సల్మాన్ ఖాన్ , సమంత జోడీగా నటించనున్నారా? అంటే... బాలీవుడ్‌లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా రాజ్ అండ్ డీకే ద్వయం సూపర్‌హీరో జానర్‌లో ఓ సినిమా తెరకెక్కనుందని బాలీవుడ్ టాక్. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు సమంతను సంప్రదిస్తున్నారట మేకర్స్. ఈ చిత్ర దర్శకుల్లో సమంత భర్త రాజ్ నిడిమోరు కూడా ఉన్నారు కనుక సమంత భాగమయ్యే అవకాశాలు ఉన్నాయని భోగట్టా.
అయితే ఈ సినిమాలో సమంత నటించడం లేదని, నిర్మాతగా బాధ్యతలు తీసుకుంటారనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి.. సల్మాన్ ఖాన్ కొత్త సినిమాలో సమంత హీరోయిన్ గా స్క్రీన్ పై కనిపిస్తారా? లేక నిర్మాతగా భాగం అవుతారా? అనేది చూడాలి. ఇక సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ ’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మరోవైపు సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం మే 15న రిలీజ్ అవుతోంది.


