సీరియల్ నటి చెల్లిని పెళ్లి చేసుకున్న ఆర్జే సూర్య | Rj Surya Marries RJ Sourya Latest News | Sakshi
Sakshi News home page

RJ Surya: 'బిగ్‌బాస్' కంటెస్టెంట్ పెళ్లి.. సీరియల్ బ్యూటీస్ సందడి

Mar 7 2026 2:45 PM | Updated on Mar 7 2026 2:52 PM

Rj Surya Marries RJ Sourya Latest News

ఆర్జేగా కొందరికి తెలిసిన సూర్య.. తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో పాల్గొని మరింతగా పేరు తెచ్చుకున్నాడు. గతేడాది అక్టోబరులో నిశ్చితార్థం చేసుకోగా.. ఇప్పుడు శుక్రవారం పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాడు. తెలుగు సీరియల్ నటి సుధీర చెల్లి, ఆర్జే శౌర్యతో సూర్య ఏడడుగులు వేశాడు. ఈ శుభకార్యానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సూర్య.. చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. కుటుంబ పరిస్థితుల వల్ల చదువు మధ్యలోనే ఆపేశాడు. చిన్నప్పటి నుంచి పలు పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ వచ్చాడు. ఓ అమ్మాయి బ్రేకప్ చెప్పిన బాధలో ఉన్నప్పుడు ఆర్జేగా ఆఫర్ రావడంతో దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోల గొంతులని మిమిక్రీ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఆర్జేగా ఫేమస్ అయిన ఇతడు.. బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో పాల్గొని 8 వారాల పాటు హౌసులో ఉన్నాడు. తర్వాత తన తోటి కంటెస్టెంట్ ఫైమాతో కలిసి బీబీ జోడీ తొలి సీజన్(డ్యాన్స్ కాంపిటీషన్) లో పాల్గొని విజేతగానూ నిలిచాడు. తన తోటి ఆర్జే, సీరియల్ నటి సుధీర చెల్లి శౌర్యతో ప్రేమలో పడ్డ సూర్య.. గతేడాది అక్టోబరులో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ వేడుకకు సీరియల్ బ్యూటీస్ అన్షు, ఆషికా తదితరులు వచ్చారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

(ఇదీ చదవండి: విజయ్‌తో కలిసే ఉంటా.. మరో షాకిచ్చిన సంగీత)

Advertisement
 
Advertisement
Advertisement