
సందర్భాన్ని బట్టి తన అవసరాన్ని బట్టి మాటలు మార్చడం ప్రజలను ఏ మార్చడంలో పవన్ కళ్యాణ్‌ను మించిన వాళ్లు లేరని మరో మారు రుజువైంది. పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయా సందర్భాల్లో ఎన్నో మార్లు నాటి వైఎస్ జగన్‌పై చెలరేగిపోయారు. సమయం సందర్భం లేకుండా గంగవెర్రులెత్తిపోయారు ..ఏయ్ జగన్ అంటూ ఊగిపోయారు.
అసలు ప్రైవేట్ వ్యక్తులు నిర్మించే సినిమాలకు సంబంధించి టికెట్లు ధరలు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది అంటూ నిలదీశారు... తన సినిమాలకు సంబంధించి అవసరమైతే ప్రజలకి ఫ్రీ షో చూపిస్తానని టికెట్ల ధరల కోసం ప్రభుత్వం దగ్గరకు వెళ్లేది లేదని డైలాగులు కొట్టారు.
మొత్తానికి ఇప్పుడు తాను అధికారంలోకి వచ్చాక హరిహర వీరమల్లు సినిమా రిలీజుకు వచ్చింది. దాదాపు ఐదేళ్లు క్రితం షూటింగ్ మొదలైన ఈ చిత్రం అపుడపుడూ షూటింగ్ చేసుకుంటూ మొత్తానికి ఆమధ్య నిర్మాణం పూర్తి చేసుకుంది. డిప్యూటీ సీఎం అయ్యాక కూడా పవన్ ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు.. మొత్తానికి రిలీజ్ డేట్ వచ్చేసరికి పవన్‌లోని ఆర్థిక అవకాశవాది బయటకు వచ్చాడు.
అవసరం అయితే తాను ఫ్రీగా సినిమా చూపిస్తాను అంటూ గతంలో కొట్టిన డైలాగులు కొండెక్కించిన పవన్ ఇప్పుడు వ్యాపారి రూపంలోకి వచ్చారు. నిర్మాత ఏఎం రత్నం నుంచి భారీగా రెమ్యునరేషన్ తీసుకున్న పవన్ ఆయనకు లబ్ది చేకూర్చేందుకు టికెట్ల ధరలు పెంచేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. దీంతో ఈమేరకు టికెట్ ధరలు పెరిగాయి.
ఇందులో భాగంగా
జూలై 23న వేసే ప్రీమియర్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్స్ షోలకు ఒక్కో టికెట్ ధర రూ.600లుగా నిర్ణయించారు. ఆపై జీఎస్టీ అదనం. రాత్రి 9:00 గంటలకు ప్రీమియర్ ను ప్రదర్శించనున్నారు. మరోవైపు 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్,మల్టీఫ్లెక్స్ ధరలను కూడా పెంచారు. లోయర్ క్లాస్‌లో రూ.100, అప్పర్ క్లాస్‌లో రూ.150, మల్టీ ప్లెక్స్ లో రూ.200 వరకు టికెట్ ఛార్జీలను పెంచుకునే అవకాశం కల్పించారు.
అవతలివాళ్లకు వచ్చేసరికి బోలెడు రూల్స్ మాట్లాడే పవన్ ఇప్పుడు తనవరకు వచ్చేసరికి ఆర్థికలాభం మాత్రమే చూసుకుంటున్నారు అని ప్రజలు భావిస్తున్నారు. ఆయన మాటలకు. చేతలకు మధ్య చాలా తేడా ఉంటుందని మరోమారు స్పష్టమైంది
* సిమ్మాదిరప్పన్న