ఆ రోజే థియేటర్స్‌లో ఆల్ఫా | Alia Bhatt Alpha starrer gets new release date | Sakshi
Sakshi News home page

ఆ రోజే థియేటర్స్‌లో ఆల్ఫా

Mar 11 2026 12:44 AM | Updated on Mar 11 2026 12:45 AM

Alia Bhatt Alpha starrer gets new release date

ఆలియా భట్, శార్వరీ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘ఆల్ఫా’. అనిల్‌ కపూర్, బాబీ డియోల్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ది రైల్వేమెన్‌’ ఫేమ్‌ శివ్‌ రైవల్‌ దర్శకత్వంలో యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించారు. వైఆర్‌ఎఫ్‌ (యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌) స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన సినిమా ఇది. ఈ చిత్రంలో ఆలియా, శార్వరీ స్పై రోల్స్‌లో నటించారు. ‘ఆల్ఫా’ చిత్రాన్ని తొలుత గత ఏడాది డిసెంబరులో రిలీజ్‌ చేయాలనుకున్నారు మేకర్స్‌.

ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్‌కు ప్లాన్‌ చేశారు. కానీ ఈ చిత్రం రిలీజ్‌ను మరోసారి వాయిదా వేస్తున్నట్లుగా వెల్లడించి, ఈ సినిమాను ఈ ఏడాది జూలై 10న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. ‘యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థలో ఆలియా చేసిన తొలి సినిమా ఇది. పూర్తి స్థాయి ఉమెన్‌ సెంట్రిక్‌ యాక్షన్‌ సినిమా. ఆలియా, శార్వరీల యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఆడియన్స్‌ను అలరిస్తాయి’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement