గతేడాది బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ నటించిన చిత్రం సితారే జమీన్ పర్. ఈ సినిమా 2025 జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో జెనీలియా దేశ్‌ముఖ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఆర్‌ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు.
అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయనని అమిర్ ఖాన్ అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత నేరుగా యూట్యూబ్‌లోనే విడుదల చేశారు. రెంట్ పద్ధతిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పట్లో ఓటీటీ రైట్స్ కోసం రూ.120 కోట్లు చెల్లించేందుకు అమెజాన్ ప్రైమ్ ముందుకొచ్చింది. కానీ ఈ బిగ్ డీల్‌ను అమిర్ ఖాన్ తిరస్కరించారు. ఈ సినిమా కేవలం థియేటర్లలోనే ఆడుతుందని.. ఓటీటీలో విడుదల ఉండదని అమిర్ ఖాన్ స్పష్టం చేశారు.
అయితే తాజాగా అమిర్ ఖాన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. సోనీ లివ్ వేదికగా అందుబాటులోకి రానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. కాగా.. ఈ చిత్రంలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు.
మహేశ్ బాబు ప్రశంసలు...
ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేశ్‌బాబు ప్రశంసలు కురిపించాడు. సితారే జమీన్ పర్.. అందరి మనసులు దోచుకుంటోంది. ఈ మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అలాగే చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఈ సినిమా చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు అని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.


