లేటు వయసులో తండ్రైన హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్ | bollywood actor Randeep Hooda Lin Laishram welcome baby girl | Sakshi
Sakshi News home page

Randeep Hooda: లేటు వయసులో తండ్రైన రణ్‌దీప్.. సోషల్ మీడియాలో పోస్ట్

Mar 10 2026 5:53 PM | Updated on Mar 10 2026 6:02 PM

bollywood actor Randeep Hooda Lin Laishram welcome baby girl

బాలీవుడ్ హీరో రణ్‌దీప్ హుడా 50 ఏళ్ల వయసులో తండ్రయ్యారు. ఆయన భార్య లిన్ లైస్రామ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ తారలు, అభిమానులు అభినందలు చెబుతున్నారు. హిందీ సినిమాల్లో విలన్, సహాయ పాత్రల్లోనూ మెప్పించిన రణ్‌దీప్‌ గతేడాది వీర్​ సావర్కర్ మూవీలో హీరోగా, జాట్ చిత్రంలో విలన్‌గా అలరించాడు. 

ఈరోజు నేను తండ్రి అయినందుకు మా నాన్న పట్ల నా కృతజ్ఞత మరింత పెరిగిందని రణ్‌దీప్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి ముఖ్యంగా నన్ను తండ్రిని చేసినందుకు.. మన చిన్న అమ్మాయిని ఈ ప్రపంచంలోకి తీసుకు వచ్చినందుకు నా భార్య లిన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు. ఈ జంటకు  మొదటి బిడ్డగా పాప పుట్టడంతో ఆనందం మరింత రెట్టింపైంది.

కాగా.. 2001లో వచ్చిన హిందీ మూవీ 'మన్‌సూన్‌ వెడ్డింగ్‌'తో నటుడిగా పరిచయమైన రణ్‌దీప్ హుడా.. తర్వాత గ్యాంగ్‌స్టర్, జన్నత్ 2, రిస్క్‌, కర్మ ఔర్‌ హోలీ, కాక్‌టైల్‌, జిస్మ్‌ 2, బాంబే టాకీస్‌, కిక్‌, భాఘీ 2, రాధే, మర్డర్ 3 తదతర చిత్రాల్లో నటించి మెప్పించాడు. కాగా.. 2023లో ప్రియురాలు లిన్ లైస్రామ్‌ని మణిపురి సంప్రదాయంలో రణ్‌దీప్ పెళ్లి చేసుకున్నాడు. 

 

Advertisement
 
Advertisement
Advertisement