సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు కొంటాను: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ | Divya Agarwal Reacts To Trolls On Calling Her Gold Digger For Marrying Apurva Padgaonkar, Read Story Inside | Sakshi
Sakshi News home page

డబ్బు కోసం పెళ్లి? ఎందుకింత ద్వేషం.. నేను సెకండ్‌ హ్యాండ్‌..

Mar 8 2026 10:35 AM | Updated on Mar 8 2026 11:46 AM

Divya Agarwal Angry on trolls calling her gold digger for marrying Apurva Padgaonkar

సెలబ్రిటీలు ఏం చేసినా, చేయకపోయినా విమర్శలపాలవుతూనే ఉంటారు. హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌ 1 విన్నర్‌ దివ్య అగర్వాల్‌ పరిస్థితి కూడా ఇంతే! తరచూ ట్రోలింగ్‌ బారిన పడుతూనే ఉంటుంది. ఆస్తి చూసే అపూర్వ పడగోయంకర్‌ను పెళ్లి చేసుకుందని కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేస్తూనే ఉన్నారు. ఈ విమర్శలపై తాజా ఇంటర్వ్యూలో నటి స్పందించింది.

ఏమైనా అనుకోండి
దివ్య అగర్వాల్‌ మాట్లాడుతూ.. నన్ను గోల్డ్‌ డిగ్గర్‌ (డబ్బు కోసమే సంబంధం పెట్టుకోవడం) అని పిలవాలనుకుంటే పిలుచుకోండి.. అవసరమైతే డైమండ్‌ డిగ్గర్‌ అని కూడా పిలవండి. నాకు మాత్రం నా జీవితంలో సరైన భాగస్వామి దొరికాడు. ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో నాకు దొరికిన అత్యంత విలువైన బంగారం ఆయనే!

అవేం లేవుగా
అయినా జనం కాస్తయినా బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు. నేనేమైనా లంబోర్గినిలో తిరుగుతున్నానా? జుహు బీచ్‌ దగ్గర బంగ్లాలో ఉంటున్నానా? నాకంటూ ఓ ప్రైవేట్‌ జెట్‌ ఉందా? ఇవన్నీ లేవే.. నేను ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణిస్తాను. మరెందుకు నాపై అంత కోపం, ద్వేషం? ఆడవాళ్లు కేవలం డబ్బు చూసే పెళ్లి చేసుకుంటారని ఎందుకు తప్పుగా అనుకుంటారు?

పెళ్లి
ఆ పెళ్లికి కారణమైన ప్రేమను చూడరా? నేనెప్పుడూ సింపుల్‌గానే ఉండాలనుకుంటాను, ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాను. అంతెందుకు.. నేను సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు కూడా కొంటుంటాను అని చెప్పుకొచ్చింది. దివ్య- అపూర్వ 2024 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు.

చదవండి: ఓటీటీలో ఫంకీ మూవీ.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement