పెద్ది హీరోయిన్ బర్త్‌ డే.. కాలి నడకన తిరుమలకు..! | Bollywood actress Janhvi Kapoor Visits Tirumala ahead of her birthday | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: బర్త్‌ డే స్పెషల్.. కాలి నడకన తిరుమలకు జాన్వీ కపూర్..!

Mar 6 2026 3:30 AM | Updated on Mar 7 2026 5:35 AM

Bollywood actress Janhvi Kapoor Visits Tirumala ahead of her birthday

బాలీవుడ్ భామ, పెద్ది మూవీ హీరోయిన్‌ జాన్వీ కపూర్ తిరుమల చేరుకున్నారు. ఈ శుక్రవారం ఆమె బర్త్‌ డే కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అలిపిరి నడకదారిలో నడుచుకుంటూ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల కొండపైకి చేరుకున్నారు. జాన్వీ కపూర్‌తో పాటు నటి మహేశ్వరి రేపు స్వామివారిని దర్శించుకోనున్నారు

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న పెద్ది మూవీలో హీరోయిన్‌గా కనిపిచంనుంది. ఈ సినిమా కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement