మెగాస్టార్ చిరంజీవి తన కూతురికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల బర్త్ డే సందర్భంగా చిరు విష్ చేశారు. ఒకప్పుడు నా వేలు పట్టుకుని నా పక్కన నడిచిన చిన్న అమ్మాయి.. నేడు ఒక బలమైన, బాధ్యయుతమైన మహిళగా ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు. నా సినిమాలు చూడటం.. ఇప్పుడు సినిమా నిర్మించడం.. నాకు చిరస్మరణీయమైన బ్లాక్‌బస్టర్‌ను అందించడం అత్యంత ప్రత్యేకమైన క్షణాలలో ఒకటని ఆనందం వ్యక్తం చేశారు. తండ్రిగా నన్ను గర్వపడేలా చేశావని సుస్మితను కొనియాడారు.
మెగాస్టార్ తన ట్వీట్ రాస్తూ..' నా ప్రియమైన సుస్మితకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒకప్పుడు నా వేలు పట్టుకుని నా పక్కన నడిచిన చిన్న అమ్మాయి నుంచి.. నేడు మీరు బలమైన, అందమైన బాధ్యతాయుతమైన మహిళగా ఎదిగావ్. ఒక తండ్రిగా నాకు అత్యంత ప్రత్యేకమైన క్షణాలలో ఇది ఒకటి. మీరు నా సినిమాలు చూడటం.. ఇప్పుడు ఏకంగా సినిమా నిర్మించడం, నాకు చిరస్మరణీయమైన బ్లాక్‌బస్టర్‌ను అందించడం.. నిజంగా నన్ను గర్వపడేలా చేసింది. మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఆరోగ్యం, ఆనందం, అంతులేని విజయం కలగాలని కోరుకుంటున్నా. ఎప్పటికీ ఇలా ప్రకాశిస్తూ ఉండు నా ప్రియమైన హనీ పాపా. నీకు ఎల్లప్పుడూ నా ప్రేమ, ఆశీస్సులు ఉంటాయి' అని పోస్ట్ చేశారు. కాగా..ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన మనశంకర వరప్రసాద్‌గారు చిత్రానికి సుస్మిత నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
'
Happy Birthday my precious @sushkonidela ❤️
From the little girl who once held my finger and walked beside me, to the strong, graceful and responsible woman you are today.
One of the most special moments for me as a father was seeing you watching my films, now producing a film,… pic.twitter.com/Z8FwhsXUrQ— Chiranjeevi Konidela (@KChiruTweets) March 10, 2026


