ఎవరు అడ్డుపడినా చంపేస్తా.. ఆసక్తికరంగా ‘వదలా’ గ్లింప్స్‌! | Vadhala Movie Glimpse, A Tense Drama Unfolds As Jagapathi Babu Faces A Deadly Blackmail Conspiracy, Watch Inside | Sakshi
Sakshi News home page

ఎవరు అడ్డుపడినా చంపేస్తా.. ఆసక్తికరంగా ‘వదలా’ గ్లింప్స్‌!

Mar 11 2026 2:50 PM | Updated on Mar 11 2026 3:24 PM

Vadhala Movie Glimpse Out

జగపతి బాబు, లయ, హృతిక ప్రధానపాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘వదలా’. ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమ్మారెడ్డి భరద్వాజ్‌, కిశోర్‌ నాయుడు నిర్మాతలుగా వ్యవహరించారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘నీ ఫ్యామిలీ నుంచి నేను ఒకరిని తీసేసుకుంటా.. ఎవరు అడ్డుపడినా చంపేస్తా’ అంటూ ఓ లేడీ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నట్లుగా గ్లింప్స్‌లో చూపించారు. మరి ఆ లేడి ఎవరు? ఎవరిని, ఎందుకు బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంది అనేది తెలియాలంటే సినిమా చూల్సిందే. మొత్తంగా ఒక వ్యక్తి చుట్టూ తిరిగే కథగా ఇది రూపొందినట్లు గ్లింప్స్‌ చూస్తే అర్థమవుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement