ఓటీటీలో క్రేజీ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ సినిమా.. తెలుగు రివ్యూ | War Machine Movie OTT Review Telugu | Sakshi
Sakshi News home page

War Machine Review: యాక్షన్ లవర్స్‌కి కిక్ ఇ‍చ్చే మూవీ.. ఓటీటీలో మిస్ అవ్వొద్దు

Mar 9 2026 9:13 PM | Updated on Mar 9 2026 9:18 PM

War Machine Movie OTT Review Telugu

ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు సంగతి పక్కనబెడితే ఓటీటీల్లోనూ నేరుగా కొన్ని మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వస్తుంటాయి. అలా గత వీకెండ్ వచ్చిన హాలీవుడ్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'వార్ మెషీన్'. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ దృష్టిలో పడింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: ఇది నిశ్చితార్థం కాదు.. షాకిచ్చిన హీరో బెల్లంకొండ.. కాబోయే భార్య ఫొటోలు)

కథేంటి?
అది అఫ్ఘానిస్తాన్‌లోని ఓ ప్రాంతం. పాడపోయిన తన తమ్ముడి ఆర్మీ కాన్వాయ్ బాగు చేసేందుకు అమెరికన్ ఆర్మీకి చెందిన స్టాఫ్ సార్జెంట్ (అలెన్ రిచ్‌సన్) వస్తాడు. సరిగ్గా అప్పుడే తాలిబన్లు వీరిపై దాడి చేస్తారు. దీని నుంచి సార్జెంట్ మాత్రమే ప్రాణాలతో బయటపడతాడు. తర్వాత అమెరికన్ ఆర్మీలోని అత్యంత కష్టమైన రేంజర్ కావాలనుకుంటాడు. నాలుగుసార్లు తిరస్కరణకు గురైనా సరే చివరకు ట్రైనింగ్‪‌కి ఎంపికవుతాడు. శిక్షణలో భాగంగా చివరి దశకు చేరుకుంటాడు. చిట్టచివరి పరీక్షలో పాసైతే చాలు అనుకుంటున్న తరుణంలో ఊహించని ఘటనలు ఎదురవుతాయి. ఇంతకీ అవేంటి? సార్జెంట్.. ఏలియన్ షిప్‌తో ఎందుకు తలపడాల్సి వచ్చింది? అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేశారు గానీ దీన్ని థియేటర్‌లో విడుదల చేసుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అలాంటి అనుభూతిని ఇచ్చింది. ఎందుకంటే 100 నిమిషాలున్న ఈ మూవీ.. మొదటి సీన్ నుంచి చివరవరకు అసలు గ్యాప్ అనేది లేకుండా అదరగొట్టేసింది. ఓవైపు యాక్షన్ చూపిస్తూనే.. మరోవైపు ఏలియన్ షిప్ చేస్తున్న దాడి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు అనే పాయింట్‌ని అద్భుతంగా ప్రెజెంట్ చేశారు.

అసలు అమెరికన్ ఆర్మీ ఎలా ఉంటుంది? ఆర్మీలోని రేంజర్ కావాలంటే ఎలాంటి పరీక్షలు పెడతారు? ఎంతలా కష్టపడాల్సి వస్తుందనే విషయాల్ని ఇంట్రెస్టింగ్ గా చూపించారు. హీరోతో సహా మిగతా పాత్రధారులు ఎవరూ కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. అయినా సరే చివరివరకు ఆపకుండా చూసేంత ఎంగేజింగ్‌గా మూవీని తెరకెక్కించారు.

సింపుల్‌గా తేల్చేయొచ్చు అనుకునే పరిస్థితుల్లో ఊహించని విధంగా ఏలియన్ షిప్ దాడి చేసి.. కనిపించిన వాళ్లని కనిపించినట్లు చంపేస్తుంటే.. హీరో తను బయటపడటంతో పాటు మరో వ్యక్తిని ఎలా రక్షించాడు. చివరకు బతికి బట్టకట్టడంతో పాటు రేంజర్ అయ్యాడా లేదా అనేది తెలియాలంటే ఫుల్ మూవీ చూసేయాల్సిందే.

మిలటరీ కాన్సెప్ట్, యాక్షన్-సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ అంటే ఆసక్తి ఉంటే మాత్రం దీనిపై లుక్కేయండి. కచ్చితంగా నచ్చేస్తుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ప్రధాన పాత్ర చేసిన రిచ్‌సన్ తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఓటీటీలో ఏదైనా ఓ మంచి యాక్షన్ మూవీ చూద్దానుకుంటే మాత్రం ఇదో బెస్ట్ ఆప్షన్.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: పనిచేసినా రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు.. టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన)

Advertisement
 
Advertisement
Advertisement