Allu Cinemas: 75 అడుగుల డాల్బీ స్క్రీన్.. టికెట్ రేట్లపై చర్చ | Interesting discussion on Allu Cinemas ticket rates | Sakshi
Sakshi News home page

Allu Cinemas: 75 అడుగుల డాల్బీ స్క్రీన్.. టికెట్ రేట్లపై చర్చ

Mar 10 2026 11:50 PM | Updated on Mar 11 2026 12:22 AM

Interesting discussion on Allu Cinemas ticket rates

హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో మార్చి 12న కొత్తగా ప్రారంభం కానున్న అల్లు సినిమాస్ ఇప్పుడు సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, అల్లు అరవింద్ కలిసి నిర్మించిన అల్లు సినిమాస్‌ ఒక సినిమా హాల్‌ మాత్రమే కాదు ఇదొక విజువల్ వండర్. ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ఇక్కడ ఉంది. ఇక్కడ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ మరో లెవెల్లో ఉండనుంది.

ఈ మల్టీప్లెక్స్‌లో నాలుగు స్క్రీన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రత్యేకమైన డాల్బీ విజన్ స్క్రీన్. ఇది 75 అడుగుల వెడల్పుతో ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతానికి ఇండియాలో కేవలం మూడు డాల్బీ విజన్ స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి పూణేలో 55 అడుగుల స్క్రీన్, రెండవది బెంగళూరులో 65 అడుగుల స్క్రీన్, ఇప్పుడు హైదరాబాద్‌లో 75 అడుగుల స్క్రీన్ రూపంలో అల్లు సినిమాస్. ఈ ప్రత్యేకత వల్ల అల్లు సినిమాస్ టికెట్ రేట్లు ఎలా ఉండబోతున్నాయన్నది సినీప్రియులలో పెద్ద చర్చగా మారింది.  

పూణేలోని డాల్బీ స్క్రీన్‌లో టికెట్ రేట్లు సాధారణ రోజుల్లో రూ.500 లోపు, పెద్ద సినిమాల వీకెండ్స్‌లో రూ. 900 వరకు ఉంటాయి.  ఇక బెంగళూరులోని డాల్బీ స్క్రీన్‌లో టికెట్ రేట్లు క్యాపింగ్ సిస్టమ్‌కు ముందు గరిష్టంగా రూ.1000 వరకు ఉంటాయి. దాంతో హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్ టికెట్ రేట్లు కూడా సాధారణ రోజుల్లో రూ.500, పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు సీటింగ్ బట్టి రూ.1000 వరకు ఉండే అవకాశం.  

తెలంగాణలో ప్రత్యేక టెక్నాలజీ, పరిమిత సీటింగ్ సామర్థ్యం ఉన్న స్క్రీన్లకు అధిక ధరలు వసూలు చేయడానికి ప్రత్యేక అనుమతులు ఉన్నాయి. అల్లు సినిమాస్ అల్ట్రా లగ్జరీ మల్టీప్లెక్స్ సెగ్మెంట్‌లోకి వస్తుంది. దాంతోడాల్బీ విజన్ స్క్రీన్‌కు భారీగా టికెట్ రేట్లు ఫిక్స్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్ ప్రీమియం మల్టీప్లెక్స్‌లకు కొత్త బెంచ్‌మార్క్‌గా నిలవబోతున్నాయి. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న అల్లు సినిమాస్‌ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇందులో మొదటిగా ఉస్తాద్ భగత్ సింగ్,  ధురంధర్ 2  చిత్రాలు ప్రదర్శించబడుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement