‘ధురంధర్ 2’ మూవీ ట్రైలర్ వచ్చేసింది. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్యధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. దీంతో సీక్వెల్‌గా తెరకెక్కిన ‘ధురంధర్: ది రివెంజ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ మార్చి 19న రిలీజ్ కానుంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలోనూ విడుదల కానుంది.


