విశాఖపట్నంపై మహేష్‌ బాబు గురి | Mahesh Babu Expands AMB Cinemas To Visakhapatnam After Hyderabad And Bengaluru Success, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

విశాఖపట్నంపై మహేష్‌ బాబు గురి

Mar 10 2026 9:08 AM | Updated on Mar 10 2026 10:14 AM

Tollywood Prince Mahesh Babu AMB Multiflex will bullied in visakhapatnam

టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్ బాబు భారీ బడ్జెట్‌ సినిమాల్లో నటిస్తూనే మల్టీఫ్లెక్స్‌ థియేటర్‌ రంగంలో రాణిస్తున్నారు.  హైదరాబాద్‌లో ఏషియన్ సినిమాస్‌తో సంయుక్తంగా ఏఎంబీ సినిమాస్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ బ్రాండ్‌ను విస్తరింపచేయాలని ఆయన ఉన్నారు. హైదరాబాద్‌లో మొదలైన ఏఎంబీ సినిమాస్‌ రీసెంట్‌గా బెంగళూరులో తొమ్మిది స్క్రీన్లతో అత్యాధునిక సదుపాయాలతో మల్టీఫ్లెక్స్‌  ప్రారంభించారు. అయితే, ఇప్పుడు విశాఖలో కూడా తన వ్యాపారాన్ని విస్తరింపచేయాలని మహేష్‌ చూస్తున్నట్లు సమాచారం.

బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ సమీపంలో కూడా మరో మల్టీప్లెక్స్ నిర్మాణానికి మహేష్‌ బాబు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. గోవా, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా ఏఎంబీ మల్టీఫ్లెక్స్‌ను ప్రారంభించాలని మహేష్ బాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో కూడా ఒక భారీ మల్టీప్లెక్స్‌ను నిర్మించాలని ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. విశాఖలో ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అతిపెద్ద షాపింగ్‌మాల్‌తో పాటు మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement