నా కథని మానభంగం చేశారు.. టాలీవుడ్ స్టార్ రైటర్ షాకింగ్ పోస్ట్ | Sai Madhav Burra Reacts Saraswathi Movie Story Changes | Sakshi
Sakshi News home page

Sai Madhav Burra: ఈయన చెప్పింది ఆ సినిమా గురించేనా?

Mar 6 2026 7:12 PM | Updated on Mar 6 2026 7:37 PM

Sai Madhav Burra Reacts Saraswathi Movie Story Changes

ఆర్ఆర్ఆర్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కంచె తదితర సినిమాలకు రచయిత, డైలాగ్ రైటర్‌గా పనిచేసి చాలా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి సాయిమాధవ్ బుర్రా. అడపాదడపా పలు చిత్రాలకు పనిచేస్తున్న ఈయన.. ఇప్పుడు తన సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఇష్టమొచ్చినట్లు తన స్టోరీని మార్చేసుకున్నారని, మానభంగం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఇంతకీ ఈయన మాట్లాడేది ఏ మూవీ గురించి? అసలేంటి విషయం?

(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి.. నయనిక ఇంట సందడి.. ఫొటోలు వైరల్)

సాయిమాధవ్ బుర్రా తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో శుక్రవారం ఓ పోస్ట్ పెట్టారు. 'నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది. ఒక్కమాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మార్చేసుకున్నారు. కథని మానభంగం చేశారు. నాది రివెంజ్ డ్రామా కాదు. నా సోల్ వేరు. అసలా కథే వేరు' అని రాసుకొచ్చారు. అయితే ఈయన మాట్లాడేది ఈరోజే థియేటర్లలోకి వచ్చిన 'సరస్వతి' మూవీ గురించి అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. వరలక్ష‍్మి శరత్ కుమార్ లీడ్ రోల్ చేస్తూ దర్శకత్వం వహించింది. నిర్మాతగానూ వ్యవహరించింది.

ఓసారి గతంలోకి వెళ్తే సాయిమాధవ్ బుర్రా దర్శకుడిగా ఓ సినిమాని మొదలుపెట్టారు. అదే 'సరస్వతి'! కొన్ని కారణాల వల్ల ఈయన బయటకు వచ్చేయడంతో మిగతా భాగాన్ని వరలక్ష‍్మి శరత్ కుమార్ దర్శకత్వం వహించి పూర్తి చేసిందట. అయితే ఈ విషయాన్ని టీమ్ ఎక్కడా చెప్పలేదు. కానీ స్టోరీ విషయంలో ఈయనకు క్రెడిట్స్ ఇచ్చారు. కానీ రెమ్యునరేషన్ మాత్రం ఇంకా ఇవ్వలేదట. ఫోన్ చేస్తున్నా సరే టీమ్ స్పందించడం లేదట. ఈ క్రమంలోనే ఇప్పుడు సాయిమాధవ్ పరోక్షంగా పోస్ట్ పెట్టడంతో.. 'సరస్వతి' గురించేనా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

'సరస్వతి' విషయానికొస్తే.. లక్ష‍్మి(వరలక్ష‍్మి) ఓ అనాథ. నర్సుగా పనిచేస్తుంటుంది. ఆగస్టు 15న తన కూతురు సరస్వతిని స్కూల్‌లో దిగబెట్టి పనికి వెళ్లిపోతుంది. సాయంత్రం తిరిగొచ్చి చూసేసరికి పాప కనిపించదు. స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే సరస్వతి పేరుతో క్లాసులో ఎవరూ లేరని చెబుతారు. అయితే ఆ పాపని ముగ్గురు అత్యాచారం చేసి చంపేశారని, శవాన్ని పాతిపెట్టారని లక్ష‍్మి.. పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంది. తర్వాత కోర్టు, కేసులు అంటూ తిరుగుతుంది. తన కూతురి చావుకు కారణమయ్యారని ఓ జడ్జిని, ఐఏఎస్, పోలీస్‌ని లక్ష‍్మి చంపేస్తుంది. తర్వతా ఏమైంది? అసలు లక్ష‍్మి ఎవరు? ఈమెకు నిజంగా కూతురు ఉందా లేదా అనేది మిగతా స్టోరీ. థియేటర్లలో ఈ మూవీకి యావరేజ్ టాక్ వచ్చింది. వీకెండ్ అయ్యేసరికి అసలు టాక్ తేలుతుంది.

(ఇదీ చదవండి: చాన్నాళ్లకు ఓ ఫొటో పోస్ట్ చేసిన రక్షిత్ శెట్టి.. రష్మిక పెళ్లి ఎఫెక్టేనా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement