విరోష్‌ రిసెప్షన్‌లో అల్లు అర్జున్‌ బౌన్సర్లు ఎందుకలా చేశారంటే? | Jr NTR Dupe Eshwar Clarity about Virosh Reception Incident | Sakshi
Sakshi News home page

Jr NTR Dupe: నెట్టేసిన బన్నీ బౌన్సర్లు.. ఆరోజు ఏం జరిగిందంటే?

Mar 7 2026 5:42 PM | Updated on Mar 7 2026 5:51 PM

Jr NTR Dupe Eshwar Clarity about Virosh Reception Incident

కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్‌ దేవరకొండ- రష్మిక మందన్నా జోడీ ఇటీవలే పెళ్లిపీటలెక్కింది. ఈ లవ్‌బర్డ్స్‌ ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ జరుపుకున్నారు. తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. అయితే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్టేజీపై ఫోటో దిగేందుకు వెళ్తుండగా ఆయన వెనకాల ఉన్న ఓ వ్యక్తిని అడ్డుకుని ఆపేశారు.

ఏం జరిగిందంటే?
కొందు ఆయన్ను సైడ్‌ యాంగిల్‌లో చూసి జూనియర్‌ ఎన్టీఆర్‌ అనే భ్రమపడ్డారు. అల్లు అర్జున్‌ బౌన్సర్లు ఎన్టీఆర్‌ను ఆపేశారా? అని ఆశ్చర్యపోయారు. కానీ, అక్కడున్నది తారక్‌ కాదు, ఆయనకు డూప్‌గా నటించే ఈశ్వర్‌. తాజాగా ఈశ్వర్‌ అక్కడేం జరిగిందో క్లారిటీ ఇచ్చాడు. అల్లు అ‍ర్జున్‌తో పాటు వీడియోలో ఉన్నది నేనే.. ఆ రోజు ఏం జరిగిందంటే? అల్లు అర్జున్‌ సర్‌ లోపలకు వచ్చే సమయంలో నేను కూడా లోనికి వెళ్తున్నాను. 

జూమ్‌ చేస్తూ పెద్దగా..
స్టేజీపై ఫోటో దిగడం కోసం ఆయన సడన్‌గా ఆగిపోయారు. ఆయన బౌన్సర్లు ఏమనుకున్నారంటే నేను ఆయనతో ఫోటో దిగడానికి వెళ్తున్నానని భ్రమపడ్డారు. లేదంటే కెమెరాకు అడ్డొస్తానని భావించి నన్ను ఆపేశారు. అది చాలా చిన్న విషయం. దాన్ని జూమ్‌ చేస్తూ చాలా పెద్దగా చూపించారు. అలా వీడియో చాలా వైరల్‌ చేశారు. దానివల్ల నాకు కూడా మంచి రీచ్‌ వచ్చింది. థాంక్యూ సోమచ్‌ అని వీడియో షేర్‌ చేశాడు. ఇతడు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలోని కొన్ని సన్నివేశాల్లో తారక్‌కు డూప్‌గా నటించాడు.

 

 

చదవండి: అణిగిమణిగి ఉండాలి.. లేదంటే సైడ్‌ చేస్తారు: అషూ

Advertisement
 
Advertisement
Advertisement