వేధిస్తున్నారు.. ఫిర్యాదు చేసిన మెగా కోడలు లావణ్య | Actress Lavanya Tripathi Konidela Files Complaint In Cyber Crime Police Station Over Social Media Abuse | Sakshi
Sakshi News home page

వేధిస్తున్నారు.. ఫిర్యాదు చేసిన మెగా కోడలు లావణ్య

Mar 10 2026 7:01 AM | Updated on Mar 10 2026 12:22 PM

Actress Lavanya tripathi Konidela Complaint in cyber crime police station

సినీ నటి లావణ్య త్రిపాఠి కొణిదెల సైబర్‌క్రైమ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్‌మీడియా ద్వారా తమ పరువుకు భంగం కలిగించేలా కొందరు వేధిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్‌మీడియా వేదికగా అదేపనిగా తనతో పాటుగా తన కుటుంబ సభ్యులపై అసభ్యంగా పోస్టులు చేయడం ఆపై తప్పుడు కామెంట్లతో దూషిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కొంతకాలంగా తమపై ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయని లావణ్య వాపోయారు. తన వ్యక్తిగత జీవితంపై ఆరోపణలు చేస్తూ అవమానిస్తున్నారని తెలిపారు. కామెంట్ల రూపంలో అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని చెప్పారు. ‘పర్పుల్‌ క్రెయాన్‌00’ ఇన్‌స్టాఖాతాకు సంబంధించిన వ్యక్తిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దీంతో పోలీసులు  సెక్షన్‌ 67తో పాటుగా భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)78, 79 కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని పట్టుకుంటామని తెలుపుతున్నారు.
 లావణ్య త్రిపాఠికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement