breaking news
Vadhala Movie
-
తలెత్తుకునే సినిమాలు చేశారాయన: జగపతి బాబు
టాలీవుడ్ నటుడు జగపతిబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడిపై ప్రశంసలు కురిపించారు. అందరికీ తెలుసు.. తాను తీసిన సినిమాలన్నీ తలెత్తుకునేవి చేశాడు. ఎవరు పిలిచినా.. ఏ ఫంక్షన్‌కు పిలిచినా వచ్చేస్తాడని అన్నారు. సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వ్యక్తి అనిల్ రావిపూడి అని కొనియాడారు. నేను వ్యక్తిగతంగా చెప్పకపోయినా ఈవెంట్‌కు వచ్చేశారని అన్నారు. నా సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా హీరోగా చేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. ఆయన హీరోగా నటించిన వదలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. అనిల్ రావిపూడి సైతం జగపతిబాబుపై ప్రశంసలు కురిపించారు. నేను ఇప్పుడూ ఫ్యామిలీ ఫిల్మ్స్ చేస్తున్నాను... కానీ ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌కు పిచ్చెక్కించిన యాక్టర్ జగపతిబాబు అని కొనియాడారు. ఆయనతో ఒక సినిమాకు పని చేయాలని ఉందని అనిల్ రావిపూడి తన మనసులోని మాట బయటపెట్టారు.కాగా.. జగపతి బాబు, లయ, హృతిక ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త సినిమా వదలా. ఈ చిత్రానికి ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్, కిశోర్ నాయుడు నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 17న థియేటర్లలో సందడి చేయనుంది. -
‘వదలా’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఎవరు అడ్డుపడినా చంపేస్తా.. ఆసక్తికరంగా ‘వదలా’ గ్లింప్స్!
జగపతి బాబు, లయ, హృతిక ప్రధానపాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘వదలా’. ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమ్మారెడ్డి భరద్వాజ్, కిశోర్ నాయుడు నిర్మాతలుగా వ్యవహరించారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘నీ ఫ్యామిలీ నుంచి నేను ఒకరిని తీసేసుకుంటా.. ఎవరు అడ్డుపడినా చంపేస్తా’ అంటూ ఓ లేడీ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా గ్లింప్స్‌లో చూపించారు. మరి ఆ లేడి ఎవరు? ఎవరిని, ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తుంది అనేది తెలియాలంటే సినిమా చూల్సిందే. మొత్తంగా ఒక వ్యక్తి చుట్టూ తిరిగే కథగా ఇది రూపొందినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది.


