కోలీవుడ్‌లో విజయ్- త్రిష పేర్లే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా త్రిష పేరు తెరపైకొచ్చింది. ఇటీవల వీరిద్దరు జంటగా ఓ వివాహానికి కూడా హాజరు కావడంతో మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే త్రిషపై కోలీవుడ్ దర్శకుడు పార్తిబన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత దర్శకుడు తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.
తాజాగా విజయ్- త్రిష వివాదంపై ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ భట్ స్పందించారు. మనం కేవలం నటీనటుల సినిమాల గురించి మాత్రమే చర్చించాలని సూచించారు. వారి వ్యక్తిగత జీవితాలపై చర్చించే హక్కు.. వారిని జడ్జ్ చేసే రైట్ మనకు లేదన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా ఈ వివాదం కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ హాట్ టాపిక్‌గా మారింది..
విక్రమ్ భట్ తన పోస్ట్‌లో రాస్తూ.. ' విజయ్- త్రిషల వ్యక్తిగత జీవితాలపై చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్స్ నిజమో, కాదో నాకు తెలియదు. ఒకవేళ అవి నిజమైతే నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. వారిద్దరూ ఎంతో హుందాగా ఉన్నారు. ఏ విషయాన్ని దాచిపెట్టడం లేదు. ఇప్పుడు వాళ్లను ఎంతోమంది జడ్జ్ చేస్తున్నారు. ఆ ఇద్దరి గురించి మాట్లాడేవారంతా ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. నటీనటుల సినిమాలు మాత్రమే మనం చూడాలి. వారి పర్సనల్ లైఫ్ గురించి మనకు అవసరం లేదు' అని రాసుకొచ్చారు.
కాగా.. ఇటీవల రూ.30కోట్ల చీటింగ్ కేసు విషయంలో విక్రమ్ భట్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విక్రమ్, అతడి భార్య శ్వేతాంబరి భట్‌లకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ దంపతులు దాదాపు రూ.30 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.


