ఇది కరెక్ట్‌ కాదు.. భార్య బాధను లెక్కచేయవా? విజయ్‌పై ఫైర్‌ | Sanam Shetty Angry over Vijay, Trisha Viral Video | Sakshi
Sakshi News home page

ఇది కరెక్ట్‌ కాదు.. విజయ్‌పై కోలీవుడ్‌ నటి ఆగ్రహం

Mar 6 2026 6:52 PM | Updated on Mar 6 2026 6:59 PM

Sanam Shetty Angry over Vijay, Trisha Viral Video

స్టార్‌ హీరో విజయ్‌- సంగీత విడాకుల వ్యవహారం తమిళనాట సంచలనంగా మారింది. దాదాపు 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కొన్నేళ్లుగా ఓ నటితో ఎఫైర్‌ పెట్టుకున్నాడని, ఆ కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సంగీత తన విడాకుల పిటిషన్‌లో పేర్కొంది. దీంతో విజయ్‌- సంగీత విడాకులకు హీరోయిన్‌ త్రిష కారణమా? అన్న చర్చ మొదలైంది.

విడాకులు
ఆన్‌స్క్రీన్‌పైనే కాకుండా ఆఫ్‌ స్క్రీన్‌లోనూ విజయ్‌- త్రిష ప్రేమాయణం నడుపుతున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. సంగీత విడాకుల పిటిషన్‌ వేసిన తర్వాత విజయ్‌.. దర్జాగా త్రిషను తీసుకుని ఓ పెళ్లికి హాజరయ్యాడు. జంటగా నిల్చుని ఫోటోకు పోజిచ్చాడు. ఇది చాలామంది అభిమానులకు మింగుడుపడలేదు. ఇప్పటికే విజయ్‌- సంగీత కలిసుండాలని చాలామంది ప్రార్థిస్తున్నారు. అలాంటి సమయంలో భార్యతో కలిసుండే ప్రసక్తే లేదని హింటిస్తూ ఇలా త్రిషతో పెళ్లికి వెళ్లడం అందర్నీ షాక్‌కు గురి చేసింది.

అవతలివారి బాధను లెక్కచేయరా?
ఈ వ్యవహారంపై విజయ్‌ అభిమాని, నటి సనం శెట్టి ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్‌, త్రిష పెళ్లికి హాజరైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేస్తూ.. ఇది కరెక్ట్‌ కాదు.. భార్య బాధను ఇసుమంతైనా పట్టించుకోకపోవడం విచారకరం. ఎంతోకాలంగా అభిమానిస్తున్న మాలాంటివాళ్లను మీరు తీవ్రంగా నిరాశపర్చారు అని రాసుకొచ్చింది. ఆమె కామెంట్స్‌ను కొందరు సపోర్ట్‌ చేస్తుండగా మరికొందరు మాత్రం విమర్శించారు.

ఎవరీ సనం శెట్టి?
కాగా సనం శెట్టి విజయ్‌కు వీరాభిమాని. కరూర్‌ తొక్కిసలాట జరిగినప్పుడు కూడా విజయ్‌ తప్పు లేదని బాధితులే చెప్పారంటూ అతడిని వెనకేసుకొచ్చింది. కానీ, ఈసారి మాత్రం భార్య బాధను పట్టించుకోకుండా ఇలా ప్రేయసితో చెట్టాపట్టాలేసుకుని తిరగడం సభ్యత కాదని చురకలంటించింది. సనం శెట్టి.. తమిళ బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో పార్టిసిపేట్‌ చేసింది. తెలుగులో శ్రీమంతుడు, ప్రేమికుడు, సింగం 123 చిత్రాల్లో యాక్ట్‌ చేసింది.

చదవండి: అప్పుడు భార్యను కొట్టి.. ఇప్పుడు అందరి ముందు క్షమాపణలు చెప్పిన మాస్క్‌ మ్యాన్‌

Advertisement
 
Advertisement
Advertisement