గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్‌.. తండ్రిని కోల్పోయిన యువతికి సాయం | Allu Arjun Financial support to Vetlapalem Durga | Sakshi
Sakshi News home page

గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్‌.. తండ్రిని కోల్పోయిన యువతికి సాయం

Mar 10 2026 11:00 AM | Updated on Mar 10 2026 11:11 AM

Allu Arjun Financial support to Vetlapalem Durga

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మంచి మనసు చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఫిబ్రవరి 28న బాణసంచా పేలుళ్ల ఘటనలో తండ్రిన కోల్పోయిన మానసిక దివ్యాంగురాలికి సాయం అందించారు. కడింపల్లి దుర్గ పోషణ కోసం జీవితాంతం నెలకు రూ.7,500 చొప్పున బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా ఏర్పాటు చేశారు.

ఈ అగ్ని ప్రమాదంలో ఆమె తండ్రి కడింపల్లి ధనరాజు  మరణించగా.. ఆమె తల్లి చాలా ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది.   మానసిక దివ్యాంగురాలైన కుమార్తె దుర్గను తండ్రి ధనరాజు చాలా జాగ్రత్తగా చూసుకునేవారని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే, పేలుళ్ల ఘటనలో ఆయన మృతి చెందడంతో దుర్గ  ఒంటరి అయిపోయింది. ఆమెకు అన్నం పెట్టే వారు కూడా లేకపోవడంతో చాలామంది చలించిపోయారు. 

అయితే, ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలుసుకున్న అల్లు అర్జున్‌ స్పందించారు. నిర్మాత బన్నివాసు ద్వారా తన ‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులను  వేట్లపాలెం పంపించారు. అక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకుని ఆయన చలించిపోయారు. దుర్గకు కావాల్సిన సాయం చేయాలని అల్లు అర్జున్‌ నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని బన్నీ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ బొలిశెట్టి సాగర్‌  తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement