హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌.. భారీగా అవకాశాలు | Netflix To Launch Major Studio Office In Hyderabad, Boosting VFX And Animation Industry | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌.. భారీగా అవకాశాలు

Mar 8 2026 9:38 AM | Updated on Mar 8 2026 11:31 AM

Netflix New Office Will Open In Hyderabad

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌లో అతిపెద్ద కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. సౌత్‌ సినిమా పరిశ్రమకు కేంద్రబింధువు కానుంది. ఇక్కడ ప్రపంచస్థాయి వీఎఫ్‌ఎక్స్‌ అండ్‌ వర్చువల్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఉపాధి కూడా కల్పించనుంది. ‘నెట్‌ఫ్లిక్స్‌ స్టూడియోస్‌’ హైదరాబాద్‌కు రావడంతో టాలీవుడ్‌ పరిశ్రమలో కొత్త శకం మొదలు అవుతుందని అభిప్రాయపడుతున్నారు. 30వేల చ.అ.విస్తీర్ణంలో ఏర్పాటు అయిన ఈ కార్యాలయాన్ని మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ భారత్‌లో అడుగు పెట్టి పదేళ్లు పూర్తి అయింది.

ఈ నేపథ్యంలోనే కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనుంది. అయితే, ఇప్పటికే ముంబై నుంచి నెట్‌ఫ్లిక్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్‌లో రెండో కార్యాలయం అవుతుంది. ఇక నుంచి హైదరాబాద్‌లోనే యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్, గేమింగ్‌ అండ్‌ కామిక్స్‌ (ఏవీజీసీ) రంగం మరింత మరింత బలోపేతం  కానుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రతిభ ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. హాలీవుడ్‌ సినిమాలకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్‌ సేవలను కూడా ఇక నుంచి హైదరాబాద్‌ నుంచే కొనసాగనున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement