వాయిదా రూమర్స్‌కి చెక్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే? | Ranveer Singh Dhurandhar 2 Movie Trailer Release Latest Update Ahead Of Global Release, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Dhurandhar 2: ట్రైలర్‌తో ప్రమోషన్స్ షురూ.. పోస్టర్ విడుదల

Mar 6 2026 4:38 PM | Updated on Mar 6 2026 4:58 PM

Dhurandhar 2 Movie Trailer Latest Update

'ధురంధర్ 2' సినిమా విడుదలకు ఇంకా రెండు వారాలు కూడా లేదు. టీమ్ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేకపోయేసరికి వాయిదా పడుతుందనే రూమర్స్ వినిపించాయి. యష్ 'టాక్సిక్' తప్పుకోవడంతో.. ధురంధర్ సీక్వెల్ కూడా అలానే చేస్తుందేమోనని మాట్లాడుకున్నారు. కానీ ట్రైలర్ రిలీజ్ అప్‌డేట్ గురించి అధికారికంగా ప్రకటించి సదరు పుకార్లకు చెక్ పెట్టేశారు.

రణ్‌వీర్ సింగ్ పాన్ ఇండియా మూవీ 'ధురంధర్:ది రివెంజ్' ట్రైలర్‌ని శనివారం(మార్చి 07) ఉదయం 11:01 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. దీనిబట్టి మూవీపై ఓ అంచనాకు వచ్చేస్తారు. ఇందులో రణవీర్.. జస్కిరత్ సింగ్, హమ్జా అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.

(ఇదీ చదవండి: తిరుమలలో రుక్మిణి వసంత్.. ఈమె చెల్లిని చూశారా?)

'ధురంధర్' తొలి భాగం.. భారత్‌తో పాటు అంతర్జాతీయంగానూ హిట్ అయింది. రూ.1300 కోట్లకుపైనే కలెక్షన్ సాధించి రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా నార్త్ అమెరికా, కెనడా, యుకే, ఆస్ట్రేలియా లాంటి చోట్ల భారీ విజయాన్ని అందుకుంది. తొలి పార్ట్ కేవలం హిందీలోనే రాగా ఇప్పుడు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ కానుండటం మరింతగా కలిసి రానుంది.

జియో స్టూడియోస్ సమర్పణలో, బి62 స్టూడియోస్ నిర్మాణంలో దర్శకుడు ఆదిత్య ధార్ తీసిన ఈ చిత్రం.. పాకిస్థాన్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన స్పై యాక్షన్ థ్రిల్లర్. హిందీ, తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. గుడి పాడ్వా, ఉగాది పండుగల సందర్భంలో ఈద్‌కు ముందుగా విడుదలవుతూ భారీ ఓపెనింగ్ సాధించేందుకు సిద్ధమవుతోంది.

(ఇదీ చదవండి: టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)

Advertisement
 
Advertisement
Advertisement