతుంటారు. కానీ ఈ సినిమాకి ఆయన ఏ మార్పులు చెప్పలేదు. డబ్బు, అగ్రిమెంట్లను మించిన అతీతమైన బంధం సితార బ్యానర్‌తో నాకు ఏర్పడింది. నా నెక్ట్స్ చిత్రం కూడా ఇదే బ్యానర్లో ఉండొచ్చు. ఇటీవలి కాలంలో తెలుగు హీరోతోనే సినిమా చేయాలనుకున్నాను. ఏంటో... అనుకుంటే కుదరడం లేదు. ఈసారి అనుకోకుండా ముందుకు వెళ్తాను (నవ్వుతూ). -
సూర్యలోని విశ్వాసమే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విజయానికి కారణం: వెంకీ
సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. నటి మమిత బైజు నాయకిగా నటించిన ఇందులో నటి రాధిక శరత్ కుమార్, భవానీశ్రీ, సునిల్ రెడ్డి, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి కథ, కథనం దర్శకత్వం బాధ్యతలను వెంకీ అట్లూరి నిర్వహించారు. జీవీ.ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఇటీవల తెలుగు, తమిళం భాషల్లో విడుదలై సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం చైన్నెలోని ఒక స్టార్ హోటల్లో థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించారు.ఇందులో పాల్గొన్న నటి రాధిక శరత్ కుమార్ మాట్లాడుతూ నటుడు సూర్య తనకు చాలా కాలంగా తెలుసు అన్నారు. ఈ చిత్రంలో ఆయన ఎంతో పరిపక్వతతో నటించారని ప్రశంసించారు. ఈ చిత్రం గురించి ఒక్క నెగిటివ్ విమర్శ వస్తుందని చూశానని, అయితే అన్ని పాజిటివ్ విమర్శలే రావడం విశేషం అన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి ప్రతి విషయంలోనూ చాలా క్లియర్‌గా ఉన్నారన్నారు. తనకు బాగా నచ్చిన చిత్రం సూర్యవంశం అనీ, ఆ తరువాత విశ్వనాథ్ అండ్ సన్స్ అని పేర్కొన్నారు.దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు. చిత్ర ప్రివ్యూను మీడియా మిత్రులతో కలిసి చూశానని, దీంతో వారి రియాక్షన్ ఎలా ఉంటుందో అని కాస్త భయపడ్డానని, అయితే ఆ తరువాత ప్రతి ఒక్కరూ బాగుందని అభినందించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాను ఇంతకు ముందు దర్శకత్వం వహించిన వాథ్తి, లక్కీ భాస్కర్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారని, తాజాగా తమిళంలో చేసిన విశ్వనాథ్ అండ్ సనన్స్ చిత్రానికి గాను విజయాన్ని అందించారని పేర్కొన్నారు. నటుడు సూర్యలోని విశ్వాసమే ఈ చిత్రం విజయానికి ప్రధాన కారణం అని దర్శకుడు వెంకీ అట్లూ రి పేర్కొన్నారు. కాగా నటుడు సూర్య చైన్నెలో లేని కారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న లేదు. -
మూడు రోజుల్లోనే.. కోట్ల వర్షం కురిపించిన విశ్వనాథ్ అండ్ సన్స్!
-
చిరంజీవితో సినిమా.. నేను ఇంకాస్త ఎదగాలి
తెలుగులో ఒకప్పటి దర్శకులైనా ఇప్పటి జనరేషన్ డైరెక్టర్స్ అయినా మెగాస్టార్ చిరంజీవితో ఒక్క మూవీ అయినా చేయాలని ఆశపడుతుంటారు. సర్, లక్కీ భాస్కర్, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాలతో వరస హిట్స్ అందుకున్న వెంకీ అట్లూరి కూడా ఇప్పుడు చిరుతో సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ)'చిరంజీవితో ఒక సినిమా అనుకున్నాం. కానీ ఇప్పుడే చేయాలనుకోవట్లేదు. మరీ ముఖ్యంగా నేను అనుకున్న సబ్జెక్టుని, చిరంజీవి లాంటి స్టార్‌ని హ్యాండిల్ చేయాలంటే, నేను ఇంకాస్త ఎదగాలి అనుకుంటున్నాను. చిరంజీవి లాంటి స్టార్ హీరో చేసినప్పుడు అన్నీ సరిగ్గా చూసుకోవాలి. ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్ అనుకుంటున్నాను' అని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చాడు.వెంకీ అట్లూరి గురించి చెప్పుకోవాలంటే హీరోగా టాలీవుడ్లో కెరీర్ ప్రారంభించాడు. రెండు చేసేసరికి సీన్ అర్థమై దర్శకుడిగా మారిపోయాడు. వరుణ్ తేజ్ హీరోగా 'తొలిప్రేమ' తీసి డైరెక్టర్‌గా తొలి సక్సెస్ అందుకున్నాడు. కానీ తర్వాత చేసిన రంగ్ దే, మిస్టర్ మజ్ను ఫెయిలయ్యాయి. దీంతో రూట్ మార్చిన వెంకీ.. ధనుష్‌తో 'సర్', దుల్కర్ సల్మాన్‌తో 'లక్కీ భాస్కర్' లాంటి వైవిధ్యమైన చిత్రాలు చేశాడు. తాజాగా సూర్యతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' చేసి అద్భుతమైన హిట్ కొట్టాడు. మరి ఇలాంటి దర్శకుడు చిరంజీవితో థ్రిల్లర్ అంటే ఆసక్తికరంగా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ రూ.35 లక్షలు.. కానీ నన్ను మోసం చేశారు!) -
విశ్వనాథ్ అండ్ సన్స్.. రెండో రోజుల్లోనే ఎన్ని కోట్లంటే?
సూర్య హీరోగా వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తొలి రోజు నుంచే అదరగొడుతోంది. మొదటి రోజు రూ.27 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రెండో రోజు అదే జోరును కొనసాగించింది. ఫస్ట్ డే కంటే ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టింది.ఈ సినిమా రిలీజైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్టమెంట్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ షేర్ చేసింది. రెండు రోజుల్లో కలిపి రూ.37.6 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ మూవీ.. గ్రాస్ పరంగా సెంచరీ కొట్టేసింది. తొలిరోజుతో పోలిస్తే వసూళ్ల పరంగా రెండో రోజే అత్యధికంగా కలెక్షన్స్ వచ్చాయి. వీకెండ్ కావడం, పాజిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ క్యూ కడుతున్నారు. కరుప్పుతో హిట్ కొట్టిన సూర్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరనుంది. #VishwanathAndSons hits it out of the park and smashes a 100cr+ in just 2 days 💥💥#BlockbusterVAS running successfully in cinemas near you ❤️#BlockbusterVishwanathAndSons @Suriya_offl #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena @gvprakash @vamsi84 @NavinNooli… pic.twitter.com/fhIpLYvFJb— Sithara Entertainments (@SitharaEnts) August 16, 2026 -
అదృష్టం అంటే ఈ హీరోయిన్నే..పాతికేళ్లకే తిరుగులేని క్రేజ్
ప్రస్తుతం కోలీవుడ్‌లో నటి మమిత బైజు టైమ్ నడుస్తుందనే చెప్పవచ్చు. వరుస విజయాలతో ఈ మాలీవుడ్ చిన్నది దూసుకుపోతోంది. కేరళ రాష్ట్రం ,కొట్టాయం సమీపంలోని కిడంగూర్ అని గ్రామానికి చెందిన డిగ్రీ కూడా పూర్తి చేయని మమిత బైజు ఇప్పుడు మలయాళం, తమిళం , తెలుగు భాషల్లో క్రేజీ కథానాయకిగా దూసుకుపోతోంది.బాల్యంలోనే సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె మొదట్లో బాలనటిగా కొన్ని చిత్రాలు నటించింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అయితే 2024 ఈ అమ్మడికి లక్కీ ఇయర్ అనే చెప్పాలి. ఆ ఏడాదిలో మలయాళం లో కథానాయకిగా నటించిన ప్రేమలు చిత్రం మమిత బైజు జీవితాన్నే మార్చేసింది. ఆ చిత్రం అనూహ్య విజయం తో మలయాళం లోనే కాకుండా తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమంలోనూ ఈమె పేరు మారుమ్రోగింది. ఇకపోతే అదే సంవత్సరంలో మమిత బైజు రెబల్ అని చిత్రంతో కోలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా మమిత బైజు కు మాత్రం ఇక్కడ మంచి సక్సెస్ఫుల్ బాటను అమర్చింది.నటుడు ధనుష్ ,విజయ్ ,ప్రదీప్ రంగనాథన్ ,సూర్య వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలను పొందింది. తాజాగా జంటగా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో శుక్రవారం విడుదలై సక్సెస్ఫుల్ టాక్ తో ప్రదర్శింపబడుతుంది. ఈ చిత్రంలో మమిత బైజు నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా ప్రతిభకు లక్కు తోడైతే అది మమిత బైజు లా ఉంటుంది అని కూడా అంటున్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రను ఎంపిక చేసుకుంటూ ఆయా పాత్రలో లీనమై నటించడం వల్లే ఈమె వరసగా సక్సెస్ అందుకుంటుందనే భావన సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. తమిళం మలయాళం భాషలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ పాతికేళ్ల పరువాల భామ తమిళంలో నటుడు కార్తీకి జంటగా నటిస్తున్న చిత్రం నిర్మాణ దశలో ఉంది. -
‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
సూర్యతో సినిమా.. రిక్వెస్ట్ కాదు డిమాండ్: త్రివిక్రమ్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లాక్ అయిందంటూ అప్పట్లో చాలా స్టోరీలు వచ్చాయి. నిజానికి అవి రూమర్స్ కావు. వీరిద్దరూ కలిసి సినిమా చేయడానికి గతంలో ప్రయత్నించారు. అయితే కథ విషయంలో ఇద్దరికీ సెట్ కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. శనివారం నిర్వహించిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌కి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, యూనిట్‌కి అభినందనలు తెలిపారు.త్రివిక్రమ్ మాట్లాడుతూ.. నేను సూర్యతో ఇప్పటికే ఓ సినిమా చేయాలి. కానీ సూర్యకు నచ్చే కథను నేను చెప్పలేకపోయాను. అయితే త్వరలోనే ఆయనతో తప్పకుండా సినిమా చేస్తానని నిండుసభలో ప్రకటించారు. నా భార్య సూర్యకు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమా చేయాలని ఎప్పటినుంచో తను నన్ను కోరుతున్నారు. “అది రిక్వెస్ట్ కాదు.. డిమాండ్” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, సూర్యను కలిసేందుకు తన భార్య ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ షూటింగ్‌కి వెళ్లి, ఆయనతో ఫొటో కూడా దిగినట్లు త్రివిక్రమ్ వెల్లడించారు.అందరూ ఒక్కటై సక్సెస్ చేశారు – సూర్య‘‘వెంకీ అట్లూరిగారు తెలుగు. నేను తమిళ్, రవీనా టాండన్ మేడం మహారాష్ట్ర, మమిత బైజు కేరళ... ఇలా వేర్వేరు ప్రాంతాలవాళ్లం కలిసి చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాని మీరందరూ (ప్రేక్షకులు) ఒక్కటై అద్భుతంగా ఆదరించారు. మాకు సక్సెస్, గౌరవాన్ని, ప్రేమను ఇవ్వడంతో పాటు ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు మరిన్ని తీసే ప్రోత్సాహం అందించినందుకు థ్యాంక్స్’’ అని సూర్య అన్నారు. సూర్య హీరోగా నటించిన తెలుగు–తమిళ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మమిత బైజు హీరోయిన్గా నటించిన ఈ మూవీలో రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న (శుక్రవారం) విడుదలైంది. సూర్య మాట్లాడుతూ.. ‘‘కొన్ని సినిమాలను వసూళ్లతో కొలవలేం. ప్రేక్షకులు పొందిన అనుభూతిలోనే ఈ సినిమా అసలు విజయం దాగుంది. ఇలాంటి మంచి సినిమా ఇచ్చిన వెంకీ అట్లూరికి ధన్యవాదాలు. మా మూవీకి శుక్రవారంతో పోల్చితే శనివారానికి వసూళ్లు డబుల్ అయ్యాయని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా కథ రాసినప్పుడు యాక్షన్, డార్క్ హ్యూమర్, ఘోస్ట్, దైవం నేపథ్యంలోని మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. ఇలాంటి ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఒక కుటుంబ కథా చిత్రంతో వస్తామన్నప్పుడు నిర్మాతలు కొంచెం నిరుత్సాహపరుస్తారు. కానీ, వంశీగారు ప్రోత్సహించారు’’ అని తెలిపారు వెంకీ అట్లూరి. ‘‘ఈ మూవీ ఊటీ షెడ్యూల్లో సూర్యతో పాటు నేనూ ఉన్నాను. ముంబైలోని నా ఫ్రెండ్స్ ఊటీకి వచ్చారు. అయితే వారు వచ్చింది నా కోసం కాదు... సూర్య కోసం (నవ్వుతూ)’’ అన్నారు రవీనా టాండన్. కరుప్పు హిట్ తర్వాత సూర్య నటించిన చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్‌తోనే సూపర్ హిట్ అవుతుందని టాక్ వినిపించింది. అలానే రిలీజైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. -
విశ్వనాథ్ అండ్ సన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్గా కనిపించింది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాతే సూపర్ హిట్ అవుతుందని టాక్ వినిపించింది. రిలీజైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్..అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.27.51 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇండియా వ్యాప్తంగా మొదటి రోజు రూ.15.15 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టగా.. రూ.17.51 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్లో రూ.10 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీకి తమిళ వర్షన్ రూ. రూ.9.15 కోట్లు రాగా.. తెలుగులోనే రూ. 6 కోట్లు కలెక్ట్ చేసింది. కరుప్పు హిట్ తర్వాత సూర్య నటించిన మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రం ఆగష్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. -
విశ్వనాథ్ & సన్స్ హిట్టా..? ఫట్టా..?
-
విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ.! థియేటర్ దగ్గర ఫ్యాన్స్ రచ్చ రచ్చ
-
సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ
మూడు నెలల క్రితం 'కరుప్పు'(తెలుగులో వీరభద్రుడు)తో హిట్ కొట్టిన సూర్య.. ఇప్పుడు 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో వచ్చేశాడు. దీనికి తెలుగువాడైన వెంకీ అట్లూరి దర్శకుడు కాగా, నాగవంశీ నిర్మాత. మమిత బైజు హీరోయిన్. రాధిక, రవీనా టండన్ కీలక పాత్రలు చేశారు. తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇంతకీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సంజయ్ విశ్వనాథ్(సూర్య) ఓ వ్యాపారవేత్త, ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన షూటర్. 40 ఏళ్లు వయసొచ్చినా పెళ్లి చేసుకోడు. అమెరికాకి వెళ్లి సరోగసి ద్వారా మగబిడ్డని కని స్వదేశానికి తిరిగొస్తాడు. కొన్నాళ్ల తర్వాత పిల్లాడు ఓ అరుదైన వ్యాధి బారిన పడతాడు. బోన్ మారో(ఎముక గుజ్జు) ట్రాన్స్ ప్లాంట్ అవసరమవుతుంది. దీంతో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి అవసరం ఏర్పడుతుంది. అమెరికాకు తిరిగెళ్లి సరోగసి మదర్ మ్యాడీ (మమిత)ని వెతికి భారత్‌కి తీసుకొస్తాడు. సర్జరీ తర్వాత ఆమె తిరిగి వెళ్ళిపోవాలని ముందే ఒప్పందం చేసుకుంటాడు.20 ఏళ్ల మ్యాడీ.. సంజయ్ ఇంటికి వచ్చిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు సంజయ్ 40 ఏళ్లు వచ్చినా పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? తల్లి అవసరం లేకుండా తన కొడుకును పెంచుకోగలిగాడా? మ్యాడీ ప్రేమని సంజయ్ ఎందుకు తిరస్కరించాడు? చివరకు పెళ్లి విషయంలో సంజయ్ తన ఆలోచన మార్చుకున్నాడా లేదా? అనేది మిగతా స్టోరీ. ఎలా ఉందంటే?కుటుంబ నేపథ్యంలో సాగే సినిమా ఇది. సాంప్రదాయాలు, బంధాలు, తల్లి-కొడుకుల మధ్య ఉండే భావోద్వేగాల చుట్టూ కథ తిరుగుతుంది. దర్శకుడు వెంకీ అట్లూరి ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా దాని చుట్టూ అల్లిన సన్నివేశాలు, మానవ సంబంధాలని హృదయాలను హత్తుకునేలా తీర్చిదిద్దాడు. కాసేపు నవ్విస్తూ మరి కాసేపు భావోద్వేగానికి గురిచేస్తూ బోర్ కొట్టకుండా కథనాలు నడిపించాడు.సంజయ్ విశ్వనాధ్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించే సన్నివేశంతో మూవీ ప్రారంభమవుతుంది. తర్వాత సంజయ్ ఫ్యామిలీ నేపథ్యం, మంచి వ్యాపారవేత్తగా ఎదిగిన తీరు చూపించారు. ఆ వెంటనే బిడ్డ కోసం సరోగసి మార్గం ఎంచుకోవడం... కొడుకు సర్జరీ కోసం సరోగసి మదర్ మ్యాడీ ఇండియాకు రావడంతో కథ కామెడీ టర్న్ తీసుకుంటుంది. మ్యాడీ చేసే అల్లరి థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. అదే సమయంలో తల్లితో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు గుండెని బరువెక్కిస్తాయి.టీవీ షో ఎపిసోడ్ అయితే కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. ద్వితీయార్థంలో కథనం చాలావరకు ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. మదర్ ఎపిసోడ్లో తెరపై సూర్య కన్నీళ్లు పెట్టుకుంటే సీట్లో ఉన్న ప్రేక్షకుడి గుండె బరువెక్కుతుంది. ఆ తర్వాత కథనం కొంతవరకు నెమ్మదిగా సాగుతుంది. పెళ్లి ఎపిసోడ్ అయితే కొంత సాగదీత అనిపిస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంది.ఎవరెలా చేశారంటే?సంజయ్ విశ్వనాధ్ పాత్రల్లో సూర్య ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన కన్నీళ్లు తెప్పిస్తుంది. మమితకు మంచి పాత్ర లభించింది. మ్యాడీగా ఆమె చేసే అల్లరి నవ్వులు పూయిస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు మమిత పాత్రను మర్చిపోరు. తల్లిగా రాధిక చక్కగా నటించింది. మిగిలిన వాళ్లు తమతమ పాత్రలకు న్యాయం చేశారు.సాంకేతిక విషయాలకొస్తే మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ప్రతి సీన్ తెరపై చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా ఇదో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్.అంజి శెట్టే , సాక్షి వెబ్ డెస్క్ -
సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విటర్ రివ్యూ
తమిళ స్టార్ హీరో సూర్య.. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీతో కలిసి చేసిన సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. మమిత బైజు హీరోయిన్ కాగా రాధిక, రవీనా టండన్ కీలక పాత్రలు చేశారు. జీవీ ప్రకాశ్ సంగీతమందించాడు. నేడు(ఆగస్టు 14) తెలుగు, తమిళంలో రిలీజైన ఈ సినిమా గురించి ట్విటర్ టాక్ ఏంటి? ఆడియెన్స్ ఏమంటున్నారు?(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా)45 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడటం అనే కథాంశంతో ఈ సినిమా తీశారు. ఇందులో సూర్య.. ఒలింపిక్ షూటర్ పాత్రలో కనిపించాడు. 20 ఏళ్ల చలాకీ అమ్మాయి పాత్రని మమిత బైజు చేసింది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ పర్లేదనిపించాయి.ఇక సినిమా విషయానికొస్తే కొందరికి బాగా నచ్చేసింది. ఆ మేరకు ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఫస్టాప్ బాగుందని, సెకండాఫ్ తేలిపోయిందని అంటున్నారు. ఇంటర్వెల్ తర్వాత మెలోడ్రామా ఎక్కువైందని, క్లైమాక్స్ ఇంకా బాగా తీసి ఉండొచ్చని రాసుకొస్తున్నారు. ఓవరాల్‌గా డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు. మరికొందరు మాత్రం తమకు ఒక్క సీన్ కూడా నచ్చలేదని అంటున్నారు.(ఇదీ చదవండి: 'అగధ' మూవీ రివ్యూ)#VishwanathAndSons – One of the BEST FAMILY ENTERTAINERS in Recent Times…!!This one is a breezy, light hearted family entertainer from #Suriya and Director #VenkyAtluri.The lead performances and writing are the biggest strengths of the film.Don’t expect a #LuckyBhaskar kind…— Rangasthalam (@RangasthalamIN) August 14, 2026Disaster Review for #VishwanathAndSons 💔Weakest Movie from #VenkyAtluri #VishwanathAndSons pic.twitter.com/HUfsTQhJCr— 𝗕𝗵𝗮𝗿𝗮𝗻𝗶🥃🎲 (@Anirudhoff_) August 14, 2026#VishwanathAndSons Review: “A Decent Family Entertainer”👉Rating : 2.75/5Positives:⁰👉#Suriya performance⁰👉#MamithaBaiju & Radhika are well cast⁰👉Venky Atluri’s dialogues work well⁰👉A few good emotional momentsNegatives:⁰👉Uneven 2nd half⁰👉Some subplots don’t work…— PaniPuri (@THEPANIPURI) August 14, 2026🔥 #VishwanathAndSons — OVERALL REVIEW 🔥When the story was leaked and the trailer dropped, I was worried that the film might have nothing more to offer. But the 2nd half has a major surprise that wasn’t revealed in any publicity material! 🔥The director shows two sides of… pic.twitter.com/JizKxv2OBu— Kollywood Wire (@KollywoodWire) August 14, 2026#VishwanathAndSons - VATCHABLE ONES!Good 1st Hlf & Avg 2nd Half.OKayish Feel Good Family Entertainer!— Christopher Kanagaraj (@Chrissuccess) August 14, 2026#VishwanathAndSons First half - Excellent 👌- Took 15 Mins to setup the plot and Conflict !!- Once #MamithaBaiju entered, the film took off and totally entered into the fun mode. Mamitha & her mannerisms was super cute🥰😀 - #Suriya's Screen presence and performance was… pic.twitter.com/A4x9vB0HPn— AmuthaBharathi (@CinemaWithAB) August 14, 2026#VishwanathAndSons A Watchable, Clean Family Entertainer With a Good 1st Half but a Weak 2nd Half!After a slow start, the first half feels refreshing and stays focused on the core plot with a good mix of fun and emotion. Just when you expect that flow to continue, the second…— Venky Reviews (@venkyreviews) August 14, 2026 -
విశ్వనాథ్ అండ్ సన్స్.. ఎవరికెంత రెమ్యునరేషన్?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలో ప్రేమలు బ్యూటీ మమతా బైజు హీరోయిన్గా నటించింది. మధ్య వయస్కుడితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ టాక్ వైరలవుతోంది. ఈ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారనే విషయంపై చర్చ మొదలైంది. ఈ చిత్రానికి సూర్య దాదాపు రూ.45 కోట్ల వరకు వసూలు చేశారని టాక్ వినిపిస్తోంది. ఇది దాదాపు సూర్య పారితోషికానికి డబులు అని తెలుస్తోంది. మమితా బైజు కోటిన్నర నుంచి మూడు కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. ఈ మూవీలో రవీనా టాండన్ తన రోల్‌కు దాదాపు రూ.2 నుంచి 3 కోట్ల వరకు ఛార్జ్ చేశారని టాక్. వీరితో పాటు రాధిక శరత్‌కుమార్ దాదాపు రూ.40 లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. -
సూర్య ముందు అద్భుతమైన అవకాశం
హీరో విజయ్.. సీఎం విజయ్ అయిపోయారు. ఈయన చేసిన చిట్టచివరి సినిమా 'జన నాయగన్' గత నెలలోనే రిలీజైపోయింది. మరో వారం ఆగితే ఓటీటీలోకి కూడా వచ్చేయొచ్చు. సరే ఈ విషయం పక్కనబెడితే తమిళ ఇండస్ట్రీలో ప్రస్తుతానికైతే కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్న హీరో విజయ్ మాత్రమే. ఇప్పుడు ఈయన యాక్టింగ్ వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. మరి ఈ స్థానాన్ని భర్తీ చేసే హీరో ఎవరు? సూర్యకు ఎంత అవకాశముంది?(ఇదీ చదవండి: మాజీ భర్త రెండో పెళ్లి.. హీరోయిన్ ఊర్మిళా కౌంటర్ పోస్ట్)సూర్య స్టార్ హీరోనే కానీ గత కొన్నేళ్లలో సరైన సినిమాలు పడకపోయేసరికి క్రేజ్ తగ్గిన మాట వాస్తవం. కానీ ఈ ఏడాది 'కరుప్పు'తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. 'వీరభద్రుడు' పేరిట ఇది తెలుగులోనూ రిలీజై మంచి వసూళ్లు అందుకుంది. రూ.350 కోట్ల గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది. సూర్య కెరీర్లోనే ఇదే అత్యధికం. ఇదొచ్చి మూడు నెలలు కూడా కాలేదు ఇంతలోనే 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీతో వచ్చేందుకు సూర్య సిద్ధమయ్యాడు. దీనిపై బజ్ బాగానే ఉంది. కాకపోతే కంటెంట్ క్లిక్ అవ్వాలి.ట్రైలర్, పాటలు లాంటివి చూస్తుంటే ఇదో కుటుంబకథా చిత్రమని అర్థమవుతుంది. 'కరుప్పు' మాస్ కంటెంట్ కావడంతో చాలామంది ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. మరి 'విశ్వనాథ్'లో క్లాస్ టచ్ కనిపిస్తోంది. ఇది ఎంతమందికి కనెక్ట్ అవుతుందనేది చూడాలి? ఒకవేళ ఇది సక్సెస్ అయితే మాత్రం సూర్య సక్సెస్ ట్రాక్‌లో పడ్డట్లే. ఇదే జోష్ కొనసాగిస్తూ వరసగా మంచి సినిమాలు చేస్తే మాత్రం విజయ్ వదిలేసిన స్థానాన్ని సూర్య అందుకోవచ్చు.తమిళ ఇండస్ట్రీ వరకు చూసుకుంటే రజనీకాంత్, కమల్ హాసన్ వయసైపోయింది. అందుకు తగ్గట్లే సినిమాలు చేయడం తగ్గించేశారు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చేశారు. అజిత్ అయితే యాక్టింగ్ కంటే రేసింగ్‌పైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ధనుష్ ఏడాదికి రెండు మూడు మూవీస్ చేస్తున్నప్పటికీ ఓ సెట్ ఆఫ్ ఆడియెన్స్ మాత్రమే ఇతడికి ఉన్నారు. విక్రమ్, శింబు లాంటి వాళ్లు స్టార్డమ్ ఉన్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే చిత్రాలు చేయలేక బాగా వెనకబడిపోయారు. మిగిలిన వాళ్లలో శివకార్తికేయన్, కార్తీ, విశాల్ తదితరులని మిడ్ రేంజ్ కేటగిరీ అనుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సరిగ్గా ప్లాన్ చేసుకుంటే సూర్య టాప్‌లోకి వెళ్లిపోవచ్చు. ఎటొచ్చి అందుకు తగ్గ డైరెక్టర్స్-సినిమాలు సెట్ కావాలంతే.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' అగ్నిపరీక్ష.. అభిజిత్ పరువు తీసిన కంటెస్టెంట్!) -
హీరో సూర్య స్పీచ్.. విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదరగొట్టిన మాటలు
-
‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్...(ఫొటోలు)
-
తెలుగు ప్రేక్షకుల ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను.. ఎమోషనల్ అయిన సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎమోషనల్ అయ్యారు. గత 28 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని అన్నారు. శివకుమార్ కుమారులైన తమను తెలుగు ప్రజలు దత్త పుత్రుల్లా గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. విశ్వనాథ్ అండ్ సన్స్’లో హ్యూమన్ ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాకు మొదట్నుంచి త్రివిక్రమ్‌గారి సపోర్ట్ ఉంది. ఈ సినిమా నాకు మంచి జ్ఞాపకాలను ఇచ్చిందన్నారు.‘గజినీ’లో సంజయ్ రామస్వామి పాత్రను ఎలా ఆదరించారో.. అదే వింటేజ్ మ్యాజిక్‌ను మళ్లీ తీసుకురావాలనే ఉద్దేశంతో దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ ఈ కథను రూపొందించారని సూర్య చెప్పారు. హైదరాబాద్‌లో ఆరు నెలల షూటింగ్ అనుభవం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. వెంకీ అట్లూరి రైటింగ్, సిన్సియారిటీని ప్రశంసిస్తూ.. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉందని తెలిపారు.‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’కు అందించిన ప్రేమనే ఆగస్టు 14న విడుదల కానున్న ‘విశ్వనాథ్ & సన్స్’కు కూడా అందించాలని తెలుగు ప్రేక్షకులను కోరారు.‘‘రాధికగారు ఈ సినిమాలో ఒక మ్యాజిక్. ఇక లైఫ్‌లో మీకు డబ్బు, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా మిమ్మల్ని మీరు నమ్మితే... మమితలా ఇంత మంచి పొజిషన్లో ఉంటారు. జూనియర్ ఆర్టిస్టు కుమార్తె నుంచి ఇప్పుడు ఆమె ఈ వేదికపై ఉన్నారు. మిమ్మల్ని మీరు నమ్మండి. వెంకీ ఈ సినిమాలో మూడు అందమైన మహిళా క్యారెక్టర్స్ రాశారు. వెంకీతో నేను ఓ బయోపిక్ చేయాల్సింది. కానీ ఈ సినిమా చేశాం. ఈ సినిమాలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాను. ఈ చిత్రం మా అందరికీ స్పెషల్’’ అని సూర్య అన్నారు.వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుల ముఖంపై ఒక చిరునవ్వు ఉంటుంది. సూర్య నటించిన చాలా సినిమాలు ఫ్రై డే రోజునే నేను చూశాను. కానీ నేను ఆయన్ను డైరెక్ట్ చేసిన సినిమా ఈ ఫ్రై డే రిలీజ్ కానుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాతో ప్రేక్షకులను 90 శాతం ఎంటర్టైన్ చేస్తానని చెప్పగలను’’ అని అన్నారు. ‘‘చాలా రోజుల తర్వాత స్టేజ్‌పై ధైర్యంగా చెబుతున్నా... ఈ సినిమా చాలా బాగుంది. ఇందులో మదర్ అండ్ సన్స్ రిలేషన్ అద్భతంగా ఉంటుంది. అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు నాగవంశీ. ‘‘కొత్త పాయింట్‌తో వెంకీ అట్లూరి మంచి కథ రాశారు. ఈ సినిమాలో మూడు పాటలు రాశాను’’ అన్నారు రామజోగయ్య శాస్త్రి. ఈ వేడుకలో పాల్గొన్న నిర్మాతలు వై. రవిశంకర్, కేఎల్ నారాయణ, జూబ్లీహిల్స్ ఎమ్ఎల్ఏ నవీన్ యాదవ్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హిట్ కావాలని ఆకాంక్షించారు. సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. -
'సంజయ్ రామస్వామిని మళ్లీ చూస్తారు': నాగవంశీ
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా కనిపించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు సూర్యతో నిర్మాత నాగవంశీ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. సూర్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీతో సూర్యలో మరోసారి సంజయ్ రామస్వామిని గుర్తుకు తెస్తామని ప్రకటించారు. ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని అన్నారు. మదర్ సెంటిమెంట్ ఈ మూవీలో మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ సినిమా చూశాక మీ మదర్‌ను పదిరెట్లు ఎక్కువగా ప్రేమిస్తారని అన్నారు. రాధిక క్యారెక్టర్ చూస్తే అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో చూస్తారని అన్నారు. ఈ సినిమా త్రివిక్రమ్‌కు కూడా నచ్చిందని వెల్లడించారు. ఆయన మెచ్చుకున్న ఏ సినిమా నాది ఫెయిల్ అవ్వలేదని పేర్కొన్నారు. -
'విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ.. సెట్స్‌లో రియల్ చిరుతపులి ఎంట్రీ'
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలో ప్రేమలు బ్యూటీ మమతా బైజు హీరోయిన్గా నటించింది. మధ్య వయస్కుడితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకీ అట్లూరి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీ షూటింగ్ టైమ్‌లో ఎదురైన భయానక అనుభవాన్ని షేర్ చేశారు. ఊటీలో ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు సెట్స్‌లోకి చిరుతపులి వచ్చిందని తెలిపారు. అది తమ కళ్ల ముందు నుంచే వెళ్లిందని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా గడ్డ కట్టే చలిలో 102-103 ఫీవర్‌తో సూర్య, మమిత బైజు దాదాపు 11 రోజుల పాటు ఊటీలోనే షూట్లో పాల్గొన్నారని వెంకీ తెలిపారు. కాగా..ఈ సినిమా ఆగస్ట్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. -
సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్
-
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్.. ట్రైలర్ వచ్చేసింది
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా కనిపించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్.ఈ నేపథ్యంలోనే విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని పుల్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్‌గా డ్రామాగా రూపొందించారని ట్రైలర్లో తెలిసిపోతోంది. 'గెలిచేదాకా ఆగకూడదు.. గెలిచాక ఎక్కువగా మాట్లాడకూడదు' అనే డైలాగ్ ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతోంది. కాగా.. ఈ చిత్రంలో సూర్య 40 ఏళ్ల వ్యక్తిగా, మమిత బైజు 20 ఏళ్ల అమ్మాయిగా నటించారు. ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
సూర్యతో ఉన్న తల్లీకూతుళ్లని గుర్తుపట్టారా? ఇద్దరూ నటులే
అప్పుడప్పుడు నటీనటులు షేర్ చేసుకునే పాత ఫొటోలు చిత్రంగా అనిపిస్తుంటాయి. ఎందుకంటే చిన్నప్పుడెప్పుడో సరదా కోసం స్టార్ హీరోహీరోయిన్లతో కొందరు పిక్స్ తీసుకుంటారు. పెరిగి పెద్దయిన తర్వాత మళ్లీ వాళ్లని కలిసేసరికి తెగ ఆనందపడిపోతుంటారు. ఈ నటి అలాంటి అనుభూతి చెందింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)పైన సూర్యతో కలిసున్న తల్లీకూతుళ్లు తమిళ సినిమాల్లో చేస్తున్న నటులే. పెద్దావిడ పేరు శ్రీజ. ఈమె సీనియర్ నటి. తమిళ, మలయాళంలో చాలానే మూవీస్ చేస్తోంది. సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్'లోనూ నటించింది. ఊటీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈమె కూతురు, నటి రవీనా కూడా లొకేషన్‌కి వెళ్లింది. భర్తతో కలిసి సూర్యని కలవడంతో పాటు తన చిన్నప్పుడు కలిసి సందర్భాన్ని గుర్తుచేసుకుంది. తాజాగా ఈ రెండు ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది.ఇకపోతే పాప పేరు రవీనా. 'లవ్ టుడే' మూవీలో ప్రదీప్ రంగనాథన్‌కి అక్కగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు నటిగా ఫేమస్ అయింది కానీ డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించింది. 'జవాన్'లో దీపికా పదుకొణెకు తమిళ-తెలుగు వెర్షన్స్‌లో, తమిళ 'గేమ్ ఛేంజర్'లో కియారా అడ్వాణీకి.. ఓకే బంగారం, ప్రేమమ్(మడోన్నా సెబాస్టియన్), 2.0 (అమీ జాక్సన్), నవాబ్ (ఐశ్వర్యా రాజేశ్), శ్యామ్ సింగరాయ్ (మడోన్నా సెబాస్టియన్) తదితర తెలుగు చిత్రాల్లోనూ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది ఈమెనే.ఇకపోతే 2023లో 'వాలాట్టి' అనే కుక్కల నేపథ్య కథతో తీసిన సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేసింది. ఆ టైంలో ఈ చిత్ర దర్శకుడు దేవన్ జయకుమార్తో ప్రేమలో పడింది. ఈ ఏడాది మే నెలలో పెద్దల్ని ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంది.(ఇదీ చదవండి: అలాంటి పాత్రలు చేయడం మానేశా.. కానీ రజనీకాంత్ కోసం) View this post on Instagram A post shared by Raveena Ravi (@raveena1166) -
హీరో సూర్య పాడిన పెళ్లి పాట రిలీజ్
హీరో సూర్యకి తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఓ సినిమా చేశాడు. అదే 'విశ్వనాథ్ అండ్ సన్స్'. వచ్చే నెల 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. కొన్నాళ్ల క్రితం 'బటర్ ఫ్లై' పాట విడుదల చేయగా.. ఇప్పుడు సూర్య పాడిన పాటని వదిలారు.(ఇదీ చదవండి: 'విశ్వనాథ్ అండ్ సన్స్' తెలుగు సినిమా కాదు)'వెడ్డింగ్ సాంగ్' అంటూ సాగే ఈ పాట కలర్ఫుల్గా ఉంది. ఇందులో సూర్య 40 ఏళ్ల వ్యక్తిగా, మమిత బైజు 20 ఏళ్ల అమ్మాయిగా నటించారు. వీళ్లిద్దరూ ప్రేమలో పడితే ఏమైంది అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు. రాధిక, రవీనా టండన్ కీలక పాత్రలు చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: 45 ఏళ్లకు తల్లయిన టాలీవుడ్ హీరోయిన్) -
ఇది తెలుగు సినిమా కాదు.. డబ్బింగ్ చేశామంతే
సూర్య స్వతహాగా తమిళ హీరోనే కానీ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో బోలెడంత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అందుకు తగ్గట్లే దాదాపు ప్రతి మూవీ ఒకేసారి ఇక్కడ కూడా థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉంటుంది. రీసెంట్ టైంలో అయితే 'కరుప్పు'ని 'వీరభద్రుడు' పేరుతో రిలీజ్ చేస్తే పర్లేదనిపించింది. వచ్చే నెలలో 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం గురించి దర్శకుడు వెంకీ అట్లూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా)తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ.. సూర్యతో చేస్తున్నారని ప్రకటన వచ్చినప్పటి నుంచి అంతా ఇది.. ఈ హీరో తెలుగులో చేస్తున్న తొలి సినిమా అనుకున్నారు. కానీ స్ట్రెయిట్ తమిళ చిత్రం అని, తెలుగులో డబ్బింగ్ చేశామని స్వయంగా డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సంగతి బయటపెట్టాడు.'గతంలో ధనుష్‌తో 'వాతి'(సార్) సినిమా టైంలో ప్రయోగం చేయాలనుకున్నాం. ఓటీటీల కారణంగా ధనుష్‌కి తెలుగులో భారీగా అభిమానులు పెరిగారు. దీంతో ఈ మూవీని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరించాం. కానీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' స్టోరీ దృష్ట్యా ముందుగా తమిళంలో పూర్తిచేసి తర్వాత తెలుగులో డబ్బింగ్ చేశాం. సూర్యతో ముందుగా ఓ బయోపిక్ చేయాలనుకున్నాను. కానీ దానికి హక్కుల విషయంలో కాస్త ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ లైన్లోకి వచ్చింది. సూర్యతో సినిమా చేయాలనేది నా చిరకాల కోరిక. భవిష్యత్తులో ఆయనతో తప్పకుండా మరో సినిమా చేయాలనుంది' అని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చాడు.40 ఏళ్ల వ్యక్తితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడటం అనే స్టోరీతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా తీశారు. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో సూర్య సరసన మమిత బైజు హీరోయిన్గా చేసింది. రాధిక, రవీనా టండన్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: రిలీజ్ రోజే 'చెన్నై లవ్ స్టోరీ' కలెక్షన్స్ పోస్టర్.. ఇదేం విడ్డూరం?)#VishwanathAndSons is not a bilingual like #Vaathi. The film was shot in Tamil only and dubbed into Telugu.It made more sense to me as a director and my actors were comfortable.- #VenkyAtluri pic.twitter.com/oF0Q73eCbx— telugucinema.com (@thetelugucinema) July 24, 2026 -
వయసుతో పని లేదు... మనసు ముఖ్యం
‘నేను నీకన్నా పెద్దవాణ్ణి... నాతో నీకు ప్రేమ సెట్ కాదు’... అంటాడు హీరో. ‘అయినా ఓకే... నేనేమైనా తప్పు చేస్తే... చిన్నమ్మాయి అని క్షమిస్తావ్... నువ్వేమైనా అంటే.. పెద్దోడు అని సర్దుకుపోతా’ అంటుంది హీరోయిన్. ఓ సినిమాలో లీడ్ క్యారెక్టర్స్‌కి మధ్య జరిగే సంభాషణ ఇది. హీరో వయసు ఫిఫ్టీ ప్లస్... హీరోయిన్‌కి 25 ప్లస్. హీరోని వెంటపడి ప్రేమిస్తుంది హీరోయిన్. అప్పుడు హీరో ‘ఏజ్ గ్యాప్’ గురించి మాట్లాడితే... ‘లవ్‌కి ఏజ్‌తో సంబంధం లేదు... మనసు ముఖ్యం’ అంటుంది. ఇలా హీరో–హీరోయిన్ మధ్య 15–20 ఏళ్లు గ్యాప్ ఉన్న కథతో ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో త్వరలో మరో మూడు చిత్రాలు రానున్నాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం...నాకన్నా ఇరవైయేళ్లు చిన్నది... ‘నాకన్నా ఇరవైయేళ్లు చిన్నది...’ అంటూ సూర్య చెప్పడం... ‘నాకు ప్రాబ్లం లేదు’ అని మమితా బైజు అనడం వంటి డైలాగులు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ట్రైలర్లో ఉన్న విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా పక్కాగా ఏజ్ గ్యాప్ నేపథ్యంలో రూపొందిందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సూర్య హీరోగా నటించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్గా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న తెలుగు–తమిళ భాషల్లో విడుదల కానుంది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో మమిత, సూర్యఈ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే సంజయ్ విశ్వనాథ్ అనే పిస్టల్ షూటర్ పాత్రని సూర్య పోషించారని అర్థం అవుతోంది. మ్యాడీ అనే పాత్రలో మమిత బైజు నటించారు. ప్రేమ... ప్రేమించమంటూ సంజయ్ విశ్వనాథ్ వెంట మ్యాడీ పడటం.. ‘నాకన్నా ఇరవైయేళ్లు చిన్నది... ఎలా’, ‘నువ్వు ఒక్క చిటికేస్తే నీ వయసు అబ్బాయిలు చాలా మంది వచ్చి ఇలా పడిపోతారు’ అంటూ సంజయ్ విశ్వనాథ్ అనగానే... ‘కావాలంటే ఇంకో నాలుగు చిటికెలు వేస్తా... నువ్వు పడు చాలు’ అని మ్యాడీ అనడం వంటి డైలాగులు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తనను ప్రేమించమంటూ మ్యాడీ వెంటపడటం.. వయసు తేడా వల్ల ఆమె ప్రేమని సంజయ్ విశ్వనాథ్ కాదనడం ట్రైలర్లో కనిపిస్తోంది. మరి... వీరి ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నది తెలియాలంటే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. మరోసారి... హీరోయిన్ నయనతార మరోసారి ఏజ్ గ్యాప్ మూవీలో నటించారు. శింబు హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘వల్లవన్’ (తెలుగులో ‘వల్లభ’) చిత్రంలో తనకన్నా వయసులో చిన్నవాడైన శింబుని ప్రేమించిన పాత్రలో నటించి, మెప్పించారామె. తాజాగా నయనతార మరోసారి అలాంటి పాత్ర పోషించిన చిత్రం ‘హాయ్’. విష్ణు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ హీరో కెవిన్ హీరోగా నటించారు. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.‘హాయ్’లో కెవిన్, నయనతార ఈ మూవీ కూడా ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. వయసులో పెద్దదైన మహిళ... యువకుడి మధ్య జరిగే ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాగా ఈ మూవీ సాగుతుందని తెలుస్తోంది. ‘‘టైటిల్‌కు తగ్గట్టుగానే ‘హాయ్’ సింపుల్, హార్ట్ వార్మింగ్, ఫీల్‌గుడ్ సినిమా. ప్రతి కుటుంబం కలిసి చూసేలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని యూనిట్ పేర్కొంది.తొలి ప్రేమే మలి ప్రేమ కూడా! ప్రేమకథా చిత్రాలను సరైన రీతిలో తెరకెక్కిస్తే హిట్ గ్యారంటీ. అందుకు ఓ ఉదాహరణ మలయాళ దర్శకుడు గిరీష్ ఏడీ తెరకెక్కించిన ‘ప్రేమలు’ (2024). ఇప్పుడు ఈ దర్శకుడి నుంచి రానున్న ఎమోషనల్ లవ్‌స్టోరీ మూవీ ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో ఆష్లీ (మమిత బైజు) అనే యువతి విదేశాల నుంచి తన స్వగ్రామానికి తిరిగి వస్తుంది. తన పక్కింట్లో జరుగుతున్న పెళ్లి వేడుకను చూసినప్పుడు ఆమెకు మొదటి ప్రేమికుడు జస్టిన్ (నివిన్ పౌలీ) గుర్తుకు వస్తాడు. ఆ జ్ఞాపకాలతో ఆమె జీవితంలో మళ్లీ భావోద్వేగాలు మొదలవుతాయి. అనుకోకుండా ఆష్లేకు జస్టిన్‌కి మళ్లీ ఎదురుపడే అవకాశం వస్తుంది.‘బెత్లెహెం కుడుంబ యూనిట్’లో నితిన్ పౌలీ, మమిత తొలి ప్రేమికుడితోనే మలి ప్రేమ మొదలవుతుంది. ఈ లవ్‌స్టోరీలో నితిన్ పౌలీ, మమిత బైజు జంటగా నటించారు. నితిన్ వయసు 40 ప్లస్... మమితకు 25. ‘‘ఈ ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది’’ అని చిత్రదర్శకుడు గిరీష్ పేర్కొన్నారు. ఈ చిత్రం ఆగస్టు 21న విడుదల కానుంది. ఇక ఈ దర్శకుడు తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం ‘ప్రేమలు’తో మమిత బైజుకి మంచి గుర్తింపు వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే... ఇలాంటి ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్‌తో ఆగస్టు 14న రానున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లోనూ మమిత కథానాయికగా నటించారు. ఇదే తరహా కాన్సెప్ట్‌తో రూపొందిన రెండు చిత్రాలతో వచ్చే నెలలోనే వారం గ్యాప్‌లో ఆమె స్క్రీన్‌పై కనిపించనుండటం విశేషం. -
సూర్య మూవీతో నయనతార ఢీ.. బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందా?
లేడీ సూపర్‌స్టార్ నయనతార, కవిన్ జంటగా నటించిన లేటేస్ట్ మూవీ హాయ్. ఈ రొమాంటిక్ డ్రామాతో విష్ణు ఎడవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ తేదీని వెల్లడించారు. ఈ మూవీని ఆగస్టు 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.సూర్యతో నయన్ ఢీ..అయితే అదే రోజున సూర్య హీరోగా వస్తోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా రిలీజ్ కానుంది. ఈ మూవీకి వెంక అట్లూరి దర్శకత్వం వహించారు. దీంతో నయనతార.. సూర్య చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. హాయ్ మూవీ పోటీలోకి రావడంతో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తిగా మారింది. కాగా.. 'హాయ్' చిత్రాన్ని నయనతార, విఘ్నేష్ శివన్ తమ బ్యానర్ 'రౌడీ పిక్చర్స్, 'సెవెన్ స్క్రీన్ స్టూడియో', 'జీ స్టూడియోస్' భాగస్వామ్యంతో నిర్మించారు. ఈ చిత్రంలో భాగ్యరాజ్, రాధికా శరత్‌కుమార్, ప్రభు, విటివి గణేష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జెన్ మార్టిన్ సంగీతం అందించారు. -
విశ్వనాథ్ అండ్ సన్స్.. సింగర్‌గా సూర్య!
కోలీవుడ్ హీరో సూర్య ఇటీవలే కరుప్పు మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ఏడాది సమ్మర్లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ తర్వాత సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తాజాగా బయటకొచ్చింది. ఈ చిత్రంలోని ఓ సాంగ్‌ను స్వయంగా సూర్యనే పాడారు. ఈ పాటకు కేవలం డ్యాన్స్ చేయడమే కాదు.. తన గొంతుతోనే అభిమానులను అలరించనున్నారు. కాగా.. ఈ పాటకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా... కెన్ కరుణాస్ లిరిక్స్ అందించారు. ఈ విషయాన్ని జీవీ ప్రకాష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సూర్య పాడిన ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలవనుందని తెలిపారు. ఇటీవలే రిలీజైన నేనో బటర్‌ఫ్లై పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ చిత్రంలో సూర్య సరసన ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్, సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. THE ONE @Suriya_offl sir sings a dance number for #vishwanathandsons …. Written by @KenKarunaas ….. A #Venkyatluri film … @SitharaEnts @vamsi84 …. ❤️❤️❤️😍😍😍 pic.twitter.com/jf7yTKZRI0— G.V.Prakash Kumar (@gvprakash) June 29, 2026 -
చాన్నాళ్లకు హిట్.. ఇప్పుడు మరొకటి రెడీ
తమిళ స్టార్ హీరో సూర్య హిట్ కొట్టి ఏళ్లు గడిచిపోయింది. అయితే ఈ నెల రెండో వారం వచ్చిన 'కరుప్పు'(తెలుగు 'వీరభద్రుడు') ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసింది. అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం ఇది థియేటర్లలో ఆడుతోంది. ఇంతలోనే మరో మూవీ రిలీజ్ డేట్ ని సూర్య ప్రకటించేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)సర్, లక్కీ భాస్కర్ సినిమాలతో ఆకట్టుకున్న తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి.. సూర్యతో తీసిన మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. మమిత బైజు హీరోయిన్. సాఫ్ట్ లవ్ స్టోరీగా దీన్ని తెరకెక్కించారు. 40 ఏళ్లు దాటేసిన ఓ వ్యక్తి.. 20 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో పడితే అనేది కాన్సెప్ట్. లెక్క ప్రకారం జూలైలోనే తీసుకురావొచ్చని అనుకున్నారు. కానీ ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ తో ప్రకటించారు.'కరుప్పు'తో సక్సెస్ అందుకున్న సూర్య.. 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడనేది చూడాలి. ఇందులో రాధిక, రవీనా టండన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ సంగీత దర్శకుడు.(ఇదీ చదవండి: ఈ గుండెని తాకిపో తాతా: తారక్ ఎమోషనల్ పోస్ట్) -
40 ఏళ్ల వ్యక్తితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమకథ.. ఆసక్తిగా టీజర్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది. పోస్టర్ చూస్తే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజైన టీజర్ చూస్తుంటే 20 ఏళ్ల అమ్మాయితో 40 ఏళ్ల వ్యక్తి ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తనకంటే వయసులో 20 ఏళ్లు పెద్దగా ఉన్న వ్యక్తితో హీరోయిన్ ప్రేమలో పడడం ఈ చిత్రం ఆసక్తిని మరింత పెంచుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.


